
సాక్షి, యాదాద్రి/భువనగిరి అర్బన్: ముఖ్యమంత్రి పదవి తనకు చెప్పుతో సమానమని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే చెప్పుకు వేసినట్లేనని ఉద్ఘాటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమ ఆస్తులను కేసీఆర్ స్వాహా చేశారని, వాటిని కక్కిస్తామని చెప్పారు. కరోనా కాలంలో వేతనాలు అందక 40 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని, అప్పుడే సీఎం కేసీఆర్ నేలపై దిగి వస్తారన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకారిణి,, భువనగిరికి చెందిన మాధురి గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆమె తన బుల్లెట్‌పై సంజయ్‌ని కూర్చోబెట్టుకుని కొద్దిదూరం ప్రయాణించారు.
Comments
Please login to add a commentAdd a comment