వాషింగ్టన్లో చరియలు విరిగి భారీ విధ్వంసం
వాషింగ్టన్ రాష్ట్రంలో జోరు వానకు కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది చనిపోయారు. మరో 18 మంది గల్లంతయ్యారు.
పలు గ్రామాల్లో 15 అడుగుల ఎత్తున బురదమట్టి పేరుకుపోయింది. కార్లు, ఇళ్లు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి.
సియాటిల్ కు 55 మైళ్ల దూరంలో ఉన్న స్టేట్ రూట్ నం. 530 కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కనీసం ఆరు ఇళ్లూ పూర్తిగా ధ్వంసమైపోయాయి. మొత్తం 2.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది.
మరో 18 మంది గల్లంతయ్యారని, గల్లంతైనవారికోసం అన్వేషణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 'గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది' అని అధికారులు చెప్పారు. అయితే చాలా చోట్ల బురద భయంకరంగా ఉండటంతో సహాయకార్యాల్లో ఉన్న కార్యకర్తలు ఊబిలో కూరుకుని పోయారని, వారిని కాపాడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.