
వాషింగ్టన్: యవ్వనంలో విపరీతంగా మద్యం తాగితే అది మెదడుపై శాశ్వత ప్రభావం చూపుతుందని, తద్వారా మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అమెరికాలోని ఇలియన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మెదడు శాశ్వత మార్పుల వలన నాడీవ్యవస్థ దెబ్బతిని భావవ్యక్తీకరణ సమస్యలతోపాటు ఒత్తిడి, ఆందోళన కలుగుతాయని వారు తెలిపారు. కౌమార దశలోనే అతిగా మద్యం తాగిన వారి మెదడులో శాశ్వత మార్పులు సంభవించడాన్ని గమనించామని భారత సంతతి శాస్త్రవేత్త, ఇలియన్స్ వర్సిటీ ప్రొఫెసర్ సుభాశ్ పాండే తెలిపారు.