ఎమ్మెల్సీ ఎన్నికలు : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణిదేవి విజయం | Telangana MLC Election Results 2021: Votes Counting Live Updates In Telugu | Sakshi
Sakshi News home page

MLC Election Results: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణిదేవి విజయం‌

Published Wed, Mar 17 2021 8:08 AM | Last Updated on Sat, Mar 20 2021 6:33 PM

Telangana MLC Election Results 2021: Votes Counting Live Updates In Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణిదేవీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుపై వాణిదేవి గెలుపొందారు. మూడు రోజులుగా ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతుండగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఫలితం వచ్చింది. ఇంకా నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విజయం దిశగా పయనిస్తున్నారు. తీన్మార్‌ మల్లన్న రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దర మధ్య ఓట్ల వ్యత్యాసం 24 వేలకు పైగా ఉంది. 

కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌: నేడు సాయంత్రంలోగా ఎమ్బెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

నల్గొండ : 

► టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం

► తీన్మార్‌ మల్లన్నపై 2, 700 ఓట్ల ఆధిక్యంలో పల్లా

► సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ

► నల్గొండలో నాలుగో స్థానంలో బీజేపీ


హైదరాబాద్‌ :

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ సంబరాలు

► టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణిదేవి గెలుపు

►రెండో ప్రాధాన్యం ఓట్లతొ గెలిచిన వాణిదేవి

► గెలుపు దిశగా టీఆర్‌ఎస్‌ అభ్యర్తి వాణీదేవి

► హైదరాబాద్‌ ఎన్నికల బరిలో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు

 ► 8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్‌ అభ్యర్ధి వాణీదేవి

► నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్ధులు

► 23,428 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

►  రెండో స్థానంలో మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం

►హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

► హైదరాబాద్‌ స్థానంలో ఇప్పటి వరకు 90 మంది ఎలిమినేట్‌

►8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్‌ అభ్యర్ధి వాణీదేవి

► టీఆర్ఎస్‌ అభ్యర్ధి వాణీదేవికి 1,28,689 ఓట్లు

► రామచంద్రరావు (BJP) 1,19,198 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు

► 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం అభ్యర్థుల వారీగా వచ్చిన రెండో ప్రాధన్యత ఓట్లు

► టీఆర్‌ఎస్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి -5252

► తీన్మార్ మల్లన్న-7352

► కోదండరాం-10299

►అభ్యర్థుల  వారిగా ఇప్పటివరకు వచ్చిన ఓట్లు....
 
►పల్లా రాజేశ్వర్ రెడ్డి- 122638.

►తీన్మార్ మల్లన్న-99210

►కోదండరాం-89409

►పల్లా ఆధిక్యం-23428

►ప్రారంభం అయిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ

►నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సరైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా మెజారిటీ తగ్గింది. అయితే ఇప్పటికి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్‌ మల్లన్నకు 91,858 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్‌కు 79,110 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 66 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 

►హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి 8,478 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,15,043 ఓట్లు, రామచంద్రరావు (బీజేపీ) 1,06,565 ఓట్లు ప్రొ. నాగేశ్వర్‌కు 55,742 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) 32,879 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 86 మందికి సంబంధించి ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది.

► నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎవరికీ గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనపడటం లేదు. ఒకవేళ ఎవరికీ మ్యూజిక్ ఫిగర్ రాకపోతే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.

హైదరాబాద్‌
► హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

► రెండో ప్రాధాన్యతలో 14 మంది ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తి

► రెండో ప్రాధాన్యతలో టీఆర్‌ఎస్‌-38, బీజేపీ-17, నాగేశ్వర్‌-18, కాంగ్రెస్‌-13 ఓట్లు

► రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి వాణిదేవి (టీఆర్‌ఎస్‌) ఆధిక్యం 8,042

► వాణీదేవి(టీఆర్‌ఎస్‌)కి 1,12,727 ఓట్లు, రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,685 ఓట్లు

► ప్రొ. నాగేశ్వర్‌కు 53,628 ఓట్లు, చిన్నారెడ్డి(కాంగ్రెస్‌)కి 31,567 ఓట్లు

► హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఏడో రౌండ్ పూర్తి

►  ఏడో రౌండ్‌ పూర్తయ్యేసరికి వాణీదేవి(టీఆర్‌ఎస్‌)కి 1,12,689 ఓట్లు

►  రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,668 ఓట్లు, ప్రొ. నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు

► ఏడో రౌండ్‌ పూర్తయ్యేసరికి చిన్నారెడ్డి(కాంగ్రెస్‌)కి 31,554 ఓట్లు

► మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోని మొదటి ప్రాధాన్యత ఓట్లు

► అనివార్యమైన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే టీఆర్‌ఎస్‌, బీజేపీ ఆశలు

► మొదటి ప్రాధాన్యత ఓట్లలో వాణీదేవి(టీఆర్‌ఎస్‌) ఆధిక్యం 8,021 ఓట్లు

► ఏడు రౌండ్లలో మొత్తం చెల్లని ఓట్లు 21,309

నల్లగొండ

► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు

► పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌)- 174, కోదండరాం- 193, తీన్మార్‌ మల్లన్న- 149 ఓట్లు

►  మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,11,014 ఓట్లు

► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్‌ మల్లన్నకు 83,539 ఓట్లు

►  మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్‌కు 70,265 ఓట్లు

► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు.

► టీఆర్‌ఎస్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి-174

► కోదండరాం - 193

► తీన్మార్ మల్లన్న -149

► పూర్తి అయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

►TRS పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత  ఓట్లు-1,10,840

►మల్లన్న-83,290..... కోదండరాం-70,072.... బీజేపీ-39,107

►తన సమీప అభ్యర్థి.మల్లన్న పై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

► మొత్తం ఓట్లు ...3,87,969....

►చెల్లిన ఓట్లు....3,66,333....

► మురిగిన ఓట్లు....21,636....

► రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం...

► పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందలంటే కావాల్సిన ఓట్లు 72,327..

► తీన్మార్ మల్లన్న గెలుపొందలంటే కావలసిన ఓట్లు 99,877.

► కోదండరామ్ గెలవాలంటే 1,13,095..

హైదరాబాద్‌:

► ఆధిక్యతలో సురభి వాణీదేవి

►నత్తనడకగా కౌంటింగ్‌.. 

► ఐదు గంటలకు ఒక రౌండ్‌ పూర్తి

 ► ఇప్పటివరకు నాలుగు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి అయింది. 

► నేటి మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత తుది ఫలితం  

►మొదటి ప్రాధాన్యత ఓట్ల నాలుగో రౌండ్‌ లెక్కింపు ముగిసేసరికి అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుపై 5,553 ఆధిక్యం కొనసాగిస్తున్నారు. 

► మొత్తం 3,57,354 ఓట్లు పోలు కాగా, ఒక్కో రౌండ్‌కు 56 వేల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. 

►  అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 70,552 ఓట్లు

► బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 64,999

► ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 34,029

► కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడికి 24,053 ఓట్లు లభించాయి.

► నాలుగో రౌండ్‌ సురభీ వాణీదేవికి 1,109 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ కౌంటింగ్‌ ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

గురువారం నాటికి..
నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదోరౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఐదో రౌండ్‌ ముగిసేసరికి 18,549 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు  పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 79,113 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 60,564, కోదండరామ్‌కు 49,200 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 28,981 ఓట్లు, కాంగ్రెస్‌ 20,274 ఓట్లు రాగా, 15,533 చెల్లని ఓట్లు వచ్చాయని కౌంటింగ్‌ అధికారులు తెలిపారు.

► ముగిసిన మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.

►  మూడో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ.

►  మూడో రౌండ్‌లో పల్లాకు పడ్డ ఓట్లు..17393...

► తీన్మార్ మల్లన్నకు....13,122

► కోదండరాంకు 11,907....

► ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,142 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ

ఇప్పటి వరకు అభ్యర్థుల వారీగా వచ్చి ఓట్లు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ
► పల్లా రాజేశ్వర్‌ రెడ్డి -47,545

► తీన్‌మార్‌ మల్లన్న-34,864

► ​కోదండరామ్‌-29,560

► ప్రేమేంందర్‌ రెడ్డి-19,899

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌
► సురభి శ్రీవాణి-35,171

► రామచంద్రరావ్‌-32,558

► ప్రొ. నాగేశ్వర్‌ రావు-16,951

► చిన్నారెడ్డి-10,062

ముగిసిన రెండో రౌండ్.

► టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి -15857 ఓట్లు.

► తీన్మార్ మల్లన్న -12070

► కోదండరాం-9448,  బీజేపీ- 6669, కాంగ్రెస్- 3244

► రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 7871 ఓట్ల తో ఆధిక్యం

► తెలంగాణ ఎమ్మెల్సీ కౌంటింగ్‌: రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడ్‌లో ఉండటం గమనార్హం.

► నల్గొండ సెగ్మెంట్‌ పరిధిలో ఉదయం తొలి రౌండ్లో మొత్తం 56003 ఓట్లు లెక్కించారు.

► టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు పడ్డాయి.

► రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న నిలిచారు. ఆయనకు 12046 ఓట్లు పోలయ్యాయి. 

► అటు హైదరాబాద్‌ సెగ్మెంట్‌ పరిధి తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవికి 17429 ఓట్లు పోలయ్యాయి.

► బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావు రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 16385 ఓట్లు పోలయ్యాయి.

► తొలి రౌండ్‌లో వాణీదేవీ 1044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

► ఇక్కడ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయనకు 8357 ఓట్లు పోలయ్యాయి.

నల్గొండ : 
► నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

►6వ నెంబర్‌ కౌంటింగ్‌ వద్ద 8 బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ లేకపోవడంతో ఏజెంట్ల ఆందోళన

► బ్యాలెట్‌ బ్యాక్స్‌ తాళాలు పగలగొట్టి ఉండటంపై బీజేపీ అభ్యర్థి ఆందోళన

► ప్రశ్నిస్తే బయటకు పంపించేస్తున్నారని ప్రేమేందర్‌ రెడ్డి నిరసన

►బ్యాలెట్ బాక్స్‌లకు తాళాలు పగలగొట్టే అవసరం ఏమొచ్చిందని ప్రేమే౦దర్ రెడ్డి ప్రశ్నించారు

► ఈ పరిణామంపై రిటర్నింగ్ అధికారికి పిర్యాదు.

సరూర్ నగర్‌
► సరూర్ నగర్ కౌంటింగ్ హాల్‌లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్‌ల పరిశీలన

► చెల్లినవి, చెల్లని ఓట్లను వేరువేరురుగా చేసిన అధికారులు.

►  అభ్యర్డులు, వారి ఏజెంట్ల సమక్షంలో బాలేట్ బాక్స్‌ సీల్ పరిశీలన 

► బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ టేబుల్స్‌ మీదకు తరలిస్తున్న సిబ్బంది.

నల్గొండ..
►  కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ

►  40%  పూర్తయిన  బండిల్స్ వర్క్

►25 ఓట్ల చొప్పున ఒక  బండిల్  కడుతున్నారు

► ఈ రోజు సాయంత్రం 5 లోపు పూర్తవనున్న బండిల్స్  ప్రక్రియ

►  రాత్రి 9 గంటలలోపు  మొదటి  రౌండ్ ఫలితం  వెలువడుతుందని అంచనా

►  ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్ల లెక్కింపు

►రేపు తొలి ప్రాధాన్యత ఫలితాలు వెలువడే అవకాశం

► రిటర్నింగ్ అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తీసుకొచ్చి బండల్స్‌ను కడుతున్నారు. 

► ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను బయటకు తీస్తున్నారు.

► నాలుగు వేల మంది సిబ్బందితో షిఫ్ట్‌ల ప్రకారం నిరంతరం లెక్కింపు కొనసాగనుంది.


‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్‌’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్‌’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్‌ఎస్‌), ఎన్‌. రామచందర్‌రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌రావు(ఇండిపెండెంట్‌) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), ప్రొఫెసర్‌ ఎం. కోదండరాం (టీజేఎస్‌) మధ్య నెలకొంది.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇలా..
కౌంటింగ్‌ కోసం ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్‌ చేశాక.. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.

అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్‌ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్‌ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement