టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ' | revanth reddy denies to meet tdp mlas at jail | Sakshi

టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'

Published Wed, Jun 3 2015 5:03 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ' - Sakshi

టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'

ఓటుకు నోటు కుంభకోణంలో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కి ప్రస్తుతం రిమాండు ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు నిరాకరించారు.

ఓటుకు నోటు కుంభకోణంలో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కి ప్రస్తుతం రిమాండు ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు నిరాకరించారు. చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ను కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, ప్రకాష్ గౌడ్ జైలుకు వచ్చారు. అయితే.. వాళ్లను కలిసేందుకు రేవంత్ నిరాకరించారు.

కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే తనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని, వేరెవ్వరినీ అనుమతించవద్దని ఆయన జైలు అధికారులను కోరారు. కాగా, మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ జైల్లో రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement