తల తోరణం కడుతున్న యువకులు
దమ్మపేట: దమ్మపేటలో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆనవాయితీని నేటి తరం యువకులు కొనసాగిస్తున్నారు. ప్రతి తెలుగు సంవత్సరాది (ఉగాది) రోజు రాత్రి దమ్మపేట ప్రారంభంలో తలతోరణం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. దశాబ్ధాల క్రితం స్థానిక మున్నూరుకాపు రైతు పెద్దలు ఈ ఆనవాయితీకి అంకురార్పణ చేశారు. తర్వాత కాలంలో పెద్దలు చాలా మంది కాలం చేశారు. దీంతో నాడు పెద్దలు చేపట్టిన ఆనవాయితీని ఆ సామాజికవర్గానికి చెందిన యువకులు నేటికి కొనసాగిస్తున్నారు.
ఉగాది తర్వాత రోజు నుంచి ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు కాలినడకన భద్రాచలం రాములోరి కళ్యాణానికి వెళ్తుంటారు. వారికి దమ్మపేటలో స్వాగతం పలికేందుకు నాడు పెద్దలు శ్రీకారం చుట్టిన ఆనవాయితీని నేటికి తాము కొనసాగిస్తున్నామని ఆ సంఘం నాయకుడు పగడాల రాంబాబు తెలిపారు. ఇది తమ తర్వాత తరాలు కూడా కొనసాగిస్తాయని ఆయన తెలిపారు.కార్యక్రమంలో యువకులు చిన్నశెట్టి గోపి, రమేష్, అప్పారావు,శశిధర్, భాస్కర్, జంగాల చిన్నపుల్లారావు, సత్యన్నారాయణ, రామిశెట్టి పుల్లారావు, వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment