
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా ఉత్కంఠ నడుమ సాగిన మండలి పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపులో ఇద్దరు ప్రొఫెసర్లు ఓటమి చెందగా, టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన విద్యా సంస్థల యజమానులు ఇద్దరూ విజేతలుగా నిలిచారు. వారిపై పోటీ చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పైగా వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించడం గమనార్హం. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 53,610 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నాగేశ్వర్.. లెక్కింపు ప్రక్రియలో చివరి వరకు కొనసాగినా ఎలిమినేషన్ ప్రక్రియలో తగినన్ని ఓట్లు సాధించలేకపోయారు.
‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభద్రుల స్థానంలో తొలిసారిగా బరిలోకి దిగిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 70,072 ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రొఫెసర్లు ఓటమి చెందడం చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పలువురు నేతలు కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి చెందారు. ‘నల్లగొండ’స్థానం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమలు గణనీయంగా ఓట్లు సాధించినా.. గెలుపు తీరాలకు చేరలేకపోయారు.
చదవండి:
MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న
కేసీఆర్ చాణక్యం: టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అంశాలివే..
Comments
Please login to add a commentAdd a comment