Hyderabad-rangareddy- Mahbubnagar
-
తెలంగాణ: ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక
Updates ►ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తి. ►రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్న ముగ్గురు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు ►ఎమ్మెల్యే కోటా లో కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక ►ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి ►కార్యక్రమానికి హాజరైన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ► మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని కౌంటింగ్ సెంటర్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ► సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శానస మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో మొదలైంది. మూడు జిల్లా నుంచి మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 29,720 మంది ఓటర్లలో 26,866 మంది ఓటేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 28 టేబుళ్లను సిద్ధం చేశారు. ఒక్కో టేబుల్‌కు ఓ అధికారితో పాటు నలుగురు కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఓట్ల కౌటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు, పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించడం లేదు. ఒక్కో టేబుల్‌కి వెయ్యి ఓట్లు ఓట్ల గణనలో భాగంగా తొలుత 137 బూత్‌ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్కులను ఒకచోటకు చేర్చి ప్రతి 50 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్‌గా జత కడతారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపునకు ఒక్కో టేబుల్‌కి వెయ్యి ఓట్లు ఇస్తారు. పోలైన మొత్తం ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతానికిపైగా మెజారిటీ సాధించిన వారిని విజేతగా ప్రకటించనున్నారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు యాభైశాతం రాకపోతే.. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు, అయిదు.. ఇలా చివరి ప్రాధాన్యత ఓటు వరకు లెక్కించి, అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి, చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫలితం మధ్యాహ్నం మూడు గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైతే.. తుది ఫలితం రాత్రి 7 గంటల వరకు వెలువడే అవకాశం ఉంది. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరు.. పోలింగ్ ఘట్టానికి సర్వం సిద్ధం
హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించారు. ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 137 పోలింగ్ కేంద్రాల్లో 29 వేల 720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 21 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 12 మంది సెక్టరోల్ అధికారులను, 29 మంది అబ్జర్వర్లను నియమించారు. ప్రాధాన్యత క్రమంలో బ్యాలెట్ విధానంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చిన పెన్నుతోనే బ్యాలెట్ పేపర్ లో ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్లలో పోలీసు బందోబస్తు, ఓటర్లకు మౌలిక సదుపాయాలు, మంచినీరు, టెంట్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా తెలిపారు. పొలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించనున్నారు. ఈ నెల 16న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితాల ప్రకటనకు 24 గంటలకు పైగా సమయం పట్టనుంది. -
వేడెక్కిన రాజకీయం.. నోటిఫికేషన్‌కు ముందే జోరుగా ప్రచారం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నోటిఫికేషన్‌కు ముందే రసవత్తరంగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలు, మండలాల వారీగా పర్యటించి ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయ ఓటర్లను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయిస్తున్నారు. ఒకవైపు ఓటర్లను ఆకర్షిస్తూనే.. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై మద్దతు ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీఆర్టీయూ తెలంగాణ మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతుండగా, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ నుంచి మాణిక్‌రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు పోటీలో ఉన్నారు. మొదలైన ఓటర్ల నమోదు ప్రక్రియ 2023 మార్చితో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ చివరి నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించి.. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించనున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 33,116 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే 22 వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 9తో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓటరు నమోదుపై దృష్టి సారించాయి. అభ్యర్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ప్రొఫెసర్లను స్వయంగా కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. రెండుగా చీలిపోయిన పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల్లో పీఆర్టీయూ కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంఘానికి 72 వేలకుపైగా సభ్యత్వాలు ఉన్నాయి. 2014కు ముందే ఈ సంఘం రెండుగా చీలిపోయింది. కొంతమంది ఉపాధ్యాయులు మాతృసంస్థ పీఆర్టీయూ తెలంగాణ నుంచి విడిపోయి పీఆర్టీయూ టీఎస్‌గా ఏర్పడ్డారు. గతంలో ఈ రెండు సంఘాలు కలిసే అభ్యర్థిని ప్రకటించి, ఈ మేరకు గెలిపించుకున్నాయి. పీఆర్టీయూ టీఎస్ రంగారెడ్డి జిల్లాకు చెందిన గుర్రం చెన్న కేశవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్న పీఆర్టీయూ తెలంగాణ ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పేరును మరోసారి ఖరారు చేసింది. వీరిద్దరూ గతంలో ఒకే సంఘంలో పని చేసిన వారే. ప్రస్తుతం కీలక నేతలిద్దరూ పోటీలో ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 317 జీఓ ఉపసంహరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే అపవాదు ప్రస్తుత ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డిపై ఉంది. జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు గుర్రం చెన్నకేశవరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒకే ఉపాధ్యాయ సంఘం నుంచి చీలిపోయి ఇద్దరు పోటీలో ఉండటం ప్రత్యర్థులకు కలిసిరానుంది. ఇద్దరి మధ్యలో యూటీఎఫ్ అభ్యర్థికి సైతం గెలుపు అవకాశాలు ఉంటాయని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాలి. -
వాణీదేవిదే విజయం
సాక్షి, హైదరాబాద్: నువ్వా నేనా అన్నట్టు సాగిన ‘మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్’గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోరులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి విజయం సాధించారు. ఆమె ఎన్నికలకు కొత్త అయినప్పటికీ.. బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచంద్రరావు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌లతో పోటీపడి పైచేయి సాధించారు. ఈ ఎన్నికలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ విజయానికి అవసరమైన ‘కోటా’ఓట్లు రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించగా.. మొత్తం 1,89,339 ఓట్లు వాణీదేవికి లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటును రాంచంద్రరావుకు వేసిన వారిలో 23 వేల మందికిపైగా రెండో ప్రాధాన్యతగా వాణీదేవికి వేశారు. సుదీర్ఘ లెక్కింపు తర్వాత.. 17వ తేదీన ఉదయమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై సుదీర్ఘంగా సాగింది. శనివారం రాత్రి ఫలితం ప్రకటించారు. నాలుగు రోజుల పాటు అటు రాజకీయ నేతలు, విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజల్లో సైతం ఇది ఉత్కంఠ రేకెత్తించింది. తక్కువ ఓట్లు వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ రాగా.. ప్రధాన ప్రత్యర్థి రామచంద్రరావు ఎలిమినేషన్ సమయానికి వాణీదేవికి కోటాకు మించి ఓట్లు లభించాయి. అయితే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో ఇతర అభ్యర్థులు ముందుకు దూసుకెళతారేమో అన్న అభిప్రాయం తొలుత వ్యక్తమైనా.. వాణీదేవి ముందుకు దూసుకెళ్లారు. ప్రథమ ప్రాధాన్యతతో 1,12,689 ఓట్లు పొందిన ఆమె.. రెండో ప్రాధాన్యతగా 76,650 ఓట్లు పొందారు. మొదటి నుంచీ టీఆర్ఎస్ ఆధిక్యత ప్రధమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి చివరి వరకు అధికార టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఏడు రౌండ్లలో ప్రతి రౌండ్ ఓట్లలో 34 నుంచి 35 శాతం వరకు ఓట్లు వాణీదేవి ఖాతాలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ప్రతి రౌండ్లో 30 నుంచి 32 శాతం ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 7 నుంచి 9 శాతం, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ ఒకటి నుంచి రెండు శాతం ఓట్లకు పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి ఫ్రొఫెసర్ నాగేశ్వర్రావుకు మాత్రం ప్రతి రౌండ్లో 14 నుంచి 16 శాతం వరకు ఓట్లు వచ్చాయి. రికార్డు ఎన్నిక ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత భారీగా 93 మంది పోటీ చేయడం, 67 శాతం పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ప్రథమ ప్రాధాన్యతలో తక్కువ ఓట్లు వచ్చినవారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ, రెండో ప్రాధాన్యత ఓట్లను కేటాయిస్తూ.. ఏకంగా 92 మందిని ఎలిమినేట్ చేసిన రికార్డు కూడా ఈ ఎన్నికదే. ►మొత్తం 93 మంది అభ్యర్థుల్లో 84 మందికి కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. ►ఒక అభ్యర్థికి కేవలం 8 ఓట్లు మాత్రమే వచ్చాయి ►రెండంకెల ఓట్లు మాత్రమే వచ్చిన వారు 51 మంది, మూడంకెల ఓట్లు దక్కినవారు 32 మంది ►ప్రధాన పోటీదారులు నలుగురు కాకుండా.. 