washinton
-
ఆ కారణం వల్లే ట్రంప్ మొదటి భార్య ఇవానా మృతి
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ గురువారం అనుమానాస్పద రీతిలో మరణించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. శరీరంపై మొద్దుబారిన గాయాల ప్రభావం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇవానా ట్రంప్ మన్‌హాటన్‌లోని తన ఇంట్లో మెట్లపైనుంచి కాలుజారి పడటం వల్ల గాయాలపాలై మరణించారని అమెరికా మీడియాలో ప్రచారం జరిగింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇవానా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆమె ఇంటి అడ్రస్ నుంచి తమకు గురువారం ఫోన్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అక్కడి వెళ్లి చూస్తే ఆమె ఘటనా స్థలంలోనే మరణించి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అక్కడ నేరం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదని స్పష్టం చేశారు. ఇవానా మరణించిందని గురువారం ట్రుత్ సోషల్ వేదికగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఆమె గొప్ప, అందమైన మహిళ అని పేర్కొన్నారు. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వసమని తెలిపారు. ఆమె పట్ల తామంతా గర్వపడుతున్నామని, ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలని భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు. ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
ఆకలిపై పోరులో డ్రీమ్ కేర్
వాషింగ్టన్ : అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్ దొండేటి నిర్వహిస్తోన్న డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది. ఫండ్ రైజింగ్ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్ ఫౌండేషన్ సమీకరించింది. ఈ నిధులతో పది వేల మీల్ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది. దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఎగైనెస్ట్హంగర్ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సహకారాలు అందించింది. హై స్కూల్ స్థాయిలోనే ఫండ్ రైజింగ్ ద్వారా అమెరికా, ఇండియాలతో పాటు ఆకలితో ఉన్న వారికి సాయపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న కుషాల్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉగాదికి ‘తానా మహాకవి సమ్మేళనం - 21
వాషింగ్టన్: ఉగాది సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన రీతిలో ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో ‘తెలుగు మహాకవి సమ్మేళనం 21’ అనే కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. సాహిత్య వేదిక సమన్వయకర్త, శతశతక కవి, చిగురుమళ్లు శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితాగానంతో, విశిష్ట అతిధుల సందేశాలతో కొనసాగుతందుని తెలిపారు. ఈ అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని తెలియజేశారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒకే గొంతుగా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. -
ఢిల్లీ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలు.. పూర్తిగా విఫలమయ్యారు
వాషింగ్టన్ : భారత రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనబడిందని ఆ దేశ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్ పేర్కొన్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన హింసాకాండపై ట్రంప్ స్పందిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అల్లర్లు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ ఇది ఇండియా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీ సాండర్స్ బుధవారం ట్విటర్ ద్వారా స్పందించారు.' భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మత ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. అయితే ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమని ట్రంప్ స్పందించారు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిగా నాయకత్వం లోపించింది. అంతేగాక ఒక వ్యక్తిగానూ మానవ హక్కుల విషయంలోనే పూర్తిగా విఫలమయ్యారు' అంటూ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీసాండర్స్ మాత్రమే గాక ఇతర డెమొక్రాటిక్ సెనేటర్లు కూడా తప్పుబట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ తమ పౌరుల భద్రత కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముస్లింలపై దాడి నివేదికల మధ్య భారత ప్రభుత్వం ప్రజలకు విశ్వాసంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించాలని అమెరికా సంస్థ తెలిపింది. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) (భారత్ గొప్ప దేశం: ట్రంప్) -
యవ్వనంలో అతిగా తాగితే మెదడుకు చేటు!
వాషింగ్టన్: యవ్వనంలో విపరీతంగా మద్యం తాగితే అది మెదడుపై శాశ్వత ప్రభావం చూపుతుందని, తద్వారా మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అమెరికాలోని ఇలియన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మెదడు శాశ్వత మార్పుల వలన నాడీవ్యవస్థ దెబ్బతిని భావవ్యక్తీకరణ సమస్యలతోపాటు ఒత్తిడి, ఆందోళన కలుగుతాయని వారు తెలిపారు. కౌమార దశలోనే అతిగా మద్యం తాగిన వారి మెదడులో శాశ్వత మార్పులు సంభవించడాన్ని గమనించామని భారత సంతతి శాస్త్రవేత్త, ఇలియన్స్ వర్సిటీ ప్రొఫెసర్ సుభాశ్ పాండే తెలిపారు. -
వాషింగ్టన్లో చరియలు విరిగి భారీ విధ్వంసం
వాషింగ్టన్ రాష్ట్రంలో జోరు వానకు కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది చనిపోయారు. మరో 18 మంది గల్లంతయ్యారు. పలు గ్రామాల్లో 15 అడుగుల ఎత్తున బురదమట్టి పేరుకుపోయింది. కార్లు, ఇళ్లు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. సియాటిల్ కు 55 మైళ్ల దూరంలో ఉన్న స్టేట్ రూట్ నం. 530 కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కనీసం ఆరు ఇళ్లూ పూర్తిగా ధ్వంసమైపోయాయి. మొత్తం 2.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. మరో 18 మంది గల్లంతయ్యారని, గల్లంతైనవారికోసం అన్వేషణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 'గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది' అని అధికారులు చెప్పారు. అయితే చాలా చోట్ల బురద భయంకరంగా ఉండటంతో సహాయకార్యాల్లో ఉన్న కార్యకర్తలు ఊబిలో కూరుకుని పోయారని, వారిని కాపాడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. -
‘షట్‌డౌన్’ సుఖాంతం
వాషింగ్టన్: పదహారు రోజులుగా కొనసాగుతున్న అమెరికా ‘షట్‌డౌన్’ సుఖాంతమైంది. దివాలా పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రుణ పరిమితిని ఎత్తివేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయ సభలు చివరి నిమిషంలో ఆమోదించాయి. అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంటనే సంతకం చేయడంతో ‘కంటిన్యూయింగ్ అప్రోప్రియేషన్స్ యాక్ట్-2014’ చట్టంగా అమలులోకి వచ్చింది. సెనేట్‌లో 81-18, ప్రతినిధుల సభలో 285-144 ఓట్లతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అమెరికా ప్రస్తుత రుణ పరిమితి 16.7 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి రుణ పరిమితిని ఎత్తివేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందడంతో ప్రభుత్వోద్యోగులు గురువారం నుంచి తిరిగి విధుల్లోకి చేరారు. దీని అమలు కాలం అక్టోబర్ 1 నుంచి మొదలైందని, 2014 ఫిబ్రవరి 7 వరకు రుణ పరిమితి పెంపు కొనసాగుతుందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జే కార్నే తెలిపారు. ప్రభుత్వ వ్యయంపై, ముఖ్యంగా ఒబామా హెల్త్‌కేర్ పథకంపై తలెత్తిన ప్రతిష్టంభన కారణంగా దేశవ్యాప్తంగా నేషనల్ పార్కులు, చారిత్రక ప్రదేశాలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ‘నాసా’, పర్యావరణ పరిరక్షణ సంస్థ వంటి జాతీయ సంస్థలు సైతం ‘షట్‌డౌన్’ ఫలితంగా 16 రోజులు మూతపడ్డాయి. ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందడంతో ఈ ప్రతిష్టంభనకు తెరపడింది. ‘షట్‌డౌన్’పై ఓటమిని రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోహ్నర్ అంగీకరించారు. తాము కడవరకు పోరాడామని, అయితే, గెలుపు సాధించలేకపోయామని అన్నారు. అమెరికా ‘షట్‌డౌన్’కు తెరపడటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.