సీతమ్మ పుస్తెలతాడు డీల్ ఎంత?
ఆలయంలోని ఆభరణాలు తీసుకెళ్లిందెవరు?
- నీరుగారిన భద్రాద్రి నగల మాయం కేసు
- మౌనం వహిస్తున్న ఆలయ అధికారులు
- అర్చకుల మధ్య సాగుతున్న అంతర్గత పోరు
- రామాలయంలో నిగ్గు తేలాల్సిన నిజాలెన్నో!
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు చర్చకు దారితీస్తున్నారుు. స్వామికార్యం పేరుతో కొందరు అర్చకులు, ఉద్యోగులు కలసి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. దేవా దాయశాఖ అధికారులు ఈ ఆలయం వ్యవహారాలపై దృష్టి సారించకపోవటం వెనుక ఏదో మతలబు దాగి ఉందనే ప్రచారం సాగుతోంది. ఆలయంలో బంగారు ఆభరణాలను మాయం చేసినా చర్యలు చేపట్టకపోవడంతో సదరు పూజారులు తమ పంథాను మార్చుకోవటం లేదు. నిత్య కల్యాణోత్సవంలో లక్ష్మణ స్వామికి లాకెట్ వేసి అలంకరణ చేయకపోవటం, ఆ విషయం పత్రికల ద్వారా బయట పడే వరకు దేవస్థానం అధికారులకు తెలియకపోవటం గమనార్హం.
అసలు స్వామికి లాకెట్ ఎందుకు అలంకరించటం లేదనే విషయంపై కూపీ లాగితే.. కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నారుు. గత నెల 19న గర్భగుడిలోని బీరువా లోని సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ కనిపించకుండా పోరుున విష యం తెలిసిందే. వీటి కోసం 10 రోజుల పాటు అర్చకులంతా వెతికారు. దేవాదాయశాఖ ఆభరణాల తనిఖీ అధికారి పర్యవేక్షణలో మరోసారి స్వామి వారి నగలను పరిశీలించి.. ఆ 2 ఆభరణాలు కనిపించలేదని ప్రకటించారు. కానీ.. 10 రోజుల తర్వాత గర్భగుడిలోని అదే బీరువాలోని లాకర్‌లో ప్రత్యక్షమయ్యారుు. నగలు పోయాయని ధ్రువీకరించాక అక్కడే అవి కనిపించటం పెద్ద డ్రామాలా మారింది. ఈ ఎపిసోడ్‌లో ఓ అర్చకుడు ‘ప్రధాన’ పాత్ర పోషించాడని తెలిసినా అతడిపై చర్యలు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. నగల మాయం కేసు కూడా నీరుగారి పోరుుంది. నగలను మాయం చేసిందెవరనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇది అర్చకుల మధ్య అంతర్యుద్ధానికి దారితీస్తోంది.
డీల్ చేసిందెవరు?: సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మ ణ స్వామి లాకెట్‌ను ఓ ఆధ్యాత్మిక సంస్థకు కట్టబెట్టే క్రమంలోనే వాటిని మాయం చేశారనే ప్రచారం సాగింది. ఆ సంస్థకు అప్పగించేందుకు వాటిని ఇక్కడి అర్చకుడు తీసుకెళ్లాడని, ఈలోగా అది బయటకు పొక్కటంతో తరువాత గుట్టుచప్పుడు కాకుండా యథాస్థానంలో పెట్టినట్లు అర్చకు ల్లో చర్చ సాగుతోంది. లక్ష్మణ స్వామి లాకెట్ ను మాత్రం అప్పటికే ఆ సంస్థకు ఇచ్చారని, దాని స్థానంలో కొత్తది చేరుుంచి పెట్టారనే ప్రచారం కూడా ఉంది. కొత్త ఆభరణాన్ని గుర్తించకుండా ఉండేందుకే దాన్ని స్వామి మెడ లో వేయటం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహా రంలో పెద్ద మొత్తంలోనే కానుకగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఓ అర్చకుడు ‘కీలక’ంగా వ్యవహరించగా అతడికి దేవస్థానంలోని ఇద్దరు ఉద్యోగులు మద్దతుగా నిలి చినట్లు ప్రచారం సాగుతోంది. విషయం బయటకు పొక్కినా హైదరాబాద్ స్థారుులో ఉన్న ఓ కీలక అధికారి వెన్నుదన్నుగా నిలవటంతోనే చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ పెద్దల మౌఖిక ఆదేశాలతో గతంలో పనిచేసిన అధికారి అంగీకరించడం తోనే ఈ డీల్ నడిచినట్లు విమర్శలున్నారుు.
అర్చకులను బదిలీ చేస్తాం..
ఆలయ ఉద్యోగులను ఇప్పటికే బదిలీ చేశాం. అర్చకులకు కూడా షిప్టు విధానాన్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే వారిని కూడా బదిలీ చేస్తాం. ఈ విషయాన్ని ఇప్పటికే దేవాదాయ కమిషనర్, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం.
- రమేశ్‌బాబు, భద్రాచలం ఆలయ ఈవో
దొరికిందల్లా దోచెయ్..
సీతమ్మ పుస్తెల తాడును దాచేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కొందరు ఉద్యోగులు అందినకాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఇచ్చే కానుకల నమోదు పుస్తకం మాయమైంది. అరుుతే 2 రోజుల తర్వాత ఇది కనిపించినప్పటికీ కొన్ని పేజీలు చినిగిపోవటం గమనార్హం. కాటేజీల్లో ఉండాల్సిన ఏసీని ఓ ఉద్యోగి తన ఇంట్లో బిగించాడు. వీటన్నింటిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, దాతలు ఇచ్చిన కానుకలను సైతం కొందరు అర్చకులు, ఉద్యోగులు కొల్లగొడుతుండటంపై సర్వత్రా ఆక్షేపణలు వస్తున్నారుు.