చెల్లని ఓట్లు 5.. అన్నీ టీడీపీవే! | 5 invalid votes polled for tdp in mlc elections | Sakshi

చెల్లని ఓట్లు 5.. అన్నీ టీడీపీవే!

Published Mon, Jun 1 2015 7:44 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

చెల్లని ఓట్లు 5.. అన్నీ టీడీపీవే! - Sakshi

చెల్లని ఓట్లు 5.. అన్నీ టీడీపీవే!

తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతింది.

తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతింది. అసలు ముందే తమ బలంపై అనుమానంతో.. నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరిని కొనుగోలు చేద్దామని ప్రయత్నించి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే.

ఎన్నికల్లో మిగిలిన అన్ని పార్టీల సభ్యులు తమ ఓటుహక్కును సరిగ్గానే వినియోగించుకోగా.. మొత్తం 5 ఓట్లు మాత్రం చెల్లలేదు. అవన్నీ టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి పడినవే. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు నోటా (పై అభ్యర్థులెవరూ కారు)ను ఎంచుకున్నారు. వారిలో ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఒకరు. ఈ లెక్కన నిజంగానే టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించి, ఓటును కొనుగోలు చేసినా కూడా ప్రయోజనం ఉండేది కాదన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement