ఉగాదికి ‘తానా మహాకవి సమ్మేళనం - 21 | TANA Says To Conduct Prapancha Maha Kavi Sammelanam-21 In USA | Sakshi
Sakshi News home page

ఉగాదికి ‘తానా మహాకవి సమ్మేళనం - 21

Published Mon, Mar 8 2021 9:58 PM | Last Updated on Mon, Mar 8 2021 9:58 PM

TANA Says To Conduct Prapancha Maha Kavi Sammelanam-21 In USA - Sakshi

వాషింగ్టన్: ఉగాది సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన రీతిలో ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో ‘తెలుగు మహాకవి సమ్మేళనం 21’ అనే కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. సాహిత్య వేదిక సమన్వయకర్త, శతశతక కవి, చిగురుమళ్లు శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ..  21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితాగానంతో, విశిష్ట అతిధుల సందేశాలతో కొనసాగుతందుని తెలిపారు. ఈ అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని తెలియజేశారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒకే గొంతుగా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement