'భూమా అక్రమాలను చంద్రబాబుకు వివరించాం' | Silpa Mohan Reddy complain against mp Bhuma Nagireddy | Sakshi
Sakshi News home page

'భూమా అక్రమాలను చంద్రబాబుకు వివరించాం'

Mar 29 2016 12:34 PM | Updated on Jul 28 2018 6:51 PM

'భూమా అక్రమాలను చంద్రబాబుకు వివరించాం' - Sakshi

'భూమా అక్రమాలను చంద్రబాబుకు వివరించాం'

కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి, తన సోదరుడితో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా కలిశారు.

హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి, తన సోదరుడితో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఇటీవలే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వల్ల తనకు సమస్యలు ఎదరవుతున్నాయని తన గోడు వెళ్లబోసుకున్నారు. భూమా కుటుంబం టీడీపీలో చేరినప్పటి నుంచి జిల్లా రాజకీయాలలో గొడవలు మొదలయ్యాయని పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదుచేశారు.

భూమా నాగిరెడ్డి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరగలేదని చంద్రబాబుకు వివరించారు. భూమా అక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. తామిద్దరిని టీడీపీలో లేకుండా చేయాలని భూమా ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement