graduate MLC elections
-
‘సమన్వయం’తో ముందుకు!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ నెలాఖరులోగా అభ్యరి్థని ఖరారు చేయాలని భావిస్తోంది. ఎన్నికల వ్యూహాల అమలు కోసం ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారంఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని, ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్ల బదిలీ చేపట్టడంతో పాటు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ అంశాలను పట్టభద్రులైన యువత దృష్టికి ప్రధానంగా తీసుకెళ్లాలని సూచించారు. రుణమాఫీతో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీల ఏర్పాటు లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. తక్షణమే ఓటర్ల నమోదుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను పార్టీ పక్షాన వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రక్రియలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలను భాగస్వాములను చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందనే విషయాన్ని మరోమారు తెలియజేయాలని, ఈ మేరకు ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్‌లు కూడా జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
ఓటుకే భద్రత లేదు!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తంతు ప్రహసనంలా మారింది. ఈ జాబితాలో పేరు ఉండాలంటే ప్రతిసారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెబుతుండడం అందరికీ ఇబ్బంది అవుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, గతంలో ఓటుహక్కు వినియోగించుకున్న పట్టభద్రుల జాబితా లేదని, మళ్లీ కొత్తగా నమోదుకు చర్యలు చేపట్టింది. కొరిటెపాడు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అర్హులైన పట్టభద్రులంతా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తమ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఇలా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఎలా అంటూ ఓటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా.. పట్టభద్రులైతే చాలు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థికి తొలి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా కనీసం 50 శాతంపై అనుకూలంగా పడితేనే విజయం వరిస్తుంది. 3 లక్షలు దాటే అవకాశం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో కేవలం 1,14,325 (45.79 శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి 2025లో జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సుమారు 3 లక్షల మందికిపైగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నమోదు నిబంధనలు ఇవీ.. » ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు మళ్లీ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. » ఫాం 18 వినియోగించుకుని దరఖాస్తు అందించాలి. » సెపె్టంబర్ 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఉంది. » ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు నేరుగా ఇంటి చిరునామాకు వచ్చి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. » ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరిశీలనా ఉండదు. » ఫాం 18లో వివరాలను తొలుత పూరించాలి. ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ నకలు, నివాస ధ్రువపత్రం సెట్‌గా చేసి మండల తహసీల్దార్, గ్రామ సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో అందించవచ్చు. హక్కులను హరించినట్టే.. పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ఓటు నమోదు చేయించుకోమనడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడమంటే ప్రజల హక్కులను హరించినట్లే. గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన వారిని కొత్తగా నమోదు నుంచి మినహాయించాలి. – తూము వెంకటేశ్వరరెడ్డి, బీకాం, గుంటూరు పునరాలోచన అవసరం పట్టభద్రుల ఓటు నమోదును గ్రామ సచివాలయాల్లో చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటు నమోదు పట్టభద్రులను అనుమానించడమేనని భావిస్తున్నాం. దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలి.– ఎం.నరేంద్రరెడ్డి, బీఏ, గుంటూరు -
మండలి సీట్లపై కమలం కన్ను
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో మూడింటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలను (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎమ్మెల్సీ సీట్లలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటినుంచే టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను పెద్దసంఖ్యలో చేర్పించేలా కార్యాచరణ అమలుచేయాలని తీర్మానించింది. ఓటర్ల నమోదుకు దరఖాస్తులను పార్టీ ఇప్పటికే పెద్దసంఖ్యలో ముద్రించి సిద్ధం చేసింది. ఈ దరఖాస్తులను ఆయా జిల్లాలకు పంపించి టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేలా చర్యలు తీసుకోనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు (టీచర్స్, గ్రాడ్యుయేట్స్ చెరో సీటు), వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి బీజేపీ 4 ఎంపీ, 7 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించడం తెలిసిందే. ఈ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ సీట్లను కూడా కచ్చితంగా గెలుపొందడం ద్వారా పార్టీ బలాన్ని నిరూపించాలని పట్టుదలతో పార్టీ నేతలున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు పార్టీపరంగా ఒక ఇన్చార్జిని నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ అభ్యరి్థగా సుగుణాకరరావు, టీచర్స్ అభ్యరి్థగా మోహన్‌రెడ్డి పోటీ చేయడం తెలిసిందే. బీజేపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో.. పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్–2024 పై నిర్వహించిన మరో సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, అరవింద్ మీనన్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, ధర్మారావు, జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. 3వ రౌండ్లో తనకు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అభ్యరి్థకి మెజారిటీ ఉందంటూ ప్రకటించారని, కౌంటింగ్‌పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రాకేష్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ఏకపక్షంగా చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే 3వ రౌండ్ లీడ్‌ను ప్రకటించారని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. 3వ రౌండ్ ఫలితాలు అడిగితే బయటకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోందని, మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రౌండ్ ఫలితాలు ప్రకటించే విషయంలో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించకుండా ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని అన్నారు. అడిగితే అనుమానం నివృత్తి చేయడం లేదని, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తారుమారు జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
సాక్షి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్లో కాంగ్రెస్‌కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని చెప్పారు రాకేష్ రెడ్డి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందన్నారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. ఆయనకు ఈ రౌండ్లో 4207 ఓట్ల ఆధిక్యత లభించింది.మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234.. రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356.. ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516.. అశోక్ (స్వతంత్ర) 27,493 ఓట్లు పడ్డాయి. చెల్లిన ఓట్లు 2,64,216 కాగా చెల్లని ఓట్లు 15784గా ఉన్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న 18878 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేయగా. మరో 48013 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. -
ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Updatesముగిసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశంమహబూబాబాద్ 2 గంటల వరకు పోలింగ్ శాతంపురుషులు: 10745మహిళలు: 6462మొత్తం: 17207శాతం: 49.26% సూర్యాపేట జిల్లా :ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ 2 గంటల వరకు 52.8 శాతంMale: 17968Female: 9220Total: 27188యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో 2 గంటల వరకు 47.92 శాతం నమోదుపురుషులు:9673మహిళలు: 6659మొత్తం: 16332శాతం: 47.92 జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మధ్యాహ్నం 2:00 గంటల వరకు 49.66% పోలింగ్ నమోదు వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు పోలింగ్ శాతం 30.18 %జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:00 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదుమహబూబాబాద్ జిల్లా:వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు 28.49 పోలింగ్ శాతం నమోదుహనుమకొండ: ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్మధ్యాహ్నం 12గంటల వరకు హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 32.90యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం నమోదు పురుషులు: 5902మహిళలు: 3543 మొత్తం: 9445 నల్లగొండ జిల్లా:జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 పోలింగ్ శాతం నమోదునల్గొండ:సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం 31.27%పురుషులు: 10813మహిళలు: 5290మొత్తం: 16103 నల్గొండ:మిర్యాలగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.నల్గొండ:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్నల్లగొండ:నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు గన్ మెన్ కేటాయింపునార్కెట్పల్లి గొడవ నేపథ్యంలో అధికారుల నిర్ణయంవరంగల్:మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణపోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ200 మీటర్ దూరం లో ఉన్నాం మీ కు ఇబ్బంది ఇంటి అని పోలీసుల తో వాగ్వివాదంనల్లగొండ ఎన్జీ కాలేజ్ లో అధికారుల నిర్లక్ష్యంవికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని వైనంమేమేం చేయాలి చైర్లు లేకపోతే అంటూ సిబ్బంది సమాధానంఇబ్బందులు పడుతోన్న వికలాంగులు నల్లగొండ నార్కెట్‌పల్లి లో ఓ షెడ్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసనస్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్ సూర్యాపేటలో 11 శాతం పోలింగ్..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:Male: 4258Female: 1570Total: 5828Percentage: 11.32% నల్లగొండ:నార్కెట్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తతఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ఇరు వర్గాల మధ్య వాగ్వాదంపోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ: సూర్యాపేట: గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్:మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్: జనగామ ప్రెస్టన్ కళాశాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌నేడు వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు -
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్‌ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్ రావు అన్నారు.రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి మల్లు రవి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అభ్యర్ధి మల్లురవి ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు. కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ విమర్శించారు.దీనిపై మల్లురవి స్పందిస్తూ.. కేటీఆర్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని తెలిపారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివితే.. ఆ కాలేజీలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు.ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతావారు కాదన్నట్లుగా మట్లాడటం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి. -
TG: ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది.సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ బూత్‌లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
హామీలన్నీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఈటల
సాక్షి, కొత్తగూడెం: పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అహంకారానికి స్థానం లేదని ప్రజలు నిరూపించారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు తప్ప హమీల అమలు లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. ఆరు నెలల ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. చైతన్యవంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రజాస్వామ్య విలువ పెంచాలని కోరారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం క్లబ్‌లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమంలో తొలి తూటా దిగింది కొత్తగూడెం గడ్డ పైనేనని తెలిపారు. ఈ జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని పేర్కొన్నారు. సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్స్.. మంచి ఎవ్వరో చెడు ఎవ్వరో తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఈటల ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. ప్రతి హామీలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని అన్నారు. భారత్ తెచ్చి 12వేల కోట్ల టాయిలెట్ కట్టించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చింది నరేంద్రమోీదీనేనని.. 10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మించింది బీజేపీనేనని అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తెచ్చి.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఘనత మోదీనేనని ఈటల తెలిపారు. -
నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బయట పడింది: హారీష్ రావు
సాక్షి, ఖమ్మం: నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఉచిత బస్సు తప్పా పథకాలన్నీ తుస్సేనని విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ బండి రివర్స్ గేర్‌లో నడస్తుందని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు కరెంటు వస్తే.. ఇప్పుడు 14 గంటలు మాత్రమే వస్తుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి అడిగితే భట్టి విక్రమార్క మేము అనలేదని నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ 100 కోట్లు ఇస్తా అని 100 రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పనున్నారు. అబద్దాలు, మోసాలు, ఉన్న పతకాలు ఊడగొట్టటం తప్పా.. కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమిలేని విమర్శించారు. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరావు మండిపడ్డారు. తమ్మినేని వీరభద్రం తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలపడం ముదిగొండ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే తీన్మార్ మల్లన్న ఏ రోజైనా పేద విద్యార్థుల కోసం మాట్లాడలేదని అన్నారు. 56 కేసులున్న తీన్మార్ మల్లన్నను పట్టభద్రులా ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కామెంట్స్..నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండరు లేదు..తనను గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల పట్ల ప్రశ్నించే గోతుకకై పోరాడుతా.కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయడం లేదు.నేను ఎమ్మెల్సీ గా గెలిస్తే నా జీతంతో పేద విద్యార్థుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాను. -
6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
సాక్షి, నల్గొండ: లోక్‌సభ ఎన్నికల సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలల కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఒకే ఒక సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంత ఉత్తదేనని అన్నారు. ప్రజలను దోచుకునే వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం దేవరకొండలో బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ఒక్క స్కాం కూడా చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్‌లేనని.. మంత్రులు జైలుకు కూడా పోయారని పేర్కొన్నారు.అబద్ధాల నిర్మాణం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మండిపడ్డారు జేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవినీతికి,అన్యానికి, ధర్మానికి, ఆ ధర్మానికి జరుగుతున్న పోటీనే ఈ ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య కుమ్ములాటలు తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమయితే.. నియామక పత్రాలు ఇచ్చింది మాత్రమే రేవంత్ రెడ్డి అని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కొత్తగూడెం ఇల్లందులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్న వాళ్లకు పట్టం కడితే ప్రశ్నించే గొంతుకైతారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌కు బద్ది చెప్పాలంటే, 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే, ఆ ఒత్తిడి ఉండాలంటే దమ్మున్న రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడని తెలిపారు. పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో టెట్‌కు దరఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేశారు. ఇవాళ టెట్ పరీక్షకు వెయ్యి పెట్టారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మొదటి కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఆ హామీ కూడా నెరవేరలేదు. సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయంపై మోదీతో రేవంత్ కూడబలుక్కున్నాడు. చివరకు సింగరేణిని కూడా ప్రయివేటుపరం చేస్తారు.ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ఎస్ కృషి చేసింది. సోషల్ మీడియాలో మాపై వ్యతిరేక ప్రచారం వల్లే మా అభివృద్ధి ప్రచారంలోకి రాలేకపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ నరేంద్ర మోీదీ తలుపులు తెరుచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి కంకణం కట్టుకున్నారు. 56 కేసులు ఉన్న ఒక బ్లాక్ మెయిలర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఆలోచించి పట్టబద్రులు ఓటు వేయాలి’ అని కోరారు. -
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిచాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని, ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారని తెలిపారు. మేనేజ్మెంట్, ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన, అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని పేర్కొన్నారు.‘అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారు.సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్‌ను రూపొందించి ఉచితంగా అందజేశారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు.టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారు. కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారుకేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు.ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారికే వేసి.. వారిని గెలిపించాలని కోరుతున్నాం’అని ట్వీట్లో పేర్కొన్నారు.✊ ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు💠 ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో… pic.twitter.com/V7KWVFSdpt— KTR (@KTRBRS) May 18, 2024 -
జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేయాలని స్వయంగా మిత్రపక్ష జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను కోరినా ఆయన స్పందించలేదని.. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే పరిస్థితి లేనప్పుడు బీజేపీ–జనసేన కలిసి ఉన్నా లేనట్లే అని శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. పొత్తులో కొనసాగుతున్నప్పటికీ జనసేన ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపని అంశంపై మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో కేంద్ర పార్టీ నుంచి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను మాధవ్‌తో పాటు మరో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం ఉంది. ఇటీవల పవన్ కూడా జనసేన–బీజేపీ పొత్తు ఉంది అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదన్నది వాస్తవం. నిజంగా పొత్తులో ఉంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజలలో మనం కలిసి వెళ్తుతున్నామన్న మాటకు అర్థం ఉంటుంది. నామ్‌కే వాస్త్‌గా పొత్తుతో ఉపయోగం లేదని మా అందరి అభిప్రాయం’.. అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పొత్తు కొనసాగాలనే కోరుకుంటున్నాం.. ‘బీజేపీ–జనసేన కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఇప్పటికీ కోరుకుంటోంది. కలిసి పనిచేస్తే ప్రజా మద్దతు రెండు పార్టీలకు ఉంటుంది. ఆయనా (పవన్) నమ్మాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటన చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. పోటీలో ఉన్న అభ్యర్థిగా నేనూ అడిగాను. చాలాసార్లు కోరాం. కానీ, ప్రకటన రాలేదు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో పీడీఎఫ్ అభ్యర్థి తమకు జనసేన మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారని, దానిని ఖండించమని కోరినా ఖండించలేదు’.. అని మాధవ్ చెప్పారు. కలిసి పనిచేసే విషయంలో బీజేపీ నుంచే స్పందనలేదని పవన్‌కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన వైపు నుంచే స్పందనలేదు’ అని బదులిచ్చారు. అందుకే సొంతంగా ఎదగాలనినిర్ణయించుకున్నాం.. ‘జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం నేపథ్యంలో పార్టీ తనంతట తాను ఎదిగేలా అన్ని ఏర్పాట్లుచేసుకోవాలని అనుకున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 1–14 వరకు బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం చేస్తున్నాం. మే ఒకటి తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు వేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఏదైనా పొత్తు నిర్ణయం ఉంటే కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది’ అని మాధవ్ చెప్పారు. -
'ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్ఓ పట్టించుకోలేదు'
అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు. ‘కౌంటింగ్ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్, కమలాపురం ఇన్చార్జ్ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే కలెక్టర్ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా? ► కౌంటింగ్ హాల్లో టేబుల్ నంబర్ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. ► అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు. ► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
రెండో ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించ లేక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించాయి. మూడు రోజులుగా కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియలో శనివారం తుది ఫలితాలు వెలువడ్డాయి. నువ్వా నేనా అన్నట్టు సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి 7,543 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ రావడమే కాకుండా.. రెండో ప్రాధాన్యతలోనూ ఆధిక్యంలో కొనసాగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి చివరి రౌండులో ఓటమి పాలయ్యారు. చివరి రౌండులో పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు వచ్చిన 19వేల పైచిలుకు ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీకి మెజార్టీ వచ్చింది. బీజేపీ అభ్యర్థి నగనూరు రాఘవేంద్రకు వచ్చిన ఓట్లలోనూ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా టీడీపీకి వచ్చాయి. దీంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన ఎక్కువ ఓట్లు చెల్లుబాటు కాకపోవడం కూడా ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద బి.రామగోపాల్‌రెడ్డి (టీడీపీ)కి 1,09,781 ఓట్లు, వెన్నపూస రవీంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ)కి 1,02,238 ఓట్లు వచ్చాయి. కాగా, అనంతపురంలోని కౌంటింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు తిష్ట వేయడంతో తొలి నుంచి అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం రాత్రి ఈ అనుమానాలు నిజమయ్యాయి. వైఎస్సార్సీపీ చెందిన ఓట్లు కొన్ని తెలుగుదేశం పార్టీ కట్టల్లోకి వెళ్లినట్టు తేలింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి మొత్తం ఓట్లను రీకౌంటింగ్ చేయాలని పట్టుపట్టారు. కానీ ఆ బాక్స్ వరకు మాత్రమే లెక్కిస్తామని, మొత్తం రీ కౌంటింగ్ కుదరదని అధికారులు చెప్పారు. కౌంటింగ్ జరుగుతున్న సేపు తెలుగుదేశం నాయకులు అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. రెండో ప్రాధాన్యత ఓటుపై పీడీఎఫ్‌తో పొత్తు వల్లే గెలుపు తూర్పు రాయలసీమలో, ఉత్తరాంధ్రలోనూ పీడీఎఫ్ ఓట్ల వల్లే టీడీపీ అభ్యర్థులు గట్టెక్కగలిగారు. పొత్తు లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోతామన్న భయంతో ముందే పీడీఎఫ్ నేతలను బతిమాలి మరీ టీడీపీ నేతలు రెండవ ప్రాధాన్యత ఓటుపై పొత్తు పెట్టుకున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ గట్టెక్కగలిగింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (తూర్పు రాయలసీమ)గా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టత రాకపోవడంతో.. పీడీఎఫ్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపు వరించింది. శ్రీకాంత్‌కు 1,24,181 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డికి 90,071 ఓట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు కావాల్సి ఉండగా, టీడీపీ మద్దతు అభ్యర్థికి 82,958 ఓట్లు.. వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749, పీడీఎఫ్ అభ్యర్థికి 35,148 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 10,884 ఓట్లు వచ్చాయి. దీంతో 36 రౌండ్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ, పీడీఎఫ్ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. -
రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్!
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ(శాసనమండలి) ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో.. తప్ప మిగిలిన అన్నిటిని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. దీంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. తప్పు లేదు. వందకు వంద మార్కులు వస్తాయని భావించిన వారు రెండు మార్కులు తగ్గితే బాధపడతారు. అదే సున్నా మార్కులు వస్తాయని అనుకున్నవారు రెండు మార్కులు వచ్చినా ఎగిరి గంతేస్తారు. అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. టీడీపీ నేతలంతా మొత్తం సాదారణ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేసినంత హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటివి అయితే శరభ.. శరభ అంటున్నాయి. ఈనాడు అయితే ఏకంగా తిరుగుబాటు అనే హెడింగ్ పెట్టి ఆత్మ సంతృప్తి చెందింది. తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అక్రమాలను బయటపెడతారా? అనే అక్కసు అందులో కనిపిస్తోంది. సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్షించుకుని తన బలాన్ని బెరీజు వేసుకుంటుంది. ఇక్కడ గమ్మత్తు అయిన అంశం ఏమిటంటే పశ్చిమ,తూర్పు రాయలసీమలోని టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు రెండిటిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే దానిని ఏదో మామూలు విషయంగా చూస్తున్న టీడీపీ, రెండు చోట్ల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో గెలవడం చాలా పెద్ద విషయం అనుకుంటోంది. స్థానిక సంస్థల నియోజకవర్గాలు తొమ్మిదింటికి గాను ఐదింటిని వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది. మరో నాలుగింట టీడీపీ మద్దతుతో కొందరు పోటీచేసినా ఫలితం దక్కలేదు.. పశ్చిమగోదావరి వంటి చోట్ల వైసీపీకి ఉన్న బలం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయట. ఆ సంగతిని టీడీపీ మీడియా కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలలోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో టీడీపీ గెలవడంతో వైసీపీకి పతనం ఆరంభం అయిందని టీడీపీ సీనియర్ నేతలంతా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న వాదన చేసేవారు టీచర్లలో ప్రభుత్వ సానుకూలత ఉందని ఒప్పుకోవలసి ఉంటుంది. నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా అంటే అది పరిమితం అని చెప్పాలి. అలా అని అసలు ప్రాధాన్యత లేదని కాదు. కానీ గ్రాడ్యుయేట్లు ముందుగా తమ ఓటును రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నా ఏభై లక్షల మందికి పైనే గ్రాడ్యుయేట్లు ఉండాలి. కానీ అధికారికంగా ఓట్ల సంఖ్య మాత్రం తొమ్మిది లక్షలే!. .. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఇతర రంగాలలోని గ్రాడ్యుయేట్లు ఉండవచ్చు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్లను టీడీపీ కాని, ఆ పార్టీ మీడియా కానీ, విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. బహుశా ఆ ప్రభావం కొంతమేర పడి ఉండడం వల్ల గ్రాడ్యుయేట్ సీట్లలో వైసీపీకి నష్టం కలిగి ఉండవచ్చు. లేదా అభ్యర్థి ఎంపికలో లోపం ఉండవచ్చు. పార్టీ నాయకత్వంలో సమన్వయ లోపం కారణం కావచ్చు. అతి విశ్వాసం కూడా ఉండి ఉండవచ్చు. విశాఖలో అయితే పార్టీలకు అతీతంగా చిరంజీవిరావుకు ఓట్లు పడ్డాయట. దానికి కారణం ఆయన గ్రూప్ పరీక్షలకు భోధన చేసే లెక్చరర్ కావడమట. అది టీడీపీకి కలిసి వచ్చింది. మరి టీడీపీ స్థానిక సంస్థల నియోజకవర్గాలలో కానీ, టీచర్ల నియోజకవర్గాలలో కానీ ఓటమి చవిచూడడానికి కూడా కారణాలు ఉంటాయి కదా? వాటిని విస్మరించి టీడీపీ వారు కేవలం గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలిచినందుకే రెచ్చిపోతే వారికి ఎంత ప్రయోజనమో తెలియదు. నిజానికి గతంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. ప్రధాన రాజకీయ పార్టీలు స్వయంగా రంగంలో దిగేవికావు. కానీ కాలక్రమేణా అభ్యర్దులకు పరోక్ష మద్దతు, తదుపరి ప్రత్యక్షంగా పార్టీలే రంగంలో దిగడం జరిగింది. టీచర్ల స్థానాలో ఎక్కువగా వామపక్షాలకు సంబందించిన సంఘాల నేతలు పోటీపడేవారు. గ్రాడ్యుయేట్ల స్థానాలలో బీజేపీ, వామపక్షాలు అధికంగా పోటీ పడేవి. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకే పరిమిత ఓటర్లు ఉండే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవి ఎక్కువగా దృష్టి పెడుతుండేవి. ఈసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీపడడంతో వామపక్షాల సంఘాల అభ్యర్దులు, బీజేపీ అభ్యర్థులు పూర్తిగా తెరమరుగు అయినట్లుగా కనిపిస్తోంది. గతసారి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన మాదవ్ ఈసారి పరాజయం చెందారు. తెలుగుదేశం మీడియా ఈ ఎన్నికల ఫలితాలపై ఒక విశ్లేషణ ప్రచారం చేస్తోంది. గ్రాడ్యుయేట్ల స్థానాలు వంద శాసనసభ స్థానాల పరిధిలో ఉన్నాయని, అందువల్ల ఈ ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికలకు నాందీ అవుతాయని ఆ మీడియా అంటున్నది. అదే నిజమైతే.. ఎన్నికలు జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం మొదలైన జిల్లాలు స్థానిక సంస్థల నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అవన్నీ వైసీపీ పరం అయ్యాయి. అంటే ఈ జిల్లాలన్నిటిలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోయినట్లు అంగీకరిస్తారా? రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో టీచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి అవకాశం లేకుండా పోయిందని అంగీకరిస్తారా? ఈ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికనే ఒక అభిప్రాయానికి రావడం కరెక్టు కాకపోవచ్చు. గత నాలుగేళ్లలో జరిగిన అన్ని ఎన్నికలలో వైసీపీనే గెలిచింది. చివరికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం స్థానిక ఎన్నికలన్నిటిని వైసీపీ గెలుచుకుంది. అందువల్ల టీడీపీ పని అయిపోయినట్లు ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? అదే సమయంలో వీటిని ఒక సంకేతంగా తీసుకోవడం ఆక్షేపణీయం కాదు. ఆ రకంగా చూసినా టీడీపీ గ్రాడ్యుయేట్ల స్థానాలలోనే గెలిచింది. మిగిలిన అన్ని వైసీపీనే గెలుచుకుంది. మండలి ఎన్నికలలో గెలిచినంత మాత్రాన సాదారణ ఎన్నికలలో గెలవాలని లేదు. ఉత్తరాంద్రలో గతసారి బీజేపీ అభ్యర్ధి మాధవ్ మండలికి గెలిచినా, ఆ తర్వాత జరిగిన సాదారణ ఎన్నికలలో బీజేపీకి ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాలేదు. పీడీఎఫ్ పేరుతో వామపక్ష అభ్యర్దులు పోటీ చేస్తుంటారు. ఉదాహరణకు ఏలూరులో సూర్యారావు అనే టీచర్ వామపక్షవాది. ఆయన మండలి ఎన్నికలలో గెలిచారు. ఆ తదుపరి శాసనసభ ఎన్నికలలో ఆ ప్రాంతంలో సీపీఎం విజయం సాదించలేదు. పీడీఎఫ్ అభ్యర్దులు గెలిచిన జిల్లాలలో శాసనసభ ఎన్నికలలో వారి ప్రభావం ఏమీ కనిపించలేదు. తెలంగాణలో గతంలో బీజేపీ నేత ఎమ్. రామచంద్రరావు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో గెలుపొందారు. కానీ ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. తెలుగుదేశం పార్టీ తనకు ఈ రెండు చోట్ల గెలవడం ఎంతో ఉపయోగంగా సహజంగానే భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజలను ప్రభావితం చేసి శాసనసభ ఎన్నికలలో ఫలితం రాబట్టడానికి తంటాలు పడుతోంది. కానీ శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది సమయం ఉందన్న సంగతి మర్చిపోరాదు. తాము రెండు చోట్ల గెలిచాము కాబట్టి మండలి ఎన్నికలలో అక్రమాలు జరగలేదని టీడీపీ చెబుతుందేమో తెలియదు. తొలుత తన విజయం మీద నమ్మకం లేక టీడీపీ వర్గాలు అసలు కౌంటింగే జరగరాదని ఏకంగా కోర్టుకే వెళ్లారు. పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ ఆ విషయం చెప్పడం లేదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిన తర్వాత ఇంకేముంది.. 2019 శాసనసభ ఎన్నికలలో కూడా తమదే గెలుపు అని టీడీపీ నేతలు బీరాలు పోయేవారు. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం మూటకట్టుకోగా, వైసీపీ ఘన విజయం సాధించింది. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నా టీడీపీ అధినాయకత్వం మండలి ఎన్నికల ఫలితాలపైనే ఇంత ప్రచారం చేయడం కేవలం ప్రజలను ప్రభావితం చేయాలన్న ఆశతోనే. కానీ అసలు ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. వైఎస్సార్ సీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో ఒక మాట అన్నారు. పెత్తందారులకు, సామాన్యులకు పోరాటం జరుగుతోందని, తన నడక సామాన్యులతోనేనని, పేదల సంక్షేమం, అభివృద్ధే తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పారు. శాసనసభ సాదారణ ఎన్నికలలో పేద, మధ్య తరగతి ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వానికి వారే అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అందుకు భిన్నంగా ఉంటారని అనుకోజాలం. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలవలేకపోవడం వారికి కొంత అసంతృప్తి కలిగించవచ్చేమో కానీ.. అవే వచ్చే శాసనసభ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావించవలసిన అవసరం లేదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
Fact Check: టీడీపీ అసత్య ప్రచారం.. అందులో వాస్తవం లేదు
సాక్షి, అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పులివెందులలో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చాయని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వాదన పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా నియోజకవర్గాల వారీగా జరగదని గుర్తుచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా కాకుండా పోలైన ఓట్లన్నీ కలిపే లెక్కింపు చేస్తారని స్పష్టంచేసింది. త్వరలో ఎన్నికల సంఘం తుది వివరాలను ప్రకటిస్తుందని, అసత్య వార్తలను నమ్మవద్దని కోరింది. చదవండి: జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా -
పటిష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
కడప సిటీ: పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జేసీ సాయికాంత్‌వర్మ, ఏఎస్పీ తుషార్‌డూడి, నగర పాలక సంస్థ కమిషనర్ జీఎస్ఎస్ ప్రవీణ్‌చంద్, అసిస్టెంట్ కలెక్టర్లు ‡రాహుల్‌మీనా, ప్రవీణ్, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల విజయవంతానికి ఏ విధంగా కృషి చేశారో అదే స్ఫూర్తితో ఈ ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా లేని వారిని మాత్రమే నియమించాలన్నారు. వారి సొంత మండలంగానీ, వారు విధులు నిర్వర్తించే మండలానికిగానీ విధులను కేటాయించరాదన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలకు అవసరమైన వాహనాలను రూట్ మ్యాప్ వేసుకుని ఆ ప్రకారంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల పరంగా ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 1950 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, వెంకట రమణ, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, సీపీఓ వెంకట్రావు, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, ఏపీఎంఐపీ పీడీలు యదుభూషణరెడ్డి, ఆనంద్ నాయక్, రామ్మోహన్‌రెడ్డి, రవీంద్రారెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. -
Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?
రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో తొలి అంకం ముగిసింది. గత నెల 30న తుది ఓటరు జాబితా ఖరారైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రధాన పారీ్టలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో పాటు ఆశావహులు ప్రచారపర్వంపై దృష్టి సారించారు. ఆరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లతో సమావేశమవుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటి భర్తీకి ఉపక్రమించింది. ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు విస్తృత ప్రచారంలో తలమునకలవుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులతో.. యూనియన్ల వారీగా, శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. పట్టభద్రుల కోటాలో 3,28,807 ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 2.52లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే 76వేల ఓట్లు అధికం. పెరిగిన ఓట్లు ప్రభుత్వ పనితీరును, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ‘అనంత’ నుంచి పోటీ చేస్తోన్న బీసీ నాగరాజు మధ్య ప్రధాన పోటీ ఉండే అకాశం ఉంది. వీరితో పాటు బోరంపల్లి ఆంజనేయులు, గైబున్నీసా, బోయ నాగరాజు, పట్టుపోగుల పవన్ కుమార్‌తో పాటు పలువురు పోటీలో ఉన్నా, పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నపూస రవీంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు కావడం సానుకూలాంశం. రాంగోపాల్‌రెడ్డి పులివెందుల నియోజవకర్గ వాసి. ఎవ్వరికీ తెలియని వ్యక్తి! రవీంద్రారెడ్డి అభ్యరి్థత్వాన్ని ఆరు జిల్లాలలోని 26మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్చార్జీలు ఏకగ్రీవంగా సమర్థించారు. బాధ్యత తీసుకుని గెలుపునకు కృషి చేస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఓడిపోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభావం తప్పదని, పోటీ వద్దని టీడీపీ ఇన్చార్జీలు భావించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పారీ్టగా వైఎస్సార్సీపీ ఉండి ఎమ్మెల్సీ గెలిచిందని, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కనీసం పోటీ చేయకుంటే ఆ ప్రభావం కేడర్‌పై బలంగా పడుతుందని నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. పోటీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాంగోపాల్‌రెడ్డిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తెలిసిందే. అక్కడ టీడీపీకి ఎలాంటి విజయాలు లేవు. అలాంటి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలపడం చూస్తే ఈ ఎన్నికలను టీడీపీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. రవీంద్రారెడ్డి 28 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలుస్తున్నారు. రాంగోపాల్‌రెడ్డి చంద్రబాబు పర్యటనలో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి. వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూల అంశాలు ►సచివాలయాల ఏర్పాటుతో వేలాది నిరుద్యోగులకు సర్కారు కొలువులు. ►ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ చేయడం. ►పోలీస్రిక్రూట్మెంట్ ద్వారా 6,900 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు. ►అభ్యర్థుల వినతి మేరకు వయస్సు సడలింపు నిర్ణయం. ►న్యాయశాఖ పరిధిలో 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ►గ్రూప్–1 నోటిఫికేషన్‌కు చర్యలు. ►వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలన్నీ భర్తీకి నిర్ణయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోనూ త్రిముఖ పోరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 27,716 ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఓట్లు కూడా పెరిగాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు బీజేపీ నేత ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. కత్తి, ఒంటేరు, రామచంద్రారెడ్డి మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కత్తి ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయ ఎన్నికల్లో యూనియన్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి గెలుపోటములను యూనియన్లే ప్రభావితం చేయనున్నాయి. దీంతో అభ్యర్థులంతా యూనియన్ల నేతలు, సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కృషి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా సీతంరాజుసుధాకర్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నియోజకవర్గం అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా వెన్నపూస రవి పోటీ చేస్తున్నారని తెలిపారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ
సాక్షి, అమరావతి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్.... ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్.... ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ ఆమోదించారు. గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో ప్రాధాన్యతగా తీసుకోలేదని సీఎం జగన్ పేర్కొనగా.. ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడం, ఉత్సాహవంతులకు అండగా నిలిచామని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. అయితే శాసనమండలిలో ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలకు మద్దతు కోరినప్పుడు మన మద్దతుతో గెలిచిన వారు కూడా మొహం చాటేసిన పరిస్థితులను చూశామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయడమే మంచిదని ఏకాభిప్రాయంతో సీఎం జగన్‌కు నివేదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనకు సీఎం జగన్ అంగీకరించారు. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారుచేశారు. ఉమ్మడి విశాఖ– విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.సుధాకర్‌ను ఖరారు చేశారు. ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం జగన్ ఖరారు చేశారు. ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూస రవి పేరును ఖరారు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ, అభ్యర్థిపై తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ సూచించారు. -
APలో 3గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో YSRCP పోటీ