5 వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినవారు ముగ్గురున్నారు. పట్టభద్ర ఓటర్లకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించిన పట్టభద్రులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వారి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అభినందించారు. అలాగే వాణీదేవి, రాజేశ్వర్‌రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు. వాణీదేవి శనివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, గెలుపు కోసం కృషి చేసిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వాణీదేవిని అభినందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, సంతోష్ కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్ రెడ్డి, శంభీపూర్ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, కేపీ వివేకానంద, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, మెతుకు ఆనంద్, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం
-
MLC Election Results: సురభి వాణిదేవి విజయం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘంగా కొనసాగిన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆమె గెలుపు ఖరారైంది. మరికాసేపట్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక వాణిదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. తెలంగాణ భవన్లో కాసేపట్లో విజయోత్సవ సంబరాలకు ఏర్పాట్లు చేస్తుండటంతో, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ►సురభి వాణిదేవికి వచ్చిన మొత్తం ఓట్లు 1,49,269 ♦మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 ♦రెండో ప్రాధాన్యత ఓట్లు 36,580 ►రాంచందర్‌రావుకు వచ్చిన మొత్తం ఓట్లు 1,37,566 ♦మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,04,668 ♦రెండో ప్రాధాన్యత ఓట్లు 32,898 కాగా తెలంగాణలో ఈ నెల 14న రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతుండగా నేడు, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఫలితం వెలువడింది. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తుండగా, తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం -
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
కౌంటింగ్.. ఇంకా వెయిటింగ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటా స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై మూడు రోజులు గడుస్తున్నా తుది ఫలితం తేలకపోవడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో సహా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పోలై... చెల్లుబాటయ్యే ఓట్లలో 50% + ఒక ఓటును పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏడురౌండ్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా... ఏ అభ్యర్థీ 50% ఓట్లు (విజ యానికి కావాల్సిన నిర్ణీత కోటా ఓట్లు) సాధించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. అతితక్కువ ఓట్లు సాధించిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ (ఆఖరి స్థానంలో నిలిచిన అభ్యర్థిని మొదట ఎలిమినేట్ చేస్తారు. అలా కింది నుంచి పైకి వెళుతూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తారు), వారి బ్యాలెట్లో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ (ఎలిమినేషన్ విధానం) కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో శనివారం మధ్యాహ్నం వరకు, ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశముందని లెక్కింపు సరళి వెల్లడిస్తోంది. అయితే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ పూర్తయిన తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల నడుమ చివరి వరకు గెలుపు దోబూచులాడే అవకాశముందని స్పష్టమవుతోంది. రెండు స్థానాల్లోనూ శనివారం రాత్రికి తుది ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ‘హైదరాబాద్’లో ఇద్దరి నడుమ హోరాహోరీ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 93 అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎస్.వాణీదేవి (టీఆర్ఎస్) ఒకటో, ఎన్.రామచందర్‌రావు (బీజేపీ) రెండో స్థానంలో నిలిచారు. దీంతో చివరి నిముషం వరకు ఈ ఇద్దరి నడుమ ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశముంది. మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (స్వతంత్ర), నాలుగో స్థానంలో నిలిచిన జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) బ్యాలెట్లలో వచ్చే రెండో ప్రాధాన్యత ఓట్లపై వాణీదేవి, రాంచందర్‌రావు గెలుపోటములు ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో చిన్నారెడ్డి, నాగేశ్వర్లు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే వారి బ్యాలెట్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వాణీదేవి, రామచందర్‌రావు నడుమ ఎవరికి ఎక్కువగా వెళితే వారు విజేత అయ్యే అవకాశముంది. విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావాలంటే వాణీదేవి మరో 17.57 శాతం, రాంచందర్‌రావు మరో 19 శాతం ఓట్లు సాధించాల్సి ఉంది. నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు ఇద్దరికీ కలిసి 25.26 శాతం తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, స్వతంత్ర అభ్యర్థులు జి.హర్షవర్దన్‌రెడ్డి, అన్వర్‌ఖాన్, వేముల తిరుమల బ్యాలెట్లలో వచ్చే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా కొంత మేర వాణీదేవి, రాంచందర్‌రావుకు కీలకం కానున్నాయి. ‘నల్లగొండ’లో ఆ ముగ్గురు నడుమ పోటీ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభధ్రుల నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) మొదటి స్థానంలో, తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) రెండు, ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్) మూడో స్థానంలో నిలిచారు. అయితే ప్రథమ ప్రాధాన్యత ఓట్ల సంఖ్య పరంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే సుమారు 7.5 శాతం ఓట్లు అదనంగా సాధించారు. కోదండరాం కంటే తీన్మార్ మల్లన్న సుమారు 2.5 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. పల్లా ముందంజలో ఉన్నా మల్లన్న, కోదండరాంలకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే...ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ), ఎస్.రాములు నాయక్ (కాంగ్రెస్) బ్యాలెట్స్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మల్లన్న, కోదండరాం గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వీరితో పాటు జయసారధిరెడ్డి (సీపీఐ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ), రాణీరుద్రమ (యువ తెలంగాణ) బ్యాలెట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పల్లా, మల్లన్న, కోదండరాం సాధించే ఫలితంపై కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది. తేలని లెక్క.. కొనసాగుతున్న ఉత్కంఠ పట్టభద్రుల స్థానాల కోటా ఓట్ల లెక్కింపు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఎవరు విజేతగా నిలుస్తారనే అంశంపై స్పష్టత రాకపోవడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జన సామాన్యానికి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎవరికి వారుగా తుది ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ‘హైదరాబాద్’లో 93, ‘నల్గొండ’లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎలిమినేషన్ విధానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నెమ్మదిగా జరుగుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో శుక్రవారం రాత్రికి రెండు స్థానాల్లోనూ కేవలం ఐదారుగురు అభ్యర్థులు మాత్రమే లెక్కింపు బరిలో మిగిలే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ధీటుగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ‘హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్’ పోటీ చేసిన అభ్యర్థులు ః 93 మొత్తం ఓట్లు ః 5,31,268 పోలైన ఓట్లు ః 3,58,348 చెల్లని ఓట్లు ః 21,309 చెల్లిన ఓట్లు ః 3,37,039 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు ః 1,68,520 ఎస్.వాణిదేవి (టీఆర్ఎస్) ః 1,12,689 (33.43 శాతం) ఎన్.రాంచందర్‌రావు (బీజేపీ) ః 1,04,668 (31 శాతం) కె.నాగేశ్వర్ (స్వతంత్ర) ః 53,620 (15.9 శాతం) చిన్నారెడ్డి (కాంగ్రెస్) ః 31,554 (9.36 శాతం) తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ‘నల్గొండ– ఖమ్మం– వరంగల్’ పోటీ చేసిన అభ్యర్థులు ః71 మొత్తం ఓట్లు ః 5,05,565 పోలైన ఓట్లు ః 3,87,969 చెల్లని ఓట్లు ః 21,636 చెల్లిన ఓట్లు ః 3,66,333 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు ః 1,83,167 పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) ః 1,10,840 (30.25 శాతం) తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) ః 83,290 (22.73 శాతం) కోదండరాం (టీజేఎస్) ః 70,072 (19.12 శాతం) గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) ః 39,107 (10.67శాతం) రాములు నాయక్(కాంగ్రెస్) : 27,588 (7.53 శాతం) శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు కలుపుకొని తాజాగా ప్రధాన అభ్యర్థుల ఓట్ల వివరాలు ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) ః 1,11,190 ఓట్లు తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) ః 83,629 ఓట్లు కోదండరాం (టీజేఎస్) ః 70,472 ఓట్లు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) ః 39, 268 ఓట్లు రాములు నాయక్(కాంగ్రెస్) : 27, 713 ఓట్లు ‘హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్’ ఎస్.వాణిదేవి (టీఆర్ఎస్) ః 1,12,802 ఓట్లు ఎన్.రాంచందర్‌రావు (బీజేపీ) ః 1,04,965 ఓట్లు కె.నాగేశ్వర్ (స్వతంత్ర) ః 53,687 ఓట్లు చిన్నారెడ్డి (కాంగ్రెస్) ః 31,602 ఓట్లు ఎలిమినేషన్ ఇలా సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. మొత్తం పోలైన ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగం + ఒక ఓటు... విజయానికి కావాల్సిన నిర్ణీత కోటా (50%+1) అవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ ఈ కోటాను చేరుకోకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు పది మంది అభ్యర్థులు రంగంలో ఉంటే.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని (అంటే 10వ స్థానంలో నిలిచిన అభ్యర్థిని) మొదట ఎలిమినేట్ చేస్తూ...ఆ అభ్యర్థి బ్యాలెట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలుపుతారు. పదో వ్యక్తి ఎలిమినేట్ అవడంతో.. 9 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్న అభ్యర్థికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైన ఉన్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలిపి... వారికి వచ్చిన మొత్తం ఓట్లుగా పరిగణిస్తారు (ఎలిమినేట్ అయిన పదో అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లలో ఒకవేళ తొమ్మిదవ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చి ఉంటే.. ఆ బ్యాలెట్ పేపర్లలోని మూడో ప్రాధాన్యత ఓట్లను పైనున్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి కలుపుతారు). తర్వాత 8వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ఇతనికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే ఏడుగురు అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే.. వారికి ఆ ఓట్లను కలుపుతారు. ఇలా ఎలిమినేట్ ఆయ్యే క్రమంలో పైనున్న స్థానాల్లోని అభ్యర్థుల్లో ఎవరికైనా 50 శాతం ఓట్లతో పాటు ఒక్క ఓటు అదనంగా వచ్చినా .. వారిని విజేతగా ప్రకటిస్తారు. అక్కడితో (ఆ ఎలిమినేషన్ రౌండ్‌తో) కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేస్తారు. ఇద్దరే మిగిలితే... ఎక్కువ ఓట్లున్న వారే విజేత నిర్ణీత కోటా ఓట్లను ఎవరూ సాధించలేని పక్షంలో పోటీలో ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ ఇద్దరిలో ఎవరికీ నిర్ణీత కోటా ఓట్లు (50 శాతం + 1 ఓటు) రాకపోయినా సరే... ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వారినే విజేతగా ప్రకటిస్తారని నల్లగొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని విజేతను ప్రకటిస్తారని వెల్లడించారు. -
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం చోటుచేసుకుంది. అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత వచ్చిన బ్యాలెట్ పేపర్ల కంటే ... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్ పేపర్లను తక్కువగా చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 8 మంది ఎలిమినేషన్లో ఉండగా, 50 ఓట్లు గల్లంతైనట్లు చూపడంతో బీజేపీ, కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో కాసేపు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రక్రియను నిలిపివేసి తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యతలో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ 38, బీజేపీ 17, ప్రొపెఫర్ నాగేశ్వర్ 18, కాంగ్రెస్ 13 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల(8042)తో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి 1, 12, 727 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు 1, 04, 685, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,628 , కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 31,567 ఓట్లతో ఉన్నారు. కాగా 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది. అయితే, ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం -
ఎమ్మెల్సీ ఎన్నికలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
ఎమ్మెల్సీ ఎన్నికలు : టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుపై వాణిదేవి గెలుపొందారు. మూడు రోజులుగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా శనివారం సాయంత్రం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఫలితం వచ్చింది. ఇంకా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం దిశగా పయనిస్తున్నారు. తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దర మధ్య ఓట్ల వ్యత్యాసం 24 వేలకు పైగా ఉంది. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్: నేడు సాయంత్రంలోగా ఎమ్బెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నల్గొండ : ► టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం ► తీన్మార్ మల్లన్నపై 2, 700 ఓట్ల ఆధిక్యంలో పల్లా ► సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ ► నల్గొండలో నాలుగో స్థానంలో బీజేపీ హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సంబరాలు ► టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు ►రెండో ప్రాధాన్యం ఓట్లతొ గెలిచిన వాణిదేవి ► గెలుపు దిశగా టీఆర్ఎస్ అభ్యర్తి వాణీదేవి ► హైదరాబాద్ ఎన్నికల బరిలో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు ► 8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి ► నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్ధులు ► 23,428 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ► రెండో స్థానంలో మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం ►హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ► హైదరాబాద్ స్థానంలో ఇప్పటి వరకు 90 మంది ఎలిమినేట్ ►8,812 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి ► టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 1,28,689 ఓట్లు ► రామచంద్రరావు (BJP) 1,19,198 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు ► 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం అభ్యర్థుల వారీగా వచ్చిన రెండో ప్రాధన్యత ఓట్లు ► టీఆర్ఎస్, పల్లా రాజేశ్వర్ రెడ్డి -5252 ► తీన్మార్ మల్లన్న-7352 ► కోదండరాం-10299 ►అభ్యర్థుల వారిగా ఇప్పటివరకు వచ్చిన ఓట్లు.... ►పల్లా రాజేశ్వర్ రెడ్డి- 122638. ►తీన్మార్ మల్లన్న-99210 ►కోదండరాం-89409 ►పల్లా ఆధిక్యం-23428 ►ప్రారంభం అయిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ►నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సరైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా మెజారిటీ తగ్గింది. అయితే ఇప్పటికి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్‌కు 79,110 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 66 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ►హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 8,478 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,15,043 ఓట్లు, రామచంద్రరావు (బీజేపీ) 1,06,565 ఓట్లు ప్రొ. నాగేశ్వర్‌కు 55,742 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్) 32,879 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 86 మందికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ► నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎవరికీ గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనపడటం లేదు. ఒకవేళ ఎవరికీ మ్యూజిక్ ఫిగర్ రాకపోతే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. హైదరాబాద్ ► హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ► రెండో ప్రాధాన్యతలో 14 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి ► రెండో ప్రాధాన్యతలో టీఆర్ఎస్-38, బీజేపీ-17, నాగేశ్వర్-18, కాంగ్రెస్-13 ఓట్లు ► రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి వాణిదేవి (టీఆర్ఎస్) ఆధిక్యం 8,042 ► వాణీదేవి(టీఆర్ఎస్)కి 1,12,727 ఓట్లు, రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,685 ఓట్లు ► ప్రొ. నాగేశ్వర్‌కు 53,628 ఓట్లు, చిన్నారెడ్డి(కాంగ్రెస్)కి 31,567 ఓట్లు ► హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఏడో రౌండ్ పూర్తి ► ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి వాణీదేవి(టీఆర్ఎస్)కి 1,12,689 ఓట్లు ► రామచంద్రరావు(బీజేపీ)కి 1,04,668 ఓట్లు, ప్రొ. నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు ► ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి చిన్నారెడ్డి(కాంగ్రెస్)కి 31,554 ఓట్లు ► మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోని మొదటి ప్రాధాన్యత ఓట్లు ► అనివార్యమైన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే టీఆర్ఎస్, బీజేపీ ఆశలు ► మొదటి ప్రాధాన్యత ఓట్లలో వాణీదేవి(టీఆర్ఎస్) ఆధిక్యం 8,021 ఓట్లు ► ఏడు రౌండ్లలో మొత్తం చెల్లని ఓట్లు 21,309 నల్లగొండ ► కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు ► పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్)- 174, కోదండరాం- 193, తీన్మార్ మల్లన్న- 149 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,11,014 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్ మల్లన్నకు 83,539 ఓట్లు ► మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్‌కు 70,265 ఓట్లు ► 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన 1312 ఓట్లు. ► టీఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి-174 ► కోదండరాం - 193 ► తీన్మార్ మల్లన్న -149 ► పూర్తి అయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ►TRS పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్లు-1,10,840 ►మల్లన్న-83,290..... కోదండరాం-70,072.... బీజేపీ-39,107 ►తన సమీప అభ్యర్థి.మల్లన్న పై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ► మొత్తం ఓట్లు ...3,87,969.... ►చెల్లిన ఓట్లు....3,66,333.... ► మురిగిన ఓట్లు....21,636.... ► రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం... ► పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందలంటే కావాల్సిన ఓట్లు 72,327.. ► తీన్మార్ మల్లన్న గెలుపొందలంటే కావలసిన ఓట్లు 99,877. ► కోదండరామ్ గెలవాలంటే 1,13,095.. హైదరాబాద్: ► ఆధిక్యతలో సురభి వాణీదేవి ►నత్తనడకగా కౌంటింగ్.. ► ఐదు గంటలకు ఒక రౌండ్ పూర్తి ► ఇప్పటివరకు నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయింది. ► నేటి మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత తుది ఫలితం ►మొదటి ప్రాధాన్యత ఓట్ల నాలుగో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుపై 5,553 ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ► మొత్తం 3,57,354 ఓట్లు పోలు కాగా, ఒక్కో రౌండ్‌కు 56 వేల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. ► అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 70,552 ఓట్లు ► బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 64,999 ► ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 34,029 ► కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడికి 24,053 ఓట్లు లభించాయి. ► నాలుగో రౌండ్ సురభీ వాణీదేవికి 1,109 ఓట్ల ఆధిక్యం వచ్చింది. సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ: తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ కౌంటింగ్ ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గురువారం నాటికి.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదోరౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఐదో రౌండ్ ముగిసేసరికి 18,549 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 79,113 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 60,564, కోదండరామ్‌కు 49,200 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 28,981 ఓట్లు, కాంగ్రెస్ 20,274 ఓట్లు రాగా, 15,533 చెల్లని ఓట్లు వచ్చాయని కౌంటింగ్ అధికారులు తెలిపారు. ► ముగిసిన మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. ► మూడో రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ► మూడో రౌండ్లో పల్లాకు పడ్డ ఓట్లు..17393... ► తీన్మార్ మల్లన్నకు....13,122 ► కోదండరాంకు 11,907.... ► ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,142 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ ఇప్పటి వరకు అభ్యర్థుల వారీగా వచ్చి ఓట్లు వరంగల్-ఖమ్మం-నల్గొండ ► పల్లా రాజేశ్వర్ రెడ్డి -47,545 ► తీన్మార్ మల్లన్న-34,864 ► కోదండరామ్-29,560 ► ప్రేమేంందర్ రెడ్డి-19,899 హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ► సురభి శ్రీవాణి-35,171 ► రామచంద్రరావ్-32,558 ► ప్రొ. నాగేశ్వర్ రావు-16,951 ► చిన్నారెడ్డి-10,062 ముగిసిన రెండో రౌండ్. ► టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి -15857 ఓట్లు. ► తీన్మార్ మల్లన్న -12070 ► కోదండరాం-9448, బీజేపీ- 6669, కాంగ్రెస్- 3244 ► రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 7871 ఓట్ల తో ఆధిక్యం ► తెలంగాణ ఎమ్మెల్సీ కౌంటింగ్: రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్‌లో ఉండటం గమనార్హం. ► నల్గొండ సెగ్మెంట్ పరిధిలో ఉదయం తొలి రౌండ్లో మొత్తం 56003 ఓట్లు లెక్కించారు. ► టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు పడ్డాయి. ► రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న నిలిచారు. ఆయనకు 12046 ఓట్లు పోలయ్యాయి. ► అటు హైదరాబాద్ సెగ్మెంట్ పరిధి తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి 17429 ఓట్లు పోలయ్యాయి. ► బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 16385 ఓట్లు పోలయ్యాయి. ► తొలి రౌండ్లో వాణీదేవీ 1044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయనకు 8357 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ : ► నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ►6వ నెంబర్ కౌంటింగ్ వద్ద 8 బ్యాలెట్ బాక్సులకు సీల్ లేకపోవడంతో ఏజెంట్ల ఆందోళన ► బ్యాలెట్ బ్యాక్స్ తాళాలు పగలగొట్టి ఉండటంపై బీజేపీ అభ్యర్థి ఆందోళన ► ప్రశ్నిస్తే బయటకు పంపించేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి నిరసన ►బ్యాలెట్ బాక్స్‌లకు తాళాలు పగలగొట్టే అవసరం ఏమొచ్చిందని ప్రేమే౦దర్ రెడ్డి ప్రశ్నించారు ► ఈ పరిణామంపై రిటర్నింగ్ అధికారికి పిర్యాదు. సరూర్ నగర్ ► సరూర్ నగర్ కౌంటింగ్ హాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన ► చెల్లినవి, చెల్లని ఓట్లను వేరువేరురుగా చేసిన అధికారులు. ► అభ్యర్డులు, వారి ఏజెంట్ల సమక్షంలో బాలేట్ బాక్స్ సీల్ పరిశీలన ► బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ టేబుల్స్ మీదకు తరలిస్తున్న సిబ్బంది. నల్గొండ.. ► కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ► 40% పూర్తయిన బండిల్స్ వర్క్ ►25 ఓట్ల చొప్పున ఒక బండిల్ కడుతున్నారు ► ఈ రోజు సాయంత్రం 5 లోపు పూర్తవనున్న బండిల్స్ ప్రక్రియ ► రాత్రి 9 గంటలలోపు మొదటి రౌండ్ ఫలితం వెలువడుతుందని అంచనా ► ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపు ►రేపు తొలి ప్రాధాన్యత ఫలితాలు వెలువడే అవకాశం ► రిటర్నింగ్ అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తీసుకొచ్చి బండల్స్‌ను కడుతున్నారు. ► ముందుగా పోస్టల్ బ్యాలెట్లను బయటకు తీస్తున్నారు. ► నాలుగు వేల మంది సిబ్బందితో షిఫ్ట్‌ల ప్రకారం నిరంతరం లెక్కింపు కొనసాగనుంది. ‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్ఎస్), ఎన్. రామచందర్‌రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇలా.. కౌంటింగ్ కోసం ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. -
నేడే ‘మండలి’ కౌంటింగ్.. ఫలితాలకు 2 రోజుల సమయం?
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఈ నెల 14న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఫలితాలపై స్పష్టత బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్ఎస్), ఎన్. రామచందర్‌రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల లెక్కింపు... మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనుండగా వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు తొలగింపుతో... రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకుంటే.. మొదటి ప్రాధాన్య ఓట్లు అతితక్కువగా వచ్చిన అభ్యర్థిని తొలగించి (ఎలిమేషన్ పద్ధతి) సదరు అభ్యర్థి బ్యాలెట్లలో పోలైన రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చాయో ఆ అభ్యర్థి ఓట్లకు కలుపుతూ వెళ్తారు. ఇలా మొదటి ప్రాధాన్య ఓట్లు తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరినే తొలగిస్తూ వారి రెండో ప్రాధాన్య ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతారు. చివరకు కోటా ఓట్లు ఎవరు పొందుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మళ్లీ ఇంతే సమయం పడుతుందని.. తుది ఫలితం 18న రాత్రికి అంటే.. మొత్తంగా కౌంటింగ్ మొదలయ్యాక 48 గంటలు (రెండు రోజులు) పడుతుందని చెబుతున్నారు. షిఫ్ట్‌లవారీగా సిబ్బంది... ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు సైతం షిఫ్ట్‌లవారీగా ఏర్పాట్లు చేశారు. ‘నల్లగొండ’స్థానం పరిధిలోని 731 పోలింగ్ కేంద్రాలు, ‘హైదరాబాద్’స్థానం పరిధిలోని 799 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేర్లను ముందుగా కలపడం (మిక్సింగ్), ఆ తర్వాత 25 ఓట్ల చొప్పున ఒక్కో కట్టను కట్టడం వంటి పనులకే సుమారు 12 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతనే మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ‘నల్లగొండ’లో ఒక్కో టేబుల్‌కు ఐదుగురు సిబ్బంది చొప్పున, ‘హైదరాబాద్’లో ఒక్కో టేబుల్‌కు ఆరుగురు సిబ్బంది చొప్పున ఒక్కో షిఫ్ట్‌లో ఓట్లు లెక్కించనున్నారు. -
గట్టిపోటీ ఇచ్చిన కోదండరాం, నాగేశ్వర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. పోలింగ్ ముగియడంతో జయాపజయాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్ జరిగిన సరళి తమ కంటే తమకే అనుకూలమంటూ అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ఆ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా తమ సత్తా చాటుతామని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వాలపై వ్యతిరేకత నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో గిరిజన నేత రాములునాయక్‌కు టికెట్ ఇవ్వడం కలసి వస్తుందని, పోలింగ్ సరళి కూడా ఇదే చెబుతోందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. సామాజిక కోణంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్, బీజేపీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుండటం, మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు తాము టికెట్ ఇవ్వడం లాభిస్తుందని అం చనా వేస్తున్నారు. పాలమూరు జిల్లాలో స్థానిక త పనిచేసిందని, రాజకీయంగా తమ అభ్యర్థి చిన్నారెడ్డి అనుభవజ్ఞుడు కావడం లాభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్పై ఎలాగూ వ్యతిరేకత ఉందన్న ధీమా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే జోరు.. ఈసారీ హుషారు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లిన కమలనాథులు కూడా రెండు స్థానాల్లో విజయం తమదేనని అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని పట్టభద్రులు విశ్వసించారని, తమకు ఎన్నికల ప్రచారంలో లభించిన స్పందనతోపాటు పోలింగ్ జరిగిన సరళి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనందున అనివార్యంగా తమను ఎంచుకున్నారని, మోదీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విజయం తమదేనన్న విశ్వాసం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానం రంగారెడ్డితోపాటు బోనస్‌గా నల్లగొండ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని, ఇదే ఊపుతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు వెళతామని కమలనాథులంటుండటం గమనార్హం. ఇక సాగర్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నిక వైపు మరలనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉప ఎన్నికపై ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముగిసిన వెంటనే మళ్లీ అన్ని రాజకీయ పార్టీలు సాగర్ కేంద్రంగా మకాం వేసి ఎన్నికల రాజకీయం నడిపేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. చెప్పుకోగలిగాం... చేతల్లో చూపిస్తాం పోలింగ్ తర్వాత మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తమ ప్రయత్నానికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. పట్టభద్రులు తమకెందుకు ఓటేయాలనే అంశాన్ని విస్తృతంగా తీసు కెళ్లగలిగామనే అంచనాలో తెలంగాణ భవన్ వర్గాలున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన పార్టీ యంత్రాంగం 10 రోజులుగా పక్కా కార్యాచరణతో ముందుకెళ్లిందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు చెందిన 100కుపైగా సంఘాలు బహిరంగంగా తమకు మద్దతు ప్రకటించినందున ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే పడ్డాయని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న కొంత వ్యతిరేకతను కూడా సమసిపోయేలా చేయగలిగామని, ఈ రెండుస్థానాల్లోనూ ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమా టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. మొదటి, రెండో ప్రాధాన్యత.. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కల్లో రాజకీయపార్టీలు నిమగ్నమయ్యాయి. ఏ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినా, రెండో ప్రాధాన్యత విషయంలో క్రాస్ ఓటింగ్ తథ్యమని, ఈ పరిస్థితుల్లో ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి అన్ని ప్రధాన రాజకీయ పక్షాల్లోనూ కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన సరళిని బట్టి నల్లగొండ నుంచి ప్రొఫెసర్ కోదండరాం గెలుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద ప్రొఫెసర్‌ను ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న సంబంధాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను పరిగణనలోనికి తీసుకుని పట్టభద్రుల పోలింగ్ జరిగిందనే వాదన ఆసక్తిని కలిగిస్తోంది. హైదరాబాద్–రంగా రెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గెలుపుపై కూడా పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద నాగేశ్వర్‌ను ఎంచుకున్నారనే ప్రచారం పట్టభద్రుల్లో సాగుతోంది.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి... వారికి ప్రథమ ప్రాధాన్యత కింద వచ్చిన ఓట్లలో తమకు ఎన్ని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వస్తాయన్న దానిపై ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
గులాబీకి పట్టు దొరికేనా.. గెలుపు దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఆదివారం పోలింగ్ జరిగే రెండుస్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’లో మరోమారు విజయం సాధించాలని, ఒక్కసారి కూడా గెలుపొందని ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలగా ఉంది. ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు బీజేపీ తరఫున మళ్లీ బరిలోకి దిగారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ స్థానాన్ని చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దివంగత మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణీదేవిని ఈ స్థానంలో అభ్యర్థిగా నిలిపిన టీఆర్ఎస్ ఆమె గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ఈ రెండు పట్టభద్రుల స్థానాలు 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటమేకాక వీటిలో 64 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా మారాయి. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన టీఆర్ఎస్ సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించింది. ‘హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ప్రతిష్టాత్మకం ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 2007, 2009, 2015లో మూడు పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 2007, 2015లలో మాత్రమే టీఆర్ఎస్ పోటీ చేసింది. 2015లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి విజయం సాధించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఏకంగా 9 మంది మంత్రులు ఈ నియోజకవర్గం పరిధిలో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తోపాటు మొత్తం 93 మంది పోటీ చేస్తున్నారు. -
నేడే తెలంగాణ ‘పట్టభద్రుల’ ఓటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘హైదరాబాద్’ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో .. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 మంది, ‘నల్లగొండ’స్థానంలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు. రెండు స్థానాల్లో 15 వేల మంది అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బంది చొప్పున మొత్తం 8 వేల పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ పేర్కొన్నారు. రెండు నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు శనివారం రాత్రిలోగా పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకున్నట్టు నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 17న (బుధవారం) ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని 8 హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ‘హైదరాబాద్’స్థానానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ కూడా 8 హాళ్లలో 56 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్నారు. ‘హైదరాబాద్’ స్థానం నుంచి సురభి వాణిదేవి (టీఆర్ఎస్), ఎన్.రామచందర్‌రావు (బీజేపీ), జిల్లెల చిన్నారెడ్డి (కాంగ్రెస్), ఎల్.రమణ (టీడీపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు (స్వతంత్ర అభ్యర్థి)లతో సహా 93 బరిలో ఉన్నారు. ‘నల్లగొండ’ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్), రాణిరుద్రమ (యువ తెలంగాణ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లతో సహా మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటం, భారీసైజు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తుండటంతో ఓటర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా అభ్యర్థుల పేర్లను వెతకడం కొంచెం కష్టంగా మారనుంది. పోలింగ్ శాతం పెరిగేనా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల మండలి ఎన్నికలు రాజకీయ వేడి పుట్టించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. గతంతో పోలిస్తే ఈసారి ఏకంగా 85 శాతం అధికంగా ఓటర్ల నమోదు జరిగింది. పోలింగ్ ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే... ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారవర్గాలు ఆశిస్తున్నాయి. ‘తొలి’ప్రాధాన్యత ఇస్తేనే ఓటు చెల్లుబాటు / ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత ఓటు విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ తొలి ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఓటు చెల్లుబాటు కాదు. ఓటింగ్‌కు సంబంధించి సీఈఓ శశాంక్ గోయల్ ఓటర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవి ఇలా ఉన్నాయి.. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఇచ్చిన ఊదా (వయోలెట్) రంగు స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటు వేయాలి. మరే ఇతర పెన్నులు, పెన్సిల్స్ ఉపయోగించరాదు. ఓటరు తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీ గడిలో ‘1’అంకెను రాయాలి. ఓటర్లు తమ తదుపరి ప్రాధాన్యతలను చెప్పడానికి 2 ,3, 4, 5 ... అంకెలను ద్వారా ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో రాయాలి. ఓటు (బ్యాలెట్ పత్రం) చెల్లుబాటు కావడానికి ఓటర్లు తప్పనిసరిగా తొలి ప్రాధాన్యత (1)ను ఇవ్వాలి. మిగిలిన అభ్యర్థులకు తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేయడం, వేయకపోవడం ఓటర్ల ఇష్టం. తొలి ప్రాధాన్యత ఓటు వేసి, తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేసినా, వేయకున్నా ఓటు చెల్లుబాటు అవుతుంది. ప్రాధాన్యతలను తెలపడానికి అంతర్జాతీయ ప్రామాణిక అంకెలు 1, 2, 3, 4... లేదా రోమన్ అంకెలు ఐ, ఐఐ, ఐఐఐ, ఐV.. లేదా భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ గుర్తించిన ఇతర భారతీయ భాషల్లో ఉపయోగించే అంకెలను వినియోగించవచ్చు. అయితే ఓటరు.. ఒకే భాష/ సంఖ్యా విధానానికి సంబంధించిన అంకెలను మాత్రమే వాడాలి. భిన్నమైన న్యూమరికల్స్‌ను కలిపి ఉపయోగించరాదు. ఒకే సంఖ్యను ఒక అభ్యర్థి కన్నా ఎక్కువ మందికి ఇవ్వకూడదు. అలా రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఏ ఒక్క అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కువ ప్రాధాన్యతలను ఇచ్చినా ఓటు చెల్లుబాటు కాదు. అభ్యర్థి పేరుకు ఎదురుగా రైట్/ టిక్ గుర్తు లేదా గీ గుర్తులతో ఎంపికను తెలియజేస్తే ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై ఓటర్లు తమ ఇంటి పేరు, ఇతర పదాలు, సంతకం, పొడి అక్షరాలు రాయకూడదు. వేలిముద్రలు కూడా వేయకూడదు. అలాచేస్తే ఓటు చెల్లదు. ప్రాధాన్యతల ఎంపికను అంకెల్లో మాత్రమే సూచించాలి. ఒకటి, రెండు, మూడు ... అని అక్షరాల్లో రాయకూడదు. అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే ప్రాధాన్యత సంఖ్యను రాయాలి. రెండు గడుల మధ్య ఉన్న గీతపై ప్రాధాన్యత అంకెను రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఓ క్రమపద్దతిలో మడతపెట్టిన బ్యాలెట్ పత్రాన్ని పోలింగ్ అధికారులు ఓటర్లకు అందించనున్నారు. ఓటర్లు మడత విప్పి ఓటు వేసిన తర్వాత మళ్లీ అదే తరహాలో మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా ఓకే... పట్టభద్రుల ఓటర్లందరికి ఓటరు గుర్తింపు (ఎపిక్) కార్డు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎపిక్ కార్డును తీసుకువచ్చి ఓటేయవచ్చు. ఒకవేళ ఎపిక్ కార్డు అందుబాటులో లేకుంటే ఈ కింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని సీఈఓ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు ఇండస్ట్రియల్ హౌస్‌లు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఓటర్లకు విద్యా సంస్థలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు, వర్శిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లమా సర్టిఫికేట్ ఒరిజినల్, సంబంధిత అధికారులు జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్. -
డిగ్రీ ఓటరుల్లారా ‘పట్టం’ కట్టండి
సాక్షి, హైదరాబాద్: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగుస్తోంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో పడ్డారు. వీలైనంత మందిని ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు గత నెల 16న నోటిఫికేషన్ వెలువడగా.. ఈ నెల 14న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 2015లో ఈ రెండు సీట్లకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి రెట్టింపు ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఈ రెండింటిలో 10.36 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా.. ఏకంగా 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ఉద్యమ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పలు రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో కీలక అభ్యర్థులంతా ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ సంస్థల మద్దతు కూడగట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లో.. చెరోచోట సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న టీఆర్ఎస్, బీజేపీలు.. సిట్టింగ్‌ను కాపాడుకుంటూనే, రెండో స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హైవోల్టేజీలో ప్రచారం సాగింది. రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్‌పై ప్రధాన పార్టీల మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీఐఆర్ పూర్తిస్థాయి డీపీఆర్‌లను కేంద్రం ఎన్నిసార్లు కోరినా రాష్ట్రం ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపిస్తే.. ఐటీఐఆర్‌ను కేంద్రమే రద్దు చేసిందని, కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పార్లమెంట్‌లోనే ఈ విషయం చెప్పిన సంగతి తెలియకపోవడం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు రాసిన కేంద్రానికి లేఖలు, డీపీఆర్‌లు ఇస్తామని.. దమ్ముంటే ఐటీఐఆర్ తేవాలని సవాల్‌చేశారు. ఇక టీఆర్ఎస్ సర్కారు సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదని, 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. తాము 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్: బలమంతా కేంద్రీకరించి.. తొలుత కేవలం సిట్టింగ్ సీటు ‘వరంగల్- ఖమ్మం-నల్గొండ’లోనే పోటీ చేస్తుందని భావించిన టీఆర్ఎస్.. చివరి నిమిషంలో ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’లోనూ బరిలోకి దిగింది. మాజీ ప్రధాని పీవీ కూతురు వాణిదేవిని అభ్యర్థిగా ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ సీట్ల పరిధి ఏకంగా ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ బరిలోకి దింపింది. 14 మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి దాకా ప్రచారం చేస్తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి, కుల, సామాజిక సంఘాల మద్దతు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ప్రతి 50 మంది పట్టభద్ర ఓటర్లను చేరుకునేందుకు నాయకులు, చురుకైన కార్యకర్తలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టి మద్దతు తీసుకుంటోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉన్నా.. వివిధ కోణాల్లో అందుతున్న నివేదికల అధారంగా ఎన్నికల ఇన్చార్జిలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్: పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ.. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ సంస్థాగతంగా మండలాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రచార సమావేశాలు ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డికి ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, భట్టి విక్రమార్కకు ‘వరంగల్-ఖమ్మం- నల్లగొండ’ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ వీలైనన్ని చోట్ల వివిధ కేటగిరీల వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాములు నాయక్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ప్రచారం నిర్వహించింది. 2019లో జరిగిన ‘కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్’ ఎన్నికలో కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్‌రెడ్డి గెలిచిన తరహాలోనే.. ఇప్పుడు కూడా ఫలితాలు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. బీజేపీ: టీఆర్ఎస్ టార్గెట్‌గా ప్రచారం ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ సీటును కూడా గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరహాలోనే ఈ రెండు చోట్ల గెలుస్తామని భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలోనే అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించిన బీజేపీ.. ప్రతి 25 మంది పట్టభద్ర ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించింది. పార్టీ అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కూడా క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర మంత్రులు రమేశ్ పోఖ్రియాల్, ప్రకాశ్ జవదేకర్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఇతర కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. సర్వశక్తులు ఒడ్డుతున్న స్వతంత్రులు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ, కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న జయసారధిరెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి సంఘాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. -
అందరి దృష్టి రెండో ప్రాధాన్యతపైనే!
సాక్షి, హైదరాబాద్: రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓ వైపు తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మరోవైపు ఓటింగ్ విధానంపైనా అవగాహన కల్పించేందుకు పార్టీలు, అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఎన్నికలు జరిగే ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, ‘నల్లగొండ-ఖమ్మం -వరంగల్’ స్థానాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులుతో పాటు, స్వతంత్రులు కూడా ఎక్కువమంది పోటీ చేస్తుండటంతో ‘ప్రాధాన్యత’ ఓట్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోలయ్యే ఓట్లలో (చెల్లుబాటు అయ్యే ఓట్లలో) సగానికి పైగా (50 శాతం + ఒక ఓటు) ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క అభ్యర్థి ‘ప్రథమ ప్రాధాన్యత’తో గెలుపొందే అవకాశాలు లేవని పార్టీలు, అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను వీలైనన్ని ఎక్కువ సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. తమకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం లేకుంటే... ఓటింగ్ సమయంలో కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని ప్రచారం సందర్భంగా అభ్యర్థులు, పార్టీలు కోరుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల నమోదు రెట్టింపు కావడంతో పోలయ్యే ఓట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. హైదరాబాద్‌లో బహుముఖ పోటీ ఆరేండ్ల క్రితం... 2015లో ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానంలో 2.96 లక్షల ఓటర్లగాను కేవలం 39 శాతం అంటే 1.13 లక్షల ఓటర్లు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. 31 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా 53,881 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌పై గెలుపొందారు (చెల్లని ఓట్లు ఎనిమిది వేల పైచిలుకు ఉండటంతో రాంచందర్‌రావు ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే విజయాన్ని అందుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం రాలేదు). ఈసారి టీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ పక్షాలు, ఔత్సాహిక అభ్యర్థులు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంపై ముందస్తుగా దృష్టి సారించడంతో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో ‘హైదరాబాద్- రంగారెడ్డి మహబూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానంలో ఏకంగా 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు వివిధ రంగాలకు చెందిన స్వతంత్రులు కూడా పోటీలో ఉండటంతో గతంలో మాదిరిగా ఏ అభ్యర్థి కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు వీలైనన్ని రెండో ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటం తమకు అనుకూలిస్తుందని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నాయి. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’లో హేమాహేమీలు ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’పట్టభద్రుల స్థానానికి 2015లో జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. 2015 ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2.81 లక్షల ఓట్లకు గాను 1.49 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 53.25 శాతం పోలింగ్ నమోదైనా ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా పోలైన ఓట్లలో 50 శాతం మార్క్‌ను దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 5.05 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 71 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ నుంచి రాణీరుద్రమతో పాటు జయసారధి రెడ్డి, తీన్మార్ మల్లన్న తదితరులు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పలువురు ఎన్నికల బరిలో నిలవడంతో ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల వేట సాగిస్తూనే రెండో ప్రాధాన్యత ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. -
సిట్టింగ్ పట్టాలె.. ‘బోనస్’ కొట్టాలె!
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలుపే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ సీటుతోపాటు మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బోనస్‌గా దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా కమలనాథులు క్షేత్ర స్థాయి నుంచి ప్రచార వ్యూహాలను సిద్ధం చేశారు. రెండు ఎమ్మెల్సీ సీట్లకు నామినేషన్లు వేసిన నాటి నుంచే పార్టీ క్యాండిడేట్లు, నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. దానికితోడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. మరోవైపు సంఘ్ పరివార్ కేడర్ కూడా చాపకింద నీరులా దూసుకెళ్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం సాధి స్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటులో తమ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు గెలిచే చాన్స్ ఎక్కువని.. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ సీట్లో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి విజయం సాధించేలా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అన్నిస్థాయిల వారిని రంగంలోకి దింపి.. గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలను రంగంలోకి దింపింది. పార్టీలో చేరిన ముఖ్య నేతలందరినీ రంగంలోకి తెచ్చింది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్చార్జులను నియమించింది. పార్టీ నుంచి ప్రతి 25 మంది ఓటర్లకు ఓ ఇన్చార్జిని పెట్టింది. అన్ని స్థాయిల్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మోత్కుపల్లి నర్సింహులు, గూడూరు నారాయణరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నేతలంతా బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో ఉన్నారు. బీజేపీ శ్రేణులతోపాటు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులోనూ క్రియాశీలకంగా పాల్గొన్న సంఘ్ పరివార్ కార్యకర్తలు కూడా ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. టార్గెట్ టీఆర్ఎస్.. కాంగ్రెస్‌పై ఫైరింగ్ కాషాయ నేతలు ముఖ్యంగా టీఆర్ఎస్ను టార్గెట్‌గా చేసుకుని, ఆరేళ్ల టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. వీలున్నప్పుడల్లా కాంగ్రెస్ గురించి ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ పని అయిపోయినట్లే నని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ మంచి ఊపుమీద ఉన్నప్పుడే బీజేపీ తరఫున రాంచందర్‌రావు భారీ మెజారిటీతో గెలిచారని, వరంగల్ సీటును కూడా కొద్ది ఓట్లతో పోగొట్టుకున్నామని అంటున్న బీజేపీ.. ఇప్పుడు రెండింటినీ కైవసం చేసుకుంటామని చెప్తోంది. టీఆర్ఎస్పై అన్నివర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల సృష్టి, వీసీల నియామకాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, గ్రూపు- 1, 2 పోస్టుల భర్తీ చేపట్టకపోవడం, యూనివర్సిటీపై నిర్లక్ష్యం, పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు వంటివి అమలు చేయకపోవడం వంటివాటిని గ్రాడ్యుయేట్లలోకి బలంగా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ దిశగా మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడంలో, కౌంటర్లు ఇవ్వడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాంచందర్‌రావు కూడా అదే తరహాలో మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మంత్రులు, అధికార పక్ష నేతలను రెచ్చగొడుతూ, ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో బీజేపీ క్యాండిడేట్ ప్రేమేందర్‌రెడ్డి తరచూ టీఆర్ఎస్ పాలనపై, మంత్రి దయాకర్‌రావు, ఇతర టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై గట్టి విమర్శలు చేస్తున్నారు. -
1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం
సాక్షి, చేవెళ్ల: తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 50 వేల పోస్టుల భర్తీకి సర్కారు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు కోసం ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన టీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి హరీశ్ హాజరయ్యారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఒక అబద్ధాన్ని పదేపదే చెబుతూ అది నిజం అవుతుందని భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అడిగిన ప్రశ్నకు తానే స్వయంగా సమాధానం చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పట్టభద్రులు బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో కోత విధిస్తూ, పెట్రో ధరలు పెంచుతూ ప్రజలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డగా పీవీ నరసింహారావు ఢిల్లీని శాసించి తెలుగువాడి ఖ్యాతిని ఇనుమడింపజేశారని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరైతే కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ‘హైదరాబాద్– రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియో జకవర్గానికి చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్.. ప్రచార వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించింది. ఎన్నికలు జరిగే మూడు జిల్లాలకు ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో గంగుల కమలాకర్, రంగారెడ్డిలో హరీశ్‌రావు, మహబూబ్‌నగర్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆ ముగ్గురు మంత్రులతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి.. ‘హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రచార, సమన్వయ వ్యూహంపై ఇన్చార్జి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. నేడు 43 నియోజకవర్గాల్లో సమావేశాలు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాన్ని ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు వివరిస్తారు. ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమితులైన ముగ్గురు మంత్రులు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలకు అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించేలా శుక్రవారం రాత్రి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి వాణీదేవి కూడా శనివారం జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
పక్కా వ్యూహంతో ముందుకు..
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పట్టభద్ర ఓటరును చేరుకోవడం ద్వారా పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు పక్కా వ్యూహం, ప్రణాళికతో ముందుకు కదలాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సూచించారు. శాసన మండలి ‘హైదరాబాద్– రంగారెడ్డి–మహ బూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానం ఎన్నికకు సంబం ధించి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. ఉదయం తెలంగాణ భవన్లో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో, సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవిని పార్టీ నేతలకు పరిచయం చేసిన తర్వాత పట్టభద్రుల ఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, ప్రణాళిక, ప్రచార షెడ్యూల్‌కు సంబంధించి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 43 అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల్లో ఈ నెల 27న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ‘పట్టభద్రుల కోటా ఎన్నిక లేని మెదక్, కరీం నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తాం. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనూ ఇన్చా ర్జీలుంటారు. అందరూ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలి’ అని కేటీఆర్ ఆదేశించారు. మండల స్థాయిలో పట్టభద్రులతో భేటీలు... ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ పట్ట భద్రుల నియోజకవర్గం పరిధిలో సుమారు 5.17 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో సుమారు 3 లక్షల మందిని టీఆర్ఎస్ పక్షాన ఓటర్లుగా నమోదు చేశాం. ఈ నెల 27 తర్వాత పార్టీ ఇన్చార్జీల పర్యవేక్షణలో మండల స్థాయిలో పట్టభద్ర ఓటర్లతో ప్రచార సభలు నిర్వహించాలి’అని కేటీఆర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటరు జాబితాను విభజించి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు అప్పగించారు. ఈ జాబితా ఆధారంగా ప్రతీ 50 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జీని నియమించి పోలింగ్ శాతం పెరిగేలా చూడా లని, ఓటు నమోదు చేయాల్సిన తీరు, పార్టీ అభ్యర్థి కి ప్రథమ ప్రాధాన్యత ఓటు లభించేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు. వివిధ అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీవీ చర్చల్లో పాల్గొనేందుకు పార్టీ నేతలకు అనుమతి ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అయితే వివిధ అంశాలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి, విపక్షాల వాదనను శాస్త్రీయ ఆధారాలతో తిప్పికొట్టాలని సూచించారు. ప్రచార అంశాలపైనా దిశానిర్దేశం... మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలతో జరిగిన వేర్వేరు సమావేశాల్లో ప్రచారంలో ఓటర్లకు వివరిం చాల్సిన అంశాలపై కేటీఆర్ సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 1.32 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను పార్టీ నేతలకు అంద జేశారు. ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్ర ఓటర్లతో నిర్వహించే సమావేశాల్లో వివరించా లన్నారు. ప్రధాని మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇచ్చిన హామీని ప్రస్తావించాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారంలో ఎండగ ట్టాలని సూచించారు. విభజన హామీలు, జీఎస్టీలో కోత, మెడికల్ కాలేజీల మంజూరులో వివక్ష వంటి అంశాలను ప్రచారంలో లేవనెత్తాలన్నారు. పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని కూతురు సురభి వాణీదేవి పోటీ చేస్తున్నందున విపక్షాలకు ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తించి.. గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చిన మేమెంత లొల్లి పెట్టాలే ‘పదేండ్లలో సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు ఇవ్వనోడు కూడా మా మీద మాట్లాడితే... ఆరేండ్లలో లక్షా 33 వేల ఉద్యోగాలు ఇచ్చిన మేమెంత లొల్లి పెట్టాలే. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వమైనా గడిచిన ఆరున్నరేండ్లలో ఎన్నో పనులు చేశాం. విభజన చిక్కులు ఇంకా వీడలేదు. జోనల్ సమస్య వంటి ఇతరత్రా సమస్యలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. ఎంతో చేసినా.. ఏమీ చేయలేదని ప్రచారం చేయడం సరికాదు’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని రీతిలో ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఇచ్చాం. రెండో పీఆర్సీ కూడా తప్పకుండా ఇస్తాం. దానికో కమిటీ ఉంది దాని పని అది చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు మాతో కలసి పనిచేశారు. వారి పట్ల మొసలికన్నీరు కారుస్తున్న బీజేపీ, కాంగ్రెస్ కంటే ఉద్యోగులు మాకు అత్యంత సన్నిహితులు. వారి మీద టెంపరరీ ప్రేమ చూపెట్టడం మా వల్ల కాదు. ఉద్యోగులకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వారితో పాటు నాకు కూడా ఉంది. పీఆర్సీ సమయానికి రాలేదనే బాధ కొందరిలో ఉండొచ్చు. ఉద్యోగుల సమస్యలపై మాకు స్పష్టత ఉంది. ఇతర పార్టీలు అయోమయంలో ఉన్నాయి’అని కేటీఆర్ అన్నారు. ‘గ్రేటర్’లో ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు ‘గెలుపు పాఠం నేర్పుతుంది. ఓటమి గుణపాఠం నేర్పుతుంది. కొన్నిసార్లు కొందరికి ఉద్వేగాలు కలిసి వస్తాయి. సర్జికల్ స్రైక్ అంటూ కొందరు హడావుడి చేసినా గ్రేటర్లో మాదే నంబర్ వన్ పార్టీ. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మేమే గెలుచుకున్నాం. దుబ్బాకలో 500 ఓట్లు, గ్రేటర్లో కొన్ని సీట్లు పెరిగినందుకే ఊగిపోతున్నారు. అలా అయితే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన మేము శిగమూగాలా’అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని నేరుగా రాజ్యసభ లేదా మండలికి నామినేట్ చేయొచ్చు కదా అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ‘వాణీదేవిది ప్రత్యర్థులు కూడా గౌరవించే వ్యక్తిత్వం. పట్టభద్రుల ఆమోదంతో కౌన్సిల్లో అడుగు పెడతారు’అని సమాధానం ఇచ్చారు. దివంగత పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవి పట్టభద్రుల ఓట్లు పొందేందుకు అన్ని విధాలా అర్హులని, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఎన్నడూ సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. ఆరున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే... కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఏపీలో పదేళ్లలో కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. అందులో తెలంగాణకు సంబంధించి సుమారు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. ఏటా వేయి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. ఐటీఐఆర్ రద్దుతో పాటు ట్రైబల్ యూనివర్సిటీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి విభజన సమస్యలను కేంద్రం విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. జీడీపీ పెంచుతామని ప్రకటించిన ప్రధాని మోదీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ పోలింగ్ నేడే..
-
ఎమ్మెల్సీ పోలింగ్ నేడే..
► తెలంగాణలో ఒకటి, ఏపీలో ఐదు స్థానాలకు ఎన్నికలు ► ఏర్పాట్లు పూర్తి:భన్వర్‌లాల్ హైదరాబాద్: హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో 23,789 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఓటుహక్కు విని యోగించుకోనున్నారు. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు ఓటింగ్ కౌంటర్లుంటాయి. ఈ ఎన్నికల కోసం మొత్తం 12 మంది అభ్య ర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ స్థానంతోపాటు ఏపీలోని ఐదు స్థానాలకు కూడా గురువారమే పోలింగ్ జరగనుంది. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు సహకరించాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఓట ర్లకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన బుధవారం సచివాలయం లో విలేకరులతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లటాన్ని నిషేధించారు. పాత ఓటర్ల జాబితాలు ఈ ఎన్నికకు చెల్లుబాటు కావని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన కొత్త ఓటర్ల జాబితాలను మాత్రమే పరిగణన లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, సర్వీస్ ఐడీ కార్డు, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఏదైనా ఒకటి చూపిం చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నా రు. అక్రమంగా ఓటు వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటేసేటప్పుడు జాగ్రత్త... ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంచిన వయెలెట్ కలర్(ఊదా) స్కెచ్‌తోనే ఓటు వేయాలి. ఓటు వేసేటప్పుడు నంబర్లను మాత్రమే వేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను వాడుకొనే వీలుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా పనివేళలు సడలించాల ని, షిప్టు పద్ధతి అనుసరించాలని భన్వర్‌లాల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. రాజ్‌భవన్ క్వార్టర్లకు ముందే అనుమతి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రాజ్‌భవన్ లో సిబ్బంది క్వార్టర్లు ప్రారంభించి గవర్నర్, సీఎం కోడ్‌ను ఉల్లంఘించారని బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుకు భన్వర్‌లాల్ వివరణ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి ముందుగా ఎన్ని కల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నాకే... ప్రారంభించారని ఆయన చెప్పారు.