Warangal-Khammam-Nalgonda
-
TG: ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది.సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ బూత్‌లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
2023లోనూ టీఆర్ఎస్దే విజయం: ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాల్లో చివరకు పల్లా విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేయగా రికార్డు మెజారిటీతో పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో నేరాలు తగ్గాయని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
ఎమ్మెల్సీ ఎన్నికలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
ఎమ్మెల్సీ ఎన్నికలు : టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుపై వాణిదేవి గెలుపొందారు. మూడు రోజులుగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా శనివారం సాయంత్రం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఫలితం వచ్చింది. ఇంకా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం దిశగా పయనిస్తున్నారు. తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దర మధ్య ఓట్ల వ్యత్యాసం 24 వేలకు పైగా ఉంది. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్: నేడు సాయంత్రంలోగా ఎమ్బెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నల్గొండ : ► టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం ► తీన్మార్ మల్లన్నపై 2, 700 ఓట్ల ఆధిక్యంలో పల్లా ► సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ ► నల్గొండలో నాలుగో స్థానంలో బీజేపీ హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సంబరాలు ► టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు ►రెండో ప్రాధాన్యం ఓట్లతొ గెలిచిన వాణిదేవి ► గెలుపు దిశగా టీఆర్ఎస్ అభ్యర్తి వాణీదేవి ► హైదరాబాద్ ఎన్నికల బరిలో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు ► 8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి ► నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్ధులు ► 23,428 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ► రెండో స్థానంలో మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం ►హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ► హైదరాబాద్ స్థానంలో ఇప్పటి వరకు 90 మంది ఎలిమినేట్ ►8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి ► టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 1,28,689 ఓట్లు ► రామచంద్రరావు (BJP) 1,19,198 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు ► 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం అభ్యర్థుల వారీగా వచ్చిన రెండో ప్రాధన్యత ఓట్లు ► టీఆర్ఎస్, పల్లా రాజేశ్వర్ రెడ్డి -5252 ► తీన్మార్ మల్లన్న-7352 ► కోదండరాం-10299 ►అభ్యర్థుల వారిగా ఇప్పటివరకు వచ్చిన ఓట్లు.... ►పల్లా రాజేశ్వర్ రెడ్డి- 122638. ►తీన్మార్ మల్లన్న-99210 ►కోదండరాం-89409 ►పల్లా ఆధిక్యం-23428 ►ప్రారంభం అయిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ►నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సరైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా మెజారిటీ తగ్గింది. అయితే ఇప్పటికి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్‌కు 79,110 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 66 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ►హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 8,478 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,15,043 ఓట్లు, రామచంద్రరావు (బీజేపీ) 1,06,565 ఓట్లు ప్రొ. నాగేశ్వర్‌కు 55,742 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్) 32,879 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 86 మందికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ► నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎవరికీ గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనపడటం లేదు. ఒకవేళ ఎవరికీ మ్యూజిక్ ఫిగర్ రాకపోతే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. హైదరాబాద్ ► హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ► రెండో ప్రాధాన్యతలో 14 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి ► రెండో ప్రాధాన్యతలో టీఆర్ఎస్-38, బీజేపీ-17, నాగేశ్వర్-18, కాంగ్రెస్-13 ఓట్లు ► రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి వాణిదేవి (టీఆర్ఎస్) ఆధిక్యం 8,042 ► వాణీదేవి(టీఆర్ఎస్)కి 1,12,727 ఓట్లు, రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,685 ఓట్లు ► ప్రొ. నాగేశ్వర్‌కు 53,628 ఓట్లు, చిన్నారెడ్డి(కాంగ్రెస్)కి 31,567 ఓట్లు ► హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఏడో రౌండ్ పూర్తి ► ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి వాణీదేవి(టీఆర్ఎస్)కి 1,12,689 ఓట్లు ► రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,668 ఓట్లు, ప్రొ. నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు ► ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి చిన్నారెడ్డి(కాంగ్రెస్)కి 31,554 ఓట్లు ► మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోని మొదటి ప్రాధాన్యత ఓట్లు ► అనివార్యమైన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే టీఆర్ఎస్, బీజేపీ ఆశలు ► మొదటి ప్రాధాన్యత ఓట్లలో వాణీదేవి(టీఆర్ఎస్) ఆధిక్యం 8,021 ఓట్లు ► ఏడు రౌండ్లలో మొత్తం చెల్లని ఓట్లు 21,309 నల్లగొండ ► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు ► పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్)- 174, కోదండరాం- 193, తీన్మార్ మల్లన్న- 149 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,11,014 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్ మల్లన్నకు 83,539 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్‌కు 70,265 ఓట్లు ► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు. ► టీఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి-174 ► కోదండరాం - 193 ► తీన్మార్ మల్లన్న -149 ► పూర్తి అయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ►TRS పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్లు-1,10,840 ►మల్లన్న-83,290..... కోదండరాం-70,072.... బీజేపీ-39,107 ►తన సమీప అభ్యర్థి.మల్లన్న పై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ► మొత్తం ఓట్లు ...3,87,969.... ►చెల్లిన ఓట్లు....3,66,333.... ► మురిగిన ఓట్లు....21,636.... ► రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం... ► పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందలంటే కావాల్సిన ఓట్లు 72,327.. ► తీన్మార్ మల్లన్న గెలుపొందలంటే కావలసిన ఓట్లు 99,877. ► కోదండరామ్ గెలవాలంటే 1,13,095.. హైదరాబాద్: ► ఆధిక్యతలో సురభి వాణీదేవి ►నత్తనడకగా కౌంటింగ్.. ► ఐదు గంటలకు ఒక రౌండ్ పూర్తి ► ఇప్పటివరకు నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయింది. ► నేటి మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత తుది ఫలితం ►మొదటి ప్రాధాన్యత ఓట్ల నాలుగో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుపై 5,553 ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ► మొత్తం 3,57,354 ఓట్లు పోలు కాగా, ఒక్కో రౌండ్‌కు 56 వేల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ► అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 70,552 ఓట్లు ► బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 64,999 ► ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 34,029 ► కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడికి 24,053 ఓట్లు లభించాయి. ► నాలుగో రౌండ్ సురభీ వాణీదేవికి 1,109 ఓట్ల ఆధిక్యం వచ్చింది. సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ కౌంటింగ్ ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గురువారం నాటికి.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదోరౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఐదో రౌండ్ ముగిసేసరికి 18,549 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 79,113 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 60,564, కోదండరామ్‌కు 49,200 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 28,981 ఓట్లు, కాంగ్రెస్ 20,274 ఓట్లు రాగా, 15,533 చెల్లని ఓట్లు వచ్చాయని కౌంటింగ్ అధికారులు తెలిపారు. ► ముగిసిన మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. ► మూడో రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ► మూడో రౌండ్లో పల్లాకు పడ్డ ఓట్లు..17393... ► తీన్మార్ మల్లన్నకు....13,122 ► కోదండరాంకు 11,907.... ► ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,142 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ ఇప్పటి వరకు అభ్యర్థుల వారీగా వచ్చి ఓట్లు వరంగల్-ఖమ్మం-నల్గొండ ► పల్లా రాజేశ్వర్ రెడ్డి -47,545 ► తీన్మార్ మల్లన్న-34,864 ► కోదండరామ్-29,560 ► ప్రేమేంందర్ రెడ్డి-19,899 హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ► సురభి శ్రీవాణి-35,171 ► రామచంద్రరావ్-32,558 ► ప్రొ. నాగేశ్వర్ రావు-16,951 ► చిన్నారెడ్డి-10,062 ముగిసిన రెండో రౌండ్. ► టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి -15857 ఓట్లు. ► తీన్మార్ మల్లన్న -12070 ► కోదండరాం-9448, బీజేపీ- 6669, కాంగ్రెస్- 3244 ► రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 7871 ఓట్ల తో ఆధిక్యం ► తెలంగాణ ఎమ్మెల్సీ కౌంటింగ్: రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్‌లో ఉండటం గమనార్హం. ► నల్గొండ సెగ్మెంట్ పరిధిలో ఉదయం తొలి రౌండ్లో మొత్తం 56003 ఓట్లు లెక్కించారు. ► టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు పడ్డాయి. ► రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న నిలిచారు. ఆయనకు 12046 ఓట్లు పోలయ్యాయి. ► అటు హైదరాబాద్ సెగ్మెంట్ పరిధి తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి 17429 ఓట్లు పోలయ్యాయి. ► బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 16385 ఓట్లు పోలయ్యాయి. ► తొలి రౌండ్లో వాణీదేవీ 1044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయనకు 8357 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ : ► నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ►6వ నెంబర్ కౌంటింగ్ వద్ద 8 బ్యాలెట్ బాక్సులకు సీల్ లేకపోవడంతో ఏజెంట్ల ఆందోళన ► బ్యాలెట్ బ్యాక్స్ తాళాలు పగలగొట్టి ఉండటంపై బీజేపీ అభ్యర్థి ఆందోళన ► ప్రశ్నిస్తే బయటకు పంపించేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి నిరసన ►బ్యాలెట్ బాక్స్‌లకు తాళాలు పగలగొట్టే అవసరం ఏమొచ్చిందని ప్రేమే౦దర్ రెడ్డి ప్రశ్నించారు ► ఈ పరిణామంపై రిటర్నింగ్ అధికారికి పిర్యాదు. సరూర్ నగర్ ► సరూర్ నగర్ కౌంటింగ్ హాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన ► చెల్లినవి, చెల్లని ఓట్లను వేరువేరురుగా చేసిన అధికారులు. ► అభ్యర్డులు, వారి ఏజెంట్ల సమక్షంలో బాలేట్ బాక్స్ సీల్ పరిశీలన ► బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ టేబుల్స్ మీదకు తరలిస్తున్న సిబ్బంది. నల్గొండ.. ► కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ► 40% పూర్తయిన బండిల్స్ వర్క్ ►25 ఓట్ల చొప్పున ఒక బండిల్ కడుతున్నారు ► ఈ రోజు సాయంత్రం 5 లోపు పూర్తవనున్న బండిల్స్ ప్రక్రియ ► రాత్రి 9 గంటలలోపు మొదటి రౌండ్ ఫలితం వెలువడుతుందని అంచనా ► ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపు ►రేపు తొలి ప్రాధాన్యత ఫలితాలు వెలువడే అవకాశం ► రిటర్నింగ్ అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తీసుకొచ్చి బండల్స్‌ను కడుతున్నారు. ► ముందుగా పోస్టల్ బ్యాలెట్లను బయటకు తీస్తున్నారు. ► నాలుగు వేల మంది సిబ్బందితో షిఫ్ట్‌ల ప్రకారం నిరంతరం లెక్కింపు కొనసాగనుంది. ‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్ఎస్), ఎన్. రామచందర్‌రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇలా.. కౌంటింగ్ కోసం ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. -
డిగ్రీ ఓటరుల్లారా ‘పట్టం’ కట్టండి
సాక్షి, హైదరాబాద్: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగుస్తోంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో పడ్డారు. వీలైనంత మందిని ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు గత నెల 16న నోటిఫికేషన్ వెలువడగా.. ఈ నెల 14న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 2015లో ఈ రెండు సీట్లకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి రెట్టింపు ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఈ రెండింటిలో 10.36 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా.. ఏకంగా 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ఉద్యమ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పలు రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో కీలక అభ్యర్థులంతా ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ సంస్థల మద్దతు కూడగట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లో.. చెరోచోట సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న టీఆర్ఎస్, బీజేపీలు.. సిట్టింగ్‌ను కాపాడుకుంటూనే, రెండో స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హైవోల్టేజీలో ప్రచారం సాగింది. రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్‌పై ప్రధాన పార్టీల మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీఐఆర్ పూర్తిస్థాయి డీపీఆర్‌లను కేంద్రం ఎన్నిసార్లు కోరినా రాష్ట్రం ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపిస్తే.. ఐటీఐఆర్‌ను కేంద్రమే రద్దు చేసిందని, కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పార్లమెంట్‌లోనే ఈ విషయం చెప్పిన సంగతి తెలియకపోవడం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు రాసిన కేంద్రానికి లేఖలు, డీపీఆర్‌లు ఇస్తామని.. దమ్ముంటే ఐటీఐఆర్ తేవాలని సవాల్‌చేశారు. ఇక టీఆర్ఎస్ సర్కారు సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదని, 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. తాము 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్: బలమంతా కేంద్రీకరించి.. తొలుత కేవలం సిట్టింగ్ సీటు ‘వరంగల్- ఖమ్మం-నల్గొండ’లోనే పోటీ చేస్తుందని భావించిన టీఆర్ఎస్.. చివరి నిమిషంలో ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’లోనూ బరిలోకి దిగింది. మాజీ ప్రధాని పీవీ కూతురు వాణిదేవిని అభ్యర్థిగా ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ సీట్ల పరిధి ఏకంగా ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ బరిలోకి దింపింది. 14 మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి దాకా ప్రచారం చేస్తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి, కుల, సామాజిక సంఘాల మద్దతు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ప్రతి 50 మంది పట్టభద్ర ఓటర్లను చేరుకునేందుకు నాయకులు, చురుకైన కార్యకర్తలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టి మద్దతు తీసుకుంటోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉన్నా.. వివిధ కోణాల్లో అందుతున్న నివేదికల అధారంగా ఎన్నికల ఇన్చార్జిలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్: పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ.. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ సంస్థాగతంగా మండలాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రచార సమావేశాలు ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డికి ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, భట్టి విక్రమార్కకు ‘వరంగల్-ఖమ్మం- నల్లగొండ’ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ వీలైనన్ని చోట్ల వివిధ కేటగిరీల వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాములు నాయక్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ప్రచారం నిర్వహించింది. 2019లో జరిగిన ‘కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్’ ఎన్నికలో కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్‌రెడ్డి గెలిచిన తరహాలోనే.. ఇప్పుడు కూడా ఫలితాలు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. బీజేపీ: టీఆర్ఎస్ టార్గెట్‌గా ప్రచారం ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ సీటును కూడా గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరహాలోనే ఈ రెండు చోట్ల గెలుస్తామని భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలోనే అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించిన బీజేపీ.. ప్రతి 25 మంది పట్టభద్ర ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించింది. పార్టీ అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కూడా క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర మంత్రులు రమేశ్ పోఖ్రియాల్, ప్రకాశ్ జవదేకర్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఇతర కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. సర్వశక్తులు ఒడ్డుతున్న స్వతంత్రులు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ, కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న జయసారధిరెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి సంఘాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. -
అందరి దృష్టి రెండో ప్రాధాన్యతపైనే!
సాక్షి, హైదరాబాద్: రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓ వైపు తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మరోవైపు ఓటింగ్ విధానంపైనా అవగాహన కల్పించేందుకు పార్టీలు, అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఎన్నికలు జరిగే ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, ‘నల్లగొండ-ఖమ్మం -వరంగల్’ స్థానాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులుతో పాటు, స్వతంత్రులు కూడా ఎక్కువమంది పోటీ చేస్తుండటంతో ‘ప్రాధాన్యత’ ఓట్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోలయ్యే ఓట్లలో (చెల్లుబాటు అయ్యే ఓట్లలో) సగానికి పైగా (50 శాతం + ఒక ఓటు) ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క అభ్యర్థి ‘ప్రథమ ప్రాధాన్యత’తో గెలుపొందే అవకాశాలు లేవని పార్టీలు, అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను వీలైనన్ని ఎక్కువ సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. తమకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం లేకుంటే... ఓటింగ్ సమయంలో కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని ప్రచారం సందర్భంగా అభ్యర్థులు, పార్టీలు కోరుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల నమోదు రెట్టింపు కావడంతో పోలయ్యే ఓట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. హైదరాబాద్‌లో బహుముఖ పోటీ ఆరేండ్ల క్రితం... 2015లో ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానంలో 2.96 లక్షల ఓటర్లగాను కేవలం 39 శాతం అంటే 1.13 లక్షల ఓటర్లు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. 31 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా 53,881 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌పై గెలుపొందారు (చెల్లని ఓట్లు ఎనిమిది వేల పైచిలుకు ఉండటంతో రాంచందర్‌రావు ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే విజయాన్ని అందుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం రాలేదు). ఈసారి టీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ పక్షాలు, ఔత్సాహిక అభ్యర్థులు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంపై ముందస్తుగా దృష్టి సారించడంతో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో ‘హైదరాబాద్- రంగారెడ్డి మహబూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానంలో ఏకంగా 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు వివిధ రంగాలకు చెందిన స్వతంత్రులు కూడా పోటీలో ఉండటంతో గతంలో మాదిరిగా ఏ అభ్యర్థి కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు వీలైనన్ని రెండో ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటం తమకు అనుకూలిస్తుందని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నాయి. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’లో హేమాహేమీలు ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’పట్టభద్రుల స్థానానికి 2015లో జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. 2015 ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2.81 లక్షల ఓట్లకు గాను 1.49 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 53.25 శాతం పోలింగ్ నమోదైనా ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా పోలైన ఓట్లలో 50 శాతం మార్క్‌ను దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 5.05 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 71 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ నుంచి రాణీరుద్రమతో పాటు జయసారధి రెడ్డి, తీన్మార్ మల్లన్న తదితరులు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పలువురు ఎన్నికల బరిలో నిలవడంతో ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల వేట సాగిస్తూనే రెండో ప్రాధాన్యత ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. -
ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలవాలి
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో ప్రచార పరంగా ఇతరులతో పోలిస్తే మనం ముందంజలో ఉన్నాం. అయితే కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, అలసత్వానికి తావు లేకుండా మరింత లోతుగా పార్టీ వ్యూహం, ప్రణాళికను అమలు చేయండి. ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుపొందాలి. పోలింగ్‌కు కేవలం 14 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ప్రతి ఓటరును కలిసేలా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయండి..’అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, విప్‌లను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార తీరుతెన్నులపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత, రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. పోలింగ్ తేదీ వరకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలి ‘సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. ప్రతి ఓటరును కలిసి మన ఎజెండాను వివరించడంతో పాటు పోలింగ్‌లో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోండి. గతంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొంత అతి విశ్వాసంతో వెళ్లడంతో నష్టం జరిగింది. ఈసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఓటర్లతో చివరి నిమిషం వరకు మమేకం కావాలి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా లేదు. ఇతర అభ్యర్ధుల్లో ఒకరిద్దరి పట్ల ఓటర్లలో కొంత సానుభూతి ఉన్నా వారికి క్షేత్ర స్థాయిలో యంత్రాంగం లేదు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 30 చోట్ల్ల మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ చివరి నిమిషం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి..’అని కేసీఆర్ సూచించారు. 50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి ‘ఈ నియోజకవర్గంలో 5 లక్షల పైచిలుకు పట్టభద్ర ఓటర్లు ఉండగా, ఇందులో సుమారు 3 లక్షల మందిని మన పార్టీ యంత్రాంగం ద్వారా నమోదు చేశాం. పోలయ్యే ఓట్లలో 50%కి పైగా ఓట్లు మన అభ్యర్థి సాధించేలా క్షేత్ర స్థాయిలో శ్రమించాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా పనిచేయండి. క్షేత్ర స్థాయిలో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర క్రియాశీల నేతలు, కార్యకర్తలు అందరినీ ప్రచారంలో భాగస్వాములను చేయాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత సాగర్‌పై చర్చ! నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత మరోమారు సమావేశమవుదామని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన సమావేశం ముగిసిన తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గొంగిడి సునీతతో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. అయితే సాగర్ ఉప ఎన్నికపై లోతైన చర్చ జరగలేదని, ఆ నియోజకవర్గం పరిధిలో పట్టభద్రుల ఎన్నికతో పాటు ఉప ఎన్నికను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచారం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. -
23న పల్లా నామినేషన్!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం బీ ఫారం అందజేశారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్‌ను రాజేశ్వర్‌రెడ్డి కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ నియోజకవర్గం నుంచి రాజేశ్వర్‌రెడ్డి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా అభ్యర్థిత్వాన్ని పార్టీ గతంలోనే ఖరారు చేయడంతో ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 16న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం 23వ తేదీ వరకు కొనసాగనుండగా, చివరిరోజున భారీ బలప్రదర్శనతో నామినేషన్ దాఖలు చేసేందుకు పల్లా సన్నాహాలు చేసుకుంటున్నారు. గురువారం రాజేశ్వర్‌రెడ్డి తరఫున లాంఛనంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పీఎల్ శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తారా? శాసనమండలి ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో టీఆర్ఎస్ పోటీకి సంబంధించి అస్పష్టత కొనసాగుతోంది. ఈ స్థానానికి మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా కైవసం చేసుకోకపోవడంతో పోటీకి దూరం గా ఉండాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైనా అభ్యర్థి ఎంపిక, ప్రచారసన్నాహాలకు సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. కాగా పార్టీ సీనియర్ నేత, విద్యాసంస్థల అధినేత పీఎల్ శ్రీనివాస్ బుధవారం కేటీఆర్‌ను కలిశారు. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’శాసనమండలి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించడంతోపాటు అవకాశం ఇస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. -
ప్రచార జోరు..
హన్మకొండ/వరంగల్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో ప్రచారం వేడెక్కుతోంది. ఈ నెల 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక కు పోలింగ్ జరగనుంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు పట్టభద్రులను తమ వైపు ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు,స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోటాపోటీ సమావేశాలతో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జోరు పెంచాయి. ఈ క్రమంలో పార్టీ ముఖ్యులను ప్రచారంలోకి దింపాయి. ఆదివారం ఆయూ పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్రావు తరఫున ప్రచారం చేసేందుకు ఆదివారం జిల్లాకు వస్తున్నారు. హన్మకొండ హంటర్ రోడ్డు సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో జరగనున్న పట్టభద్రుల సమావేశంలో పాల్గొననున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున ప్రచారానికి రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సైతం ఇదే రోజు జిల్లాకు వస్తున్నారు. మడికొండలో వర్ధన్నపేట నియోజకవర్గ పట్టభద్రులు, హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరాం గార్డెన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రులు, వరంగల్ మహేశ్వరి గార్డెన్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. అదేవిధంగా ఇటీవల నూతనంగా నియూమకమైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం జిల్లా నుంచి ఆయన నేరుగా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకుంటారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డీసీసీ భవన్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం పార్టీ నాయకులతో చర్చించనున్నారు. రేపు కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాక తొర్రూరు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాం మోహన్‌రావును గెలిపించాలని కోరుతూ ఈ నెల 16న తొర్రూరులోని ఎల్వైఆర్ గార్డెన్లో చేపట్టిన సభకు కేంద్రమంత్రి బండారు దత్తత్రేయ హాజరవుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పెదగాని సోమయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావును గెలిపించి నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి కనుకగా ఇస్తే బంగారు తెలంగాణ కోసం వేలాది కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉంటుందన్నా రు. సమావేశంలో నాయకులు శ్రీమాన్, మురళిమనోహర్, రాములు, అమరేందర్, యాకయ్య, కుమార్, రాము, శంకర్, మహేందర్ పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ పర్యటనపై సమావేశం వరంగల్ : పీసీసీ బాధ్యతలు స్వీకరించిన నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు మొదటిసారి వస్తున్నందున ఘనంగా స్వాగతం చెప్పేందుకు జిల్లా పార్టీ నేతలు శనివారం డీసీసీ భవన్లో రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా పర్యటన వివరాలను మీడియా ఇంచార్జ్ ఈవీ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డికి వరంగల్ నా యుడు పెట్రోల్‌పంపు వద్ద ఘనస్వాగతం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్కడి నుంచి వెంకట్రామ జంక్షన్ మీదుగా వస్తూ ఎంజీఎం చౌరస్తాలోని దివంగత రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తారన్నారు. అక్కడ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకున్న అనంత రం డీసీసీ భవన్లో జరిగే పార్టీ సమీక్షా సమావేశం లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, మాజీ కార్పొరేటర్ నసీం జహా, మహిళా నేతలు సరోజన, రత్నమా ల, బీసీ సెల్ నగర అధ్యక్షుడు పులి రాజు, ధన్‌రాజ్, ప్రదీప్, శ్రీనివాసరెడ్డి, రాజు, ధీరజ్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ అర్జునప్రియకు క్షమాపణ చెప్పాలి నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాల యంలో ఎన్నికల ప్రచారానికి అనుమతించని ప్రిన్సిపాల్ అర్జునప్రియపై ఆగ్రహం వ్యక్తం చేసి దుర్భాషలాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య ర్థి వెంటనే క్షమాపణ చెప్పాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోచాల పద్మ డిమాండ్ చేశారు. మహిళలను చిన్న చూపు చూడడం టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందన్న విషయం ఈసంఘటనతోనే నిదర్శమైందన్నారు. -
పోరు హోరు
ఊపందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం బడా నేతలతో పెరిగిన సందడి టీఆర్ఎస్, బీజేపీ వ్యూహాల రాజకీయం వరంగల్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు పెంచుతున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా పార్టీల శ్రేణులు, మద్దతుదారులు వీరి గెలుపునకు ప్రయత్నిస్తున్నాయి. మార్చి 22న జరగనున్న ఎన్నికలో 22 మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ పక్షాన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ తరఫున ఎర్రబెల్లి రామ్మోహన్రావు, వామపక్షాలు మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థిగా సూరం ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. శాసనమండలి ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఈసారీ గెలుపు దక్కాలని టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతి ష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వ్యూహ బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో టీఆర్ఎస్ ప్రచారంలో వేగం పెంచింది. తక్కువ సమయంలో మూడు జిల్లాల్లోని పట్టభద్రుల మద్దతు పొం దేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్‌రెడ్డి ప్రచా రం చేస్తున్నారు. మూడు జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్నికలో నిమగ్నమయ్యారు. ముమ్మరంగా ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి రామ్మోహన్రావు నవంబర్లోనే ఖరారయ్యారు. అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాష్ట్ర స్థాయి నేతలు ఒక్కొక్కరు జిల్లాకు వచ్చి ప్రచారంలో పాల్గొని వెళ్తున్నారు. వచ్చే వారంలో జాతీయ స్థాయి నేతలు ఎన్నిక ప్రచారానికి వస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గా బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుం టోంది. ఈ ఎన్నికలో బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తోం ది. గత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న(నవీన్) వరంగల్‌లో ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ యాసతో ఉద్యమం సమయంలో వచ్చిన ఆదరణకు తోడు కాంగ్రెస్ మద్దతుపై మల్లన్న ఆశావాహంగా ఉన్నారు. వామపక్షాలు మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా సూరం ప్రభాకర్‌రెడ్డి జిల్లాలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రభాకర్‌రెడ్డికి వామపక్షాల మద్దతు ఇస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అనుకూల పరిస్థితి ఉందని ఈయన శిబిరం భావిస్తోంది. మిగిలిన రెండు జిల్లాల్లో ప్రచారంపై దృష్టి పెడుతున్నారు.