TG: ముగిసిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం | Graduate MLC Election Campaign Ends, Polling On May 27th | Sakshi
Sakshi News home page

TG: ముగిసిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

Published Sat, May 25 2024 5:53 PM | Last Updated on Sat, May 25 2024 6:11 PM

Graduate MLC Election Campaign Ends, Polling On May 27th

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో  పోలింగ్‌ జరగనుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్‌ 5న వెలువడనుంది.

సాక్షి, హైదరాబాద్‌:  ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 605 పోలింగ్‌ బూత్‌లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు  ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి రాకేశ్‌రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.

పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్‌ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement