Ugadi festival
-
శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
Manchu Vishnu: ఉగాది సందడంతా వీరి ఇంట్లోనే! (ఫోటోలు)
-
Ugadi 2024: ఫెస్టివ్ ఔట్ఫిట్స్
-
Ugadi 2024: సెలబ్రిటీల సంబరాలు
-
Ugadi 2024 : అదిరిపోయే వంటలు, వేప పువ్వు చారు ఒక్కసారి రుచిచూస్తే..!
పండగొచ్చిందంటే పూజలు వ్రతాలే కాదు. దేవుడికి భక్తితో పెట్టే నైవేద్యాలు. అంతేకాదు ఇష్టమైన వంటలు, మధురమైన స్వీట్లు ఉండాల్సిందే.. ఈ సందర్భంగా మీకోసం స్పెషల్ వంటలు.. బెల్లం బీట్రూట్ అరటిపండు కేసరి కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1; బీట్రూట్ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారీ: ►ముందుగా బీట్ రూట్ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి. ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి ►అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి ►పాలు జత చేసి బాగా కలిశాక, బీట్ రూట్ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి) ►చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. పులిహోర కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు; పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత తయారీ: ►రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు) ►ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి ►చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి ►మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ►మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ►ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ►ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పప్పు కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను తయారీ ►ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి ►మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి ►చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి ►వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను తయారీ: ►వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ►బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి ►వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి ►రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. -
చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకోవాలి?
చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నెలకు ఆ మాసం పేరు వస్తుంది. ఇది అందరికీ తెలిసింది. ఎన్నో పవిత్రమైన నెలలు ఉండగా పనిగట్టుకుని ఈ చైత్రంలోనే ఉగాది పండుగ ఎందుక జరుపుకుంటున్నాం. పైగా ఈ కాలం సూర్యుడి భగభగలతో ఇబ్బంది పడే కాలం కూడా అయినా కూడా ఈ నెలకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు. అదీగాక చైత్రమాసాన్ని విశిష్ట మాసం కూడా చెబుతారు. ఎందుకు అంటే.. నిజాని విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో కాబట్టి అంతకు మించి ఉత్క్రుష్టమైన నెల ఇంకొకటి ఉండదు. అలాగే అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. ''మాసానాం మార్గశీర్షోహం'' అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి, కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. పోనీ చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసం..ఇంతటీ పవిత్రమైన నెలలన్నింటిని పక్కన పెట్టి మరీ చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే.. చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసం వచ్చేటప్పటికీ శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మండగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. జీవిత సత్యం.. నిశితంగా చూస్తే..ఇది మనిషి జీవితానికి అర్థం వివరించేలా ఉంటుంది. ఎందుకంటే కష్టాలతో కడగండ్ల పాలై డీలా పడి ఉన్నప్పుడూ ఆగిపోకూడదని, సూచనే ఈ వసంతకాలం. ప్రకృతిలో ఆకురాలు కాలం ఉన్నట్లుగానే మనిషి జీవితంలో పాతాళానికి పడిపోయే ఆటుపోట్లు కూడా ఉంటాయని అర్థం. కాలగమనంతో అవి కూడా కొట్టుకుపోయి మనికి మంచి రోజులు అంటే.. వసంతకాలం చెట్లు చిగురించినట్లుగా జీవితం కూడా వికసిస్తుందని, చీకట్లుతోనే ఉండిపోదని చెప్పేందుకు. చలి అనే సుఖం ఎల్లకాలం ఉడదు, మళ్లీ కష్టం మొదలవుతుంది. ఇది నిరంతర్ర చక్రంలా వస్తునే ఉంటాయి. మనిషి సంయమనంతో భగవంతుడిపై భారం వేసి తాను చేయవలసిని పని చేస్తూ ముందుకు పోవాలన్నదే "కాలం" చెబుతుంది. "కాలం" చాలా గొప్పది. అదే మనిషిని ఉన్నతస్థాయికి తీసుకొస్తుంది. మళ్లీ అదే సడెన్‌గా అగాథంలోకి పడేసి పరిహసిస్తుంటుంది. అంతేగాదు కాలం ఎప్పుడూ మనిషిని చూసి నవ్వుతూ ఉంటుందట. ఎందుకంటే ఎప్పుడూ మనమీద గెలిచేది తానే (కాలమే) అని. ఎందుకంటే బాధ రాగానే అక్కడితో ఆగిపోతుంది మనిసి గమనం. వాటితో నిమిత్తం లేకుండా పయనం సాగిస్తేనే నువ్వు(మనిషి)అని కాలం పదే పదే చెబుతుంది. కనీసం ఈ ఉగాది రోజైన కాలానికి గెలిచే అవకాశం ఇవ్వొద్దు. కష్టానికే కన్నీళ్లు వచ్చేలా మన గమనం ఉండాలే సాగిపోదాం. సంతోషం సంబంరంగా మన వద్దకు వచ్చేలా చేసుకుందాం..! (చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?) -
Ugadi 2024: లంగావోణీ, లెహెంగా, బెనారసీ.. ఆ సందడే వేరు!
ఉగాది 2024 హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదికి ఆరంభం. ఉగాది. 'యుగ' అంటే వయస్సు,'ఆది' ఉగాది అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చిందే ఉగాది. ఉగాది అనగానే ఇల్లంగా శుభ్రం చేసుకోవడం, మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. అలాగే రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇంకా ఉగాది అనగానే కవితా పఠనాలు, పంచాంగ శ్రవణాలు, దానధర్మాలు కూడా చేస్తారు. కొంగొత్త ఆశయాలకు అంకురార్పణ చేసే శుభదినమే ఉగాది పర్వదినం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. అందుకే అంతా కొత్త.. కొత్తగా కళకళలాడుతూ ఉండాలనీ, ఉగాది పండగ వచ్చిందంటే సంప్రదాయ రీతిలో కొత్త దుస్తులు ధరించాలని కూడా పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలైతే అందమైన లంగా ఓణీలు, లెహంగాలతో సీతాకోక చిలుకల్లా ముస్తాబవుతారు. ఇక మహిళల ప్రాధాన్యత చీరలకే. ప్రస్తుతం నారాయణ పట్టు, కాటన్,చేనేత లెహంగాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. పదహారణాల లంగావోణీ తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. చేనేత చీరలు పచ్చని సింగారం కంచిపట్టు సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడుకుంటే బెటర్. మనసు దోచే ఇకత్ ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్, ఎంబ్రాయిడరీ లెహెంగాను ఇపుడుఫ్యాషన్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీ జతచేస్తే అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. మంచి కాంట్రాస్ట్ కలర్స్‌తో ఇక్కత చీర ఏ మహిళకైనా నిండుదనాన్ని తీసుకొస్తేంది చల్ల..చల్లగా గొల్లభామ తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గొల్లభామ చీరలు కూడా నిండుగా, ఈ వేసవిలో చల్లగా ఉంటాయి. గ్రాండ్‌గా గద్వాల్, బెనారసీ పట్టు వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. ఇక మగువలు గద్వాల్, కంచి, బెనారసీ పట్టు చీరల్లోమహారాణుల్లా మెరిసిపోతారు. ఈ ఉగాదిని గ్రాండ్‌గా సెలబ్రేషన్ల కోసం మీకు ఇష్టమైన సెలబ్రిటీల ఫ్యాషన్ దుస్తులను చూసి కూడా నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. -
Ugadi 2024: ఉగాది పచ్చడి ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
#Ugadi 2024 తెలుగువారి తొలి పండుగ ఉగాది అంటేనే ఆనందం. ఉత్సాహం. కొత్తకు నాంది అనే సంబరం. ముఖ్యంగా ఉగాది అనగానే తీపి, చేదు, లాంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరికీ గుర్తొస్తుంది. ప్రతి పదార్ధం జీవితంలోని విభిన్న అనుభవాలకు గుర్తుగా అమృతం లాంటి జీవితాన్ని ఆస్వాదించే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఉగాది పచ్చడికి అంత ప్రాధాన్యత. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తగా ఆరంభించ డానికి ఇది శుభతరుణమని భావిస్తారు. ఉగాదికి పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలతోపాటు ఉగాది పచ్చడి చేయడం అనవాయితీ. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చడి ఇలా.. పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు) వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది) కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి) బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి అర టీ స్పూన్ లేదా రెండు చిన్న పచ్చిమిర్చి తయారీ: పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి.స్పూన్‌తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది. తెలంగాణలో తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది. పిల్లలు మెచ్చేలా..! ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే , వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్‌లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడిని చేసుకొని, అందులోనే అరటిపండు, యాపిల్, ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవచ్చు. దీనికి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటే మరీ జారుగా కాకుండా, చక్కగా స్పూన్‌తో తినేలా ఫ్రూట్ సలాడ్‌లా భలేగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రస్టింగ్‌గా తింటారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మన అందరి జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను కలగ చేయాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.! -
Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది..
‘ఉగాది’ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అది మన తెలుగు పండుగ అని! ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. మత్సా్యవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడంటారు. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’.. ‘ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైన దినమే ‘ఉగాది’. ఉగాది పండుగ రోజున త్వరగా నిద్రలేచి ఇంటి ముందర ముగ్గులు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. తలంటు స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు. షడ్రుచు లతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’; ‘అశోక కళికా ప్రాశనం’ అని వ్యవహరించేవారు. "త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు" ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తు న్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికీ – ఆహారానికీ గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెప్తుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరకు ముక్కలు, జీలకర్ర లాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీపొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. బెల్లం – తీపి(ఆనందం), ఉప్పు (జీవితంలో ఉత్సాహం), వేప పువ్వు – చేదు (బాధ కలిగించే అనుభవాలు), చింతపండు – పులుపు (నేర్పుగా వ్యవహరించ వలసిన పరిస్థితులు), మామిడి – వగరు (కొత్త సవాళ్లు), కారం (సహనం కోల్పోయే స్థితి) గుణాలకు సంకేతాలు అంటారు. ఉదయంవేళ, లేదా సాయంత్రం సమయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే అయిదుఅంగాలని అర్థం చెపుతారు. ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా ‘కవి సమ్మేళనం‘ నిర్వహిస్తారు. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉగాది జరుపుతారు. తెలుగు వారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరా దిని ’గుడి పడ్వా’గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. తమిళుల ఉగాదిని (తమిళ) ‘పుత్తాండు’ అంటారు. వారిది సౌరమానం. ఏప్రిల్ 14న సంవత్సరాదిని చేసుకుంటారు. బెంగాలీల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతా పుస్తకాలన్నింటినీ మూసి, సరికొత్త పుస్తకాలు తెరుస్తారు. – నందిరాజు రాధాకృష్ణ ‘ వెటరన్ జర్నలిస్ట్ 98481 28215 (రేపు ఉగాది పర్వదినం సందర్భంగా) -
Ugadi Festival 2024: పండుగ వస్తోంది.. ఈ స్పెషల్ ఫుడ్స్‌తో గడపండిలా..
ఉగాది వస్తోంది.. క్రోధి నామంతో కొత్త ఏడాదిని తెస్తోంది. కొత్తబెల్లంతో ఉగాది పచ్చడి ఎలాగూ కలుపుకుంటాం. పండుగ రోజు పచ్చడి తర్వాత ఇంకా ఏమేమి తిందాం. కొబ్బరి పాల గారెలు.. మజ్జిగ వడలు చేసుకుందాం. మరికొంత సులువుగా ఓట్స్ స్మూతీ కూడా చేసుకుందాం. ఓట్స్ స్వీట్ స్మూతీ.. కావలసినవి: ప్లెయిన్ సఫోలా ఓట్స్ – అరకప్పు; అరటిపండు – 1; బాదం పాలు – అరకప్పు; నీరు›– అర కప్పు; చక్కెర – పావు కప్పు. తయారీ.. ఓట్స్‌ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో బాదం పాలు, నీరు, అరటి పండు గుజ్జు, చక్కెర, ఓట్స్ పొడి వేసి బీటర్‌తో కలిపితే స్మూతీ రెడీ. గ్లాసులో పోసుకుని తాగడానికి వీల్లేనంత చిక్కగా ఉంటే మరికొంత నీటిని చేర్చుకోవచ్చు. స్మూతీని చల్లగా తాగాలనుకుంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి లేదా స్మూతీ కోసం వాడే నీటిని ముందుగా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరుచుకోవాలి. బాదం పాలు రెడీమేడ్‌వి తీసుకోవచ్చు లేదా బాదం పప్పులు– నీటిని కలిపి మిక్సీ వేసి పాలను తయారు చేసుకోవాలి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాల గారెలు.. కావలసినవి: మినప్పప్పు – పావు కేజీ; నూనె – వడలు వేయించడానికి తగినంత; కొబ్బరిపాలు – లీటరు; యాలకుల పొడి– అర టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; బాదం పప్పు – 10 (నానబెట్టి పొట్టు తీసి తరగాలి); జీడిపప్పు – 20; కిస్మిస్– టేబుల్ స్పూన్; పిస్తా– టేబుల్ స్పూన్; నెయ్యి– టేబుల్ స్పూన్; బెల్లం లేదా చక్కెర – అర కేజీ. తయారీ.. మినప్పప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల సేపు మంచినీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని బీటర్ లేదా స్పూన్‌తో రెండు నిమిషాల పాటు చిలకాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టి కొబ్బరి పాలు పోసి మరిగించాలి. వేడెక్కుతున్నప్పుడు అందులో చక్కెర వేసి కలుపుతూ మరిగించాలి. చిక్కబడేటప్పుడు యాలకుల పొడి వేసి మరో నిమిషం పాటు మరిగించి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి నెయ్యి వేడి చేసి అందులో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వేయించి కొబ్బరి పాలు బెల్లం మిశ్రమంలో కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో మినపపిండిని పాలిథిన్ పేపర్ మీద వేసి వత్తి (నిమ్మకాయంత గోళీలుగా కూడా వేసుకోవచ్చు) నూనెలో వేయాలి. రెండువైపులా కాలనిచ్చి తీసి టిష్యూపేపర్ మీద వేయాలి. అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకున్న వెంటనే (వేడిగా ఉండగానే) వడలను ఒక వెడల్పు పాత్రలో పరిచినట్లు అమర్చి కొబ్బరిపాల మిశ్రమాన్ని పోయాలి. వడలు ఐదు నిమిషాల్లో కొబ్బరి పాలను పీల్చుకుంటాయి. వడలు పీల్చుకున్న తర్వాత కూడా పాలు ఇంకా మిగులుగా ఉండాలి. సర్వ్ చేసేటప్పుడు కప్పులో ఒక వడ ఒక గరిటె కొబ్బరి పాలు వేసి ఇవ్వాలి. ఉగాది పచ్చడి.. కావలసినవి: మామిడి పిందె – ఒకటి; వేప పువ్వు – టేబుల్ స్పూన్; బెల్లం పొడి– టేబుల్ స్పూన్; చింతకాయ – ఒకటి (లేకపోతే కొత్త చింతపండు చిన్న గోళీ అంత); ఉప్పు – చిటికెడు; పచ్చిమిర్చి – ఒకటి (తరగాలి). తయారీ.. వేప పువ్వును తొడిమలు, ఈనెలూ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. చింతపండును నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి. మామిడికాయను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా సన్నగా తరగాలి. ఒక పాత్రలో బెల్లం పొడి, చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలిపితే ఉగాది పచ్చడి రెడీ. గమనిక: ఇష్టమైతే చెరుకు ముక్కలు, రుచి కోసం అరటిపండు గుజ్జు కలుపుకోవచ్చు. మజ్జిగ వడ.. కావలసినవి: అటుకులు – కప్పు; రవ్వ – పావు కప్పు; మజ్జిగ– అర కప్పు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); అల్లం తరుగు – టేబుల్ స్పూన్; నువ్వులు – టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు (తరగాలి); కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; బియ్యప్పిండి లేదా ఓట్స్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – టేబుల్ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; నూనె– వేయించడానికి తగినంత. తయారీ.. అటుకులను వెడల్పు పాత్రలో వేసి నీటిని పోసి కడిగి వేరొక పాత్రలోకి తీసుకోవాలి. అటుకులను నీటి నుంచి వేరు చేయడానికి నీటిని వంపకూడదు. నీటిలో తేలుతున్న అటుకులను చేత్తో తీసి మరొక పాత్రలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఇసుక ఉంటే నీటి అడుగుకు వెళ్లిపోతుంది. అటుకులు శుభ్రంగా ఉంటాయి. పచ్చి శనగపప్పు కడిగి అటుకుల్లో వేయాలి. అందులో రవ్వ, ఉప్పు, మజ్జిగ వేసి కలిపి ఇరవై నిమిషాల సేపు నాననివ్వాలి. ఇప్పుడు నానిన అటుకుల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి తురుము, నువ్వులు, బియ్యప్పిండి వేసి కలిపి పది నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని వడకు సరిపోయేటట్లు ఉందా లేదా అని సరి చూసుకోవాలి. మరీ జారుడుగా ఉంటే మరికొంత బియ్యప్పిండి కలుపుకుని పిండి అంతటినీ పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి అటుకుల గోళీని వత్తి మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీయాలి. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. వేడి వేడి వడల్లోకి పుదీనా చట్నీ రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: వేసవి తాపాన్ని తగ్గించడంలో మేటి ఈ పప్పు! ఎన్ని ప్రయోజనాలంటే.. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది) -
రాచమర్యాదలు.. అవమానాలు కూడా అంతే.
-
ఆదాయమే ఆదాయం.. కానీ అవమానాలు చూస్తే..
-
ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ.. ఊరట ఏమిటంటే..
-
రాజకీయ నాయకులకు అండదండలు.. కానీ
-
ఉగాది వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, కార్యక్రమాల నిర్వాహకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. సీఎం జగన్ నివాసంలోని గోశాలలో ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో ఈ వివరాలు తెలిపారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఉన్నాయన్నారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొంటారని తెలిపారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాల ప్రకారమే ఈ ఉగాది సంబరాలు ఉంటాయన్నారు. ఇక్కడ పూర్తిగా పల్లె వాతావరణం కన్పిస్తుందన్నారు. ప్రారంభంలో గ్రామ ముఖద్వారం ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ దంపతులు విఘ్నేశ్వర ఆలయంలో పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఆనందనిలయం నమూనా ప్రాంగణంలోకి చేరుకుంటారని చెప్పారు. అక్కడ స్వామికి సీఎం వైఎస్ జగన్ దంపతులు.. శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలుకలగాలని, సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతీసంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారని వివరించారు. అనంతరం పంచాంగ శ్రవణం ప్రారంభమవుతుందన్నారు. చిరుధాన్యాలతో నవరత్నాల పథకాలు ప్రతిబింబించేలా నేలపై ఒక బొమ్మను ఏర్పాటు చేశామన్నారు. నవరత్నాల మధ్యలో రంగులతో వేసిన సీఎం జగన్ ఫొటో ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలు దేనికైనా తిరుమల పంచాంగాన్ని ఫాలో అవుతారని, ఆ ప్రకారమే కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. స్వామి దశావతారాల బొమ్మలు, భూదేవి, శ్రీదేవి బొమ్మలను కూడా మండపంలోని గోడలపై చిత్రీకరించినట్లు తెలిపారు. తిరుమలలో ఉన్నట్లు బంగారు తాపడంతో ఉన్న గంటలు, ధ్వజస్తంభం, కోనేరు కూడా ఇక్కడ చూడవచ్చన్నారు. కొన్ని సంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు, ఉగాది పాటలకు నృత్యాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను టీటీడీ వేదపండితులు, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వేదపండితులు ఆశీర్వదిస్తారని తెలిపారు. సీఎం జగన్ ప్రధాన లక్ష్యం సామాన్యుడు బాగుండాలనేదేనని చెప్పారు. పేదల బాగుకోసం సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎం తన పాలనాకాలంలో ఇప్పటికి బటన్ నొక్కి రూ.2 లక్షల కోట్లను నేరుగా పేదల అకౌంట్లలోకి వెళ్లేలా చేశారని చెప్పారు. సీఎం ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా, నాడు–నేడు పాఠశాల భవనాల సెట్టింగ్‌లు భారీగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
శుభాది కావాల్సిన ఉగాది
వసంతమాసంలో వచ్చే ఉగాది మన తెలుగువాళ్ల కొత్త సంవత్సరం. ఆకులే కాదు, ఆశలూ చిగురించే కాలంలో వచ్చే పండుగ ఇది. వసంతానికీ కవిత్వానికీ అనాదిగా అవినాభావ బంధం ఉంది. ఉగాది అంటే ఆరు రుచుల ఉగాది పచ్చడిని ఆరగించడం; పంచాంగ శ్రవణం మాత్రమే కాదు, ఊరూరా కవిసమ్మేళనాల కోలాహలం కూడా! తెలుగు నేల మీదనే కాదు, తెలుగువాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉగాది పండుగ రోజున కవిసమ్మేళనాలు తప్పనిసరిగా జరుగుతాయి. ప్రాచీన కావ్యాలలో రుతువర్ణన తప్పనిసరి అంశం. కవులు ఆరు రుతువులనూ వర్ణించినా, వాటిలో వసంత వర్ణనకే అమిత ప్రాధాన్యమిచ్చారు. ‘ఋతూనాం కుసుమాకరః’– అంటే, ‘రుతువు లలో వసంతాన్ని నేనే’ అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పుకొన్నాడు మరి! అలాంటప్పుడు భాగవతోత్తములైన ప్రాచీన కవివరేణ్యులు వసంత వర్ణనకు రవంత అమిత ప్రాధాన్య మివ్వడంలో వింతేముంటుంది? ‘కమ్మని లతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసగం మా/ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచును ముదమ్మొనర వాచా/లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మగుచు విన్చెననిశమ్ము సుమనోభా/రమ్ముల నశోక నికర మ్ములను చంపక చయమ్ములును కింశుక వనమ్ములున్ నొప్పెన్’ అంటూ ‘ఆంధ్ర మహాభారతము’ ఆదిపర్వంలో నన్నయ పుష్పవిలసిత వసంత శోభను వర్ణించాడు. ‘కీర ముహ సచ్ఛేహిం/ రేహఇ వసుహా పలాస కుసుమేహిం/ బుద్ధస్స చలణ వందణ/ పడి విహిం వ భిక్ఖు సంఘేహిం’ – అంటే, ‘భూమి మీద తిరుగాడే రామచిలుకల ముక్కుల్లాంటి మోదుగ పూలు బుద్ధుని పాదాలను తాకి ప్రణ మిల్లే బౌద్ధభిక్షువుల సంఘమా?’ అని హాలుడు తన ‘గాథా సప్తశతి’లో అబ్బురపడ్డాడు. రుతువర్ణనలో అష్టదిగ్గజాలను తలదన్నే కవిదిగ్గజం ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు. ఆయన తన ‘ఆముక్త మాల్యద’లో చేసిన వసంత వర్ణనలో మీన మేషాలను లెక్కించాడు. ‘కినిసి వలఱేడు దండెత్త గేతు వగుట/ మీన మిల దోచుటుచితంబ మేష మేమి/పని యనగ నేల? విరహాఖ్యపాంథ యువతి/ దాహమున కగ్గి రాగ దత్తడియు రాదె?’ అని చమత్కరించాడు. ఇందులోని చమ త్కారమేమిటంటే, కోపంతో మన్మథుడు దండెత్తగా చేప కనిపించడం సమంజసమే! ఎందుకంటే, మన్మథుడు మీనకేతనుడు. అలాంటప్పుడు అక్కడ మేకకు పనేమిటంటారా? విరహతాపంతో యువతులు దహించుకు పోతున్నప్పుడు అగ్ని వాహనమైన మేషం అక్కడ ఉండటమూ సమంజ సమే కదా! సౌరమానంలో మీన, మేష మాసాలు వసంత రుతువు. వసంతాగమనాన్ని ఇంత నర్మగర్భంగా వర్ణించడం రాయలవారికే చెల్లింది! ‘క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దారసోపగుం/భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస/న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె; ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా’ అని చేమకూర వేంకటకవి వాపోయాడు. వసంతుడు వచ్చి, చెట్లను చిగురింపజేసి, వాటిని ఫలపుష్పభరితం చేసి, ప్రకృతిని పులకింపజేశాడట. అప్పుడు వసంతుడు చేసిన ఘనకార్యాన్ని పైనుంచి చూస్తున్న చంద్రుడు మెచ్చకపోగా, కినుక బూనాడు. వసంతుడిని మించి తన ఘనత చాటుకోవడానికి సుకుమారమైన వెన్నెల కురిపించి, రాళ్లను కరిగించేశాడట. అలాగే, ఎంత బాగా రాసినా సమకాలికులు మెచ్చరట! చేమకూర కవికే కాదు, ఈ బాధ ఇప్పటి కవులనూ పీడిస్తూనే ఉంది. ‘నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు’ అని కృష్ణశాస్త్రి వగచినంత మాత్రాన తెలుగు కవులకు ఉగాదులు లేకుండా పోలేదు. ఉగాది కవి సమ్మేళనాలు నేటికీ అట్టహాసంగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగని ఉగాది కవి సమ్మేళనాలు ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్నాయనడానికి ఆధారాలేవీ లేవు. మహా అయితే ఒకటి రెండు శతాబ్దాలుగా మొదలై ఉంటాయేమో! ప్రాచీన సాహిత్యంలో వసంత వర్ణన తప్ప ఉగాది వర్ణన ఎక్కడా కనిపించదు. ఒకప్పుడు కొన్ని పత్రికలు ఉగాది ప్రత్యేక సంచికలు విడుదల చేసేవి. ఆ కాలమంతా గత వసంత వైభవం. కాల చక్రభ్రమణంలో రుతువులు వస్తుంటాయి, పోతుంటాయి. ఉగాదుల రాకతో లోకమంతా పచ్చగా మారిపోతుందనుకుంటే, అది భ్రమ మాత్రమే! ‘నీతి పథమునందు, నిత్య జీవితమందు/ మాటనిరుకునందు మార్పులేక/ కొత్తబట్ట గట్టు కొన్నంత నూత్నవ/ర్షంబు మహము సార్థకంబుగాదు’ అని జాషువా ఏనాడో నిష్ఠుర సత్యాన్ని పలికారు. ‘ఉగాది పాటకు ఒకటే పల్లవి/ బాధ బాధ బాధ అది/ జగాన మెసలే జనాల జీవిత/ గాథ గాథ గాథ’ అని నిర్మొహమాటంగా తేల్చేశాడు శ్రీశ్రీ. అంతేనా? ‘ఉగాది వచ్చింది/ అయినా/ శుభాది వచ్చిందీ?’ అని నిలదీశాడు కూడా! ఏటా ఉగాది వస్తూనే ఉంటుంది. ఉగాది వేడుకలూ యథాప్రకారం జరుగుతూనే ఉంటాయి. సామాన్యుల జీవితాల్లో పెనుమార్పులేవీ రాకపోయినా; రాజకీయ పంచాంగ శ్రవణాలొక వైపు, బహిరంగ వేదికల మీద అధికారిక, అనధికారిక కండువాల కవి సమ్మేళనాలింకొక వైపు కోలాహలంగా కొనసాగుతూనే ఉంటాయి. ఒకే వేదిక మీదకు చేరిన కవుల్లో కొందరు ఉగాదిని రారమ్మని ఆహ్వానిస్తుంటారు. ఇంకొందరు రావద్దని బతిమాలుకుంటారు. ఉగాది పచ్చడిలోని చేదును మర పిస్తూ, ఈ తప్పనిసరి తతంగాలు జనాలకు ఉచిత వినోదాన్ని ఉదారంగా పంచిపెడుతూనే ఉంటాయి. పండగపూట ఆ మాత్రం వినోదమైనా లేకపోతే, బతుకులు మరీ చేదెక్కిపోవూ! -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాది న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం మరియు విశేషపూజలతో పాటు,మహాగణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి వార్లకు అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో పాటు శ్రీవారి కళ్యాణోత్సవానికి ఏప్రిల్ 2 స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా,గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు. కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సింగపూర్‌లో నిర్వహించిన వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవానికి సింగపూర్ న్యాయ, హోం అఫ్ఫైర్స్ శాఖ మంత్రి కె షణ్ముగం సన్నిధిలో ఆశీస్సులు పొందారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు , కోవిద్ నిబంధనల మేరకు సింగపూర్ తెలుగు సమాజం గత రెండు సంవత్సరాలలో ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించ లేకపోయిందని, ఎంతో కాలం తరవాత ఉగాది పండగ సందర్భంగా అందరినీ ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉందని అన్నారు. అలానే ఈ ఉగాది నాడు సుమారు 4000 మందికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేపపువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని ప్రత్యేక ప్యాకెట్ రూపం లో సుమారు 5000 మందికి పైగా అందించామని తెలియచేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారి సహాయ సహకారాలతో కళ్యణోత్సవం లో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూ ప్రసాదం, వడ, అభిషేక జలం, తలంబ్రాలు మరియు వస్త్రాలు అందచేసామని తెలిపారు. కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు,దాతలకు, ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు. -
దుబాయ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
నిజామాబాద్ కల్చరల్: దుబాయ్‌లో ఉగాది ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. తెలుగు అసోసియేషన్స్ యూఏఈ కల్చరల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మార్చి 27న తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దుబాయ్‌లోని షేక్‌రషీద్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. దుబాయ్, ఒయాసిస్, షార్జా, రస్‌ఆల్‌ఖైమా, అబుదాబి నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారులు, యువ బృందాలు చేసిన సంప్రదాయ, సినీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకలో పాల్గొన్న సినీ నటుడు శ్రీకాంత్, నటి ఈషారెబ్బను నిర్వాహకులు సన్మానించారు. త్రిపుర కన్స్ట్రక్షన్స్, శుభోదయం గ్రూప్, మలాబార్ గో ల్డ్, ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, డాలర్ డివైన్ క్లబ్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, ఆల్కెండీ గ్రూప్, మైదుబాయ్, ఆల్మైరా 64 టేస్ట్ ఆంధ్ర రెస్టారెంట్, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
గరం గరం ముచ్చట్లు 02 April 2022
-
గుడి పడ్వా వేడుకలు.. అదిరేటి డ్రెస్సుల్లో మెరిసిన యువతులు
-
స్పెషల్ వీడియోతో సితార ఉగాది విషెస్.. వైరల్
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారాల పట్టి సితార సైతం అభిమానులకు ఉగాది విషెస్ తెలియజేసింది. ప్రతి పండగకి అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం సితారకు అలావాటు. ఆ పండగ ప్రత్యేకత తెలుసుకొని మరి దానికి తగ్గట్టుగా రెడీ అయి విషెస్ తెలియజేస్తుంది. ఉగాది పండక్కి కూడా సితార అదే ఫాలో అయింది. ఉగాది సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో ఓ బ్యూటిఫుల్ ఫోటోషూట్ చేయించుకుంది సితార. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..‘అందరికి ఉగాది శుభాకాంక్షలు’ అని అచ్చమైన తెలుగులో చెప్పింది. ఆ వీడియో సితార డ్రెడిషనల్ లుక్‌లో యువరాణిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల సితార ఏ పోస్ట్ పెట్టినా అది నెట్టింట వైరల్ అవుతుంది. ఆ మధ్య‘ సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు స్టెప్పులేస్తే.. అది నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అదే సినిమాలో ‘ఎవ్రీ పెన్ని’ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
సంస్కృతీ వటవృక్షాన్ని రక్షించుకోవాలి
ఉగాది పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. తెలుగు నూతన సంవత్సరాదిగా పిలుచుకునే ఈ రోజున... జీవితంలో ఎదు రయ్యే వివిధ రకాల అను భవాలకు ప్రతీకగా భావించే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకుని తినే ఆచారం ఉంది. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు రుచులు ఉంటాయి. ఈ పచ్చడి తినడం... ఒక రకంగా పర్యావరణానికి ఇచ్చే గౌరవమే. ఇందులో వాడే ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదించిన చెట్ల నుంచి వచ్చిన పదార్థమే. ఇప్పుడు ఇందులో చేదును ప్రసా దించే వేప చెట్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘అజారక్టా ఇండికా’ అనే శాస్త్రీయ నామం కలి గిన వేప చెట్టును పురాణాలలో లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పారు. ఈ భూమి మీద ఎక్కువగా మన దేశంలోనే కనిపించే చెట్టు వేప. ఈ ఆకులలో 150 రకాల విశి ష్టమైన రసాయనాల సమ్మేళనం ఉంది. పురాతన కాలం నుంచి వేపను వివిధ అవసరాలకు, చికిత్సలకు వాడుతున్నారు. వేప చెట్టు వేర్ల నుంచి చిగుర్ల వరకూ అన్ని భాగాలనూ భారతీయులు ఉపయోగించుకుం టున్నారు. ఆయుర్వేద వైద్యంలో వేపకు ఎంతో ప్రాధాన్యం వుంది. పేగుల్లో పురుగులు, మొలలు, దురదలు, దద్దుర్లు, పచ్చకామెర్లు, అల్సర్లు, అతి మూత్ర వ్యాధి; తామర, కుష్ఠు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు; జ్వరం, మలేరియా, రక్త సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఈ వేప చెట్టు ఎంతో ఉపయోగకారి. మనదేశంలో దంతధావనం ఎక్కు వగా వేప పుల్లతోనే చేయడం మనకు తెలిసిన విష యమే. అతి ప్రాచీన కాలం నుంచీ పంటపొలాలకు వేప పిండి, వేప నూనెలను ఎరువుగా, కీటక నాశినిగా వాడుతున్నారు. మన సంప్రదాయ వ్యవసాయంలో వేప విడదీయరాని భాగం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వేప చెట్టు మనుగడ ప్రమాదంలో పడింది. గత రెండు మూడు సంవత్సరా లుగా వేపచెట్లు తరచుగా ఎండిపోతున్నాయి. చాలా చోట్ల కూలడమూ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలం గాణ, రాయలసీమ ప్రాంతాలలో ఇటీవల ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. గత మూడు నాలుగు సంవ త్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం ప్రత్యేక అధ్యయనం చేసింది. బాగా ఎదిగిన వేపచెట్లపై ‘లొరాంథస్’ అనే పరాన్న మొక్క ఎదగ డమే ఇందుకు కారణమని గుర్తించారు. భారీగా ఎదిగిన వేప చెట్లను ఆసరా చేసుకుని ఎదిగే ఈ లొరాంథస్ వేప చెట్టులో ఉండే నీటితో పాటు లవణాలు, పోషకాలను పీల్చుకుంటుంది. ఫలితంగా వేప చెట్టు ఎండిపోయి కూలిపోతుంది. అయితే వేపచెట్లపై ఈ లొరాంథస్ను గుర్తించిన వెంటనే, చెట్టును మొత్తం కొట్టేయకుండా, అది ఉన్న కొమ్మను నరికివేయడం ద్వారా మిగతా చెట్టుకు వ్యాపించ కుండా కాపాడవచ్చునని అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. అయితే ఇటీవల కొద్ది నెలలుగా ‘డిపాక్ డిసీజ్ ఆఫ్ నీవ్ు’ అని వ్యవహరించే మరో వ్యాధితో వేప చెట్లు చనిపోవడం వెలుగు చూసింది. ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే వైరస్ సోకిన కొమ్మలను కత్తరించి కాల్చివేయడం, అలాగే చెట్టుకు ఎక్కువ నీరు పోయడం వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నగరీకరణ వల్ల కాంక్రీట్ నిర్మాణాలు రావడం వల్ల చెట్టు కాండం వరకూ నిర్మాణాలు జరపడంతో చెట్టు వేర్లకు అందాల్సిన నీరు, పోషకాలు తగినంత అందకపోవడం వల్ల కూడా చెట్లు అంతరిస్తున్నాయి. ఎంతో విలువైన ‘వేప చేదులోని తియ్యదనాన్ని’ భావి తరాలకు అందించడానికి ప్రభుత్వాలు వేపచెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. మోతె రవికాంత్ వ్యాసకర్త ‘సెఫ్’ వ్యవస్థాపక అధ్యక్షులు మొబైల్ : 94919 24345+ -
Ugadi 2022: విరబూసిన వేప..
-
Ugadi 2022: షడ్రుచుల ఉగాది
-
ఉగాదికి సీఎం కేసీఆర్‌ను పిలుస్తా!
సాక్షి, హైదరాబాద్: ‘రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార, విపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నా. ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నా..’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ‘ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాలను మరిచి కొత్త ఆరంభాన్ని మనమందరం ఆకాంక్షిద్దాం. విభేదాలన్నీ కనుమరుగు కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి చాలా కాలం నుంచి రాజ్‌భవన్‌కు రావడం లేదు. ఈ గ్యాప్‌కి నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు. నేను ఏ సమస్యనూ సృష్టించాలని కోరుకోను. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటా. గవర్నర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. ముఖ్యమంత్రి అనేవారు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వ అధినేత. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. నా అధికారాలు, పరిమితులు నాకు బాగా తెలుసు. నేను ఎన్నడూ నా పరిధిని దాటలేదు. గణతంత్ర దినోత్సవ నిర్వహణ (వివాదం), అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వంటి ఉదంతాలు ప్రజల ముందు ఉన్నాయి. నేను ఎవరికీ తలొగ్గను. అత్యంత బలమైన వ్యక్తిని. బలమైన అభిప్రాయాలు కలిగి ఉన్నా. నా స్నేహపూర్వక వైఖరి, మంచితనాన్ని బలహీనతగా భావించి వాడుకోవడాన్ని అంగీకరించను..’ అని గవర్నర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’, ‘సాక్షి టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఇటీవల నెలకొన్న విభేదాలు, ఇతర అంశాలపై తమిళిసై స్పందించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. గణతంత్ర వేడుకల ఏర్పాట్లకు అధికారులు రాలేదు పుదుచ్చేరితో సహా చిన్న రాష్ట్రాల్లో సైతం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. దేశం, జాతీయ జెండాపై గౌరవం ఉన్న నేను ఇక్కడా ఘనంగా జరపాలని భావించాను. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానం లేకపోవడంతో మేమే ప్రభుత్వాన్ని సంప్రదించాం. రాజ్‌భవన్‌లోనే జెండావిష్కరణ జరపాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది. జాతీయ జెండాకున్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించా. వేడుకల ఏర్పాట్లకు రావాల్సిన ప్రభుత్వ అధికారులు రాలేదు. రాజ్‌భవన్ సిబ్బందే చేశారు. రాజ్‌భవన్ పోలీసులే పరేడ్ చేశారు. ప్రసంగాన్ని ప్రభుత్వం పంపలేదు. ప్రజలతో సంభాషించడానికి గవర్నర్‌కు ఉన్న అధికారాలను ఎవరూ కాదనలేరు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. నా ప్రసంగంలో రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని ఐటీ, ఫార్మా, పారిశ్రామికరంగ పురోగతిని, రైతుల కృషిని, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలను ప్రశంసించా. ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు. నిర్మాణాత్మక సూచనలు చేశా. ఆ కేటగిరీకి ఫిట్ కారనే ఆమోదించ లేదు అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదన్న సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి, శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో సాంప్రదాయంగా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. తప్పుడు సంప్రదాయాలకు మనం ఆద్యం కాకూడదు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించాలని నేనేమీ కోరుకోవడం లేదు. గవర్నర్ కోటాలో సంఘసేవ కేటగిరీ కింద పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం సిఫారసు చేస్తే, ఆయన ఆ కేటగిరీకి ఫిట్ కారని ఆమోదించలేదు. కౌన్సిల్ చైర్మన్ నియామకం జరిగే వరకు తాత్కాలికంగా ప్రొటెం చైర్మన్‌ను ఎన్నుకోవాలనే నిబంధనలున్నాయి. చైర్మన్ ఎన్నిక జరపకుండా వరసగా రెండోసారి ప్రొటెం చైర్మన్‌ను నియమించడం సబబు కాదని అభ్యంతరం వ్యక్తం చేశా. పద్ధతిని అనుసరించాలని కోరా. ప్రభుత్వం చేసే ప్రతి సిఫారసును ఆమోదించాలని లేదు. నిబంధనల మేరకు ఉన్నాయా లేవా చూడాల్సి ఉంటుంది. చైర్మన్‌ను నియమించినందుకు ప్రభుత్వానికి అభినందనలు. గవర్నర్, సీఎం చర్చలతో రాష్ట్రానికి మేలు రాష్ట్ర ప్రజలు, ఎన్నికైన ప్రభుత్వం మధ్య గవర్నర్ వారధి. వారధి దెబ్బతింటే సమస్యే. సీఎంతో చర్చిస్తే మంచి ఐడియాలు వస్తాయి. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు రాష్ట్రానికి మేలు చేస్తాయి. రాజ్‌భవన్ బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నా రాజకీయ నేపథ్యం చూసి ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల ప్రతినిధి బృందాలు కలవడానికి వస్తే అవకాశం ఇచ్చా. ఎవరికీ పెద్దపీట వేయలేదు. ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడలేదు. నైతిక బాధ్యత కలిగి ఉన్నా. నా వృత్తికి న్యాయం చేయాలన్న తపన నాలో ఉంటుంది. రాజకీయాలు చేయడం లేదు. నేను స్నేహశీలిని.. బెంగాల్ గవర్నర్ జగదీశ్ ధన్కర్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనడం కూడా సరికాదు. నాకు స్వీయ వ్యక్తిత్వం, అర్హతలు, తెలివితేటలు, సమర్థత ఉన్నాయి. నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటా. సహకరిస్తా. నాకు అ హంభావం లేదు. వివాదాలకు దూరంగా ఉంటా. ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇవ్వగలను నా సలహాలను ప్రభుత్వం పాటించడం లేదని నేనడం లేదు. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో చికిత్స వ్యయాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి లేఖ రాశా. సలహా మాత్రమే ఇవ్వగలను. బలవంతం చేయలేదు. ప్రభుత్వం అమలు చేస్తే ఆనందం. చేయకున్నా బాధలేదు. మహిళలు శక్తివంతులు..నేను శక్తివంతురాలిని సమ్మక్క–సారక్క జాతర కోసం 300 కి.మీ.లు రోడ్డు ద్వారా ప్రయాణించాల్సి వచ్చింది. కారణం మీకు తెలుసు. (హెలికాప్టర్ కావాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదనే ఆరోపణలను పరోక్షంగా గుర్తు చేశారు) స్థానిక అధికారులు స్వాగతం పలకలేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీ రాలేదు. తమ చర్యలతో నన్ను కట్టడి చేయాలని ఎవరైనా అనుకుంటే సాధ్యం కాదని మహిళా దినోత్సవం రోజు చెప్పా. మహిళలు శక్తివంతులు. నేను శక్తివంతురాలిని. నన్నెవరూ కట్టడి చేయలేరు. ఉన్నత విద్యారంగానికి చాలా చేయాలి వర్సిటీలకు, ఉన్నత విద్యా రంగానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. బోధన, బోధనేతర సిబ్బంది పో స్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేస్తేనే నాణ్యమైన విద్య పిల్లలకు లభిస్తుంది. ప్రభుత్వానికి సల హా ఇవ్వగలను కానీ అమలు చేసే యంత్రాంగం నా దగ్గర లేదు. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు చాలా వెనకబడి ఉన్నాయి. తెలుగు నేర్చుకుంటున్నా.. తెలుగు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. తెలుగు చదువుతున్నా. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో నేర్చుకోవడానికి కావాల్సినంత సమయం దొరకడం లేదు. ప్రజా దర్బార్ ప్రభుత్వ వ్యతిరేకం కాదు గవర్నర్‌గా 4 గోడలకు పరిమితమై ఉండాలని నేను కోరుకోను. ప్రజలను కలుసుకోవడం నాకు ఇష్టం. కోవిడ్‌తో తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజాదర్బార్‌ను త్వరలో ప్రారంభించబోతున్నా. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రజలను కలుసుకోవడం నా నైజం. ఇందులో వివాదం ఏముంది? నేను ప్రజల నుంచి విన్నపాలు స్వీకరిస్తే ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది? పుదుచ్చేరిలో కూడా గ్రీవెన్స్ బాక్స్ పెట్టా. అక్కడి ప్రభుత్వం అభ్యంతరం తెలపలేదు. రాష్ట్రంలో నా జర్నీ చాలా బాగుంది రాష్ట్ర గవర్నర్‌గా రెండున్నరేళ్ల జర్నీ చాలా బాగుంది. ప్రజల గవర్నర్‌గా గుర్తింపు పొందా. ప్రజలను కలుసుకోవడం, వారి నుంచి సమస్యలను స్వీకరించి పరిష్కరించడం, ఆదివాసి గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం, పేద విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లను దాతల నుంచి సమీకరించి పంపిణీ చేయడం, రాజ్‌భవన్ సిబ్బందికి భోజనం కార్యక్రమాన్ని అమలు చేయడం, రాజ్‌భవన్ పాఠశాల, పూర్వ విద్యార్థుల సహకారంతో వర్సిటీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో ప్రయాణం సంతృప్తికరంగా సాగుతోంది. -
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు పెరిగినా జోన్లు నాలుగే
సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో ఉద్యోగుల జోనల్ వ్యవస్థ పైన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఉన్నత విద్యా సంస్థల పరిధిపైనా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం ఉద్యోగుల జోనల్ వ్యవస్థ ఎలా ఉంది, కొత్త వ్యవస్థ ఎలా ఉండాలో ప్రతిపాదించారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. వీటికి రెండు మల్టీ జోన్లు (1, 2), వాటి పరిధిలో నాలుగు జోన్లు (1, 2, 3, 4) ఉన్నాయి. మల్టీ జోన్–1 పరిధిలోని జోన్–1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, జోన్–2లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. మల్టీ జోన్–2 పరిధిలోని జోన్–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–4లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థ ఇలా.. పునర్వ్యవస్థీకరణ అనంతరం 26 జిల్లాలనూ అదే క్రమంలో విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న విధంగానే రెండు మల్టీ జోన్లు, నాలుగు జోన్లనే ప్రతిపాదించారు. కానీ వాటి పరిధిలో కొత్త జిల్లాలు అదనంగా వస్తాయి. ఒక్కో జోన్లో 5 నుంచి 7 జిల్లాలు వస్తాయి. మల్టీ జోన్–1 పరిధిలోని జోన్–1లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, జోన్–2లో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు రానున్నాయి. మల్టీ జోన్–2 పరిధిలోని జోన్–3లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–4లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పడుతున్న శ్రీ బాలాజీ జిల్లాలో 17 మండలాలు నెల్లూరులో (జోన్–3), 18 మండలాలు చిత్తూరులో (జోన్–4) ఉండటంతో దాన్ని ఏ జోన్లో ఉంచాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్ దానికి సమాన స్థాయి ఉద్యోగుల బదిలీలు జిల్లా పరిధిలోనే ఉండడంతో వారు పూర్తిగా జోనల్ వ్యవస్థలోకి వస్తారు. జూనియర్ అసిస్టెంట్ కంటే పై స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ల వరకు జోనల్ స్థాయి పరిధిలో ఉంటారు. సూపరింటెండెంట్ ఆ పై క్యాడర్ ఉద్యోగులంతా మల్టీ జోన్లోకి వస్తారు. అందువల్ల విభజనలో వారిపై ప్రభావం ఉండదు. ఉన్నత విద్యా సంస్థల పరిధి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. జిల్లాల విభజన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలను ప్రతిపాదించారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు ఉండాలని ప్రతిపాదించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రకాశం జిల్లా (ఆంధ్రా వర్సిటీ రీజియన్) పరిధిలోని 5 మండలాలు, నెల్లూరు జిల్లా (వెంకటేశ్వర వర్సిటీ రీజియన్) పరిధిలోని 30 మండలాలు ఉండడంతో దాన్ని ఏ రీజియన్ పరిధిలో చేర్చాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. -
ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని.. తెలుగులో ట్వీట్ చేశారు. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) April 13, 2021 ఆనందాల హరివిల్లు ఉగాది: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ అన్ని వర్గాలకూ శాంతి, సామరస్యం, ఆనందాన్ని తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆయన సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు అయిన ఉగాది పండుగ ప్రతి ఇంటా శుభం కలుగజేయాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ ఉగాది పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక వచ్చేసింది ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి! -
ఉగాది పండుగను ఇలా జరుపుకోవాలి!
ఉగాది అంటే అచ్చ తెలుగు సంవత్సరాది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం ఆచారం. ఉగాది పచ్చడిని శాస్త్రాలు ‘నింబ కుసుమ భక్షణం’ అని, ‘అశోకకళికా ప్రాశనం’అనీ వ్యవహరించాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనం హేమంత రుతువు నుంచి వసంత రుతువులోకి అడుగు పెడతాం. అంటే ఋతుమార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి పిందెలతో తయారు చేస్తారు. ఒకప్పుడు అశోక చిగుళ్ళు కూడా వేసేవారట. ఇప్పుడంటే మనం ఉగాది రోజున మొక్కుబడిగా తిని వదిలేస్తున్నాం కానీ, పాతరోజుల్లో అందరూ ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినేవాళ్లని పెద్దలు చెబుతుంటారు. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని నొక్కి చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సరైన ఆహారానికి ఉండే సంబంధాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మకుంభ దానంవల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఉగాది పంచాంగ శ్రవణం రోజువారీ వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పురస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగం చూడటమే పరిపాటి. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు వాడుకలో ఉంటుంది. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండ బోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి... లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంచాంగమే ప్రధాన వనరుగా ఉండేది. అది అందరి వద్దా ఉండేది కాదు. అందువల్ల ఉగాది రోజున ఆలయాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో పండితులు ఉగాది పంచాంగాన్ని చదివి ఫలితాలు చెప్పేవారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. ఎలా జరుపుకోవాలి? తెల్లవారక ముందే ఇల్లు శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. తైలాభ్యంగన స్నానం: ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వులనూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయానికి ముందు కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని మూడు సార్లయినా ఉచ్చరించాలి. నూతన వస్త్ర ధారణ: స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టుకోవాలి. లేకపోతే ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అంతేకానీ చిరిగిన లేదా విడిచిన వస్త్రాలను ధరించడం మంచిది కాదని శాస్త్రోక్తి. అనంతరం పూజామందిరంలో ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అనే శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలి. కొత్తసంవత్సరానికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. దేవతార్చన, నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే ! నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !! నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!! అంటూ బ్రహ్మదేవుని ప్రార్థించడం శుభ ఫలితాలనిస్తుంది. ఉగాది రోజున ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు చేకూరతాయని పెద్దల మాట. అవకాశం ఉన్నవారు ఈరోజున చలివేంద్రాన్ని స్థాపించాలి. మూగ జీవాలకు నీరు అందే ఏర్పాటు చేయాలి. పేదలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చాలి. దాంతో వారికి కడుపు, మనకు గుండె నిండుతాయి. బహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.కాబట్టి ఈ రోజు చేసే ఏ మంచి పని అయినా పది కాలాలపాటు నిలుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే పిల్లల చేత తెలుగు పద్యాలు చదివించడం లేదా వారితో ఏదైనా మంచి సంకల్పాన్ని తీసుకుని దానిని ఉగాదితో ఆరంభించేలా చేయడం చేయాలి. వారికే కాదు, సంకల్పం తీసుకోవడం పెద్దలకూ అవసరమే! ప్లవ అంటే... ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే 60 తెలుగు సంవత్సరాలకూ ప్రత్యేకమైన అర్థాలున్నాయి. ఆ పేర్లు ఆ సంవత్సరంలో జరగబోయే ఫలితాన్ని అన్యాపదేశంగా చెబుతుంటాయి. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టే కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలలో చీకటిని నింపిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. నేడు మనం అడుగు పెడుతున్న సంవత్సరం ప్లవ. అంటే తెప్ప లేదా చిన్న నావ అని అర్థం. అలాగే దాటించే సాధనమనీ, తేలికగా ఉండేదనీ, నీటి వనరులు సమృద్ధిగా లభించేదనీ... రకరకాల అర్థాలున్నాయి. మనం మాత్రం ఈ సంవత్సరం నీటివనరులు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండాలనీ, కష్టాల నుంచి తేలికగా అందరినీ ఒడ్డుకు చేర్చాలనీ అర్థాలు తీసుకుందాం. అందరికీ హాయిగా ఆనందంగా ఈ సంవత్సరం గడిచిపోవాలని కోరుకుందాం. పండగ వేళ... తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త బట్టలు.. ఇల్లంతా పిల్లలతో బంధువులతో కళకళలాడుతుంటుంది... ఉగాది నాడు ఇంటిని కొంచెం విలక్షణంగా సద్దుకుంటే.. ఇంటికి కూడా పండుగ అలంకరణ చేసి, సంబరాలకు సిద్ధం చేసినట్లే.. ఇప్పుడు మామిడి ఆకులు, కాయలు, మల్లెలు విరివిగా వస్తుంటాయి.. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం తెలిసిందే. మామిడాకులు రాత్రి మరింత మెరుస్తుండేలా బంగారు రంగులో ఉండే ఎల్ఈడి బల్బులతో అలంకరిస్తే సరి. సింహద్వారానికి ఉన్న తలుపు మీద మామిడి మల్లెపూలకు మరువం జత చేసి కట్టిన దండతో ఉగాది శుభాకాంక్షలు అని ఆ ఆకారంలో దండను అతికిస్తే, గుమ్మంలోకి ప్రవేశించగానే మల్లెల పరిమళాలు వెదజల్లుతాయి. వచ్చిన అతిథులకు ఎండ అలసట అంతా ఒక్కసారి తీసిపారేసినట్లు అవుతుంది. ఇక ఇంట్లో కుర్చీలు లేదా సోఫా సెట్‌కి మధ్యనే వేసే టీపాయ్ మీద పెద్ద పాత్ర ఉంచి, నిండుగా నీళ్లతో నింపి, గులాబీలు, చేమంతులతో అలంకరించి, నీటి మధ్యలో చిన్న పాత్ర ఉంచి అందులో సాంబ్రాణి పొగ వేసి పెడితే గది నిండా ధూపం నిండి, మనసుకి సంతోషంగా ఉంటుంది. సదాలోచనలు వస్తాయి. ఇంటిలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు, మల్లె మాలలు కూడా జత చేస్తే, ఎండ వేడిమిని ఇట్టే మరచిపోవచ్చు. ఉగాది పండుగ నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తింటాం. సాధారణంగా పిల్లలు ఈ పచ్చడి పేరు చెప్పగానే పారిపోతారు. అందుకే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో సాధ్యమైనంతవరకు చెరకు ముక్కలు, అరటి పండు ముక్కలు, బెల్లం ఎక్కువగా వేసి, వేపపూత, మామిడి ముక్కలు కొద్దిగా తగ్గిస్తే, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు. తయారుచేసిన పచ్చడిని మామూలు గ్లాసులలో కాకుండా, ఎర్రమట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులలో అందిస్తే, రుచిగా తాగటమే కాకుండా, సరదాగా ఇష్టపడుతూ తాగుతారు. పిల్లలు ఉదయాన్నే స్నానం చేయటానికి బద్దకిస్తారు. అందుకని వారితో.. ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తే నీకు చదువు బాగా వస్తుందనో లేదంటే వారికి ఇష్టమైన అంశంతో జత చేస్తే వారు చక్కగా తలంట్లు పోయించేసుకుంటారు. వీలైతే పిల్లల చేత ఏదో ఒక తెలుగు పుస్తకం చదివించటం మంచిది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఉగాదికి ‘తానా మహాకవి సమ్మేళనం - 21
వాషింగ్టన్: ఉగాది సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన రీతిలో ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో ‘తెలుగు మహాకవి సమ్మేళనం 21’ అనే కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. సాహిత్య వేదిక సమన్వయకర్త, శతశతక కవి, చిగురుమళ్లు శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితాగానంతో, విశిష్ట అతిధుల సందేశాలతో కొనసాగుతందుని తెలిపారు. ఈ అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని తెలియజేశారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒకే గొంతుగా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. -
పండుగైన తప్పదు మరీ..
విజయవాడ :కొత్త సంవత్సరాది ఉత్సవం.. ‘కోవిడ్’ ఆంక్షలతో కళ తప్పింది. కలిసికట్టుగా ఇంటిల్లిపాది సంబరంగా చేసుకోవాల్సిన పండుగ.. కలి‘విడి’గా చేసుకోవాల్సి వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీంతో జిల్లా ప్రజలు దాదాపు ఉగాది పండుగకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మాస్క్‌లు ధరించైనా ఉగాది పచ్చడిని చేసుకుని రుచి చూస్తున్నారు. విజయవాడ రామవరప్పాడులో మాస్క్‌లు ధరించి ముందస్తుగా ఉగాది పచ్చడిని రుచి చూస్తున్న యువతులను చిత్రంలో చూడొచ్చు. -
స్వస్థ ఉగాది కోసం
ఉగాది అనగానే లేత వేపపూత, కొత్త బెల్లం, చింత పులుపు, మిరియాల ఘాటు, వీటిని కలగలిపే కాసింత ఉప్పదనం ఇవి గుర్తుకొస్తాయి. ఇవాళ? టీవీలో వార్తలు, పేపర్లలో హెడ్‌లైన్స్ గుర్తుకు వస్తున్నాయి. సంతోషంగా ఉండాల్సిన ఉగాది సమయాన ఆందోళన కలిగించే కరోనా వ్యాప్తితో మెదడు చేదు చేసుకుంటున్నాం. ఇది మనిషిపై ప్రకృతి తిరుగుబాటు అనేవారినీ చూస్తున్నాం. ప్రకృతి సదా దయగానే ఉంటుంది. అది ఒక్కోసారి మన పట్ల ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించినప్పుడు మనం వినమ్రం కావాలి. అది ఏమి చెబుతున్నదో చెవి ఒగ్గి వినాలి. దానిని శాంతపరిచేలా ప్రవర్తించాలి. రానున్నది శార్వరి నామ సంవత్సరం. శార్వరి అనే మాటకు పసుపు పూసుకున్న స్త్రీ అనే అర్థం ఉంది. ‘రాత్రి’ అనే అర్థం కూడా ఉంది. కరోనా అనే కాళరాత్రి గడిచి మన జీవితాలు శుభకరమైన పసుపుదనంతో నిండాలని అభిలషిద్దాం కరోనా కర్ఫ్యూ తెలుగు సంవత్సరాది సంబరాలను దూరం చేసిందని బాధపడేవాళ్ల కంటే.. అందరం బాగుంటేనే కదా పండగ.. ఏరోకారోజే కాదు.. భవిష్యత్ తరాలూ బాగుండాలి.. వాళ్లూ ఇలాంటి పండగలు జరుపుకోవాలి.. అంటే మనం బాధ్యతగా ప్రవర్తించాలి.. అని ఆలోచించేవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు.. ఆ కర్తవ్యానికి సంసిద్ధమూ అవుతున్నారు. ఏమో ఇప్పటిదాకా మనం చేసిన వినాశాన్ని ఎవరికి వారుగా ఆత్మావలోకనం చేసుకునే అవకాశం ఇస్తుందేమో ఈ పండగ? స్వీకరిద్దాం.. ప్రకృతి నియమాన్ని పాటిద్దాం.. అంటున్నారు. దీనికీ ముందడుగు వేసింది మహిళలే. కొంతమంది అభిప్రాయాలను ఇక్కడ ఇస్తున్నాం.. సూక్షా్మన్ని గ్రహిద్దాం ప్రకృతితో మమైకమై బతకడమే పండగ పరమార్థం. ఈ నిజాన్ని గ్రహించక మనుషులం ఈ సృష్టిలోని ఇతర జీవులకు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశాం. వాటి తరపున ప్రకృతి మన మీద కన్నెర్ర జేస్తోంది. కరోనా పేరుతో పండగలు, పబ్బాలు, సంతోషాలు, సంబరాలకు మనల్ని దూరం చేస్తోంది. ఇప్పటికైనా ఈ ప్రకృతి విలయంలోని సూక్షా్మన్ని గ్రహిద్దాం. అహాన్ని వదిలేద్దాం. ప్రకృతి చూపిస్తున్న స్పేసే మనకు మహా ప్రసాదం. అత్యాశను విడనాడదాం. పంచభూతాల్లో ఇతర ప్రాణికోటి వాటానూ గౌరవిద్దాం. అణ్వస్త్రాలు, ఆక్రమణలతో ఇప్పటిదాకా చేసిన వికృతాలకు ఫుల్స్టాప్ పెట్టి... సంజె వెలుగులను విరజిమ్మే శార్వరీని స్వాగతించుకుందాం. అందరం కలిసి పాలుపంచుకునే సందర్భాన్ని ఈ ఉగాది ఇవ్వట్లేదనే బాధ వద్దు.. బలవంతంగా కలుద్దామనే ఆలోచనా వద్దు. సద్దుమణగాల్సిన సమస్యను పెంచి పోషించనూ వద్దు. అందరికీ హితంచేసే ఈ ప్రవర్తనే ఉగాది పర్వదినాన ప్రకృతికి మనం సమర్పిస్తున్న వందనం. సర్వభూత సమానత్వమే మనం నేర్చుకోవాల్సిన పాఠం. – డాక్టర్ సరోజ వింజామర, ఉపాధ్యాయిని ప్రతిజ్ఞ చేద్దాం.. పండగ జరుపుకోవడం కన్నా ముఖ్యమైనది ఈ క్లిష్ట పరిస్థితి నుంచి మన దేశాన్ని రక్షించుకోవడం. ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని పాటించి, నిజమైన దేశభక్తి ఇప్పుడు చూపిద్దాం. అన్ని రకాలుగా ఇది చాలా క్లిష్ట సమయం. అందుకే దేన్నీ దుబారా చేయొద్దనుకుంటున్నాం. మామిడి ఆకులు, వేప కొమ్మలు.. ఇంట్లో ఉన్న సూక్ష్మజీవులను పారదోలుతాయి కాబట్టి.. గుమ్మాలకు, ద్వారాలకు వాటిని కట్టి.. ఉగాది పచ్చడొక్కటి చేసుకోవాలనుకుంటున్నాం. అదీ ఔషధ విలువలున్నదే కాబట్టి. ఇక లాక్డౌన్ ఇచ్చిన సెలవులను వృధా పోనివ్వకుండా మంచి పనులకు వెచ్చించాలనుకుంటున్నాం. పుస్తకాలు చదవటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేస్తూ. అంతేకాదు ఈ కష్టసమయాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తామని మా కుటుంబ సభ్యులమంతా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరం ఎవరికి వారు ఇలా ప్రతిజ్ఞ చేసి ప్రభుత్వానికి సహకరిస్తే ఈ విపత్తు నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. మంచి రోజులకు మించిన పండగలు ఉంటాయా? – నిశీద కులకర్ణి, గవర్నమెంట్ టీచర్, నిజామాబాద్ -
సందిగ్ధ కాలంలో ‘శార్వరి’
తీపి చేదుల సమ్మిశ్రమంగా సాగిన వికారికి వీడ్కోలు పలికి, కాలయవనికపైకి సరికొత్తగా అరుదెంచే శార్వరిని స్వాగతించే రోజిది. సగటు మనిషి ఆశాజీవి. అందుకే నిష్క్రమిస్తున్న సంవత్సరం సుఖ దుఃఖాల, సంతోషవిషాదాల, మంచిచెడ్డల సంగమంగా సాగిపోయినా రాబోయే కాలమంతా తన జీవితాన్ని సుఖమయం చేస్తుందని, చుట్టుముట్టిన కష్టాలన్నీ మబ్బు వీడినట్టు మాయమవుతాయని బలంగా విశ్వసిస్తాడు. కానీ ఆ విశ్వాసాన్ని చెదరగొట్టేలా ఈసారి కరోనా మహమ్మారి పిలవని పేరంటంలా మన ముంగిట్లో వాలింది. పర్యవసానంగా చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా దేశ వ్యాప్త లాక్డౌన్ అమలవుతోంది. కనుకనే ఈ శార్వరికి ఎదురేగి స్వాగతం పలకడానికి అవసరమైన ఉత్సాహోద్వేగాలు కానరావడం లేదు. ఏం జరుగుతుందో, మున్ముందు ఎలాంటి పరిస్థితులుంటాయోనన్న సందిగ్ధ వాతావరణమే రాజ్యమేలుతోంది. ఉగాదికి వచ్చే కొత్త పంచాంగంలో ముందుగా రాశిఫలాలను తిరగేయడం సర్వసాధారణం. తమ రాశికి రాజపూజ్యమే నికరంగా రాసి పెట్టి వుండాలని, అవమానాలుండొద్దని, ఉన్నా అవి నామమాత్రం కావాలని అందరూ ఆశిస్తారు. ఆ తర్వాతే పంటలెలా పండుతాయో, ఈతిబాధల సంగతేమిటో, ఏయే విపత్తులు విరుచుకుపడతాయో వాకబు చేసుకుంటారు. అలాగని ఆ ఫలితాల చుట్టూతా సంచరించరు. భగవంతుడి సృష్టిలో అన్నీ సుదినాలు, శుభ ఘడియలేనని, మన నుదుటి రాతనుబట్టే శుభాశుభాలు వచ్చిపోతుంటాయని సరి పెట్టుకుని అడుగు ముందుకేస్తారు. ఒకరకంగా ఇది మంచిదే. ఈ వైఖరి దేన్నయినా నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది. ఉగాది రుతువుల రాణి వసంత రుతువును వెంటేసుకుని వస్తుంది. అందుకే అప్పటికల్లా ప్రకృతి సమస్తం కొత్త కాంతిని సింగారించుకుంటుంది. ఏ చెట్టుచూసినా ఆకుపచ్చని లేత చివుళ్లతో శోభాయ మానంగా దర్శనమిస్తుంది. దీన్నంతటినీ చూసి కోయిల హుషారుగా గొంతెత్తుతుంది. రామచిలుక తీపి పలుకుల్ని నోట నింపుకుంటుంది. ఉగాది పండుగంటేనే షడ్రుచుల సమ్మిళితమైన పచ్చడి. జీవన గమనం సమస్తం కష్టసుఖాల కలబోతని, వాటన్నిటినీ సమంగా స్వీకరించి, సంయమనంతో వ్యవహరించాలని చెప్పడమే ఈ షడ్రుచుల వెనకుండే తాత్వికత. వెలుతురు కోసం ఎప్పుడూ వెంప ర్లాడి, చీకటి ముసిరిన వేళ చలనరహితంగా మారే రకం కాదు మనిషి. ఎదురయ్యే సవాళ్లను ఛేదిస్తూ, విపత్తులొచ్చినప్పుడు దృఢ చిత్తంతో ఎదుర్కొని మునుముందుకు సాగడమే మనిషికి తెలుసు. ఉగాది పచ్చడిలోని రుచులన్నీ నిత్య జీవనంలో మనిషికి తారసపడే రకరకాల అనుభవాలనూ, అను భూతులనూ గుర్తుకుతెచ్చేవే. అదే సమయంలో పచ్చడిలో కలగలిసి భిన్న రుచులందించే పదా ర్థాలన్నీ శరీరానికి మేలు చేసే ఔషధాలే. ప్రపంచంలో ఎన్ని సంస్కృతులున్నాయో అన్ని రకాల ఉగా దులున్నాయి. జనవరి 1తో మొదలై డిసెంబర్ 31తో ముగిసే గ్రిగేరియన్ కేలండర్ 1582 నుంచి మొదలుకాగా, ఇరాన్‌లాంటి ఒకటి రెండు దేశాలు తప్ప దాదాపు ప్రపంచదేశాలన్నీ దాన్నే ఉపయోగి స్తున్నాయి. కానీ నిత్య వ్యవహారికంలో ఆ కేలండర్‌ను అనుసరించే భిన్న దేశాలు, భిన్న ప్రాంతాల ప్రజలు తమ సంస్కృతితో ముడిపడి, రకరకాల పేర్లతో వుండే ఉగాదులను జరుపుకుంటూనే వుంటారు. భూగోళం అంతటా పగలూ, రాత్రీ సమానంగా వుండే ఈక్వినాక్స్(విషువత్తు) సమ యంలో(అది సాధారణంగా మార్చి 20 లేదా 21న వస్తుంది) ఇరాన్ ప్రజలు తమ కొత్త సంవ త్సరారంభాన్ని జరుపుకుంటారు. తమ పనులన్నిటికీ ఆ కేలండర్నే ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వుండే జోరాస్ట్రియన్లదీ అదే తోవ. రెండు తెలుగు రాష్ట్రాలూ, కర్ణాటకల్లో ఉగాదిగా పిలిచే ఈ పర్వదినం...కశ్మీర్లో నవ్రే, మహారాష్ట్రలో గుడిపడ్వా, సింధీలో చేతిచాంద్ పేరిట వేర్వేరు నెలల్లో వస్తుంది. తమిళ, పంజాబీ, ఒడియా, మలయాళీ, నేపాలీ, సింహళీ ఉగాదులు ఏప్రిల్‌లో వస్తాయి. గుజరాతీలకు దీపావళి తర్వాత నూతన సంవత్సరం వస్తుంది. టిబెటిన్లు తమ ఉగాది లోసర్‌ను జన వరి–మార్చి మధ్య జరుపుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతా ల్లోనూ, ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లోనూ నివసించే కోట్లాది తెలుగువారు ఉగాది జరుపుకుంటారు. కష్టసుఖాలతో నిమిత్తం లేకుండా ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం మనకు రివాజు. కానీ ఈసారి దేశంపై పంజా విసిరిన కరోనా మహమ్మారి ఆ ఆనందోత్సాహాలపై నీళ్లు జల్లింది. అనేక దేశాలతోపాటు మన దేశం కూడా గడప దాటాలంటే భయంతో వణుకుతోంది. ఆందోళనలు మిన్నంటినప్పుడో, అల్లర్లు చెలరేగినప్పుడో, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడో విధించే కర్ఫ్యూ...అంతా సవ్యంగా వున్నా వచ్చిపడింది. కాకపోతే దీన్ని లాక్డౌన్ అంటున్నారు. 21 రోజు లపాటు ఇదిలాగే కొనసాగుతుందని మంగళవారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వింత పరిస్థితి ప్రజలకూ కొత్తే. పాలకులకూ కొత్తే. అందుకే దీన్ని అందరితో తు.చ. తప్పకుండా పాటింపజేయడం ఎలాగన్న విచికిత్సలో పాలకులుంటే...తమ చుట్టు పట్ల జాడ కనబడని వైరస్ కోసం ఇలా దిగ్బంధించడమేమిటన్న ప్రశ్న పౌరుల్లో ఉంది. కానీ చైనా, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల అనుభవాలు మన కళ్లముందే వున్నాయి. పై నుంచి కింది వరకూ ఏకస్వామ్య వ్యవస్థ పకడ్బందీగా రాజ్యమేలే చైనాలో ఎంత కఠినంగా వ్యవహరించినా అదుపు చేయ డానికి 40 రోజులకు పైగా పట్టింది. ఇటలీ, స్పెయిన్లలో పాలకులు పొంచివున్న పెనుముప్పును సకాలంలో అంచనా వేయకపోవడం వల్లా, ఆ తర్వాతైనా పౌరులతో కఠినంగా పాటింపజేయక పోవడం వల్లా దారుణమైన ఫలితాలు చవిచూడాల్సివచ్చింది. ఒక్క రోగి వేలమందికి ఈ వ్యాధిని అంటిస్తాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారిపై హోరాహోరీగా పోరాడుతున్న గడ్డుకాలంలో ప్రవేశిస్తున్న ఈ శార్వరి మనందరి సమష్టి పోరాటానికి నైతిక ధృతిని, ద్యుతిని అందిస్తుందని ఆశిద్దాం. -
ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ
విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయతలపెట్టిన ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలో ఈ నెల 25న ఉగాది రోజునే చేయనున్నట్టు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉగాది రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగదని భావించినప్పటికీ ఎన్నికలు వాయిదా నేపథ్యంలో సుప్రీం కోర్టు కోడ్ అమలును ఎత్తివేయాలంటూ తీర్పునివ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయటంతో రాష్ట్రంలో జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు అవకాశం ఉంటుందన్నారు. మరల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మిన్నగా అధిక స్థానాలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిలా కాకుండా లంచగొండితనానికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గంలో రేపటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నగరంలో మంచి నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టామని పలు ప్రాంతాల్లో వేధిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కుటిల రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు కుటిల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రతిపక్ష నేత చంద్రబాబు నిలుస్తారని ఎమ్మెల్యే కోలగట్ల ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడు వెన్నుపోట్లు పొడవటం, ప్రజలను మోసగించే ధోరణిలో నడుచుకుంటారన్నారు. ప్రజల ఆమోదంతో ఏనాడూ గెలిచిన సందర్భాలు లేవన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో జత కట్టి ఎన్నికల్లో పని చేసిన చంద్రబాబు తీరును చూసి సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆ పార్టీ అధినేతపై విశ్వాసం కోల్పోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న కాలంలో టీడీపీకి పుట్టగతులుండవన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను తన వ్యక్తిగత పరిచయాలు, సామాజిక వర్గాల పరిచయాలను అడ్డం పెట్టుకుని వాయిదా వేయించటం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. చంద్రబాబు తన దుర్నీతితో ఎన్నికలు వాయిదా వేయించాగలిగారే తప్పా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై పూర్తి విశ్వాసంతో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్ రెడ్డి గురుమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి, సీనియర్ సిటిజన్ విభాగం నాయకులు కోలగట్ల కృష్ణారావు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, సీనియర్ మాజీ కౌన్సిలర్ ఎస్‌వివి.రాజేష్, నగర యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పార్టీ నాయకులు డాక్టర్ విఎస్.ప్రసాద్, కనకల ప్రసాదరావు, మామిడి అప్పలనాయుడు, సత్తరపు శంకరరావు, జివి.రంగారావు, పిన్నింటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది రోజు ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవరోధం తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో 26 లక్షల మందికి నివాస స్థల పట్టాలను కన్వేయన్స్ డీడ్స్ (విక్రయ దస్తావేజుల) రూపంలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సంక్షేమం ఇక చకచకా.. నిధులు విడుదల - ఇళ్ల స్థలాల కోసం భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు, ప్లాట్ల అభివృద్ధి కోసం రెవెన్యూ శాఖ తాజాగా బుధవారం రూ.1,400 కోట్లు విడుదల చేసింది. - రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పేరుతో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి జీఓ జారీ చేశారు. - ఈ నిధుల్లో కృష్ణాకు రూ.450 కోట్లు, గుంటూరుకు రూ.450 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాకు రూ.200 కోట్లు, పశ్చిమ గోదావరికి రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.5000 కోట్లు విడుదల చేసింది. - త్వరితగతిన ఫ్లాటింగ్, పట్టాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులు జిల్లాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. -
ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్ల పట్టాలు
ప్రతిపేదవాడికి సొంతింటికలను నిజం చేసే దిశగా ప్రభుత్వం బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఉగాది రోజున 26.6 లక్షల ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం.. వచ్చే నాలుగేళ్లలో 30లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ రంగంలో కొత్త చరిత్రను సృష్టించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సమాయత్తమైంది. 2024 నాటికి ఈ కలను సాకారం చేసేదిశగా అడుగులేస్తోంది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడిస్తున్న ఇళ్లపట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిఏటా నిర్మించాల్సిన లక్ష్యాలపైనా చర్చించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, వాటినుంచి ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలను సీఎం వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా ఇంకా ఎన్ని ఇళ్లు రాష్ట్రానికి మంజూరు అవడానికి ఆస్కారం ఉందన్న అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేందుకు ఆస్కారం ఉన్న నిధులు, అదిపోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమన్న దానిపై చర్చించారు. మొత్తం మీద ఈ ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వనున్నామని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహా క్రతువులో 45 వేల మంది.. ఇప్పుడు పట్టాలు పొందుతున్న పేదలతోపాటు, సొంతంగా ఇళ్లస్థలాలు ఉన్న పేదలకూ ఇళ్లు నిర్మిస్తామని, మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోనే దాదాపు 19.3 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికలు వేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గృహనిర్మాణ శాఖలో ఉన్న 4,500 మంది ఇంజనీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియామకం అయిన సిబ్బందిలో 45 వేల మంది కూడా 30 లక్షల ఇళ్ల నిర్మాణ క్రతువులో భాగస్వాములు అవుతారని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 45వేల మంది సిబ్బందితో ఈ మహాక్రతువును నిర్వహిస్తామని చెప్పారు. నాణ్యంగా.. అందంగా.. ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డిజైన్‌లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నిర్మాణం అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. బెడ్రూం, కిచెన్, వరండా, టాయిలెట్ ఉండేలా డిజైన్ రూపొందించారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటిపై రూ.25వేల రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడాలని, మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం అధికారులకు తెలిపారు. అత్యవసరాలకు ఈ డబ్బు పేదవాడికి చాలా మేలు చేస్తుందని, అధిక వడ్డీలు చెల్లిస్తూ ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదని సీఎం అన్నారు. పేదలకు కడుతున్న కాలనీల్లో చెట్లు నాటాలని, డ్రైనేజీ ఏర్పాటుపైనా సరైన ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కరెంటు, తాగునీటి వసతి కూడా కల్పించాలన్నారు. -
'35వేల మందిని అర్హులుగా గుర్తించాము'
సాక్షి, విజయవాడ : ఉగాది నాటికి అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కాగా దీని కింద ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలో 35 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న వసతిదీవెన ద్వారా రూ. 10వేలు విద్యార్థుల ఖాతాలో జమయ్యాయని వెల్లడించారు. విద్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్లాలనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు బస్సు యాత్రలు చేపడుతున్నారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. -
దమ్మపేటలో తల తోరణం
దమ్మపేట: దమ్మపేటలో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆనవాయితీని నేటి తరం యువకులు కొనసాగిస్తున్నారు. ప్రతి తెలుగు సంవత్సరాది (ఉగాది) రోజు రాత్రి దమ్మపేట ప్రారంభంలో తలతోరణం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. దశాబ్ధాల క్రితం స్థానిక మున్నూరుకాపు రైతు పెద్దలు ఈ ఆనవాయితీకి అంకురార్పణ చేశారు. తర్వాత కాలంలో పెద్దలు చాలా మంది కాలం చేశారు. దీంతో నాడు పెద్దలు చేపట్టిన ఆనవాయితీని ఆ సామాజికవర్గానికి చెందిన యువకులు నేటికి కొనసాగిస్తున్నారు. ఉగాది తర్వాత రోజు నుంచి ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు కాలినడకన భద్రాచలం రాములోరి కళ్యాణానికి వెళ్తుంటారు. వారికి దమ్మపేటలో స్వాగతం పలికేందుకు నాడు పెద్దలు శ్రీకారం చుట్టిన ఆనవాయితీని నేటికి తాము కొనసాగిస్తున్నామని ఆ సంఘం నాయకుడు పగడాల రాంబాబు తెలిపారు. ఇది తమ తర్వాత తరాలు కూడా కొనసాగిస్తాయని ఆయన తెలిపారు.కార్యక్రమంలో యువకులు చిన్నశెట్టి గోపి, రమేష్, అప్పారావు,శశిధర్, భాస్కర్, జంగాల చిన్నపుల్లారావు, సత్యన్నారాయణ, రామిశెట్టి పుల్లారావు, వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ జాతకంలో బ్రహ్మయోగం
రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. జ్యోతిష్యులు.. ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థుల జాతకాలను పరిశీలిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా పంచాంగాల రచనతోపాటు ఆయా అభ్యర్థుల భవిష్యత్తును కూడా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతిష్యంలో విశేష అనుభవం ఉన్న ములుగు రామలింగేశ్వర వరప్రసాదు ఈ సందర్భంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జాతకం ఎన్నికల ఫలితాలకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి జాతకంలో శక్తిమంతమైన ‘బ్రహ్మయోగం’ ఉందని ఆయన అన్నారు. జగన్ జన్మలగ్నం కన్యాలగ్నం అనీ, నక్షత్రం ఆరుద్ర అనీ, రాశి మిథునరాశి అనీ దరిమిలా ఆయన జాతకంలో ప్రబలమైనటువంటి గజకేసరి యోగం కూడా ఉందని ఆయన తెలిపారు. 30.04.2019 నాటికి శనిమహర్దశ అయిపోయి, బుధమహర్దశ వస్తుందనీ ఆయన చెప్పారు. రాబోయేటటువంటి మహర్దశనాథుడు లగ్నదశమాధిపతి అయిన బుధుడు అతిక్రాంత యోగాన్ని ఇవ్వటం వలన జాతకునికి విశేషరాజయోగం సంప్రాప్తిస్తుందని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిమానం సంపాదించాలన్నా, రాజకీయ అధికారాన్ని సంపాదించాలన్నా శనిగ్రహ అనుగ్రహం చాలా అవసరం అని, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో శనేశ్చరుడు ఇచ్చే ఫలితాలే అత్యంత ప్రధానమైనవనీ, ఆ కోణంలో పరిశీలిస్తే జగన్మోహన్రెడ్డి జాతకంలో భాగ్యంలో శని బలవత్తరంగా ఉన్నాడని అన్నారు. శని పితృస్థానంలో ఉన్న కారణం చేత తండ్రికి సంబంధించిన గుణగణాలే అధికంగా సంప్రాప్తిస్తాయని జ్యోతిష్యశాస్త్ర ప్రామాణిక సూత్రమని, జాతకునికి అనేక రకాల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉండడంతోపాటు ఎక్కువగా కార్మిక, కర్షక, వృద్ధుల, యస్.సి., యస్.టి., బి.సి., మైనార్టీల సంక్షేమం, ఇతర వర్గాల పట్ల, మతాల పట్ల సమభావం ఉంటుందని ఆయన జాతకంలో ఉన్న గ్రహగతులు స్పష్టంగా సూచిస్తున్నాయని చెప్పారు. ‘‘కుజుడు ద్వితీయంలో ఉండి శనిగ్రహాన్ని చూస్తున్న కారణం చేత నిరుద్యోగులైన విద్యావంతుల గూర్చి, రైతుకూలీల గూర్చి, నిరుద్యోగ సమస్య గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, మొదటినుండి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడిగా నిలిచాడంటే అష్టమదృష్టితో కుజుడు, శనైశ్చరుడిని చూడటమే కారణం. ఏది ఏమైనా ఏ నాయకుడి మీదా పెట్టుకోని ఆశలు సీమాంధ్ర ప్రజలు శ్రీ వై.ఎస్.జగన్ మీద పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చగల గ్రహస్థితి ఆయన జాతకంలో ఉంది. జాతకంలో అనేకరకాల అగ్నిపరీక్షలు, అపనిందలు ఎదుర్కొనే పరిస్థితి, వాటిని అధిగమించగల బలవత్తరమైన గ్రహగతులు ఉన్నాయి’’ అని చెబుతూ, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డ ఈ యువనాయకుడు తండ్రి పేరుని నిలబెడతాడనీ ములుగు సిద్ధాంతి జోస్యం చెప్పారు. ఈ ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. -
నవయుగాది
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం ; న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాఃఅందరూ బాగుండాలి. కడుపు నిండా తినాలి. మంచి బట్టలు వేసుకోవాలి. చేతి నిండా పని ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. పాలకులు నిస్వార్థంగా ఉండాలి. న్యాయంగా పాలించాలి. కష్టంలో ఓదార్చాలి ప్రజాభీష్టాన్ని మన్నించాలి. ఇదే ఉగాది ఆకాంక్ష... మనం ఏ శుభకార్యానికైనా సరే, సంకల్పం చెప్పుకునేటప్పుడు స్వస్తిశ్రీ చాంద్రమానేన.... నామ సంవత్సరే అని చెప్పుకుంటాం. అంటే ఉగాది మనకు అత్యంత కీలకమైన పండుగ అన్నమాట. ఇది చాంద్రమానాన్ని బట్టి అంటే చంద్రుడి గమనానికి అనుగుణంగా గణించే సంవత్సరం అన్నమాట. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం విలంబి నామ సంవత్సరం కాగా నేటి నుంచి ‘వికారి’ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆరోగ్యాన్నిచ్చే అభ్యంగనం ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. ఉగాదినాడు పొద్దున్నే అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు శుభప్రదం ఈరోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదÆ . ఉగాది సంప్రదాయం ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి. పంచాంగం అంటే ... తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించేవారందరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ తప్పక పంచాంగం చూడాలి. ఆరు రుచులు... అనంతమైన అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి జీవునికి అంటే... మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. శుభారంభానికి ఉగాది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్నధిష్ఠించిందీ ఉగాదినా డేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. వైవిధ్యభరితం ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు బదులు నిమ్మరసం, మిరియాలకు మారుగా ఎండుకారం లేదా పచ్చిమిరప వాడుతున్నారు. కొందరు చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, గసగసాలు, సోంపు... ఇలా ఎవరి అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రోజున ఉపవాసం ఉండి బ్రహ్మదేవుని పూజించిన వారికి సంవత్సరమంతా సుఖసంతోషాలు లభిస్తాయని శాస్త్రోక్తి. వర్షాలు బాగా కురవాలని కోరుతూ వ్యవయసాయదారులు ఈ వేళ ఇంద్రుణ్ణి పూజించడం కొన్ని ప్రాంతాలలో కనిపించే ఆచారం. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, పంచాంగ శ్రవణం చేయడం వలన భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను వేదవిదుడైన బ్రాహ్మణునకు లేదా యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం గ్రహదోషాలు తొలగి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టడం సులభం అవుతుందని పెద్దల అనుభవం. – డి.వి.ఆర్. -
కీ ప్యాడ్ పై ఉగాది
ఆ పండగ అలాగే ఉందా? తెల్లవారి వేణ్ణీళ్ల స్నానాలు, కొత్త బట్టలు కట్టుకోవడాలు, పిల్లలు మామిడి పూతకు పరుగులు, వైరు బుట్ట అందుకుని ఇంటి పెద్ద తెచ్చే సరుకులు, వంటగదిలో ఏదో ఒక పిండి వంట, ఇంటిల్లిపాది ముఖాల కళ నిండిన చిరునవ్వు... అవి అలాగే ఉన్నాయా? భౌతికంగా ఉన్నాయా? అభౌతికంగా మారిపోయాయా? ఇవాళ పండుగలన్నీ సెల్‌ఫోన్ నుంచి సెల్‌ఫోన్ వరకే నడుస్తున్నాయా? మొదటి సందడి అక్కడే మొదలవుతుందా? గతంలో కనీసం ఫోన్ చేసి గొంతైనా వినిపించి అభినందనలు చెప్పేవారు. ఇవాళ ఒక వాట్సప్ మెసేజ్‌తో సరి. అదీ సొంతగా టైప్ చేయరు. వేరొకరు పంపిన సందేశాన్ని ఫార్వర్డ్ చేయడమే. అలా చేస్తే ప్రేమ వస్తుందా? బంధం ఏర్పడుతుందా? అభిమానం కొనసాగుతుందా? ఆప్యాయత గాఢమవుతుందా? కాని రోజులు మారాయి. మారిన రోజులతో మనమూ మారాలా... ఇలా మారక తప్పదు అని ఆలోచనలో పడాలా? నిజమైన పండగ ఉదయం సంధ్యతో గృహాప్రవేశం చేస్తుంది. కాని నెట్టింటి వసంతం మాత్రం అర్ధరాత్రి నుంచే బీప్‌బీప్ మని సందడి చేస్తుంది. నిద్ర లేచి వాట్సప్ తెరిస్తే కొత్త చింతపండు, తాజా వేపపువ్వు, బెల్లం, అప్పుడే కోసిన చెరకు, లేత మామిడి, లేలేత కొబ్బరి.. కొత్త మిరియాలు, ఉప్పుతో తయారైన ఉగాది ప్రసాదాన్ని (వాళ్లు పెట్టే మనం తినే వీలులేని) అందమైన ఇమేజ్‌తో సోషల్ మీడియా పంచుతూ ఉంటుంది. ఇక శుభకాంక్షల సందేశాలకైతే చెప్పనవసరమే లేదు. ముఖ పరిచయంలేని వ్యక్తులు కూడా ముఖపుస్తకం సాక్షిగా పండగ సందర్భంగా మన శుభాన్ని కోరుతూ వాల్ నింపేస్తారు. అందరం కలిసి జరుపుకోవాల్సిన పండుగను అందరూ సెల్ఫోన్లు ధరించి, తల అందులో కూరి విడివిడిగా జరుపుకుంటూ ఆ విశేషాలను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంటూ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాం! ఓ రోజు ముందు నుంచి మొదలయ్యే పండగ ఏర్పట్లు.. పండగ రోజు ఉత్సాహాన్ని రెండు క్షణాల్లో సెల్ఫీలుగా.. గుల్ఫీలుగా కుదించుకుంటున్నాం! నిజమే. వేగం సమయాన్ని మింగేస్తోంది. ఓపికనూ మిగల్చడం లేదు. ఆర్థికంగా ఎదగాలన్న పోటీ సెలవులనూ ఇవ్వడం లేదు. పిల్లలలకు దొరికినా ఆ హాలిడేను పబ్జీ, జీటీఏవైసీటీ వంటి గేమ్స్‌తో పండగ చేసుకుంటున్నారు. ఒకవేళ సెలవురోజున పండగ వచ్చినా..అలా ఇంట్లో కన్నా నెట్టింట్లోనే పండగ వాతావరణం కనిపిస్తోంది. మామిడికాయ పప్పు, పులిహోర, పూర్ణం బొబ్బట్లు, పరమాన్నపాయసాల పండగ వంటను స్విగ్గీ వండించి వడ్డిస్తోంది. సమష్టి శ్రమ.. సంతోషాలుఏ పండగైనా సమష్టి శ్రమకు సంకేతం. ఉత్పత్తి రంగంలో ఉన్న వారిని గౌరవించే ప్రక్రియ. ఒకరి మీద ఒకరం ఆధారపడుతూ.. అందరి ప్రాధాన్యంతో సమాజాన్ని సమతౌల్యం చేసే బాధ్యత. అన్నిటికీ మించి పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని అధిగమించకుండా.. దాన్ని అనుసరించే మన గమనం ఉండాలని చేసే సూచన. ప్రకృతితో మమేకమవుతూ అనుభూతి చెందాల్సిన ఈ ప్రాక్టికాలిటీ సాంకేతికత పుణ్యమాని వర్చువల్ ఎక్స్పీరియెన్స్కి పడిపోయింది. అందుకే షడ్రుచుల్లోని ఏ రుచీ మనకు తెలియట్లేదు. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోడం రావట్లేదు. పులుపు, కారం, చేదు లాంటి కష్టాలు, సమస్యలు, సంక్షభాలు ఎదురైతే చాలు తల్లడిల్లుతున్నాం.. తలకిందులవుతున్నాం. తీపిని ఎంత ఇష్టంగా తింటామో కంట నీరు రాకుండా కారాన్ని దిగమింగడమూ అంతే అవసరం. ఆ సమన్వయాన్నే నేర్పుతుంది ఉగాది. బోధపడాలంటే సోషల్ మీడియా ఫ్రేమ్‌లోంచి బయటపడాలి. పండగ అంటే షేరింగే.. అందరం కలిసి పంచుకునే సంతోషం. ఎఫ్బీ, ఇన్‌స్టాగ్రామ్స్, వాట్సప్‌లలో షేర్స్ కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చేది. అందరికీ అందరం అనే భరోసానిచ్చేది. సమాజాన్ని మానవహారంగా మలిచేది. -
కాల స్వరూపం అమోఘం
తెలుగు వారి నూతన సంవత్సరాన్ని శుభకామనలతో, కాలస్వరూపుడైన భగవంతుని ఆరాధనతో పవిత్రంగా ఆరంభించడం సంప్రదాయమని, పంచాంగం చూడటమనేది పెద్దల చాదస్తమని కొట్టి పారేయడం సరి కాదనీ, కాలగణన వెనక ఎంతో నిశితమైన పరిశీలన, దూరదృష్టి ఉన్నాయనీ, అదేవిధంగా జ్యోతిష్యమనేది అవాస్తవమని కొట్టిపారేయడం అవివేకమనీ, జ్యోతిషానికి శాస్త్ర ప్రమాణం ఉందని అంటున్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు సాక్షికి ప్రత్యేకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణంలో... ఉగాది ప్రాశస్త్యాన్ని, నూతన ఉగాది ఫలాలనీ వారి మాటలలోనే తెలుసుకుందాం.. మన భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి. మనదేశంలోనే యుగాది భేదాలతో కాల విభాగం, దైవిక లౌకిక కర్మ విభాగాలు ఉన్నాయి. ఇతర దేశాలలో లేవు. మన రుషులు కాల నిర్ణయం అద్భుతంగా చేశారు. కాలం అంటే ఏమిటీ! భూత.. భవిష్యత్.. వర్తమానాలే కదా కాలాలు. ఈ కాలానికి రూపమేది! అంటే ప్రాణుల కదలికలు, పెరుగుదల, తగ్గుదల, ఆధారం చేసుకుని మానవుల మదిలో మెదిలేదే కాలం. కాలానికి రూపం లేదు. వస్తువులకు రూపం ఉంది. జరిగిపోయిన కాలాన్ని భూతమని.. రాబోయే కాలాన్ని భవిష్యత్ అని.. జరుగుతున్న కాలాన్ని వర్తమానం అని అంటాం. అసలు వర్తమానానికి ఎక్కడి నుంచి ఎక్కడకు కొలమానం? అంటే దానికి స్పష్టత లేదు. ఈ వర్తమానాన్ని ఆధారం చేసుకుని భూత, భవిష్యత్ కాలాలు ఉన్నాయి. అయితే కాలం రూపం లేనిది.. నిలకడ లేనిది కనుక అది వాగారంభణమే.. అంటే నోటి మాట మాత్రమే అనేది వేదాంత సిద్ధాంతం. అయితే లోకం గురించి కాలనిర్ణయాన్ని మన పూర్వీకులు చాలా చక్కగా చేశారు. సూర్యచంద్రాది గ్రహాలు, భూమి పరివర్తన ఆధారం చేసుకుని తిథులు, నక్షత్రాలు ఆధారం చేసుకుని కాల నిర్ణయం చేశారు. ప్రతిరోజు, ప్రతిమాసం, ఋతువులతో సహా ఎలా ఏర్పడుతుంది, భూమి మీద అన్ని ప్రాణులకి ఋతువులతోను, మనుషులతోను, ఉత్తర, దక్షిణాయనాలతోనూ ఎలా సంబంధం ఉన్నది అన్నది మన పూర్వీకులు చూపించారు. అధి దైవికమైన సూర్యాది గ్రహాలు, నక్షత్రాలు, ఉరుములు, మెరుపులతో కూడిన సర్వదివ్యమైన జ్యోతనమైన అధి దైవికంతో భూగోళానికి ఉన్న సంబంధం మన కాల నిర్ణయం. దానినే జ్యోతిష్యం అంటాము. కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు. ఖగోళ, భూగోళ సంబంధాన్ని తెలియజేసేది ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచ చిత్రపటలాన్ని నమ్మము అంటే అవివేకమే.జ్యోతిష్యం అంటే మూఢ విశ్వాసం కాదు. ఇతర దేశాలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు పెట్టుకునే సంవత్సరం కేవలం విశ్వాసంతో కూడినది కానీ మన సంవత్సరం విశ్వాసం మాత్రమే కాదు. ఖగోళంతో కూడిన సర్వసంబంధాలు భూమికి సంబంధం కలగడం వలన ప్రత్యక్ష ప్రచారంలో అనుభవ సిద్ధమైనది. మరి ఇంత విశాలమైన ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికాలతో కూడిన ఈ ప్రపంచం అనే ప్రకృతి ఎలా సృష్టించబడింది?.. అది ఎప్పుడు? అంటే దానిని తెలియజేసేదే మన యుగాది. సృష్టి ఆరంభం... మన ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటున్నాం. ధర్మసింధులో ఆ రోజున సృష్టి ప్రారంభమైనట్లు ఉంది. హేమాద్రిలో కూడా ‘చైత్రే మాసి జగత్ బ్రహ్మ ససర్జ ప్రధమేఒహని’ అన్నాడు. అంటే బ్రహ్మ చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జగత్తును సృష్టించాడని ఉంది. అయితే ఒక వస్తువు సృష్టి కావాలంటే దానిని సృష్టించేవాడు, దేశం, కాలం అనేవి కావాలి కదా. బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు అంటే అతను ఎక్కడ ఉండి ఎప్పుడు సృష్టించాడు? దానికి దేశం, కాలం చెప్పవలసి ఉంది. అలా అంగీకరిస్తే దేశాన్ని కాలాన్ని అతను సృష్టించ లేదనే కదా? అంతేకాదు దేశం, కాలం అనేవి జగత్తులోనే అంతర్గతాలు. కనుక జగత్తుని ఎక్కడ సృష్టించాలి. ఎప్పుడు సృజించాలి అనే ప్రశ్నలే పుట్టవు. శ్రుతి ఇలా చెప్పిందే కాని సృష్టి జరిగిందని ఎప్పుడూ నిరూపించలేదు. సృష్టి జరిగితే బంధం అనేది సత్యం అవుతుంది. కనుక బంధ నివృత్తి ఎప్పుడూ కాదు. సత్యానికి నివృత్తి ఎక్కడిది? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ నకర్త్నత్వం, న కర్మోణి లోకస్య సృజతి ప్రభుః...అని అన్నారు. అంటే ఈ సృష్టిని చేయనేలేదని, అజ్ఞానం చేత పరమాత్మనే జగత్తు అని భ్రాంతి పొందుతున్నామని అన్నారు. మట్టిని వీడి కుండ లేదు అంతా మన్నే అన్నట్లు పరమాత్మ చేత జగత్తు పుట్టింది అంటే పరమాత్మను వదలి జగత్తు లేదు అంతా పరమాత్మయే అనే జ్ఞానం ఉపదేశించడానికే ఈ సృష్టి ప్రక్రియ ఒక ఉపాయం అని శ్రీగౌడపాదాచార్యులు ‘ఉపాయః స్నోవతామామ’ అని అన్నారు. ఉగాది పండగ అంటే ఏమిటి? ఈ చైత్ర మాసంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు చేమలు తమ పాత ఆకులను రాల్చి కొత్త చిగుళ్ళతో కళకళలాడుతూ ప్రకృతి అంతా నవనవలాడుతుంది. అలాగే భక్తుడు ఈ ఉగాది నుండి అయినా సద్గురువులను ఆశ్రయించి తనలోని దోషం, క్రోధం, అసూయ, మిధ్యాజ్ఞానం, దురభిమానం అనే పాత భావాలను రాల్చి శాంతి.. దయ, విద్య మొదలగునవి సంపాదించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలాగే మనగలిగే అనేక మానసిక ఒత్తిడులకు తలొగ్గక ధీరులై ఉండి మనందరి ఆత్మీయ విశ్వం, పరమార్థం అనే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడమే ఉగాది పండుగ. అంతేగాని ఆ రోజు రకరకాల పిండివంటలు తిని ఉగాది బాగా జరిగింది అని అనుకుంటే అది భ్రాంతే. అయితే ఈ కొత్త సంవత్సరం వికారి నామసంవత్సరం పెద్దలు, యువకులు, సకల ప్రాణులు పరమాత్మ దయ వలన ఈ సంవత్సరమంతా బాగుండాలి. పంటలు పండాలి. అన్నం పెట్టే రైతు బాగుండాలి. సమర్థవంతమైన పాలన ఉంటుంది వికారి నామసంవత్సరంలో రాజు శని అయినందున మంత్రులు సమర్థవంతంగా పరిపాలన సాగిస్తారు. రాజకీయపరంగా ప్రతిపక్షంలో ఉన్న వారు బలం చూపించుకునే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయితే రవిగ్రహం మంత్రి అయిన కారణం చేతను రవి, శని శత్రువులు అయిన కారణంగానూ పరిపాలన విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ధనుస్సునందు గురు, శని, కేతు గ్రహాలు ఉండి ఈ రాశికి ఆరవ రాశినందు కుజుడు ఉండడం వలన అధికార, ప్రతిపక్షాలకు పోరు అధికంగా ఉంటుంది. ఈ గ్రహ యుద్ధంలో చివరి నిమిషంలో అధికార పక్షానికి ప్రమాదం ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఈ సమయంలో వాహన, అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. పంటలు బాగా పండుతాయి జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమి కారణం చేత సరిహద్దు ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉండే అవకాశం ఉంది. బుధుడు సస్యాధిపతి కావడం వల్ల పంటలు బాగా పండుతాయి. పెసలకు మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధ వ్యాపారాలు బాగుంటాయి. చంద్రుడు ధాన్యాధిపతి అయిన కారణంగా మంచి వర్షాలు కురుస్తాయి. పశుసంపద పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ఈ సంవత్సరం ప్రధానంగా ధనుస్సునందు గురు, శని, కేతువుల కలయిక వలన దేశారిష్టయోగం ఉంది. దీని నివారణార్థం అధికారులు పీఠాధిపతులను, గురువులను సంప్రదించి శాంతి కర్మ ఆచరించిన తరువాత అంతా శుభాలు కలుగుతాయి. స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పంచాంగం..‘వికారి’ ప్రవర్తన... ‘తిథిర్యారంభ యోగఃకరణమేవచ పంచాంగమతి విశ్యాతం లోకోయం కర్మ నాథక’ అంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంశాలతో కూడుకుని ఉన్న దానిని పంచాంగం అంటారు. అసలు పంచాంగాలతో ఎవరికి ఉపయోగం? దాని వలన ప్రయోజనం ఏమిటి? అనే సందేహాలు నేటితరంలో అందరినీ బాధిస్తున్నాయి. ఈ పంచాంగాలు వృద్ధులకు మాత్రమే సంబంధం మాకు కాదు అంటారు యువకులు. నిజానికి ఈ పంచాంగం అంటే వ్యక్తిగత విషయం కాదు అని గ్రహించాలి. వైయుక్తిక విషయముల కంటే సార్వత్రిక విషయాలే పంచాంగాల ముఖ్య లక్షణం. అది ఎలాగో పరిశీలిద్దాం. పంచాంగ గణితం మనకు అమావాస్య, పౌర్ణమి రూపంలో ప్రత్యక్ష ప్రమాణంగా సామాన్యులకు సైతం ఉన్నది. వర్షాల విషయంలో కూడా ప్రామాణికంగా తెలియజేస్తున్నాయి. ప్రధానంగా గ్రహణాలు ఏ నిమిషానికి ప్రారంభమయి ఏ నిమిషంలో అంతమవుతాయి– అనే విషయంలో కూడా పంచాంగాలే ప్రామాణికం. పై విషయాలను నేటి సాంకేతిక విజ్ఞానంతో శాస్త్రవేత్తలు ఎన్నో కోట్ల వ్యయంతో పరిశ్రమ చేసి తెలుసుకుంటూ ఉంటే అవే విషయాలను శాస్త్రవేత్తలకు ఏ మాత్రమూ తీసిపోకుండా మన పంచాంగ కర్తలు కేవలం కాగితం, కలం సహాయంతో తెలుసుకుంటున్నారు... నిరూపిస్తున్నారు. ఇటువంటి పంచాంగం మన సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. దీనినే ఉగాది అంటారు. యుగాది అనే శబ్దం నుంచి ఉగాది అనే మాట వాడుకలోకి వచ్చింది. ఈ రోజున అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, షడ్రసాత్మకమయిన ఉగాది పచ్చడిని తినడం, పెద్దలకు నమస్కరించడం, పంచాంగ శ్రవణం చేయడం మన తెలుగువారికి ఆచారం. - సమ్మంగి భాస్కర రావు, సాక్షి, పెందుర్తి -
ఈ సంవత్సరం ఏ నాయకుడికి కలిసొచ్చేనో..
షడ్రుచుల సమ్మిళితం ఉగాది పచ్చడి. ఈ పచ్చడి సారం మన జీవితానికే కాదు.. భవిష్యత్తుకూ వర్తిస్తుంది. జీవన గమనంలో ఎప్పుడు ఏ రుచి చవి చూస్తామో తెలియదు. ఏదీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందో తెలియదు. నమ్మకం, విశ్వాసమనే పునాదులపై ఏర్పడ్డ మన సమాజాన్ని జ్యోతిష్యం, పంచాంగం బలంగా ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యవాణిని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. తెలుగు పండగైన ఉగాది రోజున పంచాంగాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో విళంబినామ సంవత్సరంలో కొందరు నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.. రాజకీయంగా వారెదుర్కొనే ఆటుపోట్లు ఏమిటి తదితర అంశాలపై పంచాంగకర్తలను అడిగి తెలుసుకునే చిరు ప్రయత్నం చేశాం. పేర్లు, రాశుల ద్వారా వారి భవిష్యత్తును అంచనా వేసిన జ్యోతిష్యులు.. ఈ ఏడాది ఏ రాశివారికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం అనేది విశ్లేషించారు. ఈ రాజకీయ పంచాంగం మీకోసం.. సరదాగా.. సింహ రాశి: ఈ ఏడాది అంతగా అనుకూలంగా లేదు. గురువు 3వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 11, వ్యయం 11, పూజ్యం 3, అవమానం 6. ప్రత్యర్థులు పైచేయి సాధించే అవకాశముంది. సన్నిహితులు కూడా బలహీనపరిచే వీలుంది. మొత్తమ్మీద విళంబి సంవత్సరం నిరాశజనకంగానే ఉండనుంది. పి.మహేందర్‌రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కుంభ రాశి: విళంబి నామ సంవత్సరం అన్ని విధాలా కలిసి రానుంది. సమాజంలో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. గురువు 8వ స్థానంలో, శని 11వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 7, అవ మానం 1. మొదలు పెట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన పనులు ప్రారంభిస్తారు. అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి.. పెద్దల మన్ననలు పొందుతారు. సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి తుల రాశి: ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే కానుంది. ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 2, గురువు 2వ స్థానంలో ఉండి శని సంచారం 3వ స్థానంలో ఉండడం వల్ల చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి కార్యంలోనూ ఇతరుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించడం ద్వారా తన పలుకుబడిని పెంపొందించుకుంటారు. రామ్మోహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే సింహ రాశి: ఈ ఏడాది ఆశావహంగా లేదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. సొంత వాళ్లు కూడా వ్యతిరేకంగా మారే అవకాశముంది. గురు 3వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉంటాడు. ఆదాయం 11, వ్యయం11, పూజ్యం 3, అవమానం 6. ఈసారి శ్రమకు తగిన ఫలితాలు తక్కువగా ఉన్నాయి. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం మిథునరాశి: ఆరోగ్యం, మానసిక ఆందోళన తప్పదు. మొదలుపెట్టే ప్రతి పనులకు ఆటంకం కలిగి తీవ్ర జాప్యం జరుగుతుంది. శని 7వ స్థానంలో, గురువు 6, 7 స్థానాల్లో ఉండడం ఈ పరిస్థితి తలెత్తుతోంది. వ్యయం కూడా ఎక్కువే. పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వృషభ రాశి: చేపట్టే ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తికాదు. ఆరోగ్య సమస్యలుంటాయి. ఈ సంవత్సరం శని 2వ స్థానంలో, గురువు 12వ స్థానాల్లో ఉండడంతో ఈ పరిణామం జరుగుతుంది. వ్యయ నియంత్రణ ఉండదు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సివుంటుంది. సానుభూతిని సంపాదించుకుంటారు. యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల తుల రాశి: విళంబి నామ సంవత్సరం అన్ని విధాలా కలిసిరానుంది. ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 2, గురువు 2వ స్థానంలో ఉండి శని సంచారం 3వ స్థానంలో ఉండడంతో సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా మంచి గౌరవం దక్కుతుంది. కార్యనిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది లాభదాయకంగా కూడా ఉంటుంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా ఇదే రాశి కావడంతో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొడంగల్ -
తెలంగాణ సర్కార్ ఉగాది కానుక..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా కరదీపిక పేరుతో తీసుకొచ్చిన హ్యాండ్ బుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇందులో 20 రకాల అంశాలను పొందుపరిచారు. వర్ణమాల, తెలుగు సంవత్సరాలు, తిథులు – వారాలు, పక్షాలు – ఆయనాలు, మాసాలు, రుతువులు, కార్తెలు, నక్షత్రాలు – రాశులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, యుగాలు, ప్రాచీన కాలగణనం, తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు, ప్రాచీన సంఖ్యామానం, పండుగలు, పండుగల పాటలు, రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ కళలు, వాయిద్య పరికరాలు, మన పంటలు – ఆహారం, మన ఆటలు, నీతి పద్యాలు, తెలంగాణను పరిపాలించిన రాజవంశాలు ఉన్నాయి. మొత్తం 56 పేజీల పుస్తకం సమగ్ర సమాచారంతో అందరినీ ఆకట్టుకొంటోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిన నేటి తరానికి మన ప్రాచీన జ్ఞానం తెలియాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కరదీపికను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి ఇంటికీ దీన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన 1.30 కోట్ల కుటుంబాలకు ఈ కరదీపికను డీఈవోలు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ముద్రణా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ హ్యాండ్ బుక్కులను సరఫరా చేస్తారు. కలెక్టర్లు గ్రామాలకు చేరుకొని ఈ హ్యాండ్ బుక్‌ను ప్రతి ఇంటికీ అందజేస్తారు. జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఈ పుస్తకాల్ని లక్ష వరకు ప్రింట్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఉగాది కరదీపిక కోసం లింక్‌ను క్లిక్ చేయండి -
సంప్రదాయం ఉట్టిపడేలా చేద్దాం
సాక్షి, రాజమహేంద్రవరం: ఈ తరం పిల్లలకు ఉగాది విశిష్టతను తెలియజేసేలా పండుగను నిర్వహించేందుకు నిర్ణయించామని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు ఉగాది ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీ (ఆదివారం) ఉగాది సందర్భంగా పుష్కరఘాట్ నుంచి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన ద్వారం వరకు ఫుట్‌ఫాత్‌పై స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పిల్లల ఆట బొమ్మలు, సంప్రదాయ వంటకాలు విక్రయించే వారికి ఈ స్టాల్స్‌ను ఉచితంగా కేటాయిస్తామని చెప్పారు. జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన వంటకాలు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉగాది ముందు రోజు (శనివారం) సాయంత్రం నుంచి ఉత్సవాలు మొదలవుతాయని, అప్పటి నుంచే స్టాల్స్ ద్వారా విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపారు. నంది నాటకోత్సవాల ప్రదర్శనకు అనుగుణంగా ఆనం కళాకేంద్రం పై అంతస్థులు, ఇతర ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న కళాకారులు గురువారం సాయంత్రంలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముగ్గుల పోటీలు, చిన్నారుల నుంచి మహిళలకు ‘తెలుగమ్మాయి’ పేరుతో మూడు కేటగిరీల్లో సంప్రదాయ దుస్తుల ధారణ పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం పుష్కరఘాట్ వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గో సంపద ప్రదర్శనకు ఆసక్తి గల వారు తమ గోవులను తీసుకురావచ్చని చెప్పారు. పోటీల్లో అందమైన ఆవులను ఎంపిక చేసి యజమానికి బహుమతులు ఇస్తామని తెలిపారు. ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని, చిన్నారులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, అదనపు కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ రావు, మేనేజర్ సీహెచ్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఉగాది రోజున అనిల్ రావిపూడి కొత్త సినిమా?
తీసింది మూడు సినిమాలే. కానీ, యంగ్ హీరోలకు ఈ డైరెక్టర్ హాట్ ఫేవరెట్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఇలా తీసిన ప్రతి సినిమాలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో సినిమాను విజయతీరాలకు చేర్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. రీసెంట్గా రవితేజ ఖాతాలో హిట్ పడేసిన ఈ యువ దర్శకుడు ఉగాదికి తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈసారి మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటిసారిగా మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ పెద్ద హీరోలతో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించబోతున్నట్లు సమాచారం. తన మార్క్ కామెడీతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎఫ్ 2( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి అనిల్ రెడీ అవుతున్నాడు. వెంకటేశ్‌కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది. -
స్వామివారి ఆదాయం 14, ఖర్చు 11
- అమ్మవారి ఆదాయం 14 , ఖర్చు 2 - ఘనంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి పంచాంగ శ్రవణం యాదగిరికొండ: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనారసింహ స్వామి దేవస్థానంలో బుధవారం హేవళంబినామ సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగను, పంచాంగ శ్రవణాన్ని అర్చకులు, పురోహితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారిది స్వాతి నక్షత్రం తులారాశి 14 ఆదాయం, 11 ఖర్చు, ఆండాళు అమ్మవారిది పుబ్బ నక్షత్రం సింహరాశి 14 ఆదాయం, 2 ఖర్చుగా వచ్చిందని పురోహితులు తెలిపారు. ఈ ఏడాది అందరికీ కాలం కలిసి వస్తుందన్నారు. పంటలు సమృద్ధిగా పండి రైతులు ధాన్యరాశులను ధనరాశులుగా పోస్తారని పేర్కొన్నారు. వర్షాకాలంలో చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి పొర్లి జలపాతాలను తలపిస్తాయన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆలయం పూర్తవుతుందనీ, ఈ ఏడాది స్వామి, అమ్మవార్ల ఉత్సవాలన్నీ కొత్త ఆలయంలోనే జరుపుకొంటామని జోస్యం చెప్పారు. దేవస్థానం ఖజానా నిండుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతారని, ప్రజానీకం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నలుగురు వేద పండితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కలెక్టర్ అనితా రాంచంద్రన్, దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, అర్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కరశర్మ, చలమాచార్యులు, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి భవన్లో ఉగాది వేడుకలు
-
బిగ్ ‘సి’లో ఉగాది వినూత్న ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్స్ కొనుగోళ్లపై విలువైన బహుమతులను అందిస్తున్నట్లు బిగ్ ‘సి’ వ్యవస్థాపకుడు, సీఎండీ బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2,999 విలువగల లోటో షూస్, రూ.2,510 విలువగల సింగర్ మిక్సర్, రూ.6,990 విలువగల సింగర్ ఎయిర్‌కూలర్, రూ.1,099 విలువగల ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను బహుమతుల కింద ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. కాగా బిగ్ ‘సి’ ఉగాది ఆఫర్లను బాలీవుడ్ నటి మన్నార చోప్రా ఆవిష్కరించారు. -
ఉగాది ఎప్పుడూ తీపి గుర్తే
తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం... షడ్రుచుల సమ్మేళనం మనిషి జీవితం. దీనికి ప్రతీక తెలుగు సంవత్సరాది.. ఉగాది. గతేడాది ఉగాదికి నేను హైదరాబాద్‌లో ఉన్నాను. పండక్కి నెల రోజుల ముందే ‘క్షణం’ వంటి సూపర్‌హిట్‌ను తెలుగు ప్రేక్షకులు నాకు బహుమతిగా ఇచ్చారు. నా సంతోషాన్ని ఇక్కడివాళ్లతో కలసి పంచుకున్నా. ఈ నెలలో విడుదలైన హిందీ సినిమా ‘కమాండో–2’ మంచి విజయం సాధించింది. అందులో నేను తెలుగమ్మాయి భావనారెడ్డిగా నటించా. దాంతో ఈ సంతోషాన్నీ తెలుగు ప్రేక్షకులతో పంచుకోవాలని హైదరాబాద్ వచ్చేశా. కథానాయికగా నా ప్రయాణంలో షడ్రుచులున్నాయి. కానీ, నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది, తీపి గుర్తులు అందించిందీ తెలుగు చిత్ర పరిశ్రమే. అందువల్ల, నేనెప్పుడో తెలుగింటి అమ్మాయిని అయిపోయా. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది అంటే నాకూ ఇష్టమే. ఈ పండక్కి ‘ఐఫా ఉత్సవమ్’లో నేను సంప్రదాయ వస్త్రాధారణలో హాజరవుతున్నా. ఈ వేడుక కోసం మా అమ్మ చీరను కట్టుకుంటున్నా. -
28నే ఉగాది!
కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ యాదగిరిగుట్ట: శ్రీ హేమలంబ ఉగాది పండుగను ఈ నెల 28వ తేదీనే ప్రజలు జరుపుకోవాలని కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త సుబ్రమణ్య సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ పిలుపునిచ్చారు. శనివారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాచీన గణితం, దృగ్గణితము అనే విధానంలో తెలిపిన విధంగా మార్చి 28 లేదా 29న ఉగాది పండుగ జరుపుకోవాలని సం దిగ్ధం నెలకొందని తెలిపారు. శాస్త్రీయ తను చాటి చెప్పే దృగ్గణిత మును ప్రామాణికంగా తీసుకుని మార్చి 28న పండుగను జరుపు కోవాలని కొడకండ్ల సిద్ధాంతి (పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి) తెలిపినట్లు వెల్లడించారు. ప్రముఖ దేవాలయాల్లో అసత్యమైన పూర్వగణిత పంచాంగాలను వాడడం తో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. 2007లో ఇలాగే శ్రీ సర్వజిత్ సంవత్సర ఉగాది పండుగ తేదీల విషయంలో వివాదం వస్తే ఆనాడు నలుగురు ఐఏఎస్ అధికారుల సమక్షంలో పండిత చర్చ చేసి దృగ్గణిత ప్రకారమే ప్రభు త్వం ఉగాది నిర్వహిం చిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆరోజునే పండుగ సెలవు ప్రకటి స్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి, యాదాద్రి ఆస్థాన సిద్ధాంతి కృష్ణమా చార్య, వాసుదేవ శర్మ, జగదీ శ్వర శర్మ, రామలింగేశ్వరశర్మ ఉన్నారు. -
మార్చి 28న టెన్త్ సోషల్–1 పరీక్ష!
హైదరాబాద్: వచ్చే ఏడాది నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా మార్చి 28వ తేదీన సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయానికి వచ్చింది. మార్చి 29వ తేదీన ఆ పరీక్షను నిర్వహిస్తామని ఇదివరకు షెడ్యూలును జారీ చేసినా ఆ రోజు ఉగాది పండుగ ఉండటంతో ముందుగానే (28వ తేదీన) పరీక్షను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మార్పు చేసిన షెడ్యూలుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించింది. నాలుగైదు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడనుంది. -
ఉగాది వెలుగులు విరజిమ్మాలి
► మంచి వర్షాలు కురవాలని వరుణదేవున్ని ప్రార్థించాలి ► జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పిలుపు ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆకాంక్షించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయనఆడిటోరియంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు(కల్చరల్): ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆకాంక్షించారు. దుర్మిఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ప్రతి ఒక్కరూ మంచి వర్షాలు కురిసేలా వరుణదేవున్ని ప్రార్థించాలని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో దుర్మిఖినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే దుర్మిఖి నామ సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులంతా పాడిపంటలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. అనంతరం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఉగాది పండుగ కర్నూలు జిల్లా ప్రజల గుండెల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని.. పారిశ్రామిక, వ్యాపార రంగాలలో మరింత అభివృద్ధి జరిగేలా దేవున్ని ప్రార్థించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రభుత్వ సంగీత కళాశాల అధ్యాపకుల బృందంచే నాదస్వరం, విద్యార్థులచే గణపతి ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. నంద్యాల పంచాగ గ్రంధకర్త శశిభూషణ సిద్ధాంతి పంచాగ పఠనం చేశారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులు డాక్టర్ ఎం.హరికిషన్, పుల్లా రామాంజనేయులు, మారుతీకుమారి, మాకం నాగరాజు, డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, కె.స్వర్ణలత, గన్నమరాజు సాయిబాబ, ఎన్.నాగమణి చదివిన కవితలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులు చెక్కభజన, గురవయ్య నృత్యాలు ప్రదర్శించారు. రవీంద్ర విద్యానికేతన్ విద్యార్థులు, కేశవ మెమోరియల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన డాక్టర్ ఎ.సంజీవరాయుడు, సాయికుమార్, కోటేష్, రామకృష్ణయ్య, వి.వి.రమణమూర్తి, విజయప్రసాద్లకు జిల్లాస్థాయి ఉగాది విశిష్ట పురస్కారాలు అందించారు. కర్నూలును అభివృద్ధి పథంలో నడిపిద్దాం ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని సునయన ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రం కష్టాలనెదుర్కొంటోందని, అయినా కర్నూలును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు నిర్మాణం కోసం ప్రజలందరూ డిమాండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతకుముందు పంచాంగ పఠనం చేసిన ఇంద్రగంటి నరసింహ శర్మ, ఇంద్రగంటి శ్రీధర్ శర్మ కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా చార్విరెడ్డి చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యమ్రంలో వికాసభారతి అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్ జాయింట్ కలెక్టర్-2 రామస్వామి, ఆర్డీఓ గంగాధర్‌గౌడ్‌లతో పాటు అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు, ఉగాది ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోపవరం రామచంద్రన్, కళాకారులు సుధారాణి, చంద్రకంటి మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
పండగపూట పస్తులే!
► హెచ్‌డబ్ల్యూఓలకు రెండు నెలలుగా అందని జీతాలు ► ఐదు ట్రెజరీల్లో పాస్ కాని డైట్ బిల్లులు ► రూ.30 లక్షల నిధులు ల్యాప్స్ కర్నూలు(అర్బన్) : ఉగాదిని అందరు ఎంతో సంతోషంగా జరుపుకున్నా.. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహ సంక్షేమాధికారులు మాత్రం ఇబ్బందుల మధ్య నిర్వహించుకోవాల్సి వచ్చింది. రెండు నెలలుగా వసతి గృహ సంక్షేమాధికారులకు జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలకు సంబంధించి జీతాలు విడుదల కాలేదు. ఫిబ్రవరికి సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను సమాచారాన్ని అందించడంలో కొందరు హెచ్‌డబ్ల్యూఓలు చేసిన జాప్యం వల్ల జీతాల విడుదలలో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. మార్చికి సంబంధించి జీతాల బిల్లులను ట్రెజరీకి పంపినా మంజూరు కాలేదు. దీంతో రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులు పండుగ పూట ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదు ట్రెజరీల్లో పాస్ కాని డైట్ బిల్లులు జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, ఆళ్లగడ్డ, ఆలూరు ట్రెజరీ కార్యాలయాల్లో వసతి గృహాలకు సంబంధించిన మార్చి నెల డైట్ బిల్లులు పాస్ కానట్లు సమాచారం. సాధారణంగా ప్రతి నెలా 19 నుంచి 24వ తేదీలోగా డైట్ బిల్లులను ఆయా ట్రెజరీ కార్యాలయాలకు అందజేయాల్సి ఉంది. అందరు వసతి గృహ సంక్షేమాధికారులు నిర్ణీత సమయంలోనే ట్రెజరీలకు బిల్లులను అందజేసినా, మార్చి చివరిలో మంజూరు కావాల్సిన బిల్లులు పాస్ కాలేదు. దీంతో దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బడ్జెట్ ల్యాప్స్ అయినట్లు తెలుస్తోంది. సమస్యను డీడీ దృష్టికి తీసుకువెళ్లాం- శ్రీరామచంద్రుడు, హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జెడ్ దొరస్వామి, కే బాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితిని, ఆయా ట్రెజరీల్లో మంజూరు కానీ డైట్ బిల్లుల విషయాన్ని తమ శాఖ ఉప సంచాలకుల దృష్టికి తీసుకువెళ్లాం. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. రెండు నెలల జీతాలతో పాటు డైట్ బడ్జెట్ కూడా ల్యాప్స్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలతో పాటు డైట్ బడ్జెట్‌ను ఇప్పించాలి. డైట్ బడ్జెట్ రాకుంటే వసతి గృహ సంక్షేమాధికారులు మరిన్ని ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. -
ముక్కంటికి పంగనామాలు
► ఉగాది ఉత్సవాల్లో చేతివాటం ► భారీగా వీఐపీ టిక్కెట్ల రీసైక్లింగ్ ► గురువారం వెలుగులోకి వచ్చిన ఘటన ► మల్లన్న ఆదాయానికి గండి ► కప్పిపుచ్చుకుంటున్న ఆలయ అధికారులు ► ఓ మీడియా బృందంపై ఈఓ మండిపాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆలయ సిబ్బంది చేతి వాటం చర్చనీయాంశమవుతోంది. భక్తుల రద్దీ వీరికి వరంగా మారుతోంది. వీఐపీ బ్రేక్ టికెట్ల రీసైక్లింగ్‌తో దేవస్థానం ఆదాయానికి లక్షల్లో గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి, కర్నూలు: ఉత్సవాలు వస్తే శ్రీశైలాలయ ఉద్యోగులకు పండగే. స్వామి ఆదాయానికి గండికొట్టి మరీ అక్రమార్జన సాగిస్తున్నారు. టికెట్ల రీసైక్లింగ్ వ్యవహారం గురువారం వెలుగులోకి వచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కర్ణాటకతో పాటు మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున స్వామి, అమ్మవార్ల దర్శనార్తం తరలివచ్చారు. ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఉంటారనేది అధికారుల అంచనా. ఇదే అదనుగా ఆలయ అధికారులు కొందరు అక్రమార్జనకు తెరతీశారు. దర్జాగా దర్శన టికెట్ల దందాకు శ్రీకారం చుట్టారు. వీఐపీలకు ప్రత్యేక కౌంటర్లలో అందజేసే ఒక్కో బ్రేక్ టిక్కెట్ ధర రూ.500. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో భక్తులు ఈ టిక్కెట్లతోనే దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒకసారి వినియోగించిన టిక్కెట్లను ఆలయ సిబ్బంది ద్వారా తిరిగి భక్తులకు విక్రయించడం జరుగుతోంది. తేలు కుట్టిన దొంగలు గురువారం రాత్రి అనుమతి లేని వీఐపీ బ్రేక్ రూ.500 టిక్కెట్లతో దర్శనానికి వచ్చిన ఇద్దరు కర్ణాటక భక్తులను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) మహేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సదరు యాత్రికులు తమకు భిక్షపతి మఠం వారు టిక్కెట్లు ఇచ్చినట్లు చెప్పారు. మఠం సిబ్బంది ఆలయ దర్శన టికెట్లను ఎలా ఇస్తారని ఏసీ ఆ భక్తులను ప్రశ్నించారు. దీంతో వాళ్లు నీళ్లు నమలడంతో బండారం బయటపడింది. భిక్షపతి మఠం మేనేజర్ మల్లికార్జునను ఏసీ పిలిపించి విచారించగా మొదట తమ పిల్లలతో 7వ తేదీ ఉదయం క్యూలో తెప్పించుకుని సాయంకాలం దర్శానానికి వచ్చామని సమాధానమిచ్చారు. తర్వాత కాసేపటికి ఆ టికెట్లు ఆలయ ఏఈఓ రాజశేఖర్ ఇచ్చారని వివరణ ఇచ్చారు. కంగుతిన్న ఏసీ మహేశ్వరరెడ్డి.. ఏఈఓ రాజశేఖర్‌ను వివరణ కోరగా ఆయన చేతులెత్తేశారు. దీంతో విషయం ఈఓ సాగర్‌బాబు దృష్టికి చేరింది. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు దర్శన టికెట్ల బాగోతం మీడియా దృష్టికి చేరడంతో కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై ఈఓ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను ఈవోనని.. మిమ్మల్ని దేవాలయంలోనికి కూడా అనుమతించేది లేదంటూ ఓ ఎలక్ట్రానిక్ మీడియా(సాక్షి కాదు) బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మీడియా ఒత్తిడి మేరకు వివరణ ఇస్తూ.. ఆ టిక్కెట్లు ముందు రోజు రాత్రి ఆలయ కౌంటర్లో తీసుకున్నారని, అయితే మరుసటి రోజు దర్శనానికి వచ్చారని పొంతనలేని సమాధానంతో దాటేశారు. ఇంతలో ఏఈఓ రాజశేఖర్ కల్పించుకుని ఆ టిక్కెట్లు నకిలీవి కావని.. వీఐపీలు ఎవరైనా వచ్చినప్పుడు వారిని నేరుగా దర్శనానికి అనుమతిస్తే ఇతర భక్తులు గోల చేస్తారన్నారు. అందువల్ల ఒక్కోసారి వినియోగించిన వీఐపీ బ్రేక్ టిక్కెట్లను ప్రముఖులకు అందిస్తుంటామని కొత్త తరహా మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అధికారులు స్వయంగా ఇలాంటి దందాకు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. -
పెళ్లైన పద్నాలుగు నెలలకే..
► చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న వివాహిత ► భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి తండ్రి అనంతపురం న్యూసిటీ: అనంతపురం పాతూరుకు చెందిన బంగారు వ్యాపారి కదిరి మోహనాచారి ముగ్గురు కూతుర్లు. పెద్ద కుమార్తె యశోవాణి(26) అదనపు కట్నం కోసం భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. 2014 డిసెంబర్ 12న గోరంట్ల మండలం కొండాపురానికి చెందిన జీబీ ప్రసాద్ ఆచారి(ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం) కుమారుడు నరేశ్‌తో యశోవాణి పెళ్లైంది. అప్పట్లో కట్నం కింద రూ.6 లక్షలు, బంగారు కట్టబెట్టారు. పెళ్లైన రెండు నెలల నుంచే యశోవాణికి అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు అధికమయ్యాయి. ఈ విషయంపై కొన్నిసార్లు గొడవపడ్డారు. నేను కావాలా, కట్నం కావాల అంటూ యశోవాణి నిలదీసినా నరేశ్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక భరించలేకపోయిన ఆమె తన గోడును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. ఏడ్చింది. వారు అల్లుడికి సర్ది చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓసారి యశోవాణి తీవ్ర అనారోగ్యానికి గురైనా భర్త పట్టించుకోలేదు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆపరేషన్ చేయించాడు. అయినా నరేశ్‌లో ఎటువం టి మార్పు రాలే దు. పోలీసులకు ఫిర్యాదు చేసినా... : భర్త వేధింపులపై యశోవాణి 2015 నవంబర్ 28న అనంతపురం మహిళ పోలీసు స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో భర్త, అత్తమామలు, ఆడపడుచు తనను ఏ విధంగా రాచి రంపాన పెట్టారో వివరించారు. అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్ బాషా కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా జరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ తరువాత నరేశ్ యశోవాణికి మాయమాటలు చెప్పి కాపురానికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి పుట్టింటికి పంపనే లేదు. నరేశ్ తండ్రి సైతం కోడలిని బాధించేవాడు. ఉగాది పండుగ కు ఇంటికెళ్తానని చెప్పినా పంపలేదు. దీంతో చివరకు ఈ నెల 6న చెన్నైలో ఆ అభాగ్యురాలు ఉరేసుకుని తనువు చాలించింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చి తిరిగి చూసిన భర్త నరేశ్ భార్య చనిపోయిందన్న సమాచారం పోలీసులు, వారి తల్లిదండ్రులకు తెలిపాడు. యశోవాణి మృతదేహాన్ని ఆదివారం రాత్రి అనంతపురానికి తీసుకువచ్చారు. -
సకల శుభాలకు నాంది ఉగాది
♦ దుర్ముఖి నామ ఉగాదికి అంతా రెడీ ♦ వేడుకలకు సిద్ధమైన జిల్లావాసులు ♦ కుండలు, పచ్చడి సామగ్రి కొనుగోలు ♦ ఇంటింటా ఇష్టమైన భక్షాలు.. ♦ పంచాగశ్రవణం కోసం ఆలయాల్లో ఏర్పాట్లు రుతువుల్లో అందరినీ మైమరిపించేది వసంత రుతువు. శిశిరంలో ఎండిపోయిన చెట్లన్నీ వసంత కాలంలో చిగుళ్లు తొడిగి పచ్చగా కళకళలాడుతూ కొత్త అందాలతో అలరిస్తాయి. అందుకే ఈ రుతువును అత్యంత మనోహరమైనది, ఆహ్లాదకరమైనదిగా చెబుతారు. నూతన తెలుగు సంవత్సర ఆరంభానికి ఈ రుతువునే కొలమానంగా తీసుకున్నారు. వసంతంలో వచ్చే తొలిమాసం చైత్రం. తిథుల్లో మొదటి గౌరవం దక్కేది పాడ్యమి. బ్రహ్మ పురాణం అనుసరించి బ్రహ్మ సృష్టిని ఆరంభించింది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజును నూతన తెలుగు సంవత్సరాదిగా పాటిస్తూ ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. - దోమ/ఘట్‌కేసర్‌టౌన్/షాబాద్ ఉగాది పచ్చడిలో షడ్రుచులు.. ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆరు రుచులతో (షడ్రుచులు) కూడిన పచ్చడి. పండుగ రోజున ఏ ఇంట్లో చూసినా ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, వ గరు వంటి 6 రుచులతో కూడిన పచ్చడి ఘుమఘుమలే కనిపిస్తాయి. ప్రత్యేకంగా కొనుగోలు చేసిన కొత్త కుండల్లోనే ఈ పచ్చడిని తయారు చేయడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. ఉగాది పచ్చడి తాగితే చక్కటి ఆరోగ్యంతో పాటు జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు విలసిల్లుతాయని ప్రజల నమ్మకం. ఆరురుచుల ప్రత్యేకతలు: చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్త బెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతు వాపు వంటి లక్షణాలను అరికడుతుంది. ఉప్పు ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. చెరకు ముక్కలు, అరటి పళ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. పచ్చడి తయారుచేసే విధానం.. కావాల్సిన వస్తువులు: ఒక స్పూన్ వేపపువ్వు రేకులు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, 6 అరటి పళ్లు, చింతపండు, మామిడి కాయలు, 100 గ్రాముల బెల్లం, ఒక పచ్చి మిరపకాయ, చిటికెడు ఉప్పు, 2 ఏలకులు, 2 గ్లాసుల నీళ్లు. తయారీ విధానం: ముందుగా చెరకు, కొబ్బరి, బెల్లం, మిరపకాయ, మామిడికాయలను చిన్న ముక్కలుగా చేసి విడివిడిగా పెట్టాలి. పేప పువ్వును శుభ్రపరచి రేకులను ఓ పక్కన పెట్టాలి. ఏలకులు గుండుగా చేసి అట్టిపెట్టాలి. 2 గ్లాసుల నీళ్లలో చింత పండును బాగా చిలికి, పులుపు నీళ్లను ఓ గిన్నెలోకి వడపోయాలి. అందులో బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత అరటిపళ్లను ముద్దగా చేసి నీళ్లలో కలపాలి. అందులో చిటికెడు ఉప్పు, ఏలకుల పొడి, చెరకు, మిరపకాయ, మామిడి ముక్కల్ని వేసి బాగా కలపాలి. పండుగ సాంప్రదాయాలు ఉగాది పండుగకు 15 రోజుల ముందు నుంచే గ్రామాల్లో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లకు సున్నం, రంగులు వేయడం, అందంగా అలంకరించడం ప్రారంభం అవుతుంది. పండుగ రోజున ఇళ్లంతా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు, పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరిస్తారు. ఈ రోజున అభ్యంగన స్నానం ఆచరించడడం, గంగాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లను పూజించడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త దుస్తులను ధరించడం ఓ ఆనవాయితీ. ముఖ్యంగా ఎండల నుంచి ఉపశమనం కోసం తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ఎక్కువగా ధరిస్తారు. నోరూరించే భక్షాలు.. ఉగాది పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే భక్షాలు (పోలెలు). ఎన్ని వంటలున్నా వీటిని రుచి చూడడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. సాధారణంగా పండుగకు ఒకరోజు ముందే భక్షాలను సిద్ధం చేసి ఉంచుతారు. ముందుగా శనగ పప్పుతో చక్కెరను జత చేసి దానిని బాగా గ్రైండర్లో వేసి రుబ్బి పూర్ణంగా మారుస్తారు. అనంతరం గోధుమ పిండితో చిన్నచిన్న ముద్దలు తయారు చేస్తారు. ఈ ముద్దల మధ్యన కొద్దికొద్దిగా పూర్ణాన్ని ఉంచి పెనంపై వేసి వేడి చేస్తే భక్షాలు సిద్ధం అయినట్లే. ఇలా తయారు చేసిన భక్షాలను అందరూ ఇష్టంగా తింటారు. పంచాంగ శ్రవణం.. ఉగాది నాడు పంచాంగ శ్రవణం ప్రధానఘట్టం. దీని వెనుకా అనేక కారణాలున్నాయి. ఖగోళ శాస్త్రీయ ధృ క్కోణానికి అద్దం పట్టే సాంప్రదాయంగా పండితులు దీనిని పేర్కొంటారు. ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు ఉంటాయి. చంద్రుడి నడకకు సంబంధించినది తిథి. వారంలోని ప్రతీ రోజును ఓ గ్రహానికి ఆదిదేవతగా భావించి ఆ రోజును ఆ గ్రహం పేరుతో పిలుస్తారు. రాశి చక్రంలోని 27 నక్షత్రాల్లో ఏ రోజున ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్లు చెబుతారు. నక్షత్రరాశిలో సూర్యచంద్రుల స్థితిని బట్టి యోగం లెక్కకడతారు. ఇక తిథిలో అర్ధభాగం కరణం. వాటన్నింటినీ ఆధారంగా చేసుకొని కొత్త సంవత్సరంలో వాతావరణం ఎలా ఉంటుంది, ఏఏ పంటలు వేస్తే బాగుంటుంది, వానలు పడే సమయం తదితర విషయాలను పంచాంగ శ్రవణం ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. -
వానలకు దేవుడిపైనే భారం
ఈ ఏడాది గ్రహస్థితి వల్ల వర్షాలు అంతంతమాత్రమే పంటలు తగ్గి కరువు ఛాయలు ఏర్పడే అవకాశం ధార్మిక కార్యక్రమాలతో ఉపశమనం.. తెల్ల ధాన్యాలకు అనుకూల వాతావరణం పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో పురోగతి.. చెరువుల పునరుద్ధరణతో సత్ఫలితాలు దేవాదాయ శాఖ పంచాంగ శ్రవణంలో చంద్రశేఖర సిద్ధాంతి వెల్లడి సాక్షి, హైదరాబాద్: మన్మథనామ సంవత్సరంలో వానలు అంతంతమాత్రంగానే ఉంటాయని, దీనివల్ల పంటల దిగుబడులు తగ్గి కరువు ఛాయలు ఏర్పడతాయని ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు. దేవుడిపై భారం మోపి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే వరుణుడు కొంతమేర కరుణించే అవకాశం ఉంటుందని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సదనంలో నిర్వహించిన ఉగాది వేడుకలో భాగంగా ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. మన్మథనామ సంవత్సరంలో రాశి ఫలితాలు, పరిస్థితులు ఎలా ఉండబోతాయో వివరించారు. ఈ సంవత్సరం గ్రహస్థితిలో రాజు స్థానంలో శని ఉన్నందున వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 22 నుంచి జూలై 19 వరకు సాధారణ వర్షాలు, జూలై 20 నుంచి ఆగస్టు 30 వరకు పెద్ద వానలు, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మేఘాధిపతిగా చంద్రుడు ఉండటంతో విపరీతమైన గాలుల వల్ల మేఘాలు తేలిపోయి వానలకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఆ గాలులు చివరకు పంటలను కూడా నాశనం చేస్తాయని చెప్పారు. వర్షాల కోసం వరుణ, రుద్రయాగాలు, రుద్రాభిషేకాలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి సూచించారు. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని, పసుపు, వేరుశనగ ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. తెల్లని ధాన్యాలు, పొట్టు ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటి ధరలు తగ్గుతాయని చెప్పారు. మంత్రి స్థానంలో కుజుడు ఉన్నందున హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని, సేనాధిపతిగా కూడా కుజుడే ఉన్నందున వాటిని సాధించుకునేందుకు పోరాడే శక్తి లభిస్తుందని తెలిపారు. పారిశ్రామికంగా రాష్ర్టం చాలా పురోగతి సాధించేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని, విద్యుత్ సమస్యలను అధిగమించే అవకాశాలు చాలా మెరుగవుతాయని, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తాయని వివరించారు. హైకోర్టు విభజనతోపాటు దీర్ఘకాలం పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్మాణాత్మక చర్యల వల్ల ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు. నేరాలు పెచ్చుమీరే ప్రమాదం ఉన్నందున సర్కారు దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుందని, పర్యాటక, రవాణా రంగాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆదాయ-వ్యయాలు సమంగా ఉంటాయని, ఆదాయం 93గా ఉంటే వ్యయం కూడా అంతే ఉందన్నారు. కాగా వైద్య, చలనచిత్ర రంగాల్లో దేశానికి కీర్తి లభిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో ఆర్థికమాంద్యం తలెత్తుతుందని కూడా చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు. ప్రముఖులకు సన్మానం సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రకళ, శిల్పకళ, పేరిణి నృ త్యం, జానపద సంగీతం, జానపద కళారూప ప్రదర్శన, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, మిమిక్రీ, టీవీ, సినిమా రంగం, జానపద చిత్రకళ, హస్తకళ తదితర రంగాలకు చెందిన 31 మంది ప్రముఖులను జ్ఞాపికలు, పోచంపల్లి పట్టు శాలువాలతో సీఎం కేసీఆర్ సత్కరించారు. రాష్ర్టంలోని దేవాలయాలకు చెందిన 34 మంది వేదపండితులు, అర్చకులను సన్మానించారు. ఈ సందర్భంగా నల్లా విజయ్ అనే నిపుణుడు అరటినారతో నేసిన శాలువాను సీఎంకు బహూకరించారు. భద్రాచల దేవాలయం పక్షాన శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రికను ఆలయ వేదాచార్యులు కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని, పోచారం, తలసాని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అధికారులు పాల్గొన్నారు. -
ఉగాది సందర్భంగా ప్రత్యేక బస్సులు
బెంగళూరు : ఉగాది పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు శుక్రవారం సాయంత్రం ఐదుగంటల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈమేరకు గురువారం సాయంత్రం మీడియా ప్రకటన వెలువరించింది. ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో పొద్దుటూరు-7, కడప-5, హైదరాబాద్-5, నంద్యాల-5, కర్నూల్-10, విజయవాడ-2,ఒంగోలు-1, నెల్లూరు-4, తిరుపతికి 3 ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక బస్సులు అర్ధరాత్రి 12 గంటల వరకూ ఉండనున్నాయి. మరిన్ని వివరాలకు 9945516544, 9945516545,08022874136 (మెజెస్టిక్)... 9945516543 (శాంతలా బస్ స్టేషన్)లలో సంప్రదించవచ్చు. -
ఉగాదికి 557 ప్రత్యేక బస్సులు
సాక్షి,హైదరాబాద్: ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 557 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్‌కుమార్ శనివారం తెలిపారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లతో పాటు, వివిధ ప్రాంతాల్లోని పలు ఏటీబీ కేంద్రాల నుంచి 19, 20లలో ఇవి బయలుదేరుతాయి. వివరాలకు 040-24614406, 040-23434268 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. -
ఉగాది విరామం
మున్సిపోల్స్ తరువాత సేదదీరిన నేతలు నేటి నుంచి స్థానిక ఎన్నికల ప్రచారం ముమ్మరం సాక్షి, తిరుపతి: దాదాపుగా నెల నుంచి ప్రచారంలో మునిగితేలిన నేతలు చాలామంది ఉగాది రోజైన సోమవారం సేద దీరారు. ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఇంతకాలం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఆశించిన స్థాయిలో పాల్గొనలేకపోయారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగ్గా నాయకులు సోమవారం ఉగాది పండుగ కావడంతో ప్రచారంలో పాల్గొనలేదు. కొద్దిరోజులుగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో బిజీగా గడిపిన నాయకులకు సోమవారం కాస్తంత సేదదీరే సమయం లభించింది. పండుగ రోజు కూడా ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఇబ్బందిపెట్టడం ఎందుకని ఒక రోజు విరామం ఇచ్చారు. అయితే కొందరు నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికలు మొదటి విడతకు ఏప్రిల్ 6వ తేదీన మదనపల్లె డివిజన్లో పోలింగ్ నిర్వహిస్తారు. మిగిలిన రెండు డివిజన్లలో 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ రెండు విడతల్లోనూ 65 జెడ్పీటీసీ స్థానాలు, 887 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికల ప్రచారానికి ఇక నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచి ముమ్మరం కానుంది. అన్ని రాజకీయ పక్షాల నేతలూ ప్రచారాన్ని ఉరకలెత్తించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఎన్నికల వాతావరణం ఇక పల్లెలను తాకనుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతాల్లో ఓటర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. మంగళవారం నుంచి ఈ పరిస్థితి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించనుందనడంలో సందేహం లేదు. -
రాష్ర్టవ్యాప్తంగా ఘనంగా ఉగాది
సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుప్రజలు సోమవారం ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ప్రజలకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షల బోర్డులను ఏర్పాటుచేశాయి. ఖరాస్ బిల్డింగ్‌లో... ఖరాస్ బిల్డింగ్‌లో ‘ఓం పద్మశాలి సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం, ఉపాధ్యక్షుడు అంబల్ల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, సిద్ధివినాయక మందిరం ట్రస్టీ సభ్యుడు ఏక్నాథ్ సంగం తదితరులు సత్కరించారు. అనంతర ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కాగా ఓం పద్మశాలి విజయ సంఘం-(కమ్మర్పల్లి) ముంబై శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు గుడ్లనడిపి. లింబాద్రి, ప్రధాన కార్యదర్శి చింత రాంప్రసాద్, కోశాధికారి గుడ్ల రమేశ్, కార్యదర్శి చిలుక కిషన్, కమిటీ సభ్యులు వేముల నారాయణ, చిలివేరి నరేంద్ర, బొడ్డు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీఎస్ ఆధ్వర్యంలో... మోర్తాడ్ పద్మశాలి సంఘం (ఎంపీఎస్) ముంబై శాఖ ఆధ్వర్యంలో జయ నామ ఉగాది సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కామని హన్మాండ్లు, కార్యదర్శి అరుట్ల మల్లేశ్వర్, సలహాదారులు కామని బాబూరావు, యెల్ది సుదర్శన్, యెల్ది గణేశ్ తదితరులు పాల్గొన్నారు. చౌట్పల్లి గ్రామ సంఘం ఆధ్వర్యంలో చౌట్పల్లి గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం సంఘ సభ్యులు తీర్థప్రసాదాలతోపాటు పచ్చడిని కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బండి దామోదర్, ప్రధాన కార్యదర్శి కారంపూడి మనోహర్, కోశాధికారి అంబల్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. టీపీఎస్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ పద్మశాలి సంఘం (టీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చాట్ల గజానంద్, ప్రధాన కార్యదర్శి కట్కం రవీంద్ర, కోశాధికారి చాట్ల అశోక్ పాల్గొన్నారు. వర్లిలో... పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో ఉదయం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజమల్లు పంతులు మార్కండేయ మహాముని విగ్రహానికి పూలమాల వేసి పూజ చేశారు. అనంతరం ప్రసాదం, పచ్చడిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజ సుధారక మండలి అధ్యక్షుడు వాసాల శ్రీహరి, సాంస్కృతిక సమితి ప్రతినిధి అల్లె శంకరయ్య, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సభ్యులు చింతకింది ఆనందం, జిందం భాస్కర్, సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీపీఎస్ ఆధ్వర్యంలో.... శ్రీ వేంపేట పద్మశాలి సంఘం (వీపీఎస్) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గాజంగి చక్రపాణి, కోశాధికారి జక్కని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా బీడీడీ చాల్ నంబరు 106లోని శ్రీరామ బాల సంఘం కార్యాలయంలోనూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షుడు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభాదేవిలో.. ప్రభాదేవిలోని ఏర్గట్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన సభ్యులందరికీ పచ్చడిని పంపిణీ చేశామని అధ్యక్షుడు యెలిగేటి నడ్పి రాజారాం, ప్రధాన కార్యదర్శి దొంతుల హన్మాండ్లు, కోశాధికారి కంటం శ్రీధర్ లు చెప్పారు. ఉగాది పచ్చడి పంపిణీ ధారావిలోని మహారాష్ట్ర తెలంగాణ మంచ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మచ్చ ప్రభాకర్, వాళేశ్వరం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుడుగుంట్ల వేంకటేశ్ గౌడ్, కార్యాధ్యక్షుడు కారింగు అంజయ్య, ప్రధాన కార్యదర్శి గొలుసుల లింగయ్య, కోశాధికారి ఆవుల రాములు, ఉపాధ్యక్షుడు జి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి గొల్పుల లింగయ్య, కార్యదర్శి సాక శేఖర్, సహకోశాధికారి కన్నెబోయిన వెంకటేశ్, యూత్ అధ్యక్షుడు పురుగల కృష్ణ, యూత్ ఉపాధ్యక్షుడు ఎల్లంల సతీష్‌కుమార్, వేదిక నిర్వాహకులు పాక శంకర్, సరిగే సైదులు, నిర్వాహకులు బత్తుల శంకర్, బీసం వెంకన్న, బాసాని నర్సింహ, గుండబోయిన కృష్ణ ఎన్నుకున్నారు. ప్రతీక్షా నగర్లో... ప్రతీక్షానగర్ పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పచ్చడిని పంపిణీ చేశామని సంస్థ అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్, కార్యదర్శి అంజనేయులు చెప్పారు. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో... గోరేగావ్‌లోని తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జయనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ ఉగాది పచ్చడి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వీరమల్ల మల్లేశ్, ఉపాధ్యక్షుడు వంటపాక శేఖ ర్, ఉపకార్యాధ్యక్షుడు స్వామి లెంకలపల్లి, కోశాధికారి బక్క అంజయ్య తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో... ఘాట్కోపర్ కామ్‌రాజ్‌నగర్‌లోని తెలుగు రహివాసి సేవా సంఘం (టీఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికులకు పచ్చడి పంపిణీ చేశామని ఆ సంస్థ అధ్యక్షుడు గుల్లే గంగాధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జక్కుల తిరుపతి, గాలి మురళీధర్, చౌకి నారాయణ తదితరులు పాల్గొన్నారు. టీపీఎస్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా పశ్చిమ గోరేగావ్‌లో తెలంగాణ ప్రజాసంఘం (టీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం అందరికీ షడ్రుచుల పచ్చడిని పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజాసంఘం కార్యాధ్యక్షుడు బక్క అంజయ్య ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘం అధ్యక్షుడు వీరమల్ల మల్లేష్, కోశాధికారి పరమేశ్ భీమగోని, ఉపాధ్యక్షుడు శేఖర్ వంటపాక, నర్సిరెడ్డి మన్నె, ఉపకార్యాధ్యక్షుడు స్వామి లెంకలపల్లి, నర్సింహ బీనా మోని, శంకర్ బద్దం, గణేశ్. మచ్చ, సుక్క. అంజయ్య, కురుపీటి. కృష్ణ, మల్లేశ్. గాదె, లక్ష్మణ్, ఎర్ర, జానీ, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
జయ నామ ఉగాది శుభాకాంక్షలు
-
పంచాంగ శ్రవణంతో సకల శుభాలు
-
309 మంది పోలీసులకు ‘ఉగాది పతకాలు’
సాక్షి, హైదరాబాద్: ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఏటా ఇచ్చే పతకాలను ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ కలిపి 309 మందికి వివిధ పతకాలు దక్కాయి. ఖమ్మం జిల్లా చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తోటిచర్ల స్వామి, ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీఐ సెల్లో పని చేస్తున్న కానిస్టేబుల్ కె.శ్రీనివాసులు, మావోయిస్టుల వ్యతిరేక విభాగం ఎస్ఐబీలో పనిచేసిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్ఎస్ఐ ఎన్ నాగేశ్వరరావులకు ముఖ్యమంత్రి శౌర్యపతకాలు లభించాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల డీఎస్పీ డి.నర్సయ్య, సీఐడీలో పనిచేస్తున్న డీఎస్పీ ఎస్.త్రిమూర్తులు, ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఎస్సై ఎస్.సన్యాసిరావులకు మహోన్నత సేవా పతకం లభించింది. వీరితోపాటు 37 మందికి ఉత్తమ సేవా పతకం, 30 మందికి కఠిన సేవా పతకం, 160 మందికి పోలీసు సేవా పతకం లభించాయి. మరోవైపు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 13 మందికి పోలీసు సేవా పతకం లభించాయి. అగ్ని మాపకశాఖలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురికి ఉత్తమ సేవా పతకం, 25 మందికి సేవా పతకం లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విం గ్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్-కానిస్టేబుల్ కె.ప్రభాకర్ మహోన్నత సేవా పతకం పొందారు. ఈ విభాగంలో మరో ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, పదిమందికి సేవా పతకం లభించాయి. అవినీతి నిరోధక శాఖలో పని చేస్తున్న ఏఎస్సై జి.పరమానందం మహోన్నత సేవా పతకం పొందగా... మరో ముగ్గురు ఉత్తమ సేవ, 12 మంది సేవా పతకాలు పొందారు. -
నేడు ఉగాది పర్వదినం షడ్రుచుల సమ్మేళనం
ప్రాముఖ్యం చైత్ర శుద్ధపాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మాకు అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. పూజ అన్ని పండుగల మాదిరిగానే ఉగాది రోజున ఉదయం 9గంటల లోపు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఏదో ఒక దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఏమీ తినక ముందే ఉగాది పచ్చడిని తింటారు. పచ్చడి ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే తినే ప్రత్యేక పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. ఏడాదిపాటు ఎదురయ్యే మంచిచెడులు, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. పచ్చడి తయారీకి మామిడి కాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, వేపపువ్వు వాడుతారు. బె ల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సాహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పుగా వ్యవహారించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం బావానికి ప్రతీక. పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతి వంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, అనే విషయాలను తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేసేవారని చెబుతారు.