ప్రచార జోరు.. | mlc election party leaders Campaign | Sakshi
Sakshi News home page

ప్రచార జోరు..

Published Sun, Mar 15 2015 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

mlc election party leaders Campaign

హన్మకొండ/వరంగల్ :  వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో ప్రచారం వేడెక్కుతోంది. ఈ నెల 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక కు పోలింగ్ జరగనుంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు పట్టభద్రులను తమ వైపు ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు,స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోటాపోటీ సమావేశాలతో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జోరు పెంచాయి. ఈ క్రమంలో పార్టీ ముఖ్యులను ప్రచారంలోకి దింపాయి. ఆదివారం ఆయూ పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
 
 ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు తరఫున ప్రచారం చేసేందుకు ఆదివారం జిల్లాకు వస్తున్నారు. హన్మకొండ హంటర్ రోడ్డు సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్‌లో జరగనున్న పట్టభద్రుల సమావేశంలో పాల్గొననున్నారు. అదే విధంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున ప్రచారానికి రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సైతం ఇదే రోజు జిల్లాకు వస్తున్నారు. మడికొండలో వర్ధన్నపేట నియోజకవర్గ పట్టభద్రులు, హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరాం గార్డెన్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రులు, వరంగల్ మహేశ్వరి గార్డెన్‌లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. అదేవిధంగా ఇటీవల నూతనంగా నియూమకమైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం జిల్లా నుంచి ఆయన నేరుగా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకుంటారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డీసీసీ భవన్‌లో జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం పార్టీ నాయకులతో చర్చించనున్నారు.
 
 రేపు కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాక
 తొర్రూరు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాం మోహన్‌రావును గెలిపించాలని కోరుతూ ఈ నెల 16న తొర్రూరులోని ఎల్‌వైఆర్ గార్డెన్‌లో చేపట్టిన సభకు కేంద్రమంత్రి బండారు దత్తత్రేయ హాజరవుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పెదగాని సోమయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావును గెలిపించి నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి కనుకగా ఇస్తే బంగారు తెలంగాణ కోసం వేలాది కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉంటుందన్నా రు. సమావేశంలో నాయకులు శ్రీమాన్, మురళిమనోహర్, రాములు, అమరేందర్, యాకయ్య, కుమార్, రాము, శంకర్, మహేందర్ పాల్గొన్నారు.
 
  పీసీసీ చీఫ్ పర్యటనపై సమావేశం
 వరంగల్ : పీసీసీ బాధ్యతలు స్వీకరించిన నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు మొదటిసారి వస్తున్నందున ఘనంగా స్వాగతం చెప్పేందుకు జిల్లా పార్టీ నేతలు శనివారం డీసీసీ భవన్‌లో రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా పర్యటన వివరాలను మీడియా ఇంచార్జ్ ఈవీ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డికి వరంగల్ నా యుడు పెట్రోల్‌పంపు వద్ద ఘనస్వాగతం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్కడి నుంచి వెంకట్రామ జంక్షన్ మీదుగా వస్తూ ఎంజీఎం చౌరస్తాలోని దివంగత రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తారన్నారు. అక్కడ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకున్న అనంత రం డీసీసీ భవన్‌లో జరిగే పార్టీ సమీక్షా సమావేశం లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, మాజీ కార్పొరేటర్ నసీం జహా, మహిళా నేతలు సరోజన, రత్నమా ల, బీసీ సెల్ నగర అధ్యక్షుడు పులి రాజు, ధన్‌రాజ్, ప్రదీప్, శ్రీనివాసరెడ్డి, రాజు, ధీరజ్ పాల్గొన్నారు.
 
 ప్రిన్సిపాల్ అర్జునప్రియకు క్షమాపణ చెప్పాలి
 నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాల యంలో ఎన్నికల ప్రచారానికి అనుమతించని ప్రిన్సిపాల్ అర్జునప్రియపై ఆగ్రహం వ్యక్తం చేసి దుర్భాషలాడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్య ర్థి వెంటనే క్షమాపణ చెప్పాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోచాల పద్మ డిమాండ్ చేశారు. మహిళలను చిన్న చూపు చూడడం టీఆర్‌ఎస్ పార్టీకే చెల్లుతుందన్న విషయం ఈసంఘటనతోనే నిదర్శమైందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement