Professors
-
పీజీ మెడికల్ సీట్లపై కత్తి!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీలు తేవాలన్న తాపత్రయంతో ఉన్న కాలేజీల్లోని ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేయడంతో కథ అడ్డం తిరిగింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయం నిర్వాకంతో రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్లకు గండిపడే ప్రమాదం నెలకొంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇష్టారాజ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి అనేక ప్రముఖ మెడికల్ కాలేజీల నుంచి అత్యంత సీనియర్లను బదిలీ చేశారు. కానీ వారి స్థానాలను భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. వెనుకా ముందు చూడకుండా బదిలీలు చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేసే చాన్సూ లేదు ఉస్మానియా, గాందీ, కాకతీయ వంటి ఎంబీబీఎస్, పీజీ సీట్లతో కూడిన వైద్య కళాశాలలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అంచనా వేయకుండానే, ఈ ఏడాది 40 శాతం సాధారణ బదిలీల నెపంతో 8 కొత్త మెడికల్ కాలేజీలను సాధించేందుకు ప్రొఫె సర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేశారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు లేరు. కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ లోని ఓబీజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జన రల్ సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పదోన్నతులకు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని వైద్య నిపుణులు అంటున్నారు. బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఎన్ఎంసీ సమీక్ష రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,148 పీజీ సీట్లు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్‌కు మూడు పీజీ మెడికల్ సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లు బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు తగ్గితే ఆ ప్రకారం జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పీజీ సీట్లకు కోత పెడుతుంది. ప్రతి నెలా, రెండు నెలలకోసారి ఫ్యాకల్టీని ఎన్ఎంసీ సమీక్షిస్తుంది. అంతేకాదు బయోమెట్రిక్ హాజరు విధానంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే టీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్యపై అంచనా వేస్తుంది. కాబట్టి పీజీ సీట్లకు గండం తప్పేలా లేదు. ఉదాహరణకు.. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 481 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 188 ప్రొఫెసర్ పోస్టుల మంజూరు ఉండగా, ఇటీవల బదిలీల కారణంగా ప్రస్తుతం కేవలం 86 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. అంటే 102 ప్రొ ఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 178 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. అంటే అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు 152 ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 284 పీజీ సీట్లకు సరిపోను మాత్రమే ఉన్నారు. కాగా బదిలీల కారణంగా ఉస్మానియాలోని 197 పీజీ సీట్లకు కత్తెర పడే ప్రమాదం నెలకొంది. ఇక గాంధీ మెడికల్ కాలేజీలో 213 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. అయితే బదిలీల కారణంగా అక్కడ 60 మంది ప్రొఫెసర్లకు గాను 35 మందే మిగిలారు. 73 మందిఅసోసియేట్ ప్రొఫెసర్లకుగాను 40 మందే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు 145 పీజీ సీట్లకు మాత్రమే సరిపోతారు. అంటే మిగిలిన 68 పీజీ సీట్లపై కత్తి వేలాడుతోందన్న మాట. ఇలా ఒక్క ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఏకంగా 265 పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. ఇలాగే కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలు, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వంటి చోట్ల కూడా పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం నెలకొంది.సీట్లు కోల్పోయే అవకాశం లేదు పీజీ సీట్లు కోల్పోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు అలాగే ఉంటాయి. అవసరమైన ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన, పదోన్నతులపై నియమించాం. – డాక్టర్ వాణి, డీఎంఈ -
నిలోఫర్‌లో ‘కుర్చీ’ కుస్తీ !
నాంపల్లి: ప్రముఖ నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య కొట్లాట జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియతో ఈ వైరం మొదలైంది. సూపరింటెండెంట్ పోస్ట్ నీదా... నాదా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్‌కు ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఏడాది కూడా పూర్తికాక ముందే తనపై బదిలీ వేటు వేశారని, అక్రమ బదిలీని నిలుపుదల చేయాలంటూ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్‌కు వెళ్లకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, న్యాయస్థానంలో డాక్టర్ ఉషారాణికి అనుకూలంగా తీర్పు వచి్చంది. కోర్టు ఆదేశాలతో డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. అయితే అక్కడ ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న డాక్టర్ రవికుమార్ ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు నిరాకరించారు. చెక్కుబుక్స్, సెల్‌ఫోన్‌ను తన దగ్గరే ఉంచుకున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రొఫెసర్ పోస్టులో కొనసాగుతున్నారు. ఇద్దరూ ఉడుంపట్టు... అన్యాయంగా, అక్రమంగా తన పోస్టులో కొనసాగుతున్నారని డాక్టర్ ఉషారాణి ఆరోపిస్తుండగా, కాదు తనకే బాధ్యతలు ఇచ్చారంటూ డాక్టర్ రవి కుమార్ అంటున్నారు. ఇద్దరూ ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. డాక్టర్ రవికుమార్ పూర్తిస్థాయి బాధ్యతల కోసం కోఠిలోని డీఎంఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాను దళితుడినని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దళితుడేనని, ఎలాగైనా తనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. అయితే ఈ వివాదాన్ని డీఎంఈ కార్యాలయం కూడా ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పడేసింది. మరోవైపు నిలోఫర్‌లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వైరల్ జ్వరాలు సోకి బాధితులతో కిక్కిరిసిపోతోంది. నిలోఫర్‌లో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌తో కలిపి మొత్తం 1,300 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ పడకలు ఎటూ సరిపోవడం లేదు. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేనికారణంగా నెల రోజులుగా పాలనంతా అస్తవ్యస్తమైంది. ఇప్పటికైనా నిలోఫర్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించాలని రోగులు, రోగి సహాయకులు, ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. -
హేరామ్.. ‘గాంధీ’ ఖాళీ
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయిని, కోవిడ్ సంక్షోభ వేళ వేలాది మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి బదిలీల విఘాతం తగిలింది. సుమారు 2 వేల మంది ఇన్‌పేషెంట్లు, మరో మూడు వేల మంది అవుట్‌పేòÙంట్లకు వైద్యసేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. లాంగ్‌స్టాండింగ్ పేరిట బోధనాసుపత్రి నిర్వహణలో ఉన్న కీలకమైన ప్రొఫెసర్లను మూకుమ్మడిగా బదిలీ చేయడంతో గాంధీ ఆస్పత్రి నిర్వహణపై పెనుప్రభావం పడనుంది. ఆస్పత్రి సూçపరింటెండెంట్తోపాటు ఆయా విభాగాలకు చెందిన సుమారు 40 మంది ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడంతో మేజర్ సర్జరీల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులకు గైడ్లుగా వ్యవహరించే ప్రొఫెసర్లకూ బదిలీ కావడంతో పీజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీనియర్, జూనియర్ నిష్పత్తిలో కాకుండా నిష్ణాతులైన వైద్యులందరినీ ఇష్టారాజ్యంగా శుక్రవారం బదిలీ చేయడంపై వైద్యవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకు.... కీలకమైన గాంధీ జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లను ఒకేమారు బదిలీ చేయడంతో సర్జరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నూతనంగా బదిలీపై వచ్చే ప్రొఫెసర్లకు ఇక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అరకొరగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ వైద్యులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకుగాను ఐదుగురు బదిలీ అయ్యారు. అత్యంత కీలకమైన అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్లు బదిలీ కావడంతో ఆపరేషన్లలో జాప్యం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థోపెడిక్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీకాగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. గైనకాలజీ విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.ఒక్కో ప్రొఫెసర్ ఉన్న విభాగంలో కూడా యూరాలజీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్‌ను కూడా బదిలీ చేయడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రభావం పడనుంది. -
విద్యకు సహకారం అందించండి
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్య క్రమాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకబృందం గురువారం సీఎం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జనవరి 7 నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్íÙప్ (పీఎస్‌ఐఎల్–24) కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ బృందం రాష్ట్రానికి వచి్చంది. ఈ బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లో 10–12 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థులతోపాటు 33 జిల్లాల ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాశ్, డాక్టర్ ఎండీ రైట్ పాల్గొన్నారు. -
వర్సిటీ అధ్యాపకుల వయోపరిమితి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్నత విద్య వర్గాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉండగా, మెడికల్ కాలేజీల్లోనూ బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచింది. కానీ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగానే ఉంది. రాష్ట్రంలో త్వరలో కొంతమంది అధ్యాపకులు రిటైర్ అయ్యే వీలుందని చెపుతున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రిటైర్మెంట్ల కారణంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. మరో పక్క రాష్ట్రంలోని కొన్ని వర్సిటీల వైఎస్ చాన్స్లర్ల పదవీ కాలం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. దీంతో కొత్త వీసీల నియామకం చేపడితే తప్ప యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టే వీల్లేదు. ఈ సమయంలో బోధన సిబ్బంది కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. 2024లోనే ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ అసెస్మెంట్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. న్యాక్‌లో మంచి గ్రేడ్ వస్తే తప్ప రీసెర్చ్ ప్రాజెక్టులు ఈ యూనివర్సిటీకి వచ్చే అవకాశం లేదు. ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గానే కొనసాగించాలి
ఏయూ క్యాంపస్: కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు, మేధావులు కోరారు. విదేశాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాలు, సెంటర్లు పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అడ్డుకోవడం దారుణమన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు ఇలా విధ్వంసాలకు పాల్పడరన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమన్నారు. మహిళా విద్య కోసం అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఏయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీలో సైతం అంబేడ్కర్ కార్నర్ ఉందన్నారు. అంబేడ్కర్‌ను గౌరవించడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ఠాగూర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ఆచార్యులు డి.వి.ఆర్ మూర్తి, కె.పల్లవి, కె.విశ్వేశ్వరరావు, చల్లా రామకృష్ణ, ఎన్.విజయమోహన్, డాక్టర్ జి.రవికుమార్, రెక్టార్ కె.సమత, ప్రిన్సిపాల్స్ పి.రాజేంద్ర కర్మార్కర్, టి.శోభశ్రీ, డీన్లు ఆచార్య ఎన్.సత్యనారాయణ, టి.షారోన్ రాజు, పాల్ తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఏరీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం బోధనా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల ఖాళీలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 65 శాతం ఖాళీలున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీల ఉనికికే ప్రమాదం... రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా అధ్యాపకుల నియామకం ప్రహసనంగా మారిందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆపై కుంటి సాకులతో వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో కాలం వెళ్లదీసినా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్య భూమిక పోషించే పరిశోధనలు సైతం ప్రొఫెసర్ల కొరతతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్య 157కాగా ఇంకా 238 ఖాళీలున్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుంటే ఇంకా 781 ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంటే మరో 850 ఖాళీలున్నాయి. మొత్తంగా 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి సర్కార్ మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. ఇదీ దుస్థితి... ►శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సి టీ, పొట్టి శ్రీరాములు తె లుగు యూనివర్సిటీ (మొ త్తం ఆరు)ల్లో ఒక్క ప్రొఫె సర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు. ►రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా వర్సిటీలో సగానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయ యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ►జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఉన్నది ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లే. -
ప్రొఫెసర్లుగా 80 మంది వైద్యులు
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వైద్యుల కల ఎట్టకేలకు ఫలించింది. ఒకే దఫాలో 80మందికి పైగా అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్యులకు ప్రొఫెసర్లు కావడమనేది అత్యున్నత పోస్టు. దీనికోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తుంటారు. గత ప్రభుత్వాల హయాంలో అర్హత ఉన్నా.. సకాలంలో పదోన్నతులు ఇవ్వలేదు. తాజాగా క్లినికల్ విభాగంలో 80 మందికి పైగా వైద్యులు ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందారు. వీరికి నేడో రేపో జూమ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. వీరితో పాటు నాన్క్లినికల్ అంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్ ఇలా రకరకాల విభాగాల్లో పనిచేసే వారి పదోన్నతుల జాబితా రెడీ చేశారు. ఈ వారంలో వీళ్లకూ ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితమే ఏడుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతులిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2006 తర్వాత టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులందరికీ 2020లోనే పీఆర్సీ వచ్చింది. 2016లోనే అప్పటి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వేతన సవరణ చేయడంతో ఎంతోమంది వైద్యులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. ప్రధానంగా సర్వీసు 10 ఏళ్లు దాటిన వైద్యులకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పెరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సైతం భారీగా వేతనాలు పెరిగాయి. -
వైరల్ వీడియో: ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు
-
ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు, వైరల్ వీడియో
ఖరగ్‌పూర్: కరోనా సంక్షోభ సమయంలో ఆన్లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్‌లో తప్పనిసరిగా మారిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థుల కష్టాలు అన్నీ కావు. తాజాగా ఒక ఐఐటీ ప్రొఫెసర్ విద్యార్థులపై విరుచుకు పడింది. ఐఐటీ ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సీమా సింగ్ ఆన్లైన్క్లాస్లో విద్యార్ధులతోపాటు, వారి తల్లిదండ్రులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్క్లాస్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాస్ చెప్తూ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించింది. విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా దూషణలకు దిగింది. ‘మీరు నా పై కంప్లయిట్ ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. వీలైతే సెంట్రల్ మినిష్టర్స్‌కు కూడా కంప్లయిట్ ఇచ్చుకోండి’ అంటూ ఆమె విద్యార్ధులపై చిందులు వేసింది. అంతేకాదు పరీక్షలో ఫెయిల్ చేస్తానని విద్యార్థులను బెదిరించిన వైనంప పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరొక వీడియోలో విద్యార్థి తాతా చనిపోయినందుకు పరీక్ష నుంచి మినహాయింపు కోరగా, ప్రొఫెసర్ ఆ విద్యార్థిని దూషించింది. ‘నేను కూడా హిందువునే నాకు మన సంప్రదాయాలు, కట్టుబాట్లు నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ఇలాంటివి ఎక్కువగా ఎవరూ చేయడం లేదంటూ’ ప్రొఫెసర్ సీమాసింగ్ విద్యార్థిపై మండిపడింది. మరో వీడియోలో క్లాస్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులు భారత్ మాతా కీ జై అనగా, వారిపై ‘మీరు దేశానికి ఇది తప్ప ఇంకొటి చేయాలేరా’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విద్యార్థుల మార్కులు నా చేతిలో ఉన్నాయంటూ వారిని బెదిరించింది. కాగా ఈ తతంగాన్ని ఐఐటీ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. కాగా ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. చదవండి: మే 2 తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేదం: ఈసీ -
ఆ నలుగురు ఔట్..!
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లను ఉద్యోగాల నుంచి రిలీవ్ చేస్తూ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ ఆమోదంతో గురువారం రాత్రి ఇన్చార్జి రిజిస్ట్రార్ వైకే సుందరకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నలుగురు ప్రొఫెసర్లు ప్రస్తుతం సెలవులో ఉండటంతో ఉత్తర్వులను వారి వ్యక్తిగత మెయిల్‌కు పంపడంతో పాటు శుక్రవారం వాటిని సొంత ఊరు అడ్రస్‌కు పోస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ పాలక మండలి నియామక నోటిఫికేషన్ రద్దు చేసిందన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ప్రొఫెసర్ల ఉద్యోగాలు పోయినట్లే. అయితే వాటిని కాపాడుకునేందుకు సదరు ప్రొఫెసర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతపురం జేఎన్టీయూ మాదిరే తమకు కూడా హైకోర్టు ధర్మాసనం సానుకూలమైన తీర్పు ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సుందరకృష్ణ కృష్ణా యూనివర్సిటీ నుంచి సాగనంపే నలుగురు ప్రొఫెసర్లలో ఒకరైన టి. హైమావతి ప్రస్తుతం ఇక్కడ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ల నియామకం, తొలగింపు... రిజిస్ట్రార్ సంతకంతోనే జరగాల్సి ఉంది. ఇది చిక్కు తెచ్చిపెట్టింది. వర్సిటీ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ దీనిపై తీవ్ర తర్జన భర్జన అనంతరం వైకే సుందరకృష్ణను ఇన్చార్ట్ రిజిస్ట్రార్‌గా నియమించి, అతనితో ఆ నలుగురు ప్రొఫెసర్లకు తొలగింపు ఉత్తర్వులు ఇప్పించారు. తొలగించిన వారు వీరే.. ♦డాక్టర్ తాళ్ల హైమావతి, అప్లైడ్ మాథమెటిక్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు) ♦డాక్టర్ వి. వెంకట్రాము, ఫిజిక్స్ డిపార్ట్మెంటు, అసిస్టెంట్ ప్రొఫెసర్, యోగి వేమన యూనివర్సిటీ (నూజివీడు పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్‌గా, వర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ బాధ్యతలు చూస్తున్నారు.) ♦డాక్టర్ ఈదర దిలీప్, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ద్రవిడన్ యూనివర్సిటీ (ఇంగ్లిష్ డిపార్ట్ట్మెంట్ హెచ్ఓడీగా, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా ఉన్నారు.) ♦డాక్టర్ వైఏవీఏఎస్‌ఎన్ మారుతి బయోసైన్స్ అండ్ బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్, ప్రొఫెసర్, గీతం యూనివర్సిటీ ( కాలేజీ అభివృద్ధి కమిటీ (సీడీసీ) డీన్‌తో పాటు క్యాంపస్‌లో ఉన్న ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు). ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే కృష్ణా యూనివర్సిటీ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నాము. నిపుణుల సలహాలు తీసుకొనే ఆ నలుగురు ప్రొఫెసర్లును రిలీవ్ చేశాము. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ నియామకం తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. – కేబీ చంద్రశేఖర్, వైస్ చాన్సలర్, కృష్ణా యూనివర్సిటీ చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్ తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
-
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా ఉత్కంఠ నడుమ సాగిన మండలి పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపులో ఇద్దరు ప్రొఫెసర్లు ఓటమి చెందగా, టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన విద్యా సంస్థల యజమానులు ఇద్దరూ విజేతలుగా నిలిచారు. వారిపై పోటీ చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పైగా వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించడం గమనార్హం. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 53,610 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నాగేశ్వర్.. లెక్కింపు ప్రక్రియలో చివరి వరకు కొనసాగినా ఎలిమినేషన్ ప్రక్రియలో తగినన్ని ఓట్లు సాధించలేకపోయారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభద్రుల స్థానంలో తొలిసారిగా బరిలోకి దిగిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 70,072 ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రొఫెసర్లు ఓటమి చెందడం చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పలువురు నేతలు కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి చెందారు. ‘నల్లగొండ’స్థానం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమలు గణనీయంగా ఓట్లు సాధించినా.. గెలుపు తీరాలకు చేరలేకపోయారు. చదవండి: MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ చాణక్యం: టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలివే.. -
‘అతన్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆరేటి ఉమ మహేశ్వరరావుకు ఎటువంటి సంబంధం లేదని ఏయూ దళిత ప్రొఫెసర్లు షరోన్‌రాజ్, ఏన్ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ యాక్టివ్ రోల్స్‌లో కూడా లేని మహేష్ ఏయూ ప్రతిష్టను మసక బార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి పారదర్శక పాలన అందిస్తూ, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమాచారహక్కు చట్టం పేరుతో అనేక మంది ప్రొఫెసర్ల, నాన్ టీచింగ్ సిబ్బంది బ్లాక్ మెయిలింగ్‌కు గురవుతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆరేటి ఉమా మహేశ్వరరావుపై గవర్నర్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరేటి మహేష్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహేష్‌పై పోలీసులు అధికారులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. -
కరోనా వైరస్‌పై నిట్ ప్రొఫెసర్ల పరిశోధన
కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్19) తీరుతెన్నులను కనుగొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలకు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్ బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ సౌమ్యలిప్సా రాత్, డాక్టర్ కిషాంత్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సౌమ్య, కిషాంత్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కరోనాపై పరిశోధనలు చేపట్టేందుకు వారం క్రితం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థకు మా ఆలోచనలపై పరిశోధనా పత్రం సమర్పించాం. ఆ సంస్థ మా పత్రాలను ఎంపిక చేసింది’అని తెలిపారు. అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసేందుకు అనువుగా ల్యాబ్‌లు ఉన్న నాసా, ఐబీఎం, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, ఎంఐటీ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఈ మేరకు ఆన్లైన్లోనే పరిశోధనలు చేయాల్సి ఉండగా నిట్ ప్రొఫెసర్లు శనివారం తమ ప్రాజెక్టును ప్రారంభించారు. వివిధ ఉష్ణోగ్రతల్లో వైరస్ ప్రభావం, దానిని అంతం చేసే అవకాశాలపై పరిశోధనలు చేశాక వ్యాక్సిన్ రూపొందించేందుకు అవకాశాలు సులువవుతాయి. ఏడాది పాటు ఈ పరిశోధనలు కొనసాగుతాయి. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనధికారికంగా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారిలో కొందరు ఇప్పటికే వివరణ ఇవ్వగా, ఇంకొందరు స్పందించలేదు. దీంతో వారిపై వేటు వేసేందుకు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం రంగం సిద్ధం చేసింది. ఆయా ప్రొఫెసర్ల వివరాలను తెప్పించి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా వారిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తీవ్ర సంచలనంగా మారింది. అనుభవం ఉండి, సీనియర్ అధ్యాపకులుగా కొనసాగుతున్న వారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏడాదికిపైగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వారికి ఉద్వాసన పలకక తప్పట్లేదని డీఎంఈ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వ విద్యాలయంలో కీలక పదవులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదు. వర్సిటీలోని పరిస్థితులకు భయపడి పదవులు వదులుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్సిటీ హాస్టల్స్ ఛీఫ్ వార్డెన్, వార్డెన్, దూర విద్య విభాగం డైరెక్టర్, వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తదితర కీలక పోస్టులకు ప్రొఫెసర్లు కరువయ్యారు. పరీక్షల విభాగం డీన్‌గా ఒక ప్రొఫెసర్ ఉన్నప్పటికీ ఆయన ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కీలక పదవులు ఖాళీగా ఉండడంతో వర్సిటీలో పాలన గాడి తప్పుతోంది. ఆర్యూ హాస్టల్స్ వార్డెన్ ఎవరో..? రాయలసీమ విశ్వవిద్యాలయంలో రెండు మెన్స్, రెండు ఉమెన్స్ హాస్టళ్లు ఉన్నాయి. అందులో సుమారు 700 మంది విద్యార్థులు ఉంటారు. ఈ విద్యా సంవత్సరం నూతనంగా ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమవుతుంది. వారికి రెండు హాస్టళ్లను ప్రారంభించనున్నారు. అయితే హాస్టళ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఛీఫ్ వార్డెన్‌గా ఎవరున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతమున్న ప్రొఫెసర్ వై.నరసింహులు సంవత్సరం కిత్రమే ఆ పదవికి రిజైన్ చేశారు. రిలీవ్ చేయాలని వందల సార్లు వీసీ, రిజిస్ట్రార్లకు మొరపెట్టుకున్నా చేయలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వర్సిటీలో ఆరŠట్ప్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, తెలుగు శాఖ విభాగాధిపతిగా, బీఓఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని పనిభారం ఉందని విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నారు. ఆయన స్థానంలో ఎకనామిక్స్ విభాగం ప్రొఫెసర్ వెంకట శేషయ్యకు వార్డెన్‌గా, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయన మొదట అంగీకరించినప్పటికీ తరువాత నాకు ఏపదవి వద్దని చెప్పినట్లు సమాచారం. మెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఒక డిప్యూటీ వార్డెన్, ఉమెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఇద్దరు డిప్యూటీ వార్డెన్లు హాస్టళ్ల వ్యవహారాలు చూస్తున్నారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆర్థిక పరమైన అంశాల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. అలాగే దూర విద్య విభాగం డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసరావు పదవి రాజీనామా చేశారు. అయితే ఉన్నతాధికారులు రిలీవ్ చేయలేదు. ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. అంటీముట్టనట్లుగా పరీక్షల విభాగం డీన్ ఆర్యూ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి విధులకు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నరని సమాచారం. పరీక్షల విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో బా«ధ్యతలు నిర్వర్తించడం లేదు. విభాగంలో అవకతవకల కారణంగా ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ విశ్వవిద్యాలయం -
జేఎన్టీయూకేలో.. వేధింపుల పర్వం
సాక్షి, కాకినాడ: సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో వేధింపుల పర్వం సాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ అండతో ఉన్నతాధికారులు ప్రొఫెసర్లపై వేధింపులకు దిగారు. తమ మాట వింటే.. తాము చెప్పినట్టు నడుచుకుంటే ఓకే.. లేదంటే అనవసర ఆరోపణలు అంటగడుతూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ తంతు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై అత్యధికంగా జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కొందరు ప్రొఫెసర్లు ఎన్సీఎస్టీ, ఎన్‌సీఎస్సీలను ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన కమిషన్ వీసీ డాక్టర్ రామలింగరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ వైవీ సుబ్బారావులకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఎన్సీఎస్టీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. ఏం జరిగిందంటే..! జేఎన్టీయూకేలో సివిల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ కోటేశ్వరరావును సదరు వీసీ, రిజిస్ట్రార్లు వేధించారన్న ఆరోపణ ఉంది. తాను చేయని తప్పులకు తనను బాధ్యుడి చేస్తూ.. అనవసర ఆరోపణలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించారని ప్రొఫెసర్ కోటేశ్వరరావు ఎన్సీఎస్టీ (నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్)కు తన గోడు వెళ్లబోసుకున్నారు. ప్రొఫెసర్ విన్నపాన్ని స్వీకరించిన కమిషన్ వేధింపులపై వివరణ ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్‌లో దక్షిణ రాష్ట్రాల జాతీయ కమిషన్ మెంబర్ శ్రీమతి మాయ చింతమన్ గిన్వటే సమక్షంలో ఆరోపణలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీసీ, రిజిస్ట్రార్లపై కమిషన్ తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు వర్సిటీలో మంచివి కాదని, పునరావృతం అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. గతంలోనూ ఇంతే.. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు వర్సిటీలో అనేకం చోటు చేసుకున్నాయన్న విమర్శలున్నాయి. అప్పట్లో ముగ్గురు ప్రొఫెసర్లు కమిషన్‌ను ఆశ్రయించగా వీసీ, రిజిస్ట్రార్లకు మందలింపులు తప్పలేదు. అయినా పద్ధతిలో ఏ మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు అండగా ఉన్నారన్న ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్ప డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరు ప్రొఫెసర్లదీ అదే బాట.. వేధింపుల పర్వం కేవలం కాకినాడ జేఎన్‌టీయూకేకే పరిమితం కాలేదు. విజయనగరం కళాశాలకు సైతం పాకింది. తాజాగా జేఎన్టీయూ విజయనగరం కళాశాలలో తమను ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని ఇద్దరు ప్రొఫెసర్లు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యుల్ క్యాస్ట్ (ఎన్సీఎస్సీ)ను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని క్లుప్తంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని గత ఎనిమిది మాసాలుగా వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఈ అంశంలో తమకు న్యాయం చేయకపోతే ఉద్యోగాల్లో కొనసాగడం కష్టమవుతుందని ఆవేదన చెందారు. ఈ విషయమై సైతం వీసీ, రిజిస్ట్రార్లు మరోసారి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట సాంకేతిక విశ్వ విద్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉన్నత పౌరులను తీర్చి దిద్దే ఇలాంటి దేవాలయంలో రాజకీయాలు, రాగద్వేషాలకు ఆస్కారం లేకుండా ఉం డాలి. కానీ కొందరు కీలక అధికారులు చేస్తున్న చేష్టలకు వర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తుతుతోంది. ఇప్పటికే వీసీల నియామకం కోర్టులో ఉన్న విషయం తెలి సిందే. ఆ విషయం మరవకముందే వేధిం పుల పర్వం తెరపైకి రావడం దారుణం. -
బోధన వైద్యులకు ‘నిర్ణీతకాల పదోన్నతులు’
సాక్షి, హైదరాబాద్: ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. పైరవీలకు ఆస్కారం లేకుండా పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు నిర్ణీతకాల వ్యవధిలో పదోన్నతులు లభించనున్నాయి. 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. సీఎం ఆమోదం అనంతరం తగిన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ముఖ్యమంత్రి వద్దకు పంపిన ఫైలు ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక వారికి స్కేల్లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. తాజా ప్రతిపాదనలు బోధన వైద్యులకు ప్రయోజనం కల్గిస్తాయని అధికారులు చెబుతున్నారు. 3 వేలమంది వైద్యులకు ప్రయోజనం... ప్రస్తుతం పదోన్నతులు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైరై ఖాళీలు ఏర్పడ్డాకే పదోన్నతులు లభిస్తున్నాయి. దీనివల్ల ఖాళీలు కొన్నే ఉంటే కొందరికి మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. మరికొందరికి పదోన్నతులు లభించడంలేదు. దీంతో పదోన్నతులు అనేది ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకోసం పైరవీలు జరుగుతుంటాయి. పైరవీల సందర్భంగా లక్షలకు లక్షలు సమర్పించుకోవాల్సిన సందర్భాలూ ఉన్నాయని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చినవారూ ఉన్నారు. మరికొందరికైతే 20 ఏళ్లకుగాని పదోన్నతి లభించే పరిస్థితి లేదు. ఇది వైద్యుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలు చేస్తున్నాయి. సీఎంకు పంపిన ఫైలు ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వెద్యులకు ప్రయోజనం కలుగనుందని సమాచారం. వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి కూడా వేతనాల్లోనూ మార్పులుంటాయి. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా మధ్య మధ్యలో స్కేల్స్‌లోనూ నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీతకాలంలో పదోన్నతులు ఇవ్వడం వల్ల ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు భౌతికంగా ఇతర పోస్టులకు మారుతారు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. వీలైనంత త్వరగా సీఎం ఆమోదం వస్తుంద ని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
యవ్వనంలో అతిగా తాగితే మెదడుకు చేటు!
వాషింగ్టన్: యవ్వనంలో విపరీతంగా మద్యం తాగితే అది మెదడుపై శాశ్వత ప్రభావం చూపుతుందని, తద్వారా మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అమెరికాలోని ఇలియన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మెదడు శాశ్వత మార్పుల వలన నాడీవ్యవస్థ దెబ్బతిని భావవ్యక్తీకరణ సమస్యలతోపాటు ఒత్తిడి, ఆందోళన కలుగుతాయని వారు తెలిపారు. కౌమార దశలోనే అతిగా మద్యం తాగిన వారి మెదడులో శాశ్వత మార్పులు సంభవించడాన్ని గమనించామని భారత సంతతి శాస్త్రవేత్త, ఇలియన్స్ వర్సిటీ ప్రొఫెసర్ సుభాశ్ పాండే తెలిపారు. -
విశ్వపతి పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంస...
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత టి.వి.ఆర్.కే.మూర్తి ( విశ్వపతి ) రచించిన ‘శ్రీవారి దర్శన్’ పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంసలు లభిస్తున్నాయి. ‘శ్రీవారి దర్శన్’ వలన తమకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయన్నారు. తమ విద్యార్థులకు ఈ విశేషాలన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విశ్వపతిని ప్రశంసించారు. విశ్వపతిని ప్రశంసించిన వారిలో హార్వర్డ్ యునివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ క్లోని, కొలంబియా యునివర్సిటీకి చెందిన జాన్ స్ట్రాటన్ హాలే, యేల్ యూనివర్సిటీ అలెగ్జాండర్ కోస్కోకోవ్ , ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ మదన్ లాల్ గోయల్, కొలరాడో ప్రొఫెసర్ లోరిలియా బీరేసిం, ప్రొఫెసర్ బ్రియాన్ట్ ఎడ్విన్కి ఉన్నారు. రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నాం.. విశ్వపతి రచించిన శ్రీవారి దర్శన్ , అమృతపథం , సిన్సియర్లీ యువర్స్ పుస్తకాలను ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం వారి ప్రధాన లైబ్రరీ లోనూ , వారి ఆసియా కేంద్రం లైబ్రరీ లోనూ ఉంచుతున్నట్లు విశ్వవిద్యాలయ లైబ్రేరియన్ మిసెస్ లాండా నుంచి వర్తమానం వచ్చింది. గతంలోనూ విశ్వపతి పుస్తకాలు హార్వర్డ్ , కార్నెల్ ఆక్స్ఫర్డ్ , కేంబ్రిడ్జి , కొపెన్హెగ్లోని డెన్మార్క్ రాయల్ లైబ్రరీలోనూ ఉంచారు. విశ్వపతి శ్రీ వేంకటేశ్వర స్వామిపై రాసిన పుస్తకాలను ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్టూడెంట్స్ రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నారు. తాను రాసిన పుస్తకాలను ఇంతమందికి చేరడం ఆ శ్రీనివాసుని అనుగ్రహం గా భావిస్తున్నానని విశ్వపతి పేర్కొన్నారు. -
ప్రొఫెసర్లకు భరోసా కల్పించిన వైఎస్ జగన్
-
బోధనా వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు లభించనున్నాయి. అందుకు సంబంధించిన సీఏఎస్ ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి పంపిన ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయని సమాచారం. తాజా నిర్ణయాల ప్రకారం బోధనాస్పత్రుల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆటోమేటిక్‌గా పదోన్నతి లభించనుంది. అలాగే ఆరేళ్లు సర్వీసు పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పూర్తయిన వారి పే స్కేలులో మార్పు తీసుకొస్తారు. ఎన్నేళ్ల ఎదురుచూపులో! ప్రస్తుతం బోధనా వైద్యుల పదోన్నతులు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. రిటైర్ అయితేనే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండగా చాలామందికి నిరాశే మిగులుతుంది. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వస్తుండటంతో వైద్యుల్లో నిరాశ నెలకొంది. కొందరికైతే 20 ఏళ్లకు కూడా పదోన్నతి కల్పించిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితి మార్చాలని వైద్యులు ఎన్నేళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. సీఏఎస్ అమలైతే రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2,700 మంది వైద్యులకు ప్రయోజనం కలుగుతుంది. వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి వేతనంలో మార్పులు చేస్తారు. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి వేతనంలో మార్పులు చేస్తారు. ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం సీఏఎస్ విధానానికి సీఎం ఆమోదం తెలపడంపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కేంద్ర విభాగం నేతలు డాక్టర్ నరహరి, డాక్టర్ ప్రవీణ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
శాతవాహన రిజిస్ట్రార్ ఎవరో..?
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీకి కొత్త రిజిస్ట్రార్ ఎవరు వస్తారనే చర్చ యూనివర్సిటీతోపాటు పరిధిలోని వివిధ కళాశాలల్లో ప్రారంభమైంది. ఈనెల 31తో ప్రస్తుతం పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఎం.కోమల్‌డ్డి ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత ఎవరు వస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. నాలుగేళ్లుగా ఇన్చార్జి పాలనలో కొనసాగుతున్న యూనివర్సిటీకి కీలకంగా రిజిస్ట్రార్ స్థానమే బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇన్చార్జి వీసీలు ఇక్కడ పెద్దగా సమయం కేటాయించకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం.. సమస్యలొస్తే పరిష్కరించడానికి రిజిస్ట్రార్ అందుబాటులో ఉండి పర్యవేక్షించారు. అలాంటి రిజిస్ట్రార్ పోస్టు ఇప్పుడు ఖాళీ అయితే ఎలా..? అనేది అందరి ఆలోచన. నాలుగేళ్లుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించకుండానే ప్రభుత్వం నెట్టుకొస్తున్న ఈ తరుణంలో రెగ్యులర్ రిజిస్ట్రార్ నియామకం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరోవైపు పోస్టు ఖాళీ అయిన వెంటనే రిజిస్ట్రార్ పోస్టును భర్తీ చేయాలని విద్యారంగనిపుణులు, విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు శాతవాహన యూనివర్సిటీకి కోమల్‌రెడ్డితోపాటు ఇప్పటివరకు నలుగరు బాధ్యతలు చేపట్టారు. వర్సిటీ ప్రారంభమయ్యాక మొద టి రిజిస్ట్రార్‌గా ఏ.వినాయక్‌రెడ్డి (28 ఆగస్టు 2008 నుంచి 27 ఆగస్టు 2009 వరకు), ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ (31 ఆగస్టు 2009 నుంచి 27మే 2012), ప్రొఫెసర్ బి.భద్రయ్య (28 మే 2012 నుంచి 27 మే 2014) తర్వాత 28 మే 2014 నుంచి ఎం.కోమల్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనుండడంతో పోస్టు ఖాళీ కానుంది. యూనివర్సిటీలో కీలకమైనస్థానం ఖాళీ అవుతుండడంతో తర్వాత ఎవరు వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. యూనివర్సిటీలో నుండే వస్తారా..? వర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్లున్నారు. వీరిలో ఒకరు కోమల్‌రెడ్డి, ఇంకొకరు గతంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా పనిచేసిన టి.భరత్. అనుభవం ప్రకారం చూస్తే వర్సిటీలో మొదటి అవకాశం ఇతనికే ఉంటుందన్న చర్చ వర్సిటీవర్గాల్లో జరుగుతోంది. వివిధ యూనివర్సిటీ ల రిజిస్ట్రార్ల నియామకాలు పరిశీలిస్తే ఎవరినైనా పోస్టు వరించవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. తుదకు రిజిస్ట్రార్ ఎవరనేది నిర్ణయించేది వీసీ చేతులో ఉంటుంది. ఇద్దరూ ఒకేసారి వచ్చే అవకాశం ప్రస్తుతం యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా టి.చిరంజీవులు కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమించాలనే ఆలోచనతో ఉంది. దీనికోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశం ఈనెల 10న ఉండగా.. అనుకోకుండా వాయిదాపడింది. త్వరలోనే వీసీ నియామకం కూడా చేపట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారవర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రార్‌ను నియమించాలంటే వీసీ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీసీతోపాటు రిజిస్ట్రార్‌ను కొత్తవారినే నియమించే అవకాశాలూ ఉన్నట్లు విద్యారంగ నిపుణుల్లో చర్చ సాగుతోంది. మొదట వీసీని నియమించి.. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ను నియమిస్తారా..? ప్రస్తుతం ఖాళీ అవనున్న రిజిస్ట్రార్ కుర్చీ భర్తీ చేసి ఆ తర్వాత వీసీని నియమిస్తారా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని విద్యారంగ నిపుణులు ఎదురుచూస్తున్నారు. -
‘గుర్తింపు’ తంటాలు
ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య ప్రదాయిని రిమ్స్ మెడికల్ కళాశాలకు నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏజెన్సీ మరణాలు, ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)ను 2008 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కాగా మొదటి నుంచి రిమ్స్ సిబ్బంది కొరతతో సతమతం అవుతుంది. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల మెడికోలు వైద్య శిక్షణను పూర్తి చేసుకొని బయటకు వెళ్లారు. గతేడాది సూపర్ స్పెషాలిటీ కోసం కూడా కేంద్రం కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తాజాగా రిమ్స్ వైద్య కళాశాలను రెన్యువల్ సమస్య వెంటాడుతోంది. జూన్ 5న ఎంసీఐ(భారతీయ వైద్య మండలి) బృందం తనిఖీ చేసిన విషయం విదితమే. బృందం నివేదిక ప్రకారం వైద్య కళాశాలకు గుర్తింపు రాలేదు. మరోసారి రిమ్స్‌ను ఆ బృందం ఈ నెలాఖరులో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆలోగా రిమ్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటే గుర్తింపును కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. లేనిపక్షంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే క్రమంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బోధన సిబ్బంది కొరతే ప్రధాన కారణం రిమ్స్‌లో వైద్య సేవలను పక్కనబెడితే భావి వైద్యులైన మెడికోలకు నాణ్యమైన విద్య అందడం లేదనే చెప్పుకోవచ్చు. బోధనకు సంబంధించి 150 పోస్టులకు గాను 90 మంది బోధన సిబ్బంది పనిచేస్తుండగా, 60 ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో మెడికోలకు సరైన రీతిలో బోధన సాగడం లేదని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల కోర్సు కాగా ఒక సంవత్సరం శిక్షణ వైద్యులుగా అనుభవంతో వైద్య వృత్తిలో కొనసాగనున్నారు. 16 ప్రొఫెసర్ పోస్టులు, 10 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 15 అసిస్టెంట్ ప్రొఫెసర్, 19 ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు కీలకమైన రిమ్స్ డైరెక్టర్ పోస్టు ఇన్‌చార్జీతోనే కొనసాగుతోంది. రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంటే డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మొదటి నుంచీ సమస్యల నడుమే వైద్య శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. 2008 సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు బోధన విషయమే ప్రధాన సమస్యగా ఉంది. ఎంసీఐ బృందం మొదటి నాలుగు సంవత్సరాలు తనిఖీలు చేసింది. పలుసార్లు కూడా రెన్యువల్ సమస్యనే ఉంది. ఎలాగో నెట్టుకుంటూ నాలుగు బ్యాచ్‌ల తర్వాత గుర్తింపు లభించింది. ఎంసీఐ బృందం తనిఖీ చేసే సమయంలో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను ఇక్కడ పనిచేస్తున్నట్లు చూపించి గట్టెక్కించారు. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్ ఉండడంతో ప్రతిసారి సమస్యే ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం బోధిస్తున్న వారిలో కూడా రెగ్యులర్ లేకపోవడం గమనార్హం. ఈ కళాశాలలో సీటు సాధించిన విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో విద్యాబోధన జరగకపోవడంతో భవిష్యత్తులో చేసే వైద్య వృత్తిలో పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా రిమ్స్‌కు వచ్చే రోగులకు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. చిన్నపాటి వైద్య చికిత్సలు చేస్తూ మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం పరిపాటిగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. గత నాలుగైదు నెలల క్రితం జిల్లా అటవీ శాఖాధికారి గుండెపోటుతో రిమ్స్‌లో చేరగా, వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, సరైన వైద్యం అందకపోవడంతో తుదిశ్వాస వదిలారు. ఇలాంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో జూనియర్ వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. దీంతో వారికి అనుభవం లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. అయోమయంలో మెడికోలు రిమ్స్ వైద్య కళాశాలకు గుర్తింపు వస్తుందో లేదోనని మెడికోలు అయోమయంలో పడ్డారు. ఇటీవల ఎంసీఐ బృందం పర్యటించినప్పుడు విద్యార్థులను బోధనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ రిమ్స్‌కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) గుర్తింపు నిరాకరిస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. వారి శిక్షణకు కూడా అడ్డంకులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేస్తే తమకు నాణ్యమైన విద్యతో పాటు కళాశాలకు గుర్తింపు లభిస్తుందని, రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం కోసం పాకులాట.. ప్రతిసారి ఎంసీఐ బృందం రిమ్స్‌ను తనిఖీ చేసినప్పుడు ఏవిధంగా గట్టెక్కిద్దామనే ఆలోచనే తప్పా సమస్యను పూర్తిగా ఎలా పరిష్కరిద్దామనేది అధికారులకు అంతుచిక్కడంలేదు. అద్దె వైద్యులు, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను బృందం తనిఖీ సమయంలో చూపించి చేదులు దులిపేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంసీఐ బృందం 10 శాతం ఖాళీలు ఉంటే రెన్యువల్ చేయడం నిరాకరించకుండా అనుమతులను జారీ చేస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్ పరిస్థితిని చూస్తే ప్రస్తుతం 18 శాతం ఖాళీగా ఉన్నాయి. రిమ్స్ మెడికల్ కళాశాలలో బోధించేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండడం, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవనే ఆలోచనతోనే ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదని సమాచారం. వేతనాలు పెంచినా సరైన మౌళిక వసతులు కల్పించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పెరిగిన వేతనాలతోనైనా భర్తీకి నోచుకునేనా.. ఖాళీల కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రొఫెసర్ల వేతనాలను పెంచుతూ జీఓ నెం.482 ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బోధకుల నియామక ప్రక్రియ జరగనుంది. ఈసారైనా బోధకులు వస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఖాళీలు భర్తీ అయితే మెడికోలకు లబ్ధి చేకూరడంతోపాటు రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి. ఆందోళన అవసరం లేదు మెడికోలు రెన్యువల్‌కు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత నెలలో పర్యటించిన ఎంసీఐ బృందం నివేదిక ఇంకా అందలేదు. ఆస్పత్రిలో అన్ని సేవలు అందుతున్నాయి. కళాశాలలో మాత్రమే సిబ్బంది కొరత ఉంది. అయినప్పటికీ మెడికోలకు బోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బోధన సిబ్బంది కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వేతనాలు కూడా గతంలో కంటే ఎక్కువగా పెంచింది. దీంతో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంసీఐ బృందం నివేదికలో లోటుపాట్లు ఉంటే వాటిని సవరించి అనుమతులు పొందేలా చర్యలు చేపడతాం. – అశోక్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ హోదా ప్రస్తుత వేతనం పెరిగిన వేతనం ప్రొఫెసర్ రూ.1లక్ష రూ.1.90 లక్షలు అసోసియేట్ ప్రొఫెసర్ రూ.90వేలు రూ.1.60 లక్షలు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.75వేలు రూ.1.20 లక్షలు ట్యూటర్ రూ.40వేలు రూ.53వేలు