Bhadrachalam Ram temple
-
భద్రాచలంలో యాంకర్ అనసూయ.. రాములోరిని దర్శించుకుని (ఫొటోలు)
-
భద్రాచలంలో ఉరకలేస్తున్న గోదావరి (ఫొటోలు)
-
Bhadrachalam Sri Rama Navami: భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు (ఫొటోలు)
-
భద్రగిరికి కళ్యాణ శోభ.. ఎదుర్కోలు వేడుకలో సీతా, రాముడు (ఫొటోలు)
-
ముక్కోటికి రెడీ! వీఐపీల తాకిడితోనే అసలు సమస్య!!
భద్రాచలం: ముక్కోటి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా ఈ నెల 22న రాత్రి గోదావరిలో హంసవాహనంపై రామయ్య తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 23న తెల్లవారుజామున ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరపనున్నారు. దీంతో ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. తెప్పోత్సవం జరిపే హంసవాహనం ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఉత్తర ద్వార దర్శనం వీక్షణకు సెక్టార్ల వారీగా విభజనతోపాటు ప్రధాన ద్వారాల వద్ద తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక ఆల పలుమార్లు సమీక్షలు జరిపారు. ఎస్పీ వినీత్‌తో కలిసి పర్యవేక్షించి పలు సూచనలు అందజేశారు. వీఐపీల తాకిడితోనే అసలు సమస్య! ప్రతి ఏడాది వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనికి తోడు వీఐపీ సెక్టార్లలో అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించి కిక్కిరిసి ఉండటం, నిలబడి వీక్షించడంతో వెనుక సెక్టార్లలో ఉన్న భక్తులు ఉత్తర ద్వార దర్శనంను వీక్షించే అవకాశం ఉండటం లేదు. ఈ సమస్యను అధికారులు గుర్తించి నివారించాల్సి ఉంది. ఈ ఏడాది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సైతం హాజరయ్యే అకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రుల అనుచరులు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు. దీంతో రద్దీ పెరిగి సెక్టార్లు, అంతరాలయం వద్ద సామాన్య భక్తులు ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. ఈ సమస్యను దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులు గమనించి అధిగమించాలని పలువురు కోరుతున్నారు. -
సీతారాముల కళ్యాణం లో కన్యాదానం
-
సీతారాముల కళ్యాణం లో తలంబ్రాలు
-
సీతారాముల కళ్యాణం లో మాంగల్యధారణ
-
మహా సంకల్పం
-
భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని
సాక్షి, అమరావతి/భద్రాచలం: తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మంత్రి కొడాలి నాని సోమవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కోసం చేయించిన రూ.13 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజికి మంత్రి అందజేశారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలూ శ్రమిస్తున్న సీఎం జగన్‌కు అవసరమైన శక్తిని ప్రసాదించాలని సీతారామచంద్రస్వామిని ప్రార్థించినట్టు చెప్పారు. -
సర్వంగా సుందరంగా ముస్తాబైన భద్రగిరి
-
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
-
నేడు పట్టాభిషేకం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి సోమవారం పట్టాభిషేకం చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియం వేదికపైనే పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపిస్తారు. సోమవారం ఉదయం మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మిథిలా స్టేడియంలో ఆశీనులను చేస్తారు. అనంతరం విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేస్తారు. తర్వాత పవిత్ర నదీ జలా లతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావిస్తారు. కల్యా ణంలో లాగే అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యా హ్నం 12గంటలకు రజిత సింహాసనంపై శ్రీ సీతారామచంద్రస్వామివారిని పట్టాభిషిక్తుడ్ని చేస్తారు. ఒక్కో ఆభరణం ధరింçపజేస్తూ... రాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీ. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం.. ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరిస్తా రు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన ముహూర్తంలోనే భద్రాచలంలో కూడా పట్టాభిషేకం నిర్వహించడం రామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. 60 ఏళ్లకు మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కర ప్రయుక్త సామ్రాజ్య పట్టాభిషేకం, ప్రతి యేటా కల్యాణం మరుసటి రోజున పట్టాభిషేకం నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో పట్టాభిషేక స్వర్గను పారాయణం చేస్తారు. వేడుక అనంతరం రామయ్యను అంతరాలయంలో వేంచేయింపజేస్తారు. హాజరుకానున్న గవర్నర్ ... శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సోమవారం నిర్వహించే పట్టాబిషేక మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు ఆలయ అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
దమ్మపేటలో తల తోరణం
దమ్మపేట: దమ్మపేటలో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆనవాయితీని నేటి తరం యువకులు కొనసాగిస్తున్నారు. ప్రతి తెలుగు సంవత్సరాది (ఉగాది) రోజు రాత్రి దమ్మపేట ప్రారంభంలో తలతోరణం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. దశాబ్ధాల క్రితం స్థానిక మున్నూరుకాపు రైతు పెద్దలు ఈ ఆనవాయితీకి అంకురార్పణ చేశారు. తర్వాత కాలంలో పెద్దలు చాలా మంది కాలం చేశారు. దీంతో నాడు పెద్దలు చేపట్టిన ఆనవాయితీని ఆ సామాజికవర్గానికి చెందిన యువకులు నేటికి కొనసాగిస్తున్నారు. ఉగాది తర్వాత రోజు నుంచి ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు కాలినడకన భద్రాచలం రాములోరి కళ్యాణానికి వెళ్తుంటారు. వారికి దమ్మపేటలో స్వాగతం పలికేందుకు నాడు పెద్దలు శ్రీకారం చుట్టిన ఆనవాయితీని నేటికి తాము కొనసాగిస్తున్నామని ఆ సంఘం నాయకుడు పగడాల రాంబాబు తెలిపారు. ఇది తమ తర్వాత తరాలు కూడా కొనసాగిస్తాయని ఆయన తెలిపారు.కార్యక్రమంలో యువకులు చిన్నశెట్టి గోపి, రమేష్, అప్పారావు,శశిధర్, భాస్కర్, జంగాల చిన్నపుల్లారావు, సత్యన్నారాయణ, రామిశెట్టి పుల్లారావు, వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
నేడు భద్రాద్రిలో ఘనంగా సీతారాముల వారి కల్యాణం
-
హనుమంత వాహనంపై శ్రీవారి ఊరేగింపు
సాక్షి, తిరుపతి : తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం శ్రీరామస్వామి వారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. స్వామి వారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు అశేషంగా తిరుమలకు చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోని ఒంటిమిట్ట, భద్రాచల దేవస్థానాల్లో సీతారామ కళ్యాణం కన్నులపండువగా జరగనుంది. -
సీతమ్మ పుస్తెలతాడు డీల్ ఎంత?
ఆలయంలోని ఆభరణాలు తీసుకెళ్లిందెవరు? - నీరుగారిన భద్రాద్రి నగల మాయం కేసు - మౌనం వహిస్తున్న ఆలయ అధికారులు - అర్చకుల మధ్య సాగుతున్న అంతర్గత పోరు - రామాలయంలో నిగ్గు తేలాల్సిన నిజాలెన్నో! భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు చర్చకు దారితీస్తున్నారుు. స్వామికార్యం పేరుతో కొందరు అర్చకులు, ఉద్యోగులు కలసి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. దేవా దాయశాఖ అధికారులు ఈ ఆలయం వ్యవహారాలపై దృష్టి సారించకపోవటం వెనుక ఏదో మతలబు దాగి ఉందనే ప్రచారం సాగుతోంది. ఆలయంలో బంగారు ఆభరణాలను మాయం చేసినా చర్యలు చేపట్టకపోవడంతో సదరు పూజారులు తమ పంథాను మార్చుకోవటం లేదు. నిత్య కల్యాణోత్సవంలో లక్ష్మణ స్వామికి లాకెట్ వేసి అలంకరణ చేయకపోవటం, ఆ విషయం పత్రికల ద్వారా బయట పడే వరకు దేవస్థానం అధికారులకు తెలియకపోవటం గమనార్హం. అసలు స్వామికి లాకెట్ ఎందుకు అలంకరించటం లేదనే విషయంపై కూపీ లాగితే.. కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నారుు. గత నెల 19న గర్భగుడిలోని బీరువా లోని సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ కనిపించకుండా పోరుున విష యం తెలిసిందే. వీటి కోసం 10 రోజుల పాటు అర్చకులంతా వెతికారు. దేవాదాయశాఖ ఆభరణాల తనిఖీ అధికారి పర్యవేక్షణలో మరోసారి స్వామి వారి నగలను పరిశీలించి.. ఆ 2 ఆభరణాలు కనిపించలేదని ప్రకటించారు. కానీ.. 10 రోజుల తర్వాత గర్భగుడిలోని అదే బీరువాలోని లాకర్లో ప్రత్యక్షమయ్యారుు. నగలు పోయాయని ధ్రువీకరించాక అక్కడే అవి కనిపించటం పెద్ద డ్రామాలా మారింది. ఈ ఎపిసోడ్లో ఓ అర్చకుడు ‘ప్రధాన’ పాత్ర పోషించాడని తెలిసినా అతడిపై చర్యలు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. నగల మాయం కేసు కూడా నీరుగారి పోరుుంది. నగలను మాయం చేసిందెవరనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇది అర్చకుల మధ్య అంతర్యుద్ధానికి దారితీస్తోంది. డీల్ చేసిందెవరు?: సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మ ణ స్వామి లాకెట్‌ను ఓ ఆధ్యాత్మిక సంస్థకు కట్టబెట్టే క్రమంలోనే వాటిని మాయం చేశారనే ప్రచారం సాగింది. ఆ సంస్థకు అప్పగించేందుకు వాటిని ఇక్కడి అర్చకుడు తీసుకెళ్లాడని, ఈలోగా అది బయటకు పొక్కటంతో తరువాత గుట్టుచప్పుడు కాకుండా యథాస్థానంలో పెట్టినట్లు అర్చకు ల్లో చర్చ సాగుతోంది. లక్ష్మణ స్వామి లాకెట్ ను మాత్రం అప్పటికే ఆ సంస్థకు ఇచ్చారని, దాని స్థానంలో కొత్తది చేరుుంచి పెట్టారనే ప్రచారం కూడా ఉంది. కొత్త ఆభరణాన్ని గుర్తించకుండా ఉండేందుకే దాన్ని స్వామి మెడ లో వేయటం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహా రంలో పెద్ద మొత్తంలోనే కానుకగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఓ అర్చకుడు ‘కీలక’ంగా వ్యవహరించగా అతడికి దేవస్థానంలోని ఇద్దరు ఉద్యోగులు మద్దతుగా నిలి చినట్లు ప్రచారం సాగుతోంది. విషయం బయటకు పొక్కినా హైదరాబాద్ స్థారుులో ఉన్న ఓ కీలక అధికారి వెన్నుదన్నుగా నిలవటంతోనే చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ పెద్దల మౌఖిక ఆదేశాలతో గతంలో పనిచేసిన అధికారి అంగీకరించడం తోనే ఈ డీల్ నడిచినట్లు విమర్శలున్నారుు. అర్చకులను బదిలీ చేస్తాం.. ఆలయ ఉద్యోగులను ఇప్పటికే బదిలీ చేశాం. అర్చకులకు కూడా షిప్టు విధానాన్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే వారిని కూడా బదిలీ చేస్తాం. ఈ విషయాన్ని ఇప్పటికే దేవాదాయ కమిషనర్, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. - రమేశ్‌బాబు, భద్రాచలం ఆలయ ఈవో దొరికిందల్లా దోచెయ్.. సీతమ్మ పుస్తెల తాడును దాచేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కొందరు ఉద్యోగులు అందినకాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఇచ్చే కానుకల నమోదు పుస్తకం మాయమైంది. అరుుతే 2 రోజుల తర్వాత ఇది కనిపించినప్పటికీ కొన్ని పేజీలు చినిగిపోవటం గమనార్హం. కాటేజీల్లో ఉండాల్సిన ఏసీని ఓ ఉద్యోగి తన ఇంట్లో బిగించాడు. వీటన్నింటిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, దాతలు ఇచ్చిన కానుకలను సైతం కొందరు అర్చకులు, ఉద్యోగులు కొల్లగొడుతుండటంపై సర్వత్రా ఆక్షేపణలు వస్తున్నారుు.