నెల రోజుల క్రితం కేరళలోని వయనాడులోని ముండక్కై, చురల్‌మల ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే మరోమారు పంచరిమట్టం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన అనంతరం అధికారులు ఈ ప్రాంతంలోని వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత జూలై నెలలో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత ప్రాంతానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతాలను ప్రభుత్వం నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు తాజాగా మరోమారు కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment