Updates
►ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తి.
►రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్న ముగ్గురు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు
►ఎమ్మెల్యే కోటా లో కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
►ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి
►కార్యక్రమానికి హాజరైన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు
► మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని కౌంటింగ్ సెంటర్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
► సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శానస మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో మొదలైంది. మూడు జిల్లా నుంచి మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 29,720 మంది ఓటర్లలో 26,866 మంది ఓటేశారు.
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 28 టేబుళ్లను సిద్ధం చేశారు. ఒక్కో టేబుల్‌కు ఓ అధికారితో పాటు నలుగురు కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఓట్ల కౌటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు, పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించడం లేదు.
ఒక్కో టేబుల్‌కి వెయ్యి ఓట్లు
ఓట్ల గణనలో భాగంగా తొలుత 137 బూత్‌ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్కులను ఒకచోటకు చేర్చి ప్రతి 50 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్‌గా జత కడతారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపునకు ఒక్కో టేబుల్‌కి వెయ్యి ఓట్లు ఇస్తారు. పోలైన మొత్తం ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతానికిపైగా మెజారిటీ సాధించిన వారిని విజేతగా ప్రకటించనున్నారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు యాభైశాతం రాకపోతే.. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు, అయిదు.. ఇలా చివరి ప్రాధాన్యత ఓటు వరకు లెక్కించి,
అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి, చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫలితం మధ్యాహ్నం మూడు గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైతే.. తుది ఫలితం రాత్రి 7 గంటల వరకు వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment