
సాక్షి, అమరావతి/భద్రాచలం: తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మంత్రి కొడాలి నాని సోమవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కోసం చేయించిన రూ.13 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజికి మంత్రి అందజేశారు.
అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలూ శ్రమిస్తున్న సీఎం జగన్‌కు అవసరమైన శక్తిని ప్రసాదించాలని సీతారామచంద్రస్వామిని ప్రార్థించినట్టు చెప్పారు.