
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కనబరుస్తున్న ప్రేమకు చిహ్నంగా భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజ్ సుధాకర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇది సెమీఫైనల్స్‌గా భావించాలని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ద్వారా వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలుపునకు మరింత ఊపు వస్తుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం ద్వారా సీఎం జగన్ చరిష్మా మరోసారి బయటపడిందని తెలిపారు.
బీసీలు మేలు చేసిన వారిని మర్చిపోరు: ఆర్ కృష్ణయ్యా
రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యా అన్నారు. ఇంతలా బీసీలకు ఏ రాష్ట్రంలో మేలు జరగడం లేదని వ్యాఖ్యానించారు. బీసీలు మేలు చేసిన వారిని మర్చిపోరన్న ఆయన.. సీఎం చేసిన మేలు మర్చిపోకుండా వైఎస్సార్‌సీపీ వెంట వుండాలన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీలకు అధిక శాతం సీట్లు ఇచ్చిన చరిత్రకారుడు సీఎం జగన్ అని కొనియాడారు. విశాఖలో సమ్మిట్ ద్వారా విశాఖ పై అంతర్జాతీయ దృష్టి పడిందని, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఉత్తరాంధ్రకు మేలు జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment