invalid votes
-
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు.. ఆశ్చర్యంలో మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి,హైదరాబాద్ : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.ఈ క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చదువుకున్నవాళ్లకు ఓట్లు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చెల్లని ఓట్లపై ఏర్పడ్డ గందరగోళంపై అభ్యర్థుల ఆందోళన బాటపట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
US Elections 2024: సంతకం రాక.. ఓట్లు చెల్లక
వాషింగ్టన్: మనకు ఒక కచ్చి తమైన సంతకం అంటూ లేకపోతే ఎంత నష్టమో అమెరికా ఎన్నికలను చూసి తెలుసుకోవచ్చు. పోస్టు ద్వారా వచ్చి న చాలా ఓట్లు సంతకంలో తేడాల వల్ల చెల్లకుండాపోయా యి. సంతకం చేయడం రాకపోవడంతో ఓటు వేసి నా అవి చెల్లలేదు. ప్రధానంగా యువ ఓటర్ల విషయంలో ఈ సమస్య ఎదురైంది. ఓటు–బై–మెయిల్ బ్యాలెట్‌లోని సంతకం, ఓటర్ రికార్డులోని సంత కం ఒకేలా ఉండాలి. ఎన్నికల అధికారులు రెండింటినీ సరిపోల్చుతారు. ధ్రువీకరణ తర్వాతే ఆ ఓటు ను లెక్కిస్తారు. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తే సదరు ఓటరుకు సమాచారం ఇస్తారు. సంతకాన్ని సరిచేసుకొనే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు స్పందించపోవడంతో ఈసారి పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లలేదు. నెవడా రాష్ట్రంలోని క్లార్క్ కౌంటీలో 11,300, వాషో కౌంటీలో 1,800 ఓట్ల విషయంలో సంతకాలను మళ్లీ సరిదిద్దాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి ఫ్రాన్సిస్కో అగిలార్ చెప్పారు. నేటి టెక్నా లజీ యుగంలో చేతితో రాయడం పెద్దగా అవసరం పడట్లేదు. అన్నీ కంప్యూటర్, ఫోన్లోనే టైప్ చేస్తున్నారు. సాధారణంగా సంతకాలను వంపు తిరిగిన అక్షరాల్లో(కర్సివ్) చేస్తారు. అమెరికా పాఠశాలల్లో ఇటీవలి కాలంలో కర్సివ్ చేతిరాత నేరి్పంచడం లేదు. దాంతో పిల్లలకు సంతకాలు చేయడం రావడం లేదని నిపుణులు అంటున్నారు. -
విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్పోరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులుకుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు. కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్ రోహిణిబ్యాలెట్ పేపర్లపై కలర్ పెన్సిళ్లతో గుర్తులు..ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్ పెన్సిళ్లతో బ్యాలెట్ పేపర్‌పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి.. బ్యాలెట్ పేపర్‌పై పెన్ను, పెన్సిల్, స్కెచ్ గీతలుంటే కచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావన్న నిబంధనలున్నా కమిషనర్ మాత్రం పూర్తిగా పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఓట్లు చెల్లుబాటు కావని చెబుతున్నా బేఖాతరు చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు 10 మందీ విజయం సాధించినట్లు ప్రకటించారు.దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కమిషనర్ తీరుపై మండిపడ్డారు. పోర్టికోలో బైఠాయించారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్ వేసిన టీడీపీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటికి పంపించేశారు. అక్రమంగా విజయం సాధించిన టీడీపీ వ్యవహారం, కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్‌లీడర్ బానాల శ్రీను, ఇతర కార్పొరేటర్లు తెలిపారు. -
జైమల్లన్న, జై రాకేశ్‌రెడ్డి, ఐ లవ్యూ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసే సమయంలో కొందరు అత్యుత్సాహంతో నినాదాలు రాయగా, ఇంకొందరు ఇతర అభ్యర్థుల ఫొటోలు నలిపేయడం, బ్యాలెట్ పేపరు వెనుక అంకెలు వేయడం, మరికొందరు ఐలవ్యూ అంటూ రాశారు. చెల్లని ఓట్లు 7.69 శాతం వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 7.69% ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 4, 63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 3,36,013 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొందరి అవగాహన రాహిత్యం, అత్యుత్సాహం కారణంగా 25, 824 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 3,10,189 చెల్లిన ఓట్లుగా అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి రౌండ్లో అధిక సంఖ్యలో చెల్లుబాటుకాని ఓట్లు బయటపడ్డాయి. కొందరు తొలి ప్రాధాన్యత ఓట్లు వేయకుండా ఇతర ప్రాధాన్యత ఓట్లు వేయడం, టిక్కులు పెaట్టడం చేశారు. బ్యాలెట్ పేపరుపై ఇష్టానుసారంగా రాతలు బ్యాలెట్పేపర్లపై ప్రాధాన్యతక్రమంలో అంకెలు మాత్రమే వేయాలి. ఇతర ఎలాంటి రాతలు రాయొద్దని ఎన్నికల అధికారులు పలుమార్లు చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోకుండా బ్యాలెట్ పేపర్లపై కొందరు జైమల్లన్న, జైరాకేశ్రెడ్డి అంటూ రాశారు. ఓ పట్టభద్రుడైతే బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థి ఫొటో కట్ చేసుకుపోయాడు. మరికొందరు పట్టభద్రులు బ్యాలెట్ పేపర్ వెనుక అంకెలు వేయగా, మరికొందరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో ప్రాధాన్యత ఓటు వేశారు. కొందరు పట్టభద్రులు ఒక అడుగు ముందుకేసి ఐలవ్యూ అంటూ రాసినట్టు తెలిసింది. -
ఎమ్మెల్సీ ఎన్నికలు: చెల్లని పట్టభద్రులు..!
సాక్షి, హైదరాబాద్: వారంతా పట్టభద్ర ఓటర్లు... సాధారణ పౌరులతో పోలిస్తే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకూ అర్హత కలిగిన వారు. కానీ రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో వేల మంది పట్ట భద్రుల అవగాహనారాహిత్యం బయటపడింది. బ్యాలెట్ పత్రంపై తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో అంకెలను సూచించాల్సి ఉండగా అందుకు భిన్నంగా కామెంట్లు, సంతకాలు చేశారు. ఫలితంగా భారీ స్థాయిలో ఇలాంటి ఓట్లు చెల్లకుండా పోయాయి. హైదరాబాద్– మహబూబ్ నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో పోలైన ఓట్లలో సుమారు 6 శాతం పట్టభద్రుల ఓట్లు చెల్లకుండా మురిగిపోయాయి. పట్టభద్రుల ఎన్నికలో ఈసారి 3,58,348 లక్షల ఓట్లు పోలవగా అందులో 21,309 ఓట్లు వివిధ కారణాలతో చెల్లలేదు. అదేవిధంగా నల్లగొండ– వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలవగా అందులో ఏకంగా 21,636 ఓట్లు చెల్లనివిగా తేలాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది సుమారు 6 శాతం కావడం గమనార్హం. చదవండి: రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు తగ్గిన మెజారిటీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం! -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు; చెల్లని ఓట్లు 18,754
సాక్షి, నల్లగొండ : నల్లగొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తికాగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకాగా, అదేరోజు రాత్రి ఏడుగంటల సమయంలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఒక రౌండ్లో 56వేల చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు. గురువారం తెల్ల వారుజామున 2.30గంటలకు తొలిరౌండ్ ఫలితం తేలింది. ఇప్పటివరకు ఆరు రౌండ్లలో 3,35,961 ఓట్లను లెక్కించగా.. వాటిలో 18,754 ఓట్లు చెల్ల కుండాపోయాయి. చెల్లిన 3,17207 ఓట్లలో.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 95,317 ఓట్లు సాధించారు. ఆయనకు 22,843 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక, ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్)కు 72,474 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్‌కు 59,705 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 24,268 ఓట్లు లభించాయి. నల్లగొండ శివారులోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వామపక్షాలకు ఆరో స్థానం ఓట్ల లెక్కింపు పూర్తయిన ఆరు రౌండ్లలో వామపక్షాల అభ్యర్థి, సీపీఐకి చెందిన జయసారథి రెడ్డి 8,348 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ 7,881 ఓట్లతో ఏడో స్థానంలో, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి 6,805 ఓట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 22మంది అభ్యర్థులకు కనీసం పది ఓట్లు కూడా పోల్ కాలేదు. ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ చూపిస్తున్న అధికారులు తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే.. గెలుపు కోటా నిర్ణయం ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కావాలి్సన కోటా ఇంకా తేలలేదు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత చెల్లని ఓట్ల లెక్క తేల్చాక ఈ కోటా నిర్ణయం కానుంది. మొదటి ప్రాధాన్య ఓటుతో ఎవరూ కోటా మేర ఓట్లు సాధించని పక్షంలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అప్పటికీ విజేత తేలకుంటే.. మూడో ప్రాధాన్య ఓట్లనూ లెక్కించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కానీ, లేదా శనివారం ఉదయానికి గానీ విజేత ఎవరో తేలనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, ఒక్కో రౌండ్ లెక్కింపునకు ఐదు గంటల సమయం పడుతోంది. ఈ లెక్కన మొత్తం ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి శుక్రవారం తెల్లవారుజామువరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ► మొత్తం లెక్కించిన ఓట్లు 3,35,961 ► చెల్లిన ఓట్లు 3,17,207 ► చెల్లని ఓట్లు 18,754 చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: 18,549 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
బిహార్‌లో నేనే విజేత: తేజస్వి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ కెరటంగా నిలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తానే అసలు సిసలైన విజేతనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నప్పటికీ ప్రజల హృదయాలను తామే గెలిచామన్నారు. గురువారం మహాకూటమి శాసనసభా నేతగా ఎన్నికైన తేజస్విæ ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌లపై నిప్పులు చెరిగారు. వారు దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. 20 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదని, చాలా ఓట్లని చెల్లని ఓట్లు అంటూ పక్కన పెట్టారని విమర్శించారు. ఆ స్థానాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘నితీశ్‡ ఛరిష్మా ఏమైపోయింది ? ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారిపోయింది. మార్పు కావాలని ప్రజలు అనుకుంటున్నారు. నితీశ్ సీఎం పీఠంపై కూర్చోవచ్చు కానీ మనం ప్రజల హృదయాల్లో నిలిచాం’ అని తేజస్వి అన్నారు. ఎన్డీయే, మహాఘట్ బంధన్ మధ్య ఓట్ల తేడా కేవలం 12,270 మాత్రమేనని అలాంటప్పుడు వారికి 15 సీట్లు అధికంగా ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఓట్ల తేడా 0.03% ఎన్నికల్లో హోరాహోరి పోరు మధ్య బొటాబొటి సీట్ల మెజారిటీతో అధికార పీఠాన్ని దక్కించుకున్న ఎన్డీయే ఓట్ల విషయంలో మరీ వెనుకబడిపోయింది. ఎన్డీయేకి, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 0.03శాతం. ఎన్డీయే కూటమికి 37.26శాతం ఓట్లు పోలయితే, మహాఘట్ బంధన్ కూటమికి 37.23% ఓట్లు పోలయ్యాయి. మిగిలిన పార్టీలకు 25.51% ఓట్లు వచ్చాయి. మొత్తం పోలయిన 3.14 కోట్ల ఓట్లలో ఎన్డీయేకి 1,57,01,226 ఓట్లు వస్తే, మహాఘట్ బంధన్‌కి 1,56,88,458 ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు కూటముల మధ్య తేడా కేవలం 12,768 ఓట్లు మాత్రమే. ఇరుపక్షాల మధ్య గెలుపు ఆధిక్యాలు అత్యంత స్వల్పంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. 243 సీట్లకు గాను 130 సీట్లకు సంబంధించి మొత్తం పోలయిన ఓట్లలో సగటు ఆధిక్యం 16,825గా ఉంది. -
అనుమతి లేకుండా తొలగించొద్దు
నాగర్‌కర్నూల్: ఓటర్ జాబితా నుంచి ప్రొఫార్మా–7, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఓటర్ జాబితా నుంచి ఓట్లను తొలగించొద్దని జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఓటర్ జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపుపై తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ బోగస్ ఓట్లను తొలగించేందుకు అన్ని పోలింగ్ బూత్ లెవల్ అధికారులతో సమావేశం నిర్వహించి డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించాలన్నారు. ఓటరు జాబితా సవరణలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయకుండా కొన్ని చోట్ల ఓట్లను తొలగించారని, మరికొన్ని చోట్ల రెండు పేర్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి స్థాయిలో బోగస్ ఓట్లను తొలగించేందుకు బూత్ లెవల్ అధికారులను సంప్రదించి ఎన్ని ఓట్లు తొలగించారో పూర్తి సమాచారంతో గురువారం జరిగే సమావేశానికి హాజరు కావాలన్నారు. రెండు ఓట్లు తొలగించిన వారితో ప్రొ ఫార్మా–6తో తిరిగి వారికి ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో సాంకేతిక లోపంతో ఉన్న 450 ఓట్లను ప్రొ ఫార్మా–8 వినియోగించి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర సవరణలను సరిచేయాలని తహసీల్దార్లకు సూచించారు. నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లను ఆయా మండలాల్లో తొలగించేందుకు ఆర్డీఓలు రాష్ట్ర ఎన్నికల అధికారి అనుమతి పొందేందుకు లేఖతో సమావేశానికి హాజరు కావాలన్నారు. అదే విధంగా భూ ప్రక్షాళన పనులు వేగవంతం చేసి, వాటికి సంబంధించిన డిజిటల్ సంతకాలు, ఇతర విషయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్‌నాయక్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు మోహన్‌రెడ్డి, అనిల్ ప్రకాశ్, ఆర్డీఓలు హనుమనాయక్, పాండునాయక్, రాజేష్‌కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్లతో ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నిక ల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల పనితీరు, నియోజకవర్గానికి అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు చేరాయా లేదా అనే విషయంపై సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొదటి విడత తనిఖీలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ సమస్యలు వస్తే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రతినిధులు వస్తారని తెలిపారు. ఈ వీసీలో కలెక్టర్ ఈ.శ్రీధర్, జేసీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ అక్షరాస్యులే అయినా..
అనంతపురం అర్బన్ : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదో విచిత్రం. ఓటు హక్కు కలిగిన వారందరూ విద్యావంతులే. డిగ్రీ, డిప్లొమా కనీస విద్యార్హత కల్గినవారు. అయితే.. ఓటు ఎలా వేయాలనే దానిపై పలువురికి అవగాహన లేదనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఏకంగా 18,363 నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,55,711 ఓట్లు పోలయ్యాయి. రౌండ్‌కు 26 వేల చొప్పున ఆరు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్లోనూ చెల్లని ఓట్లు మూడు వేల వరకు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలి? ప్రాధాన్యతా క్రమంలో ఓటు ఎలా వేయాలి? ఓటు ఎలా చెల్లకుండా పోతుందనే అంశాలపై ఎన్నికల సంఘం, అధికారులు, అభ్యర్థులు విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. అయినా కూడా కొందరు అవగాహన లేకుండా ఓటు వేశారు. దీంతో భారీసంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్యత (1) ఓటు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో ఇచ్చిన వైలెట్ రంగు స్కెచ్ పెన్‌తోనే అంకెలు వేయాలి. అయితే.. చాలా మంది రైట్ మార్క్ వేశారు. మరికొందరు సొంత పెన్ వాడారు. ఇలాంటి ఓట్లు ఐదు వేల వరకు ఉన్నాయి. అలాగే కొందరు తాము మొదటి ప్రాధాన్యత ఓటు వేయదల్చుకున్న అభ్యర్థుల ముందు ‘1’ అంకె వేయకుండా అభ్యర్థి వరుస సంఖ్యను అతనికి కేటాయించిన గడిలో నమోదు చేశారు. ఇలాంటివి దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే విద్యావంతులు అయ్యి ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై అవగాహన పెంచుకోలేదనే విషయం స్పష్టమైంది. నోటాకు 1,576 ఓట్లు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద అబవ్) గుర్తుకు 1,576 ఓట్లు వచ్చాయి. మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఏ ఒక్కరూ సరైన వ్యక్తిగా తాము భావించడం లేదంటూ 1,576 మంది తమ అభిప్రాయాన్ని నోటా ద్వారా తెలియజేశారు. -
'చెల్లని' కాంగ్రెస్ ఓట్లు.. మీడియా కింగ్ విజయం
మీడియా కింగ్ సుభాష్ చంద్ర అనూహ్యంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన హరియాణా నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యారు. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన జీ గ్రూపు అధినేత.. పెద్ద రాజకీయ డ్రామా నడుమ ఎన్నిక కావడం గమనార్హం. ఈయనపై ఐఎన్ఎల్డీ మద్దతుతో ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఆర్కే ఆనంద్ పోటీ చేశారు. అయితే.. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లలేదు. దాంతో ఆనంద్ ఓడిపోగా, సుభాష్ చంద్ర గెలిచారు. నిజానికి రాజ్యసభ ఎన్నికలలో ఓట్లు వేసేది అప్పటికే ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు. వాళ్లకు ఓటు ఎలా వేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా వారు వేసిన ఓట్లు చెల్లలేదంటే.. అందులో ఏదో మతలబు ఉందనే అంటున్నారు. విప్‌ను ధిక్కరించి వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే, పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం వేటు పడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సభ్యత్వాన్ని కోల్పోవాలి. మరోసారి ఎన్నిక అవుతామో లేదో నమ్మకం ఉండదు. కానీ అవతలి వాళ్లు మనకు బాగా కావల్సిన వాళ్లయితే.. వాళ్లు గెలవాలని గట్టిగా కోరుకుంటే.. మన ఓట్లు చెల్లకుండా ఉండేలా వేయొచ్చు. అప్పుడు అవతలి వాళ్లకు అంత బలం లేకపోయినా, ఈ ఓట్లు చెల్లవు కాబట్టి తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. సుభాష్ చంద్ర విజయం వెనుక ఇలాంటి వ్యూహమే పనిచేసిందని సమాచారం. -
చెల్లని ఓట్లు 5.. అన్నీ టీడీపీవే!
-
చెల్లని ఓట్లు 5.. అన్నీ టీడీపీవే!
తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతింది. అసలు ముందే తమ బలంపై అనుమానంతో.. నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరిని కొనుగోలు చేద్దామని ప్రయత్నించి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో మిగిలిన అన్ని పార్టీల సభ్యులు తమ ఓటుహక్కును సరిగ్గానే వినియోగించుకోగా.. మొత్తం 5 ఓట్లు మాత్రం చెల్లలేదు. అవన్నీ టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి పడినవే. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు నోటా (పై అభ్యర్థులెవరూ కారు)ను ఎంచుకున్నారు. వారిలో ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఒకరు. ఈ లెక్కన నిజంగానే టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించి, ఓటును కొనుగోలు చేసినా కూడా ప్రయోజనం ఉండేది కాదన్నమాట.