
వాషింగ్టన్: మనకు ఒక కచ్చి తమైన సంతకం అంటూ లేకపోతే ఎంత నష్టమో అమెరికా ఎన్నికలను చూసి తెలుసుకోవచ్చు. పోస్టు ద్వారా వచ్చి న చాలా ఓట్లు సంతకంలో తేడాల వల్ల చెల్లకుండాపోయా యి. సంతకం చేయడం రాకపోవడంతో ఓటు వేసి నా అవి చెల్లలేదు. ప్రధానంగా యువ ఓటర్ల విషయంలో ఈ సమస్య ఎదురైంది. ఓటు–బై–మెయిల్ బ్యాలెట్‌లోని సంతకం, ఓటర్ రికార్డులోని సంత కం ఒకేలా ఉండాలి. ఎన్నికల అధికారులు రెండింటినీ సరిపోల్చుతారు. ధ్రువీకరణ తర్వాతే ఆ ఓటు ను లెక్కిస్తారు. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తే సదరు ఓటరుకు సమాచారం ఇస్తారు.
సంతకాన్ని సరిచేసుకొనే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు స్పందించపోవడంతో ఈసారి పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లలేదు. నెవడా రాష్ట్రంలోని క్లార్క్ కౌంటీలో 11,300, వాషో కౌంటీలో 1,800 ఓట్ల విషయంలో సంతకాలను మళ్లీ సరిదిద్దాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి ఫ్రాన్సిస్కో అగిలార్ చెప్పారు. నేటి టెక్నా లజీ యుగంలో చేతితో రాయడం పెద్దగా అవసరం పడట్లేదు. అన్నీ కంప్యూటర్, ఫోన్‌లోనే టైప్ చేస్తున్నారు. సాధారణంగా సంతకాలను వంపు తిరిగిన అక్షరాల్లో(కర్సివ్) చేస్తారు. అమెరికా పాఠశాలల్లో ఇటీవలి కాలంలో కర్సివ్ చేతిరాత నేరి్పంచడం లేదు. దాంతో పిల్లలకు సంతకాలు చేయడం రావడం లేదని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment