
సాక్షి,హైదరాబాద్ : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.
ఈ క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చదువుకున్నవాళ్లకు ఓట్లు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చెల్లని ఓట్లపై ఏర్పడ్డ గందరగోళంపై అభ్యర్థుల ఆందోళన బాటపట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.