Endowments Department
-
అధికారికంగా క్రోధి ఉగాది వేడుకలు
సాక్షి, అమరావతి: క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. మంగళవారం తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు, ఆలయ అర్చకులను సత్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 9 గంటలకు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 18 మంది వేద పండితులను ఘనంగా సత్కరిస్తారు. అన్ని జిల్లాల్లో ఉగాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా వేదపండితులు, అర్చకులకు సన్మాన కార్యక్రమాల నిర్వహణకు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రతి జిల్లాలో 62 ఏళ్లకు పైబడిన అర్చకులు ఇద్దరిని, ఒక వేద పండితుడిని సత్కరించాలని సూచించారు. సన్మాన గ్రహీతలకు ప్రశంసాపత్రం, రూ.10,116 సంభావన, శాలువా, కొత్తవస్త్రాలు, పండ్లు అందజేస్తారు. -
4,500 కొత్త ఆలయాల్ని నిర్మించాం
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతోపాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆరి్థక సహాయం చేస్తోందన్నారు. 19 డీసీ, 22 ఏసీ పోస్టుల పదోన్నతి ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దేవదాయ శాఖలో కొత్తగా మంజూరు చేసిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కమిషనర్లుగానూ.. వివిధ ఆలయాల్లో గ్రేడ్–1 ఈవోలుగా, ఏఈవోలుగా, కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న మరో 22 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు. -
దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 ఏఈఈ (సివిల్), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్), మరో 30 టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) పోస్టులు కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నియామక ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం ప్రముఖ సంస్థ ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా’కు అప్పగించింది. ఏఈఈ పోస్టులకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్ అంశాలపైన, పది మార్కులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం, మరో పది మార్కులకు జనరల్ నాలెడ్జితో కూడిన మర్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవదాయ శాఖ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. దేవదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల పునరి్నర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపడుతోంది. రూ. 450 కోట్లకు పైగా పనులకు అనుమతులు తెలిపింది. అందులో రూ. 250 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరోపక్క టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో రూ. 300 కోట్ల ఖర్చుతో 3 వేల ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మరో రూ. 50 కోట్ల టీటీడీ ఆర్థిక సహాయంతో రాష్ట్రమంతటా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం సాగుతోంది. మరోవైపు దేవదాయ శాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటికీ వచ్చే 35 ఏళ్ల దాకా పెరిగే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయాల వారీగా కొత్త మాస్టర్ ప్లాన్లను రూపొందించింది. వాటికి అనుగుణంగా ఆ ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అత్యవసరంగా కాంట్రాక్టు విధానంలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టు దేవదాయ శాఖ పేర్కొంది. పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బందిని నియమిస్తున్నాం. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’కు అప్పగించాం. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) -
నాయీ బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ గూడ్ న్యూస్..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల కేశ ఖండనశాలల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేశ ఖండనశాలల్లో తలనీలాల కార్యక్రమం కనీసం వంద రోజులు కొనసాగే ఆలయాలలో ఇది వర్తిస్తుందని దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి (ఎఫ్ఏసీ) హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించే టిక్కెట్ ధరను రూ.40కి పెంచి ఆ మొత్తాన్ని సంబంధిత నాయీ బ్రాహ్మణులకే అందజేస్తారు. రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాల ద్వారా లభించే ఆదాయం రూ.20 వేల కంటే ఎక్కువగా ఉంటే అది కూడా మొత్తం సంబంధిత నాయీ బ్రాహ్మణులకే చెల్లిస్తారు. ఒకవేళ తగినంత డిమాండ్ లేక టికెట్ల అమ్మకం ద్వారా రూ. 20 వేల కంటే తక్కువ ఆదాయం లభిస్తే తలనీలాలు విక్రయాల ద్వారా సమకూరే మొత్తం నుంచి ఆమేరకు చెల్లించాలని నిర్ణయించారు. టికెట్టు ధర రూ.40కి పెంచడం ద్వారా కేశఖండన శాలలు వంద రోజుల లోపు పనిచేసే ఆలయాలలో సైతం నాయీ బ్రాహ్మణులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. నాడు చంద్రబాబు చిందులు.. టీడీపీ అధికారంలో ఉండగా తమకు కనీస ఆదాయం వర్తింపజేయాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తాజాగా జీవో విడుదలైంది. సముచిత స్థానం.. నాయీ బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే అరుదైన గౌరవాన్ని కల్పించిందని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డులో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చదవండి: స్పీచ్ అదిరింది.. వాస్తవాలు కళ్లకు కట్టారు.. టీడీపీ హయాంలో అవమానాలు ఎదుర్కొన్న తమకు సీఎం జగన్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర నేతలు గుంటుపల్లి రామదాసు, ఇతర నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు. -
అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యాలు జరగనున్నాయి. ఆలయాల అభివృద్ధి, నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మరో 2091 ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 30 వేల ఆదాయం కూడా లేక నిత్య పూజలు జరగని ఈ ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని (డీడీఎన్ఎస్) మంజూరు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: మూడు రాజధానుల కోసం.. ముందడుగు ఈ పథకం ద్వారా ప్రతి ఆలయానికి స్వామివార్ల ధూప, దీప, నైవేద్యం ఖర్చులకు నెలకు రూ.2,000, పూజారి గౌరవ వేతనం మరో రూ. 3000 చొప్పున నెలకు రూ. 5000 ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆలయ పూజారి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు. అక్టోబరు నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని, నవంబరు ఒకటో తేదీ తర్వాత చెల్లింపులు జరుగుతాయని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలవారీగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆలయాల వివరాలు, పూజారి పేరు, అతని బ్యాంకు ఖాతా వివరాలను కూడా పేర్కొన్నారు. దేవదాయ శాఖలో రిజిస్టర్ అయి ఉండి, గ్రామీణ ప్రాంతంలో రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూమి, ఐదెకరాల లోపు మెట్ట భూమి ఉండి ఆలయానికి అన్ని రకాల ఆదాయం రూ. 30 వేలకు మించని ఆలయాలనే ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ముందుగా జిల్లా దేవదాయ శాఖ అధికారులు ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారి ప్రతిపాదనలను కమిషనర్ కార్యాలయానికి పంపారు. వీటిని 11 మంది ఉన్నతాధికారులు పరిశీలించారు. ఒక్కొక్క అధికారి 20 ఆలయాలను ర్యాండమ్‌గా తనిఖీ చేసి నిర్ధారించుకున్న తర్వాతే తుది జాబితాను రూపొందించారు. ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఆలయాల ఎంపికను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ ప్రభుత్వాల హయాంలోనే.. గ్రామీణ ప్రాంతాల్లో తగినంత ఆదాయం లేక నిత్య పూజలకు నోచుకోని ఆలయాలకు 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ధూప, దీప, నైవేద్యం పథకాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో తొలుత దాదాపు 3,600 ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. రాష్ట్ర విభజన సమయానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1,900 ఆలయాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుండేది. 2014 తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఒక్క ఆలయానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. పైగా అప్పటిదాకా పనిచేస్తున్న పూజారులు చనిపోయిన ఆలయాలకు పథకాన్ని నిలిపివేయడం, ఇతర కారణాలతో 2019 ఎన్నికల సమయానికి ఆ ఆలయాల సంఖ్య 1,620కు తగ్గిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత మళ్లీ ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. తాజా ఆలయాలతో కలిపి ఈ మూడేళ్లలో ప్రభుత్వం 2,747 ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం 4,367 ఆలయాలు ప్రయోజనం పొందుతున్నాయి. -
Kanipakam: కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. -
బిస్కెట్లుగా దేవుడి నగలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ముఖ్య దేవాలయాల్లో మూలుగుతున్న బంగారు, వెండి ఆభరణాలు, వస్తువుల మూటలకు మోక్షం కలగనుంది. బంగారం బిస్కెట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా లాకర్ల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వడ్డీ రూపంలో ఆదాయం సమకూర్చుకునే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలోనే ప్రధాన దేవాలయం వేములవాడ.. భక్తుల కొంగుబంగారం. అందుకు తగ్గట్టుగానే అక్కడికి వచ్చే భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. ఇందులో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కూడా ఉంటాయి. అయితే స్వామికి అలంకరించే ఆభరణాలు పోను మిగతావి పదుల సంఖ్యలో మూటల్లో నింపి లాకర్లలో పడేశారు. రాష్ట్రంలోని భద్రాచలం, బాసర, కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమురవెల్లి, ధర్మపురి, వరంగల్ భద్రకాళి, ఉజ్జయినీ మహంకాళి.. ఇలా ముఖ్య దేవాలయాలన్నిటిలో ఇదే పరిస్థితి. భద్రాచలం దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఎక్కువ నగలను దేవతా మూర్తులకు అలంకరిస్తున్నారు. యాదగిరిగుట్టలో దేవాలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బంగారాన్ని కరిగించి ఆలయానికే వినియోగిస్తున్నారు. కానీ మిగతా దేవాలయాల్లో ఆభరణాలు, వస్తువులు, తుసుర్ల రూపంలో ఉన్న వెండి, బంగారం ఎన్నో ఏళ్లుగా లాకర్లలో మూలుగుతున్నాయి. అయితే ఇప్పుడవి బంగారం బిస్కెట్లలా మారనున్నాయి. తర్వాత అవి స్టేట్ బ్యాంకు అధీనంలోకి వెళ్లడం ద్వారా వడ్డీ రూపంలో దేవాదాయ శాఖకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరనుంది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద.. బంగారాన్ని డిపాజిట్ చేసే పని ఇప్పటికే మొదలు కాగా, తాజాగా వేల కిలోల వెండి.. దాని విలువకు తగ్గ బంగారం బిస్కెట్లుగా మారనుంది. వెండిని కరిగించి దానికి బదులుగా స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఇచ్చేందుకు మింట్ అంగీకరించింది. మొత్తం బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట్ చేయటం ద్వారా సాలీనా రూ.2.5 కోట్ల వడ్డీ దేవాదాయ శాఖకు అందుతుందని సమాచారం. ఇంతకాలం ఆ వెండి, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరిచినందుకు లాకర్ అద్దె, కొన్నింటికి బీమా చేయించినందుకు ప్రీమియం రూపంలో లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆ ఖర్చు మిగలనుంది. వేములవాడ ఆలయంతో మొదలు.. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో వినియోగంలో లేని బంగారం దాదాపు 425 కిలోలు ఉంది. అలాగే 18 వేల కిలోల వెండి లాకర్లలో మూలుగుతోంది. నిజానికి ఆలయాల్లో 38 వేల కిలోల వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. కానీ అందులో సగానికంటే కాస్త ఎక్కువ మాత్రమే వినియోగంలో ఉండగా మిగతావి లాకర్లలోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు కూడా నిధులు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ఆదాయాన్ని పెంచుకునే కసరత్తులో భాగంగా బంగారం, వెండి వస్తువులను స్టేట్ బ్యాంకు గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో భాగంగా డిపాజిట్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఆ మేరకు వినియోగంలో లేని బంగారాన్ని మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) ఆధ్వర్యంలో కరిగించి బిస్కెట్లుగా మార్చే కసరత్తు ప్రారంభమయ్యింది. ఇటీవలే కొంత బంగారాన్ని స్టేట్ బ్యాంకుకు అప్పగించారు. దాదాపు 70 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేయనున్నారు. మింట్ అధికారులతో చర్చ తాజా సమాచారం ప్రకారం.. బంగారాన్ని నేరుగా స్టేట్‌బ్యాంకే ఎంఎంటీసీలో కరిగిస్తుంది. అక్కడ 95 శాతం ప్యూరిటీ స్థాయికి తెప్పించి దాన్ని బిస్కట్లుగా మారుస్తారు. వెండి విషయంలో మాత్రం ఇటీవల మింట్ యంత్రాంగంతో దేవాదాయ శాఖ అధికారులు చర్చించారు. వెండిని కరిగించి పూర్తి స్వచ్ఛమైన వెండిలా మార్చి.. అప్పటి బులియన్ ధరల ప్రకారం దాని విలువను బంగారంతో లెక్కగట్టి.. అంత విలువైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కట్ల రూపంలో దేవాదాయ శాఖకు అందించేందుకు మింట్ అంగీకరించినట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలోని దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న 18 వేల కిలోల వెండిని మింట్‌కు అప్పగించనున్నారు. తొలుత వేములవాడ దేవాలయం వెండిని బిస్కెట్లుగా మార్చే పనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ దేవాలయంలోని 800 కిలోల వెండికి బదులుగా మింట్ నుంచి దాదాపు 8 కిలోల బంగారు బిస్కెట్లు సమకూరుతాయని అంచనా. అలా అన్ని దేవాలయాల్లోని వెండి ద్వారా దాదాపు 180 కిలోల వరకు బంగారం సమకూరుతుందని భావిస్తున్నారు. అంటే వంద కిలోల వెండికి కిలో బంగారం వస్తుందన్నమాట. -
వారం రోజులే టైం
-
పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట..
ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయ ఆదాయాన్ని ఆలయ కమిటీ ముసుగులో దోచేశారు. మాజీ మంత్రి పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలో పాతికేళ్లు ఆలయ నిర్వహణ కొనసాగింది. భక్తుల నుంచి ముడుపులు, కానుకలతో పాటు ఆలయ గదుల అద్దెలు, దుకాణాల వేలం పాట ద్వారా సమకూరిన ఆదాయాన్ని దిగమింగేశారు. నామమాత్రంగా ఆదాయం చూపుతూ భక్తులు అమ్మవారికి సమర్పించిన అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీల రూపంలోని చందాలను ఎంచక్కా ఇళ్లకు చేర్చుకున్నారు. ఎట్టకేలకు ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తేవడంతో దోపిyీ కి చెక్ పడింది. రామగిరి: కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ పూజలందుకుంటోంది. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో నసనకోట ఒకటి. ఇక్కడికి జిల్లా వ్యాప్తంగానే కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, శుక్ర వారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ముత్యాలమ్మ అమ్మవారికి కానుకల రూపంలో నగదు, చీర, సారెతో పాటు బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తుంటారు. రూ.లక్షల్లో ఆదాయం ఉంటున్నా రికార్డుల్లో మాత్రం నమోదు కాలేదు. పాతికేళ్లుగా పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలోనే కొనసాగుతూ వచ్చింది. చందాలు, కానుకల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి గానీ, నసనకోట గ్రామ అభివృద్ధికి గానీ వినియోగించిన దాఖలాలు లేవు. పాతికేళ్లుగా దోపిడీ.. మహిమాన్విత నసనకోట ముత్యాలమ్మ ఆలయం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం అధీనంలోనే పాతికేళ్లుగా ఉండేది. పరిటాల అనుచరులు, కుటుంబ సభ్యులే ఆలయ కమిటీ పేరుతో చెలామణి అయ్యేవారు. కమిటీ పేరుతో ఏడాదికి ఒకసారి ఆలయ గదులు, హుండీ, కానుకలు, కొబ్బరి కాయలు, మద్యం విక్రయం తదితర వాటికి వేలం వేసి నామమాత్రపు ఆదాయం చూపేవారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక కానుకలను సమర్పించడానికి వచ్చిన అనేక సందర్భాలలో కమిటీ సభ్యులు ఇంటి వద్దకే పిలిపించుకునే వారు. చెక్కులు, బంగారు, వెండి ఆభరణాలు ఆలయానికి వినియోగిస్తామని నమ్మబలికి భక్తుల నుంచి తీసుకునేవారు. ఆలయ కానుకలు, ఆదాయాన్ని భారీగా దోపిడీ చేస్తున్నారంటూ ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆందోళన చేశారు. భక్తులు అందజేసిన బంగారు ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోటలో విక్రయిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులే ఆరోపించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు దేవదాయ శాఖ పరిధిలోకి.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చొరవతో నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని నాలుగు నెలల కిందట దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ పరిటాల అనుచరులే పెత్తనం సాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి పది రోజులకు సంబంధించిన హుండీ కానుకలను ఈ నెల ఏడో తేదీన లెక్కించారు. అదీ మాఘమాసం.. జంతు బలులు తక్కువ ఇచ్చే సమయంలో రూ.77,343 ఆదాయం వచ్చినట్లు ఈఓ నర్సయ్య తెలిపారు. మిగతా రోజుల్లో హుండీ కానుకల ఆదాయం భారీగా ఉంటుందనేది తేటతెల్లమైంది. దేవదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత పరిటాల కుటుంబ కబంధ హస్తాల చెర నుంచి ముత్యాలమ్మ ఆలయానికి విముక్తి కలిగినట్లయ్యిందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇక నుంచైనా ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ఆలయ ఆదాయాన్ని వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పరిటాల కుటుంబానికి షాక్
సాక్షి, రాప్తాడు (అనంతపురం జిల్లా): నసనకోట ముత్యాలమ్మ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. నసనకోట ముత్యాలమ్మ.. ఈ పేరు జిల్లా నలుమూలలకే గాక కర్ణాటక రాష్ట్రంలోనూ వినిపిస్తుంది. కొన్నేళ్లుగా ముత్యాలమ్మ ఆలయం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. ఆలయ ఈఓగా బీవీ నర్సయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 25 ఏళ్లుగా రూ.కోట్లు కొల్లగొట్టారు గతంలో రామగిరి ప్రాంతంపై నక్సల్స్ ప్రభావం ఉండేది. ఈప్రాంతంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు, ఒకే కు టుంబానికి చెందిన వారే 25 ఏళ్లుగా మంత్రులు, ఎంఎల్ఏలుగా కొనసా గుతుండడంతో ఈప్రాంతంలో వారి ఆధిపత్యం కొనసాగుతోంది. 1992 నుంచి ఈఆలయం ఇప్పటి వరకు 27 ఏళ్ల కాలం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులే ఆలయ కమిటీ చైర్మన్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఏటా ఆలయంలో వేలం పాట, హుండీ, టెంకాయలు, వాహనాల పార్కింగ్, గదుల బాడుగలు, మద్యంవిక్రయం ఏడాదికి రూ.2కోట్ల వరకు ఆదాయం వచ్చేది. భక్తులు అమ్మవారికి చీర, సారెలతోపాటు బంగారు, వెండి ఆభరణాలేకాక అధిక మొత్తం డబ్బులను, చెక్కులను ఆలయ కమిటీ చైర్మన్‌కు స్వయంగా అందజేశారని వైఎస్సార్సీపీ నాయకులు జేష్ట్యరామయ్య, నారాయణరెడ్డి, సూర్యం, హెచ్ఎస్.ముత్యాలు, నాగభూషణం, రామలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామాంజనేయులు తెలిపారు. 19మంది సభ్యులతో ఆలయ కమిటీ ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులుగా తన అనుయానులనే 19 మందిని నియమించుకొని, కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న కొనసాగే వారు. అధికారికంగా రూ.కోటి, రూ.2కోట్లు ఆదాయం చూపిస్తున్నా ఆలయ విరాళాలను కమిటీ సభ్యులకుగానీ, గ్రామస్తులకు తెలియనిచ్చేవారు కాదన్న విమర్శలు ఉన్నాయి. బంగారు,వెండి ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోటలో విక్రయించేవారని ఆ యా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’లో ‘ముత్యాలమ్మకే శఠగోపం’ శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. అయి నా ఈ ప్రాంతంలో వారి ఆధిపత్యం కొనసాగింది. బందోబస్తుతో హాజరైన ఆలయ ఈఓ. గత ఆలయ కమిటీ సభ్యుల వివరాలను వెంటనే తెలియజేయాలని గదికి అంటించిన నోటీస్ కమిటీని రద్దు చేయాలని పోరాటం ముత్యాలమ్మ ఆలయ కమిటీ పేరుతో కొన్నేళ్లుగా మాజీ మంత్రి కుటుంబ సభ్యులు రూ.కోట్లు దండుకుంటున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గత ఎన్నికల సమయంలో విమర్శించినా అప్పట్లో ఫలితం లేకపోయింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు, దేవదాయశాఖ అధికారుల కు తెలిపినా పట్టించుకునేవారు కారు. ఆలయ దోపిడీపై పోరాటం చేస్తే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించింది. రెండు నెలల క్రితం ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి కొచ్చి, ఈఓ గా ఆనంద్‌ను నియమించారు. బాధ్యతలు స్వీక రించకుండా బెదిరించినట్లు విమర్శలు ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి కృషి ముత్యాలమ్మ ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఆలయ ఏఈఓగా బాధ్యతలు స్వీకరించిన బీవీ నర్సయ్య పేర్కొన్నారు. గతంలో కమిటీ సభ్యులు ఒక్కడ కొనసాగుతుండేవారని, ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి రావడంతో గత పాలకులు రికార్డులను బంగారు, నగల వివరాలను తెలియజేయాలని కమిటీ నిర్వహించే గదికి నోటీసులు అతికించినట్లు ఆయన తెలియజేశారు. రామగిరి ఎస్ఐ నాగస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నడుమ ఈఓ బాధ్యతలు స్వీకరించారు. -
దేవాదాయ ఆస్తులపై మంత్రి కన్నబాబు సమీక్ష
-
‘దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు’
సాక్షి, కాకినాడ: దేవాదాయ,ధర్మాదాయ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘దేవుని ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ భూములు,ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తాం’ అని కన్నబాబు తెలిపారు. కాకినాడ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో కొందరు దేవాదాయ భూములను అన్యాక్రాంతం చేశారని అన్నారు. భావనారాయణ స్వామి ఆలయం, భగ్గవరపు సత్రం, అన్నదాన సమాజం, నుకాలమ్మ మాన్యంకు చెందిన కొన్ని భూములు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించామని వెల్లడించారు. వాటిలో కొన్నింటిని వెనక్కి తీసుకుని ఆయా ఆలయాలకు అప్పగించామని చెప్పారు. ఇంకా ఆక్రమణల్లో ఉన్న భూములు, ఆస్తులను గుర్తించి వాటిపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. -
విడాకుల కేసులో జైలుశిక్ష.. సంతకం ఫోర్జరీతో ఉద్యోగం
హుండీలు మాయమవుతున్నాయి. దేవుడి పేరుతో వసూళ్లకు తెగబడుతున్నారు. దేవాలయ ఆదాయంలో చేతివాటం ప్రదర్శిస్తూ ఏకంగా దేవునికే శఠగోపం పెడుతున్నారు. తాజాగా ఫోర్జరీ సంతకంతో ఓ చిరుద్యోగి సంవత్సరాల తరబడి పాతుకుపోయి పెత్తనం చెలాయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ‘గుమస్తా’గిరికి రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి గాంచిన జంబుకేశ్వరస్వామి దేవాలయం వేదికగా నిలిచింది. జితేంద్రనాథ్ అనే వ్యక్తి ఏకంగా ట్రస్ట్ చైర్మన్ టి.నీలకంఠప్ప సంతకాన్ని ఫోర్జరీ చేసి గుమస్తాగా చెలామణి అవుతూ.. ఈవోలను మించిన దర్పం ప్రదర్శిస్తుండటం దేవాలయ వర్గాలతో పాటు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతపురం,రాయదుర్గం : గుంతకల్లు నియోజకవర్గం కసాపురం గ్రామానికి చెందిన జితేంద్రనాథ్ 1974లో జన్మించాడు. 1991–1993 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. తిరిగి 1995 మేలో ఇంటర్ పాసయ్యాడు. అదే సంవత్సరం 19 ఏళ్ల వయస్సుకే రాయదుర్గం ప్రాంతంతో సంబంధం లేకపోయినా జంబుకేశ్వరస్వామి ఆలయంలో గుమస్తాగా కుదురుకున్నాడు. అది కూడా ట్రస్ట్ చైర్మన్ నీలకంఠప్ప సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగం పొందినట్లు విమర్శలు ఉన్నాయి. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ నిజంగా గుమస్తాను నియమించినా.. అది కేవలం ఆ దేవాలయానికే పరిమితం అవుతుంది. అయితే జితేంద్రనాథ్ గ్రూపు దేవాలయాలకు అధికారిగా చెలామణి అవుతుండటం గమనార్హం. 2000 సంవత్సరంలో అప్పటి దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహరాజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, దేవదాయ శాఖ ద్వారా వేతనం పొందేందుకు సహాయం చేశారు. అయితే సర్వీసు రిజిష్టర్‌లో పేరు చేర్చకపోవడంతో ఇప్పటికీ ఆయన ఎస్ఆర్ ఉన్నతాధికారులకు చేరని పరిస్థితి ఉంది. సమాచారహక్కు చట్టంతో వెలుగులోకి జితేంద్రనాథ్ వ్యవహారశైలి నచ్చకపోవడతంతో బొమ్మనహాళ్‌కు చెందిన పయ్యావుల వెంకటరమణప్ప సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు కోరడంతో జితేంద్రనాథ్ బాగోతం బట్టబయలైంది. అప్పట్లో జంబుకేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న టి.నీలకంఠప్ప సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రుజువైంది. దొంగదారిలో గుమస్తాగా చేరిన జితేంద్రనాథ్పై చర్యలు తీసుకోవాలని పయ్యావుల వెంకటరమణప్ప దేవదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కర్నూలు డిప్యూటీ కమిషనర్ 2017లో రహస్యంగా విచారణ చేసి వెళ్లినట్లు తెలిసింది. అయితే జితేంద్రనాథ్పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వెంకటరమణప్ప హైకోర్టులో అప్పీలు చేశారు. సర్వీస్ రిజిష్టర్ కోసం తంటాలు ఎంతో మంది కార్యనిర్వహణాధికారులు బదిలీపై వచ్చి వెళ్లినా.. ఈయన వాలకాన్ని గమనించి ఉన్నతాధికారులకు ఎస్ఆర్ పంపకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. పంపితే ఏమవుతుందోనని భయపడి, తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని ఎవరికి వారు మౌనం వహిస్తూ వచ్చారు. జితేంద్రనాథ్ బదిలీపై ఇక్కడకు వచ్చిన ప్రతి ఈఓను ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేకపోతోంది. ఇతడి కారణంగానే ఇద్దరు ఈఓలు సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిసింది. భార్యకు విడాకుల కేసులో జైలుశిక్ష మొదటి భార్యకు విడాకుల కేసులో జితేంద్రనాథ్ మూడు నెలల పాటు జైలుశిక్ష అనుభవించినట్లు దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో సెలవు కూడా పెట్టలేదంటున్నారు. జైలుకెళ్లడం, ట్రస్ట్ చైర్మన్ సంతకం ఫోర్జరీ చేయడంతో 2015కు ముందున్న ఈఓ నరసింహరాజు ఉన్నతాధికారులకు జితేంద్రనాథ్ ఎస్ఆర్ పంపలేదు. ఈయనపై ఉన్న కేసులు, ఫోర్జరీ సంతకం విషయాలను ప్రస్తావించి, ఆ కారణాలతోనే ఎస్ఆర్ నమోదు చేయలేదని ఉన్నతాధికారులకు తెలిపినట్లు విశ్రాంత ఈఓ నరసింహరాజు చెబుతున్నారు. ఎస్ఆర్ పంపలేదు రాయదుర్గం గ్రూపు దేవాలయాల గుమస్తాగా ఉన్న జితేంద్రనాథ్కు ఎస్ఆర్ లేదు. కేవలం ఆయన ట్రస్ట్ చైర్మన్ నియమించిన గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదికూడా సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు కొంతమంది కోర్టులో కేసు వేశారు. గతంలో ఉన్న ఈఓలు ఎస్ఆర్ పంపించాల్సి ఉంది. కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. తదుపరి నిర్ణయాలు కోర్టు తీర్పును బట్టి ఉంటాయి. – కె.శ్రీనివాసులు, ఈఓ, రాయదుర్గం ఫోర్జరీ చేయలేదు నేను 1993లో ఇంటర్ ఫెయిల్ అయ్యాను. 1995 మేలో పాసయ్యాను. అదే సంవ త్సరం నవంబర్‌లో జంబుకేశ్వర స్వామి ఆలయ గుమాస్తాగా నియమింపబడ్డాను. ట్రస్ట్ చైర్మన్ సంతకం ఫోర్జరీ చేయలేదు. మొదటి భార్య విడాకుల కేసులో బెయిల్ పొందాను. జైలుశిక్ష అనుభవించలేదు.– జితేంద్రనాథ్, గుమస్తా,గ్రూపు దేవాలయాలు, రాయదుర్గం -
విదేశాలకూ దైవ ప్రసాదం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో ఉంటున్న నాగేందర్ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి. ఏటా తన పుట్టిన రోజున స్వామిని అర్చించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలనేది ఆయన కోరిక. కానీ వివిధ కారణాల వల్ల ఆయనకు యాదాద్రి వచ్చి దైవ దర్శనం చేసుకునేందుకు కుదరట్లేదు. దీంతో పుట్టిన రోజున ఏదో వెలితి ఆయనను వెంటాడుతోంది. ఇలాంటి ఎందరో ప్రవాస తెలుగువారు వేదన పడుతున్నారు. ఇకపై భక్తుల చింత తీరనుంది. కొద్దిరోజుల్లోనే వారి ఇలవేల్పు దేవాలయం నుంచి ఆయా దేశాల్లోని భక్తు ల చెంతకు స్వామివారి ప్రసాదం, అక్షింతలు, పసుపు–కుంకుమ చేరనున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో వారు కోరిన రోజున ఆలయంలో వారి పేరుతో పూ జాదికాలు నిర్వహించి ప్రసాదాన్ని వారికి పంపుతా రు. దేవాదాయశాఖ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతోంది. యాదగిరిగుట్టతో మొదలు.... విదేశాల్లోని భక్తులకు మానసిక సంతోషాన్ని కలిగించేలా వారి ఇష్టదైవం కొలువైన కోవెల నుంచి ప్రసాదం ఎందుకు వారికి చేరకూడదన్న ఉద్దేశంతో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించి దీనికి అనుమతి తీసుకున్న ఆయన... విదేశాలకు స్వామి ప్రసాదం చేరవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఐటీ శాఖను కోరారు. దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోవడం నుంచి విధివిధానాలను ఖరారు చేయడం వరకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల నుంచి ప్రారంభించే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా తొలుత యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంతో మొదలుపెట్టాలని నిర్ణయించారు. వీలైతే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి కూడా ఈ సేవ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇటీవలే బెల్లం ప్రసాదాల వితరణ ప్రారంభించి భక్తుల అభిమానాన్ని చూరగొన్న దేవాదాయశాఖ అదే ఉత్సాహంతో దేవాలయాల్లో నిర్వహించే ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు తదితరాల బుకింగ్‌ను ఆన్లైన్ చేసింది. ఇప్పుడు విదేశీ భక్తులకు ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. మరిన్ని దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు.... దేవాలయానికి వెళ్లేలోపే ఆర్జిత సేవలు, గదులను బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ సేవలకు ఇటీవలే దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో యాదాద్రి భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆన్లైన్ సేవలను మొదలుపెట్టింది. తొలుత యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, బాసర, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ సేవలను మొదలుపెట్టారు. జూలై 6వ తేదీ నుంచి వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం, ధర్మపురి, కొండగ ట్టు, కొమురవెల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణపతి దేవాలయాల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్ర ధాన ఆలయాల్లో మొదలుపెడతారు. విరాళాలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. నిల్వ ఎలా? రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో పులిహోర, లడ్డూ ప్రధాన ప్రసాదంగా ఉంది. పులిహోరను ఒక రోజుకు మించి నిల్వ చేసే అవకాశం లేనందున దాన్ని విదేశాలకు పంపరు. ఇక లడ్డూ కూడా రెండు మూడు రోజులే నిల్వ ఉంటుంది. దాన్ని గాలి చొరబడని ప్యాకింగ్‌లో ఉంచితే ఒక రోజుకు మించి నిల్వ ఉండదు. లడ్డూ నిల్వ ఉండాలంటే తిరుమల ప్రసాదం తరహాలో తేమ లేకుండా ఉండాలి. దీంతో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రసాదంగా స్వామి పసుపు–కుంకుమ, అక్షింతలు, ఇతర పూజా వస్తువులను పంపాలని నిర్ణయించారు. తేమ లేని లడ్డూ తయారీ, రవ్వతో చేసే పొడి ప్రసాదం తదితరాల విషయంలో తుది నిర్ణయం తీసుకొని దాన్ని అందించనున్నారు. -
కబ్జాల ఖాతాలో.. దేవుడి భూములు జమ!
సాక్షి, హైదరాబాద్ : దేముడి సొమ్మే కదా అని తేరగా స్వాహా చేసిన కబ్జాదారుల లెక్క తేల్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయ మాన్యం దాదాపు 87వేల ఎకరాలదాకా ఉంది. వీటిలో 24వేల ఎకరాల మేర అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంది. గుట్టు చప్పుడుగాకుండా గుడిని గుడిలో లింగాన్ని మింగేసే ఈ కబ్జాబాబుల దర్జాకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుంది. ధూప,దీప నైవేద్యం, దేవాలయాల పరిరక్షణ కోసం దాతలు వితరణ చేసిన భూములను పర్యవేక్షించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహించింది. దీంతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.కొన్ని చోట్ల లీజుదారుల కబంధహస్తాల్లో భూమి చిక్కుకుపోయింది. భూములపై నిర్దిష్ట సమాచారం లేకపోవడం, సర్వే నిర్వహించకపోవడంతో భూబకాసురుల చెర నుంచి విముక్తి చేయలేకపోయింది.ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఆలయాల భూముల లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలవారీగా మాన్యాల వివరాలను సేకరించిన దేవాదాయశాఖ.. వాటిని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.అలాగే విలువైన భూములను లీజుకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. సెల్ టవర్లు, దుకాణ సముదాయాలు, ఇతరత్రా వాణిజ్యావసరాలకు స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయం ఆలయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. 24వేల ఎకరాలు హాంఫట్! విలువైన దేవాలయ భూములకు రెక్కలొచ్చాయి. ప్రజాప్రతినిధులు మొదలు బడాబాబుల వరకు ఈ స్వాహాపర్వాన్ని కొనసాగించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్రంలోని సొమలింగేశ్వర స్వామి భూమి, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని వేణుగోపాలస్వామి మాన్యాలు కూడా కబ్జాకోరల్లో చిక్కుకున్నవే. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా 24వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,500 ఎకరాలు, హైదరాబాద్‌లో 2,200 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 1,800 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇందులో ఏకంగా 16వేల ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. భూముల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ దేవాలయ భూముల లెక్క తేల్చడానికి దేవాదాయ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. గత నెలలో దేవాలయాలవారీగా భూముల వివరాలను సేకరించింది. దేవుడి పేరిట భూములను దానం చేస్తే వాటి వివరాలను 43 రిజిష్టర్‌లో దేవాదాయ శాఖ నమోదు చేస్తుంది. ఇలా నోటిఫై చేసిన భూములపై సర్వహక్కులు దేవాదాయశాఖకే ఉంటాయి.వాటి వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకునేందుకు తాజాగా ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. 43 రిజిష్టర్‌లో నమోదైన భూమిలో ఎంతమేర కబ్జా అయ్యింది? ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? ఇనాం/కౌలు దారులున్నారా? తదితర సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తించిన మాన్యాలను కాపాడుకునేందుకు ప్రహారీగోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. అలాగే భూమిలో దేవాదాయ భూమిగా పేర్కొంటూ బోర్డులను పెడుతోంది. కాగా, ఇంకా 43 రిజిష్టర్‌లో నోటిఫై చేయని, ఇటీవల ఎక్కడైనా దానం చేసిన భూమి ఉంటే వాటి వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటోంది. రికార్డులను పకడ్బందీగా రూపొందించిన అనంతరం భూ సర్వే జరపాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో తేలిన దేవాలయాల భూముల జాబితాను పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ.. తమవద్ద ఉన్న లెక్కలతో సరిచూసుకుంటోంది. వీటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. భూ సర్వేకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ, సర్వే సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నందున.. జూన్‌లో ప్రతి దేవాలయ భూమిని సర్వే చేయించాలని నిర్ణయించింది. -
చలో మేడారం
సాక్షి, భూపాలపల్లి/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మరో పండగకు సిద్ధమవుతోంది. బుధవారం మండమెలిగె పండగతో ప్రారంభమయ్యే మినీ జాతరలో వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో రెండు సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తయిన ఏర్పాట్లు: భక్తులకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి కోసం ఎనిమిది ట్యాంకర్లతోపాటు జాతర పరిసరాల్లో 80 చేతి పంపులను మరమ్మతు చేసి వినియోగంలోకి తెచ్చారు. తాత్కాలికంగా ఏడు రెడీమేడ్ మరుగుదొడ్లను సిద్ధం చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వనదేవతల గద్దెల ప్రాంగణంలో విద్యుత్ దీపాలు అమర్చారు. చుట్టూ డెకరేషన్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగులో స్నాన ఘట్టాల వద్ద 15 షవర్లను బిగించారు. దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక ఏర్పాటు చేశారు. జాతర జరిగే నాలుగు రోజులు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 14 ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. శానిటేషన్ పనులకు 100 మంది కూలీలు: పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జాతరలో ఎక్కువగా వ్యర్థాలు పడేసే ఆరు ప్రాంతాలను గుర్తించామని, వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతామని డీపీఓ చంద్రమౌళి తెలిపారు. చెత్త డంపింగ్ కోసం తాత్కాలికంగా కుండీలను ఏర్పాటు చేశామన్నారు. 2017లో జరిగిన మినీ జాతర కంటే ఈసారి పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. పోలీసుల శాఖ సమాయత్తం: జాతరలో 300 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో విశాలమైన పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. -
ఎట్టకేలకు పంచలోహ విగ్రహాలకు విముక్తి
గోపవరం : కారణాలు ఏవైనా గత 40 సంవత్సరాలుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలకు విముక్తి లభించింది. పంచలోహ విగ్రహాలకు సంబంధించి సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మండలంలోని రాచాయపేటలో వెలసి ఉన్న పురాతన సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలైన పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ, ఇతర పూజా సామాగ్రిని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు ఇన్‌ఛార్జి ఈఓ వెంకటరమణారెడ్డి, సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలు గత 40 ఏళ్లుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్నట్లు గ్రామస్తులకు గాని సంబం«ధితశాఖ అధికారులకు గాని సమాచారం లేదు. అసలు పంచలోహ విగ్రహాలు ఉన్నాయన్న విషయం కూడా గ్రామస్తులకు తెలియదు. పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ వీటి విలువ రూ.70 లక్షలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. ఇటీవల మాజీ ధర్మకర్త భార్య అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు బీరువా తెరువగా అందులో పంచలోహ విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు ఆశ్చర్యానికి గురై ఆగమేఘాల మీద సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేసి విగ్రహాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అయితే ఇంత విలువైన విగ్రహాలు ఆలయానికి ఉన్నట్లు దేవాదాయశాఖ రికార్డుల్లో లేవు. కేవలం భూములు ఉన్నట్లు మాత్రమే రికార్డుల్లో పొందుపరిచారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు వెనకడుగు వేశారు. అయితే విగ్రహాలను స్వాధీనం చేసుకునే అంశంపై స్థానిక అధికారులపై మాజీ ధర్మకర్త కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు దేవాదాయశాఖ కమిషనర్ విగ్రహాలను స్వాధీనం చేసుకుని భద్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం రెవెన్యూ, పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో పంచలోహ విగ్రహాలకు పంచనామా నిర్వహించి దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలను బద్వేలు గోవిందయ్యమఠంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో భద్రపరిచారు. విగ్రహాల వివరాలు, పంచనామా నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఈఓ తెలిపారు. పంచనామాలో గోపవరం డిప్యూటీ తహసీల్దారు మధురవాణి, బద్వేలు రూరల్ ఎస్ఐ హేమాద్రి, వీఆర్ఓలు జగదీశ్వర్‌రెడ్డి, నరసింహులు, జెడ్పీటీసీ రమణయ్య, మాజీ ధర్మకర్త రాజగోపాల్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పేద భక్తులకు దివ్యదర్శనం కరువేనా ?
పలమనేరు: రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఆర్థికస్థోమత లేని పేద భక్తులకోసం ప్రభుత్వం దేవాదాయశాఖ ద్వారా చేపట్టిన దివ్యదర్శనం కార్యక్రమం పలమనేరులో అభాసుపాలైంది. అధికారులు దీనిపై సరైన ప్రచారం చేపట్టపోవడంతో ఆఖరిరోజు అందుబాటులో ఉన్నవారిని మాత్రం పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లారు. ఎన్నో ఆశలతో ఆలయం వద్దకొచ్చిన పేద భక్తులు చేసేదిలేక వెనుదిరిగారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి నెలా ఓ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆసక్తిగలవారు తమ ఆధార్ కార్డు ను స్థానిక ఈఓ కార్యాయంలో అందించి దరఖా స్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి ని నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని కాణిపాకం, తిరుపతి, తిరుమల, జొన్నవాడ, పెద్దకాకాని, విజ యవాడ, అమరావతి, సింగరాయకొండ, శ్రీకాళహస్తి దేవాలయాలకు అధికారులకు ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తారు. అయితే ఈ కార్యక్రమంపై దేవా దాయ శాఖ అధికారులు సరైన ప్రచారం చేపట్ట లేదు. మంగళవారం ఉదయం స్థానిక శివాలయం నుంచి నాలుగు బస్సులు బయలుదేరాయి. ఇందులో మండలంలోని గ్రామాలకు చెందిన వారిని కాకుండా ఆర్థికంగా డబ్బులున్న పట్టణ వాసులను ఎక్కువగా అప్పటికప్పుడు పిలిపించి తీసుకెళ్లారు. ఇది విమర్శలకు దారితీసింది. ఏదో రూపంలో సమాచారంఅందుకుని ఆలయం వద్దకొచ్చిన పేదభక్తులు తాము వస్తామని అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో తాము దివ్యదర్శనానికి నోచుకోకుండా పోయామని పలువురు భక్తులు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక దేవాదాయ శాఖ ఈఓ రమణను వివరణ కోరగా, ఆన్లైన్ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి తామేమీ చేయలేమన్నారు. ఈ కార్యక్రమం రెండేళ్లుగా సాగుతోందని ప్రతినెలా ఓ మండలవాసులను ఆలయాలకు తీసుకెళుతున్నామని తెలిపారు. ఇకపై మరింత ఎక్కువగా ప్రచారం చేస్తామని తెలిపారు. -
అయ్యో.. దేవా !
వాజేడు(భద్రాచలం) : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని లొట్టిపిట్టగండి వద్ద గుట్ట ల్లో కొలువైన భీరమయ్య(భీష్మశంకరుడు)ను కొలిచేందుకు భక్తులు ఏడాదికోసారి పోటెత్తుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా సౌకర్యాల లేమితో భక్తులు అవస్థలు పడుతున్నారు. వాజేడు మండల కేంద్రం నుంచి 21 కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు గుట్ట(గాటీ)పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు(రెండు రాష్ట్రాల సరిహద్దులో) వెళ్లే రహదారిలో గుట్టపై భీరమయ్య కొలువై ఉన్నాడు. ఈ గుట్టపై అటు ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ ఎలాంటి సౌకర్యాలను కల్పించక పోవడంతో భక్తుల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, పెద్దగంగారం, కడేకల్ గ్రామాలకు చెందిన గిరి జనులు భీరమయ్యను పూజిస్తున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుంచి జాత ర నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిరిజనులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం కాని ఇటు భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. సౌకర్యాల లేమి.. భీష్మశంకరుడిని ఆరాధించే గిరిజనులే జాతర సమయంలో భక్తుల అవసరాల కోసం ఆయిల్ ఇంజన్ ద్వారా తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక చేతి పంపును వేయించాలని ఎన్నిసార్లు గిరిజనులు, భక్తులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం పేరూరు ఎస్సైగా పనిచేసిన కాగితోజు శివప్రసాద్ చేతి పంపును రహదారి పక్కన వేయించారు. అదొక్కటే ప్రస్తుతం భక్తుల దాహార్తిని తీరుస్తోంది. మధ్యలో నిలిచిన గుడి నిర్మాణం.. సమీపంలోని నాలుగు గ్రామాల ప్రజలు భీరమయ్యకు గుడినిర్మాణం తలపెట్టా రు. నిధుల లేమి, ఇతర కారణాలతో గుడి నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. గిరిజనులు అధికారులకు, ఐటీడీఏకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో గుడిమధ్యలోనే ఆగిపోయింది. అటు ఐటీడీఏ, ఇటు ప్ర భుత్వం నిధులను కేటాయించకపోవడంతో దానిని నిలిపివేశారు. దానికి సమీపంలో స్వామి వారిని ప్రతిష్టించిన ప్రాంతంలో చిన్నమందిరాన్ని పోలీసుల సహకారంతో నిర్మించి పూజలు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయాలి.. భీరమయ్య గుడికి 2008లో భద్రాచలం ఐటీడీఏ నుంచి రూ 25 లక్షల నిధులను కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం జరి గింది. అప్పట్లో గుడినిర్మాణంతోపాటు గుట్ట ప్రాంతంలో సౌకర్యాలు ఏర్పడుతాయని ఈ ప్రాంత ప్రజానీకం సంతో షించారు. కాని కాలక్రమేనా వాటి ఊసేలేకుండా పోయింది. దీంతో గుడికి నిధులు మంజూరు భ్రమగానే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. నిత్యం పూజలు.. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతోపాటు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో భక్తుల తాకిడి స్వామికి ఎక్కువగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్లే ప్రతీ ఒక్కరూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లరు. 31 నుంచి 2 వరకు జాతర.. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు భీరమయ్య జాతరను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి టేకులగూడెం గ్రామస్తులు మైక్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ఈ జాతరకు గతంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపేవారు. మరి ఈ సంవత్సరం ఆ ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. -
ఆంధ్రజ్యోతి ప్రభుత్వమట!
కడప కల్చరల్: ‘పిచ్చి కుదిరింది.. తలకు రోకలి చుట్టండి..’అనే సామెత ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఓ తెలుగు పత్రిక వార్తా ఏజెన్సీకి అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఫలానా పత్రిక ఏజెన్సీ ద్వారా’ అంటూ పత్రికలకు అందే సమాచారంలో తెలియజేస్తారు. అయితే ఆ పత్రికపై ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఇష్టం తారాస్థాయికి పెరిగిందేమో.. ఏకంగా సర్కారు పేరే మార్చేశారు. మంగళవారం జిల్లా సమాచార శాఖ ద్వారా అందిన దేవాదాయ శాఖ ప్రెస్‌నోట్‌లో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘ఆంధ్ర జ్యోతి ప్రభుత్వం’అని ఉండటం గమనార్హం. దీన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై జిల్లా సమాచార శాఖ ఏడీని అడిగితే ఆ ప్రకటన అమరావతి కార్యాలయం నుంచి వచ్చిందని, యథాతథంగా పత్రికలకు పంపామని చెప్పుకొచ్చారు. -
చదువులమ్మ చెంత అపచారం
నిర్మల్: చదువులమ్మ కొలువైన బాసరలో అపచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆలయం మూసిన తర్వాత.. అమ్మవారు సేదదీరే సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో తామేం చేస్తే అదే శాసనం.. శాస్త్రమన్నట్లుగా ప్రవర్తించారు. సరస్వతీమాత ప్రాశస్త్యాన్ని, భక్తుల మనోభావాలను ఇక్కడి అధికారులు, పలువురు ధర్మకర్తలు తుంగలో తొక్కుతున్నారు. సేదదీరే సమయంలో.. బాసర సరస్వతీమాత క్షేత్రంలో శనివారం మధ్యాహ్నం ఆలయం మూసివేసిన తర్వాత (ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు ) అమ్మవారు సేదదీరే సమయంలో ఆలయ ధర్మకర్త నూకం రామారావు, మరో ధర్మకర్త భర్త, పలువురు టీఆర్ఎస్ నేతలు కలసి ప్రత్యేక పూజలు చేయించారు. ఇన్చార్జి ప్రధాన అర్చకుడు ఈ పూజలు చేశారు. అమ్మవారు సేదదీరే సమయంలో దర్శనాలను రద్దు చేసి, ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఇలాంటి సమయంలో పూజలు చేయడం మహాపాపంగా భావిస్తారు. ప్రధాన ద్వారాన్ని మూసి, పక్క ద్వారం గుండా లోపలికి వెళ్లి పూజలు నిర్వహించడంపై భక్తులు, బాసరవాసులు భగ్గుమంటున్నారు. ఆధిపత్యం తమదేనని.. అధికార పార్టీ నాయకులుగా, ఆలయ ధర్మకర్తలుగా ఉన్న పలువురు బాసర క్షేత్రంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో తమదే ఆధిపత్యమన్న ధోరణి తోనే ఇలా అపచారానికి ఒడిగట్టారన్న ఆరోపణలు వ స్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు సైతం వారికే వత్తాసు పలుకుతుండటంతో వారి పెత్తనానికి అడ్డులేకుండా పోతోందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలోనూ అపచారాలు.. బాసర ఆలయంలో అపచారాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. గతంలో ఆలయానికి వచ్చిన స్పీకర్, మంత్రులకు మర్యాదలు చేసే క్రమంలో అర్చ కులు అమ్మవారికి నైవేద్యాన్ని ఆలస్యంగా పెట్టారు. మరో అర్చకుడు అమ్మవారి ఆభరణాలతోనే గర్భగుడిలో పూజలు చేయించారు. ప్రాతఃకాల పూజలు ఆలస్యం కావడం, అర్చకులు విధులను ఎగ్గొట్టడం సాధారణం గా మారింది. ఆలయ నిర్వహణను పట్టించుకోవాల్సిన అధికారులు బినామీల పేరుతో నిధుల దోపిడీలో మునిగిపోయారు. ఈ క్రమంలో భక్తులు, బాసరవాసులే ఆలయ రక్షణకు ముందుకు వస్తున్నారు. విచారణ జరుపుతాం.. సరస్వతీ ఆలయంలో మధ్యాహ్నం సమయంలో పూజలు జరిపినట్లు నా దృష్టికి వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి దర్శనాలకు అనుమతిస్తుంటారు. కానీ ఇలా ప్రత్యేక పూజలు చేయడంపై విచారణ చేపడతాం. తదుపరి చర్యలు తీసుకుంటాం. – సోమయ్య, ఇన్చార్జి ఈవో, బాసర -
'దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయండి'
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్రంలో దేవాదాయశాఖను ప్రక్షాళన చేయాలని ఐవైఆర్ కోరారు. ఆలయాలను ఆదాయవనరుగా చూడొద్దని.. అలా చేయడం వల్ల సామాన్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆలయాల్లో నియమాలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. -
దాచిన భూమి ‘దారి’ కొచ్చింది
-
దాచిన భూమి ‘దారి’కొచ్చింది
దాచిపెట్టిన సత్రం భూముల్లో 1.13 ఎకరాలు ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి - తాజాగా ఈ మొత్తం కలుపుతూ సర్కార్ సవరణ నోటిఫికేషన్ - మిగతా 2.99 ఎకరాలపై ఇంకా కొనసాగుతున్న గోప్యం - ‘సాక్షి’ కథనంతో బట్టబయలైన ప్రభుత్వ పెద్దల భూ‘దోపిడీ’ సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల రెండో విడత వేలంలో భూముల వివరాలను దాచేసి దోచేద్దామన్న సర్కారీ పెద్దల పన్నాగాన్ని ‘సాక్షి’ ససాక్ష్యంగా బహిర్గతం చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. రెండో విడత వేలం నోటిఫికేషన్లో దాచేసిన 4.12 ఎకరాల్లో 1.13 ఎకరాల భూమి వివరాలతో ప్రభుత్వం మంగళవారం అనుబంధ వేలం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో సర్కారు దురుద్దేశం బట్టబయలు కాగా, మిగిలిన 2.99 ఎకరాల భూ వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారనే అనుమానాలు కలిగించింది. సదావర్తి సత్రం భూములకు తిరిగి బహిరంగ వేలం నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసేసరికి 83.11 ఎకరాల భూమి వేలానికి విడుదల చేసిన రెండోవిడత నోటిఫికేషన్లో కేవలం 78.99 ఎకరాల సర్వే నంబర్ల వివరాలను మాత్రమే పొందుపరచడంపై ఈనెల 2న ‘సాక్షి’ ప్రచురించిన కథనం తెలిసిందే. చెన్నై నగర సమీపంలో ఉన్న తాళంబూరు గ్రామ పరిధిలో సదావర్తి సత్రం పేరిట 37 వేర్వేరు సర్వే నంబర్లలో 78.99 ఎకరాల వివరాలతోనే ప్రభుత్వం గత నెల 28న రెండో విడత నోటిఫికేషన్ జారీచేయగా.. సాక్షి కథనం తర్వాత హఠాత్తుగా 1.13 ఎకరాల భూమి సర్వే వివరాలు వెలుగులోకి వచ్చాయంటూ ప్రభుత్వం మంగళవారం సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన 37 సర్వే నెంబర్లకు తోడు అదనంగా 22/11 సర్వే నెంబరు సత్రం పేరిట ఉన్న 1.13 ఎకరాలను వేలం ప్రక్రియలో చేర్చుతూ సవరణ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2.99 ఎకరాలపై ఇప్పటికీ గోప్యతే వేలానికి పెట్టిన 83.11 సత్రం భూముల్లో 2.99 ఎకరాల భూ వివరాలపై సర్కారు ఇప్పటికీ గోప్యత పాటిస్తోంది. మొత్తం 83.11 ఎకరాల భూమిలో 78.99 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు మాత్రమే చెప్పగా.. ‘మిగతా రోడ్లు’ అంటూ 28వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్లో సర్కార్ పేర్కొంది. అప్పుడు రోడ్లులో ఉందంటూ పేర్కొన్న 4.12 ఎకరాలలో ‘సాక్షి’ కథనం తర్వాత హఠాత్తుగా 1.13 ఎకరాల భూమి వివరాలు వెలుగులోకి రావడం అధికార వర్గాలను అశ్చర్యపర్చింది. ఈ అంశంపై సత్రం ఈవోని ‘సాక్షి’ ప్రతినిధి ఏమి అడిగినా.. ‘తాను సెలవులో ఉన్నాను. తననేమీ అడగవ’ద్దంటూ ముక్తసరి జవాబు ఇవ్వడంతోనే సరిపెట్టారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ కూడా దీనిపై స్పందించడానికి గతంలో నిరాకరించారు. కీలక నిబంధనల్లో మార్పు సదావర్తి సత్రం భూములకు రెండో విడత వేలం నిర్వహించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. సత్రం భూముల అమ్మకానికి 2016 మార్చి 28వ తేదీన జరిగిన వేలం ప్రక్రియకు కొనసాగింపుగానే 83.11 ఎకరాల భూమికి రూ.27.45 కోట్ల కనీస ధరగా నిర్ణయించి తిరిగి వేలం నిర్వహించాలని మాత్రమే కోర్టు ప్రభుత్వానికి సూచించిందని దేవాదాయ శాఖలోని పలువురు అధికారులే గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన వేలం ప్రక్రియను రద్దు చేయకుండా కోర్టు ఆదేశాల మేరకు తిరిగి వేలం నిర్వహిస్తుందంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వమైనా, దేవాదాయ శాఖ అయినా మొదట విడత వేలం నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలను అలాగే కొనసాగించాలి. కానీ, కొన్ని కీలకమైన నిబంధనలను మార్చేసి కొత్త నిబంధనలతో తిరిగి నోటిఫికేషన్ ఎలా జారీచేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాగా, వేలంలో నిర్ణయించిన ధర మొత్తాన్ని చెల్లించిన తర్వాత పాటదారుడు సొంత ఖర్చుతో ఆ భూములకు సత్రం ఈవో ద్వారా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని మొదటి విడత నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. తాజాగా రెండో విడత వేలం నోటిఫికేషన్‌కు వచ్చేసరికి.. భూముల కొనుగోలు చేసిన వారికి దేవాదాయ శాఖ రిజిస్ట్రేషన్ చేయదని ఆ నిబంధనను మార్చేసింది. కోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి ప్రభుత్వం ఇంతటి కీలకమైన నిబంధనలను ఎలా మార్చుతుందని ఆ శాఖలోని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే భూములెవరు కొంటారు? ఈ విషయంలో రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు.. వరుస పరిణామాలను చూస్తుంటే అత్యంత ఖరీదైన భూముల వేలంలో ఎవరూ పాల్గొనకుండా చేసి, తక్కువ ధరలకే ఆ భూములను తిరిగి దక్కించుకునే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వంలోని వారే రోజుకో నాటకానికి తెర తీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భూముల వివరాలను దాచిపెట్టి బహిరంగ వేలం నోటిఫికేషన్ జారీ అన్నది ప్రభుత్వ పెద్దల జోక్యం ఉంటే తప్ప అధికారుల స్థాయిలో ఇలాంటివి సాధ్యంకాదని ఆ శాఖకు చెందిన అధికారులే అంటున్నారు. భూములు రిజిస్ట్రేషన్ చేసేదిలేదని ప్రభుత్వమే చెబితే, దానికి సాధికారత ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయని భూములకు బ్యాంకుల నుంచి రుణాలు ఎలా సాధ్యమవుతాయని.. అంత భూమిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకొస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. -
అర్హత లేకున్నా డీసీగా పదోన్నతి!
- వేములవాడ రాజన్న ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా ఓ అధికారికి దొడ్డిదారిలో ప్రమోషన్ - హైకోర్టును ఆశ్రయించిన కొందరు అధికారులు సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖలో మరో అడ్డగోలు వ్యవహారం బట్టబయలైంది. తప్పుడు సీనియారిటీ జాబితా ఆధారంగా తాత్కాలిక పదోన్నతిపై కొనసాగుతున్న ఓ ఉన్నతాధికారికి ఏకంగా డిప్యూటీ కమిషనర్ పోస్టు కట్టబెట్టి దేవాదాయశాఖ అభాసుపాలైంది. తదుపరి ఖాళీ అయ్యే మరిన్ని డీసీ పోస్టులనూ ఇలాంటి వారికే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు వెలుగు చూసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులై నిబంధనల ప్రకారం ప్రొబెషన్ ఖరారైన అధికారులను కాదని ఆ ఉన్నతాధికారిని డిప్యూటీ కమిషనర్ పోస్టులో కూర్చోబెడుతూ కొద్దిరోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాన్ని హైకోర్టు తాజాగా కొట్టేసింది. గత పదోన్నతే వివాదంలో ఉన్నా... వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న రాజేశ్వర్‌కు దేవాదాయశాఖ మే నెలలో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. ఆయన సహాయక కమిషనర్ హోదాలో ఆర్జేసీ స్థాయిలో ఉన్న ఈ ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. అయితే కమిషనర్ నిర్ణయంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన సహాయ కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. వారి పటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం... దేవాదాయశాఖ ఇచ్చిన పదోన్నతి ఆదేశాన్ని రద్దు చేసింది. గతంలో సహాయ కమిషనర్ల పదోన్నతుల జాబితా రూపకల్పనలో జరిగిన గందరగోళంపైనే తీవ్ర వివాదం నెలకొంది. అర్హత లేనివారిని సీనియర్లుగా చూపుతూ ఈ జాబితా రూపొందించారన్న వ్యవహారం ఇప్పటికీ కోర్డులో పెండింగ్‌లో ఉంది. ఆ జాబితా ప్రకారం రాజేశ్వర్ గత పదోన్నతే వివాదంలో చిక్కుకొని ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆయన్ను డీసీ కుర్చీపై కూర్చోబెట్టి దేవాదాయశాఖ పరువు పోగొట్టుకుంది. -
దేవాలయాల్లో లీజుల దందా!
దేవాదాయ శాఖ దుకాణాల అద్దెల్లో గోల్మాల్ సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలోని ఓ దేవాలయం.. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది... ఆలయానికి అనుబంధంగా నిర్మించిన దుకాణాలూ రద్దీగానే ఉంటాయి. వాటిని లీజుకు తీసుకున్న వ్యక్తులు నెలకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తూ వాటిని రూ.15 వేలకు తిరిగి అద్దెకిచ్చుకుంటున్నారు. కమీషన్లతో కళ్లుమూసుకుపోయిన అధికారులు అంతా సవ్యంగానే ఉందంటూ బుకాయిస్తున్నారు. ఈ దందా ఏ ఒక్క దేవాలయానికో పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ దందా నడుస్తోంది.తాజాగా ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదులందగా, కొన్ని చోట్ల తనిఖీ చేసి అక్రమాలు నిజమేనని తేల్చింది. ఆదాయం సమకూరే అవకాశమున్నా.. దేవాలయాలకు అనుబంధంగా ఉన్న దుకాణాల ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా.. స్వయంగా అధికారులే ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అద్దెలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా దేవాదాయ శాఖ రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతోంది. సాధారణంగా దుకాణాలను లీజుకు తీసుకున్న వ్యక్తి మాత్రమే వాటిని నిర్వహించాలి. సబ్ లీజుకు ఇవ్వటానికి వీల్లేదు. కానీ చాలా చోట్ల లీజుదారులు అంతకు మూడు నాలుగు రెట్లు ఎక్కువగా దుకాణాలను ఇతరులకు అద్దెలకిచ్చి నయాపైసా పెట్టుబడి లేకుండా డబ్బులు పొందుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500కు పైగా దుకాణాల్లో గోల్మాల్ జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి. మఠాల్లో ముఠాలు..: దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ధార్మిక సంస్థలు, మఠాల ఆధ్వర్యంలో భారీగా స్థలాలున్నాయి. ఈ సంస్థలు, మఠాలు ఆయా స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించి అద్దెలకిస్తున్నారు. ఈ ఆదాయం వాటి నిర్వహణకు వినియోగించాలి. అయితే కొందరు మహంత్‌లు, నిర్వాహకులు వాటికి వచ్చే ఆదాయాలను జేబుల్లో నింపేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ మఠం పరిధిలో 50 దుకాణాలు న్నాయి. నెలనెలా రూ.లక్షల్లో అద్దెలొస్తాయి. దాని నిర్వాహకుడు ఆ మొత్తాన్ని సొంత ఖాతాలోకి మళ్లిస్తున్నాడు. అయినా ఉన్నతాధికారులు నోరు మెదపట్లేదు. దీంతో ఈ వ్యవహారంలో వారికీ వాటాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని మరో మఠంలో నిర్వాహకుడు ఏకంగా గుడికి తాళం వేసి సంబంధిత దుకాణాల అద్దెలను మాత్రం తీసుకుంటున్నాడు. కాచిగూడలో ఉన్న మరో ట్రస్టు నిర్వాహకులు దేవాదాయ శాఖ నిబంధనల నుంచి మినహాయిం పు పొందేలా ప్రభుత్వంలోని పెద్దల సాయంతో చక్రం తిప్పారు. ఇప్పుడు దర్జాగా అద్దెలను స్వాహా చేస్తున్నారు. -
సదావర్తి సత్రం భూములు మాకే దక్కాలి
అధికారులకు ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలు సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న రూ.1,000 కోట్ల విలువైన భూములను ఎలాగైనా కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడాది కాలంగా మరుగున పడి ఉన్న ఈ వ్యవహారాన్ని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారు. సత్రం భూములు తమకు దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి దేవాదాయ శాఖ అధికారులకు తాజాగా మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సదావర్తి సత్రం భూములపై బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. కమిషనర్ అనూరాధ, సత్రం ఫౌండర్ ట్రస్టీ సభ్యుడు వాసిరెడ్డి సుధాస్వరూప్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సత్రం భూముల అమ్మకంపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు త్వరగా పరిష్కారమై, తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై చర్చించారు. ఏడాది కిత్రం జరిగిన వేలం కథ సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో 83.11 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి విక్రయానికి గతేడాది మార్చి 28వ తేదీన దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. టీడీపీ పెద్దలకు కేవలం రూ.22.44 కోట్లకు వేలంలో కట్టబెట్టేందుకు పావులు కదిపారు. నిబంధనలన్నీ పక్కన పెట్టి వేలం ప్రక్రియను పూర్తి చేశారు. ఈ–వేలం విధానం జోలికే వెళ్లలేదు. అతి తక్కువ ధరకు వేలంలో భూమిని దక్కించుకున్న 8 మంది సభ్యుల బృందంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ భార్య, మరో ఇద్దరు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఉండడం గమనార్హం. -
7న నెల్లూరు నుంచి దివ్యదర్శనయాత్ర
నెల్లూరు : దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7నుంచి 10వ తేదీ వరకు దివ్యదర్శనయాత్ర చేపడుతున్నట్లు దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి తెలిపారు. దివ్యదర్శనయాత్రలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది భక్తులు రాష్ట్రంలోని తిరుచానూరు, తిరుమల, ఒంటిమిట్ట, మహానంది ,శ్రీశైలం దివ్యక్షేత్రాలను దర్శించనున్నారన్నారు. నాలుగు రోజుల జరిగే యాత్ర శ్రీశైలం నుంచి నర్రవాడ మీదుగా నెల్లూరు చేరుతుందన్నారు. దివ్యదర్శనయాత్ర 7వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరుతుందన్నారు. ఇప్పటికే దివ్యదర్శనయాత్రలో పాల్గొనే భక్తులకు ఇప్పటికే సమాచారం పంపామన్నారు. సమాచారం అందుకున్న భక్తులు మాత్రమే దివ్యదర్శనయాత్రకు రావాలని ఆయన తెలిపారు. -
ఘనంగా గీతా జయంతి
నల్లగొండ కల్చరల్ : భారతదేశం వేదభూమి భగవద్గీత ప్రపంచానికి మహోపదేశం చేసిన మహాగ్రంథం అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత అన్నారు. శనివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలోని హిందూ ధర్మ ప్రచార మండలి కార్యాలయంలో నిర్వహించిన గీతా జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయడం వల్ల భాషలో స్వచ్ఛత ఏర్పడి తద్వారా మాటలు అందంగా వినిపిస్తాయన్నారు. హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ మాట్లాడుతూ భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ హితబోధిని భగవద్గీత అని అన్నారు. గీతా జయంతి రోజును గురుపూజోత్సవంగా నిర్వహించాలని, భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. అనంతరం గీతా శ్లోక పఠన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతిని వి.అక్షర, రెండవ బహుమతిని సారుు సహస్రిత. 6, 7వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతిని వైష్ణవి, రెండవ బహుమతిని పల్లవి అందుకున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతిని బి.పల్లవి, రెండవ బహుమతిని జ్యోత్స్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కో - ఆర్డినేటర్ బి.సేవ్లా నాయక్, ప్రచార మండలి కార్యదర్శి అంకం మురళి, ఉపాధ్యక్షులు జ్యోతి, నన్నూరి రాంరెడ్డి, మారం శ్రీనివాస్, పెండ్యాల కృష్ణారావు, నీలకంఠం జనార్ధన్, అంజయ్య, ఉమేష్, త్రివేది తదితరులు పాల్గొన్నారు. -
‘దేవాదాయం’.. ఇక పోలీసు అధీనం!
- ఆలయాల్లో అక్రమాల అడ్డుకట్టకే.. - అర్చకులు, ఉద్యోగుల వేతననిధి ఏర్పాటు - కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గ ఉపసంఘం - ఎజెండాపై అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ చర్చ సాక్షి, హైదరాబాద్: దేవాదాయం.. ఇక పోలీసుల అధీనం కానుంది. దేవాలయాల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దేవాదాయశాఖను పోలీసు విజిలెన్స్ పరిధిలోకి తెచ్చేదిశగా అడుగులు వేస్తోంది. దేవాదాయ శాఖకు ప్రత్యేక విజిలెన్స్ విభాగమున్నా, సంబంధిత అధికారులు కమిషనర్ కార్యాలయానికే పరిమితం కావటం, నామమాత్రంగా తని ఖీలు జరుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోకపోతుండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. స్వామివారి ప్రసాదం సరుకులను, భక్తులిచ్చిన కైంకర్యాలను కూడా స్వాహా చేసేస్తున్నారు. దీంతో పోలీసు విజిలెన్స్ ద్వారా తనిఖీ చేయిస్తేనే పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో దీనిపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆక్రమణల తొలగింపునూ పోలీసు పర్యవేక్షణలో చేపట్టేవిధంగా నిబంధనలు మార్చడంపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ ఉప సంఘం భేటీలో చర్చించాల్సిన అంశాలపై దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, ఆర్జేసీలు శ్రీనివాసరావు, కృష్ణవేణిలతో చర్చించారు. వేతన నిధికి రూ.102 కోట్లు అవసరం ఆలయ ఉద్యోగులు, అర్చకులకు వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసే కేంద్రనిధికి రూ.102 కోట్లు అవసరమవుతాయన్న అంచనాకు వచ్చి అధికారులు మంత్రి ముందు లెక్కలుంచారు. ఆలయ సిబ్బంది పెంపు తదితర అంశాలనూ ఎజెండాలో ఉంచాలని నిర్ణయించారు. -
దేవాదాయశాఖలో పదోన్నతుల దందా
సాక్షి, హైదరాబాద్: కోర్టు కేసులు పట్టవు... సీనియారిటీతో సంబంధంలేదు..కావాల్సిన వారికి పదోన్నతులు కల్పించడమే లక్ష్యం. ఇదీ దేవాదాయశాఖలో తీరు. ఈ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉన్నత పోస్టుకు పదోన్నతి కల్పించే విషయంలో కొందరు అధికారులు సాగించిన అడ్డగోలు నిర్వాకం. తప్పులతడకగా రూపొందించిన సీనియారిటీ లిస్టును ఆసరాగా చేసుకుని పదోన్నతులు ఇచ్చేశారు. దీనిపై కొందరు కోర్టులో సవాల్ చేశారు. వాస్తవజాబితా రూపొందించాల్సింది పోయి హడావుడిగా పదోన్నతులిచ్చేశారు. ఇప్పుడు మరోసారి దీన్ని సవాల్ చేస్తూ కోర్టు తలుపు తట్టేందుకు కొందరు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో 20 మంది అసిస్టెంట్ కమిషనర్లను నియమించాలని ఆ శాఖ నిర్ణయించింది. దేవాలయాల్లోని గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులు, ఏసీ, డీసీ, ఆర్జేసీ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు, డీసీ, ఆర్జేసీ స్థాయి దేవాలయాల్లోని సహాయ కార్యనిర్వహణాధికారులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక్కడే మ తలబు జరిగింది. తమకు అనుకూలంగా ఉన్న వారిని పైకి తీసుకొచ్చి అడ్డదిడ్డంగా వాటిని రూపొందించారు. దీంతో అర్హుల సా ్థనంలో జూనియర్లు అందలమెక్కారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా వీటినే ఖరారు చేసేశారు. అభ్యంతరాలివీ.. - దేవాలయాల్లో ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు మొత్తం ఆదాయంలో 30 శాతానికి మించరాదు. అలాంటి ఆలయాల్లోనే కొత్త నియామకాలు జరగాలి. దానికి విరుద్ధంగా జరిగిన వాటిని అక్రమంగా పరిగణించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. - 2014లో గ్రేడ్-1 ఈఓ పదోన్నతి పొందాల్సినవారు 2011లోనే ఆ పదోన్నతి వచ్చినట్టుగా జాబితాలో చూపినట్టు సమాచారం. - అసిస్టెంట్ కమిషనర్పోస్టుల దామాషాను మారుస్తూ ఈ ఏడాది జనవరిలో జీఓ5 విడుదలైంది. కానీ దాన్ని 2014 నుంచి అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్న వాదన ఉంది. - కొందరు ఉద్యోగులు 2008లో ఈఓలుగా పదోన్నతి పొందగా దానిపై కోర్టు కేసులు దాఖలు కావటంతో వారి విషయంలో 2011ను పరిగణనలోకి తీసుకోవాలి, కానీ 2008లోనే పదోన్నతినే గుర్తించి జాబితా రూపొందించారు. - దేవాలయాల్లో పాలకమండళ్ల చేత నియమితులయ్యేవారు అదే దేవాలయంలోనే పదోన్నతి పొందాలి. వారు కనీసం ఐదేళ్లపాటు పనిచేస్తేనే పదోన్నతి రావాలి. కానీ ఈలోగానే వేరే దేవాలయాలకు మా రి అక్రమంగా పదోన్నతులు పొందినవారికి ఇప్పుడు ఏసీగా ప్రమోట్ చేశారు. -
సీతమ్మ పుస్తెలతాడు డీల్ ఎంత?
ఆలయంలోని ఆభరణాలు తీసుకెళ్లిందెవరు? - నీరుగారిన భద్రాద్రి నగల మాయం కేసు - మౌనం వహిస్తున్న ఆలయ అధికారులు - అర్చకుల మధ్య సాగుతున్న అంతర్గత పోరు - రామాలయంలో నిగ్గు తేలాల్సిన నిజాలెన్నో! భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు చర్చకు దారితీస్తున్నారుు. స్వామికార్యం పేరుతో కొందరు అర్చకులు, ఉద్యోగులు కలసి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. దేవా దాయశాఖ అధికారులు ఈ ఆలయం వ్యవహారాలపై దృష్టి సారించకపోవటం వెనుక ఏదో మతలబు దాగి ఉందనే ప్రచారం సాగుతోంది. ఆలయంలో బంగారు ఆభరణాలను మాయం చేసినా చర్యలు చేపట్టకపోవడంతో సదరు పూజారులు తమ పంథాను మార్చుకోవటం లేదు. నిత్య కల్యాణోత్సవంలో లక్ష్మణ స్వామికి లాకెట్ వేసి అలంకరణ చేయకపోవటం, ఆ విషయం పత్రికల ద్వారా బయట పడే వరకు దేవస్థానం అధికారులకు తెలియకపోవటం గమనార్హం. అసలు స్వామికి లాకెట్ ఎందుకు అలంకరించటం లేదనే విషయంపై కూపీ లాగితే.. కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నారుు. గత నెల 19న గర్భగుడిలోని బీరువా లోని సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ కనిపించకుండా పోరుున విష యం తెలిసిందే. వీటి కోసం 10 రోజుల పాటు అర్చకులంతా వెతికారు. దేవాదాయశాఖ ఆభరణాల తనిఖీ అధికారి పర్యవేక్షణలో మరోసారి స్వామి వారి నగలను పరిశీలించి.. ఆ 2 ఆభరణాలు కనిపించలేదని ప్రకటించారు. కానీ.. 10 రోజుల తర్వాత గర్భగుడిలోని అదే బీరువాలోని లాకర్లో ప్రత్యక్షమయ్యారుు. నగలు పోయాయని ధ్రువీకరించాక అక్కడే అవి కనిపించటం పెద్ద డ్రామాలా మారింది. ఈ ఎపిసోడ్లో ఓ అర్చకుడు ‘ప్రధాన’ పాత్ర పోషించాడని తెలిసినా అతడిపై చర్యలు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. నగల మాయం కేసు కూడా నీరుగారి పోరుుంది. నగలను మాయం చేసిందెవరనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇది అర్చకుల మధ్య అంతర్యుద్ధానికి దారితీస్తోంది. డీల్ చేసిందెవరు?: సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మ ణ స్వామి లాకెట్‌ను ఓ ఆధ్యాత్మిక సంస్థకు కట్టబెట్టే క్రమంలోనే వాటిని మాయం చేశారనే ప్రచారం సాగింది. ఆ సంస్థకు అప్పగించేందుకు వాటిని ఇక్కడి అర్చకుడు తీసుకెళ్లాడని, ఈలోగా అది బయటకు పొక్కటంతో తరువాత గుట్టుచప్పుడు కాకుండా యథాస్థానంలో పెట్టినట్లు అర్చకు ల్లో చర్చ సాగుతోంది. లక్ష్మణ స్వామి లాకెట్ ను మాత్రం అప్పటికే ఆ సంస్థకు ఇచ్చారని, దాని స్థానంలో కొత్తది చేరుుంచి పెట్టారనే ప్రచారం కూడా ఉంది. కొత్త ఆభరణాన్ని గుర్తించకుండా ఉండేందుకే దాన్ని స్వామి మెడ లో వేయటం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహా రంలో పెద్ద మొత్తంలోనే కానుకగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఓ అర్చకుడు ‘కీలక’ంగా వ్యవహరించగా అతడికి దేవస్థానంలోని ఇద్దరు ఉద్యోగులు మద్దతుగా నిలి చినట్లు ప్రచారం సాగుతోంది. విషయం బయటకు పొక్కినా హైదరాబాద్ స్థారుులో ఉన్న ఓ కీలక అధికారి వెన్నుదన్నుగా నిలవటంతోనే చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ పెద్దల మౌఖిక ఆదేశాలతో గతంలో పనిచేసిన అధికారి అంగీకరించడం తోనే ఈ డీల్ నడిచినట్లు విమర్శలున్నారుు. అర్చకులను బదిలీ చేస్తాం.. ఆలయ ఉద్యోగులను ఇప్పటికే బదిలీ చేశాం. అర్చకులకు కూడా షిప్టు విధానాన్ని అమలు చేస్తున్నాం. త్వరలోనే వారిని కూడా బదిలీ చేస్తాం. ఈ విషయాన్ని ఇప్పటికే దేవాదాయ కమిషనర్, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. - రమేశ్‌బాబు, భద్రాచలం ఆలయ ఈవో దొరికిందల్లా దోచెయ్.. సీతమ్మ పుస్తెల తాడును దాచేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కొందరు ఉద్యోగులు అందినకాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఇచ్చే కానుకల నమోదు పుస్తకం మాయమైంది. అరుుతే 2 రోజుల తర్వాత ఇది కనిపించినప్పటికీ కొన్ని పేజీలు చినిగిపోవటం గమనార్హం. కాటేజీల్లో ఉండాల్సిన ఏసీని ఓ ఉద్యోగి తన ఇంట్లో బిగించాడు. వీటన్నింటిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, దాతలు ఇచ్చిన కానుకలను సైతం కొందరు అర్చకులు, ఉద్యోగులు కొల్లగొడుతుండటంపై సర్వత్రా ఆక్షేపణలు వస్తున్నారుు. -
సాగర్‌బాబు ఇంటిపై ఏసీబీ దాడులు
-
ఆలయాల్లో వరుణయాగం
నెల్లూరు(బృందావనం): దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ఆలయాల్లో శుక్రవారం గో పూజలు, వరుణసూక్త పారాయణం, వరుణజపం, వరుణయాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగనాయకులపేటలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షణలో పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, సభ్యుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి జగన్నాథాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరాలయంలో పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం, బాలాజీశర్మ, శ్రీశైలం భార్గవశర్మ, ధూర్జటి వేణుగోపాలశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆలయ పాలకమండలి చైర్మన్ ఆల్తూరు గిరీష్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. మూలాపేటలోని ద్రౌపతీదేవి సమేత కృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో అర్చకులు మునిలక్ష్మయ్య, చక్రపాణి, రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాలకమండలి చైర్మన్ కంచి నాగేశ్వరరావు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. -
సత్రం భూముల దోపిడీ నిజమే!
- వాస్తవ ధర తెలిసినా చౌకగా విక్రయం - వేలం ధర తగ్గింపుపై మౌనం - కీలక ప్రశ్నలకు వివరణ ఇవ్వని మంత్రి మాణిక్యాలరావు సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల విక్రయంలో భారీ దోపిడీ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ పత్రమే తేటతెల్లం చేస్తోంది. భూముల వాస్తవ ధర ఎంత ఉందో తెలిసినా 83.11 ఎకరాలను చౌకగా విక్రయించడానికి అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం అంగీకరించింది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న అత్యంత విలువైన సత్రం భూములను అధికార పార్టీ నేతలు వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ.1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు మంగళవారం విజయవాడలో వివరణ ఇచ్చారు. నోట్ కూడా విడుదల చేశారు. భూముల వేలానికి మార్చి 1వ తేదీన దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని... రెండు రోజుల్లో(3వ తేదీ)నే భూమి ధరకు సంబంధించి తమిళనాడులోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆరా తీసినట్లు మంత్రి తన వివరణలో పేర్కొన్నారు. మార్చి 3న ఆరా తీసినప్పుడు సత్రం భూములు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగు రూ.1,700 చొప్పున ఎకరాకు రూ.6 కోట్ల వరకు ధర ఉన్నట్లు తెలుసని అంగీకరించారు. భూముల ధర తగ్గించారెందుకు? ఎక రం ధర రూ.6 కోట్ల వరకు ఉందని తెలిసినా, సదావర్తి సత్రం భూములు ఆక్రమణలో ఉన్నాయన్న సాకుతో వేలం సమయంలో ఎకరా రూ.50 లక్షలు బేసిక్ ధరగా నిర్ణయించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ సమయంలో ఎకరం ధరను రూ.27 లక్షలకు ఎందుకు తగ్గించి అమ్మాల్సి వచ్చిందన్న దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. విజయవాడ దుర్గ గుడి వద్ద ఈ ఏడాది చెప్పుల షాపు నిర్వహణకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. గతేడాది కన్నా రూ.2 లక్షలు తక్కువకు పాట వచ్చిందని రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి అనుమతించి ంది.కానీ రూ.1,000 కోట్ల విలువైన భూముల వేలంలో ఈ జాగ్రత్తలు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్రంలో ఏ గుడి అధీనంలోని దుకాణాన్నైనా అద్దెకు ఇవ్వాలంటే దేవాదాయశాఖ ఈ-టెండర్ అమలు చేస్తోంది. అలా పిలవకుండా బహిరంగ వేలం నిర్వహించింది. దీని గురించి అధికార పార్టీ నేతలు మినహా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడింది.ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సర్కార్ చెప్పడం లేదు. వేలం తర్వాత అనుమతికీ తొందరే దేవాదాయ శాఖలో నాలుగైదు ఏళ్ల క్రితం వేలంలో భూములను దక్కించుకున్నా వాటిని వారు స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సత్రం భూముల విషయంలో మాత్రం మార్చి 28న వేలం జరగ్గా ఏప్రిల్ 24నే పాటదారుకు అప్పగించాలని నిర్ణయించింది. -
అన్ని ఆలయాలకు బోనాల నిధులు
ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి నాయిని సమీక్ష సాక్షి, హైదరాబాద్: బోనాల పండుగ నిర్వహణ కోసం హైదరాబాద్‌లోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం తరఫున నిధులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే గుళ్లతో పాటు మిగతా వాటికి సైతం నిధులు ఇస్తామన్నారు. బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీని కోసం రూ.5 కోట్ల నిధులను కేటాయించారన్నారు. అవసరమైతే ఇంకా నిధులను పెంచాలని కేసీఆర్‌ను కోరతామన్నారు. బోనాల పండుగ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో నాయిని ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ.. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించింది. అనంతరం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి హోంమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఒకేసారి వచ్చిన రంజాన్, బోనాల పండుగలను కలసిమెలసి ప్రశాంతంగా జరుపుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ నెల 24, 25న సికింద్రాబాద్‌లో, 30, 31న పాతబస్తీలో, వచ్చే నెల 7న గోల్కొండలో బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు. గతంలో గుళ్ల పరిసర ప్రాంతాల్లో చందాలు వసూలు చేసి బోనాలు నిర్వహించేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే నిధులను కేటాయిస్తోందని మంత్రి తలసాని అన్నారు. ప్రభుత్వమిచ్చే రూ.5 కోట్ల నిధులను నగరంలోని గుడి స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.3 లక్షల వరకు కేటాయిస్తామన్నారు. అలాగే జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, పర్యాటక, దేవాదాయ తదితర శాఖల ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు రూ.80 కోట్లను ఖర్చు చేయనున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. -
‘సత్రం’ ఫైల్.. సూపర్‌ఫాస్ట్
ఈవో, కమిషనర్ మధ్య నేరుగా ఉత్తరప్రత్యుత్తరాలు సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రం భూముల దోపిడీ వ్యవహారం బట్టబయలు కావడంతో దేవాదాయ శాఖ అధికారులుఆశ్చర్యచకితులవుతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో నామమాత్రపు ధరకు భూముల అమ్మకానికి సంబంధించిన ఫైల్ పట్ల కమిషనర్ కార్యాలయంలోని ముఖ్య అధికారులు ఎందుకంత ప్రత్యేక ఆసక్తి కనబరిచారో స్పష్టత వచ్చిందంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఫైల్ కదలాలంటే సుదీర్ఘకాలం వేచిచూడాల్సిందే. ఫైల్‌కు మోక్షం లభించాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. సదావర్తి సత్రం భూముల అక్రమం ఫైల్ మాత్రం చకచకా ముందుకు కదిలింది. బడాబాబుల ప్రమేయం వల్లే ఫైల్‌కు ప్రాధాన్యం సదావర్తి సత్రం భూముల ఫైల్లో ఎక్కువ భాగం ఉత్తరప్రత్యుత్తరాలను సత్రం కార్యనిర్వహణాధికారి(ఈవో) నేరుగా దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు చేర్చేవారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దేవాదాయ శాఖలో ఒక ఈవో నుంచి కమిషనర్ కార్యాలయానికి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు నడవాలన్నా మధ్యలో డిప్యూటీ కమిషనర్ లేదా జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. సత్రం భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రమేయం లేకుండానే మొదట నుంచీ ఉత్తరప్రత్యుత్తరాలను ఈవోనే నేరుగా కమిషనర్‌కు చేరవేశారు. భూముల అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న వేలం నిర్వహించారు. ఎకరా రూ.13 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.27 లక్షలకే విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి కోరే పత్రాలను సత్రం ఈవో స్వయంగా కమిషనర్‌కు అందజేశారు. మధ్యలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఈ పత్రాలు పరిశీలనకు వెళ్లలేదని దేవాదాయ శాఖ వర్గాల సమాచారం. చివరకు టీడీపీ నేతల కుటుంబ సభ్యులకే ఆ భూముల అమ్మకానికి అనుమతులు మంజూరయ్యాయి. ‘అమరావతి సదావర్తి సత్రంలో వెయ్యి కోట్ల లూటీ!’ శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బడాబాబుల ప్రమేయం ఉండడం వల్లే భూముల అమ్మకం ఫైల్‌కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. మార్కెట్ ధర ఎంతుందో తెలుసా? దేవాదాయ శాఖలో గజం భూమి విక్రయించాలన్నా ఆ భూమి మార్కెట్(ప్రభుత్వ) విలువ, బహిరంగ మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకొని తాము అమ్మాల్సిన ధరను నిర్ణయిస్తారు. అయితే, చెన్నై సమీపంలో సత్రానికి చెందిన భూమికి మార్కెట్ ధర ఎంత ఉందో పట్టించుకోకుండా నామమాత్రంగా ఎకరాకు రూ.50 లక్షల ధరనే నిర్ణయించారు. ఆ తర్వాత వేలంపాట పేరుతో టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబీకులు, వారి మిత్రబృందం అమరలింగేశ్వరస్వామి భూములను ఎకరా రూ.27 లక్షలకే కొట్టేశారు. వేలం పాట పూర్తయిన తర్వాత కూడా అమ్మిన భూమికి బేసిక్ ధర ఎంత ఉందన్న వివరాలను సత్రం ఈవోను అడిగినా ఆయన తనకు తెలియజేయలేదంటూ దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంభ స్వయంగా కమిషనర్‌కే లేఖ రాశారు. కొనుగోలుదారుల్లో ముగ్గురు చలమలశెట్టి కుటుంబీకులే కారుచౌకగా సదావర్తి సత్రం భూములను దక్కించుకున్న 8 మందిలో ముగ్గురు అధికార పార్టీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులే. ఆయన భార్య సీహెచ్ లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్‌బాబు, మేనల్లుడు బి.శివరామకృష్ణ కిషోర్‌లకు సత్రం భూములను వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ముగ్గురితోపాటు మందాల సంజీవరెడ్డి, ఆయన భార్య సునీతారెడ్డి, మేనల్లుడు చావలి కృష్ణారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని విద్యాసంస్థల అధినేత ఎం.సూర్యకిరణ్‌మౌళి, డి.పవన్‌కుమార్‌లు ఉన్నారు. సంజీవరెడ్డి మేనల్లుడు చావలి కృష్ణారెడ్డి, చలమలశెట్టి మేనల్లుడు బి.శివరామకృష్ణకిషోర్లు స్నేహితులు. వీరిద్దరూ లండన్‌లో కలిసి చదువుకున్నారు. శివరామకృష్ణకిషోర్ ప్రస్తుతం చలమలశెట్టి వద్దే ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చెప్పుల స్టాండ్ లీజుకు ఐదుసార్లు వేలం సత్రం భూములను ఎకరా రూ.50 లక్షల చొప్పున అమ్మడానికి వేలం పాట మొదలుపెట్టి అక్కడికక్కడే ఎకరా రూ.27 లక్షలకు తగ్గించడంపై దేవాదాయ శాఖలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగానే చెప్పుకుంటున్నారు. ఇటీవల విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద చెప్పుల స్టాండ్ లీజుకు వేలం పాట నిర్వహించారు. గతేడాది రూ.57 లక్షలకు జరిగిన పాట ఈ ఏడాది రూ.50 లక్షలకు తగ్గింది. దీంతో ఐదుసార్లు వేలం పాట నిర్వహించారు. అలాంటిది రూ.కోట్ల విలువైన భూముల విషయంలో ఒకేరోజు ఒకే వేలం పాటలో అమ్మకం ధరను సగానికి తగ్గించి అతి కారుచౌకగా కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధమని దేశాదాయ శాఖ అధికారులు అంటున్నారు. అమ్మకంపై నివేదిక ఇవ్వండి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆదేశం సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాల భూమి అమ్మకం వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను ప్రభుత్వ ముఖ్యకార్యదర్వి జేఎస్పీ ప్రసాద్ ఆదేశించారు. భూముల అమ్మకంలో రూ.1,000 కోట్ల లూటీ జరిగిందంటూ పూర్తి సాక్ష్యాధారాలతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ భూముల అమ్మకానికి సంబంధించి అనుమతుల మంజూరు వివరాలను సోమవారం నాటికి సమగ్రంగా తన ముందుంచాలని కమిషనర్ స్పష్టం చేశారు. -
రేపటి నుంచి నూకాంబిక జాతర
నెలరోజులపాటు ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తిచేసిన దేవాదాయశాఖ అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి మే 6 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ సహాయ కమిషనర్ సుజాత తెలిపారు. ఆరో తేదీ రాత్రి జాతర, ఏడో తేదీన కొత్త అమావాస్య పండగ, 8న ఉగాది, మే 6న నెల పండగ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ పరిసరాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యంతోపాటు పిల్లలకు పాలు, పెద్దలకు మజ్జిగను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ప్రభుత్వశాఖ అధికారులతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించారు. అమ్మవారి చరిత్ర... సుమారు 550 ఏళ్లకిందట నూకాంబిక అమ్మవారు కాకతాంబగా వెలిశారు. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పని చేసి కాకర్లపూడి అప్పలరాజు కళింగాంధ్ర ప్రభువైన బహుభలేంద్రుడిని ఓడించి అనకాపల్లి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే గవరపాలెం ప్రాంతంలో శత్రుదుర్బేధ్యమైన కోటను నిర్మించి వారి ఇలవేల్పు కాకతాంబ గుడిని దక్షిణ ప్రాంతంలో నిర్మించారు. తర్వాత కాలంలో విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారిగా మార్చి కొలిచేవారు. తర్వాత కాలంలో గోడి జగన్నాథరాజును అనకాపల్లి కోటకు సామంతరాజుగా విజయనగరం రాజు నియమించారు. అనేక సంవత్సరాలు బ్రిటీష్వారికి పన్నులు చెల్లించకపోవడంతో కోటను వేలం వేశారు. వైరిచర్ల ఆనందగజపతిరాజు వేలంపాటలో కోటను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి వైరచర్ల వంశీయులే దేవస్థానం ధర్మకర్తలుగా వ్యవహరించేవారు. 1935లో దేవాదాయ శాఖ పరిధిలోకి... నూకాంబిక అమ్మవారి దేవాలయంలో 1935లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. దినదిన ప్రవర్థమానమై 40 కాటేజీలు, క్యూకాంప్లెక్స్లు, కల్యాణ మండపాలను నిర్మించారు. పిలిచిన వెంటనే పలికే ఇలవేల్పుగా, కల్పవల్లిగా, తల్లిగా భక్తులు కొలిచే అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధికెక్కారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ బహుళ అమావాస్య అనగా ఉగాది ముందురోజు నుంచి నెలరోజులపాటు కొత్త అమావాస్య జాతర మాసోత్సవాలను నిర్వహిస్తారు. నిత్య అన్నదాన పథకం... నూకాంబిక అమ్మవారి ఆలయంలో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి రోజు ఇక్కడికి విచ్చేసే కొందరు భక్తులకు అన్నదానం చేస్తున్నారు. -
కృష్ణా పుష్కరాలకు రూ.825 కోట్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కృష్ణా పుష్కరాలకు రూ.825 కోట్లు కేటాయిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్నానఘట్టాలకు, రోడ్ల విస్తరణకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండలో 86 స్నానఘట్టాల నిర్మాణానికి రూ.212 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ.398 కోట్లు కేటాయించామని వివరించారు. మార్చి మొదటివారంలో పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారలతో సమీక్ష నిర్వహిస్తామని, మార్చి 15 నుంచి పుష్కరాల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. -
ఈ పనుల్లోనూ ‘నామినేషన్’!
కృష్ణా పుష్కరాల పనులపై ఉద్దేశపూర్వకంగానే జాప్యం ఆఖరి నిమిషంలో టీడీపీ నేతలకు అప్పగించే ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనులను నామినేషన్ విధానంలో అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన ప్రభుత్వం కృష్ణా పుష్కరాల్లోనూ అదే తరహా విధానానికి తెరతీసింది. ఆగస్టు 12 నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాల పనుల అంచనాను పెంచి, నామినేషన్‌పై అప్పగించేందుకు స్కెచ్ వేసింది. పుష్కరాలకు మరో 6నెలలే గడువు మిగిలి ఉంది. ఈపనుల్లో పారదర్శకత పాటించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వీటిని ఇప్పటికే టెండర్ విధానంలో అప్పగించేవారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 2,200 కోట్లతో ప్రతిపాదనలు కృష్ణా పుష్కరాలు జరగనున్న కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొత్తం రూ.2,200 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చింది. రోడ్ల నిర్మాణాలకు అంచనాలను రూపొందించింది. గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా పుష్కరాల నిర్వహణలోనూ సింహభాగం పనులను ఆర్‌అండ్‌బీకే అప్పగించనున్నారు. గోదావరి పుష్కరాల్లో రూ.1,600 కోట్లతో ముందుగా అంచనాలు సిద్ధం చేశారు. పనులు ప్రారంభమయ్యే నాటికి వాటిని రూ.1,800 కోట్లకు పెంచేశారు.ఉభయగోదావరి జిల్లాల్లో రూ.1,800 కోట్లు ఖర్చు చేయగా, మూడు జిల్లాల పరిధిలో జరిగే కృష్ణా పుష్కరాలకు కనీసం రూ.2,000 కోట్ల మేర ఖర్చు ఉంటుందని ఆర్అండ్బీ, మున్సిపల్, దేవాదాయ శాఖల అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో ఆర్‌అండ్‌బీకి రూ.650 కోట్ల వరకు కేటాయించారు. -
టీటీడీ ఉద్యోగులకు శుభవార్త
‘బహుమానం’పై మెట్టు దిగిన దేవాదాయశాఖ సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు మంజూరు చేస్తున్న బ్రహ్మోత్సవ బహుమానం విషయంలో దేవాదాయ శాఖ మెట్టు దిగింది. టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకే బ్రహోత్సవ బహుమానం ఇచ్చేలా నిశ్చయించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవ బహుమానం తగ్గిస్తూ ఈ నెల 3న జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. టీటీడీలో శాశ్వత ఉద్యోగిxకి రూ. 12,200, కాంట్రాక్టు ఉద్యోగికి రూ.6,100 బహుమానం ఇచ్చేలా టీటీడీ బోర్డు తీర్మానించి దేవాదాయ శాఖకు పంపింది. అయితే ఆ శాఖ శాశ్వత ఉద్యోగికి రూ. 10,000, కాంట్రాక్టు ఉద్యోగికి రూ. 5,000గా నిర్ణయంచి జీవో జారీ చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు టీటీడీ ఈవో డాక ్టర్ సాంబశివరావును కలసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈవో ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకే ఉద్యోగులకు బహుమానం విడుదల చేసే ఫైల్‌పై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ శుక్రవారం సాయంత్రం సంతకం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
ఆలయ ఉద్యోగులంతా పంచె కట్టాల్సిందే..
భద్రాచలం: రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేసే దిశగా దేవాదాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 6ఏ, బీ, సీ, డీ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లో ఇక నుంచి విధిగా కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయాలని దేవాదాయశాఖ విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు వేద పండితులు, వైదికసిబ్బంది, అర్చక స్వాము లు, ఉద్యోగులంతా తప్పనిసరిగా ప్రవర్తనా నియమావళిని పాటించాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేదపండితుల నియమావళి ► వేద పండితులంతా ఆలయాల్లో తప్పనిసరిగా ప్రతి రోజూ 6 గంటలకు తక్కువ కాకుండా వేదపారాయణం చేయాలి. ► స్వామివార్లు, అమ్మవార్లకు జరిగే మేలుకొలుపు, అభిషేక కార్యక్రమాలకు హాజరుకావాలి. ► శిష్టాచార సంపన్నంగా కట్టు, బొట్టు, శిఖ, యజ్ఞోపవీతాదులతో యథావైదిక శాస్త్ర సంపన్నమైన వేష భాషలు కలిగి ఉండాలి. ► సాయంత్రం వేళల్లో జరిగే తిరువీధి సేవ, పల్లకీ సేవ, పవళింపు సేవల్లో ఆలయ అర్చకులతో పాటు వేద పండితులు కూడా పాల్గొనాలి. ► మద్యం, మాంసం, ధూమపానాలకు దూరం గా ఉండాలి. అనుబంధిత వేద పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్థులకు రోజూ పాఠాలు చెప్పాలి. వైదిక/అర్చక స్వాములకు.. ► శిష్టాచార సంపన్నముగా కట్టు, బొట్టు, శిఖ యజ్ఞోపవీతాదులతో యథాశాస్త్ర సంపన్నమైన వేషభాషలు కలిగి ఉండాలి. ► అశాస్త్రీయ, అనాగరిక మాటలు నిషిద్ధం. ► ఆలయంలో కానీ, ఆలయం బయట కానీ సిగరెట్లు, మద్యపానం, గుట్కా, జర్దాలు తినరాదు. ఈవో, సిబ్బందికి నియమావళి.. ► ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు సిబ్బంది అంతా పనివేళలల్లో తప్పనిసరిగా తెల్లని పంచెకట్టు, చొక్కా ధరించాలి (ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాంట్ ధరించరాదు). తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి. ► ధర్మకర్తలతోనూ, అర్చకాదులతోనూ, భక్తులతోనూ అత్యంత మర్యాద పూర్వకంగా మెలగాలి. ఆలయంలోకి భక్తులు ప్రవేశించగానే బొట్టు పెట్టుకునేందుకు వీలుగా కుంకుమ, శ్రీచూర్ణం, సింధూరం, విభూది వంటివి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. ► ప్రతి ఆలయంలో ప్రతి రోజూ జరిగే వివిధ సేవల వివరాలను భక్తులకు తెలిసేలా ముందుగా ప్రచారం చేయాలి. ఆ రోజు తిథి, వార నక్షత్రాదులు వివరాలు ఆలయ ప్రదర్శన పట్టికలో ప్రతీ రోజూ రాయించాలి. ► వేదపండితులు, అర్చకులు, వైదిక సిబ్బంది, ఉద్యోగులు ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్ వినియోగించరాదు. -
మేడారం..జనసంద్రం
అమ్మలను దర్శించుకున్న 4 లక్షల మంది ములుగు: ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం మేడారానికి సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ములుగు గట్టమ్మ, మేడారం వద్ద నార్లాపుర్-ఊరట్టం క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి సిబ్బందిని అప్రమత్తం చేసి ట్రాఫిక్ నియంత్రింపజేశారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా కొన్ని కనెక్షన్లు మాత్రమే ఇవ్వడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా సిద్ధం చేయకపోవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో పనులు జరగుతున్నాయని శనివారం వరకు ఒకవైపు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో బారికేడ్లను తొలగించారు. -
గిరిజనులు లేకుండా వనజాతర
పెత్తనం కోసం దేవాదాయ శాఖ యత్నాలు * రెండేళ్ల క్రితమే ముగిసిన మేడారం ట్రస్ట్ బోర్డు కాలపరిమితి * కొత్త కమిటీ ఏర్పాటును పట్టించుకోని సర్కారు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం.. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతర ఏర్పాట్లలో స్థానిక గిరిజన ఆదివాసీల ప్రమేయం కనిపించడం లేదు. జాతరపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మేడారం జాతర కమిటీ ఏర్పాటులో కాలయూపన చేస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది. పూర్తిగా గిరిజన సంప్రదాయాల ప్రకారం ఈ జాతర జరుగుతుంది. కోటి మంది భక్తులు వస్తారనే అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సమ్మక్క-సారలమ్మ జాతర పాలకమండలి పదవీకాలం 2014 జనవరి 8న ముగిసింది. 2014లో జరిగిన జాతరను ట్రస్టుబోర్డు లేకుండానే నిర్వహించారు. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి జాతర కావడంతో ఆదివాసీలకు ప్రాధాన్యత కల్పిస్తారని ఈ వర్గం వారు భావించారు. మేడారం ట్రస్టు బోర్డు ఏర్పాటు కోసం 2015 జూలైలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కమిటీని మాత్రం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. 2014 తరహాలో ఈసారి ఆలయ ట్రస్టీ ఏర్పాటు చేయకుండా, ఆదివాసీల ప్రమేయం లేకుండానే జాతరను పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డు నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆరు నెలలు గడుస్తున్నా దేవాదాయ శాఖ ఇప్పటికీ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరో నెలే గడువు.. మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ.101 కోట్లతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జాతర దగ్గరపడుతున్న సమయంలో స్థానిక ఆదివాసీ గిరిజనులకు పనుల్లో భాగస్వాములను చేయాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. కొత్త కమిటీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసినా... ఎంపిక ప్రక్రియకు గడువు లేదనే సాకుచెప్పి దాటవేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు ఎంపికకు నోటిఫికేషన్ ప్రకారం... దరఖాస్తులను పరిశీలించి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి, సీఎం ఆమోదం తర్వాత పాలకమండలి ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేస్తుంది. మేడారం మహా జాతర మరో నెల రోజుల్లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచే భక్తులు భారీగా తరలివస్తారు. ఆలోపు మేడారం ఆలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ గిరిజన జాతరలో తమకు చోటు దక్కకుండా చేస్తున్నారంటూ ఈ వర్గం వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ జోక్యమూ... మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ట్రస్టుబోర్డులో చైర్మన్ సహా తొమ్మిది మంది సభ్యులు ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే కచ్చితంగా ఉండాలి. ఒకరు మహిళా సభ్యురాలు తప్పనిసరి. రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంపై జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్లో ఎవరికి ట్రస్టు బోర్డులో స్థానం కల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడమే ఈ ఆలస్యానికి కారణమని సమాచారం. గత జాతర సమయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొనడంతో ట్రస్టుబోర్డు లేకుండానే జాతరను నిర్వహించారు. ఈ సారి కూడా అదే విధంగా వ్యవహరిస్తారా.. లేక ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేస్తారో చూడాల్సిందే. -
కుంగిపోతున్న శివలింగం
రామప్ప గర్భగుడికి పొంచి ఉన్న ముప్పు ‘సోమసూత్రం’ మూసుకుపోవడమే కారణం వెంకటాపురం: కాకతీయులు 800 ఏళ్ల క్రితం నిర్మించిన వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయానికి ముంపు పొంచి ఉంది. ఈ ఆలయాన్ని పాలకులు పట్టించుకోకపోవడంతో పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆలయంలోని శివలింగం కుంగిపోతోందని భక్తులు అంటున్నారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట శివారులో చరిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని 1213 సంవత్సరంలో కాకతీయులు నిర్మించారు. కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని ఈ ఆలయం నిర్మితమైంది. కార్తీక మాసం, శ్రావణ మాసాలతోపాటు శివరాత్రి సందర్భంగా ఇక్కడ వైభవంగా పూజలు జరుగుతారుు. ఇక్కడ భక్తులు ప్రతిరోజు శివలింగానికి అభిషేకం, అర్చన పూజలు నిర్వహిస్తారు. పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనే, చక్కెరలతో శివలింగానికి అభిషేకం చేసి మొక్కులు చెల్లిస్తారు. అభిషేకం చేసిన తర్వాత నీరు నిలవకుండా గర్భగుడి నుంచి బయటకు నీరు వెళ్లేందుకు కాకతీయులు సోమసూత్రం(ప్రత్యేక రంధ్రం) ఏర్పాటు చేశారు. అరుుతే, ఈ రంధ్రం 30 ఏళ్లుగా మూసుకుపోవడంతో జలాభిషేకం, పాలాభిషేకం సందర్భంగా శివలింగంపై పోసే నీరు, పాలు గర్భగుడిలోనే నిలుస్తోంది. అంతేకాకుండా, ఆలయ పూజారులు రోజూ ఉదయాన్నే శివలింగాన్ని నీటితో శుద్ధి చేసి ముస్తాబు చేస్తారు. ఈ నీరంతా బయటకు వెళ్లకుండా గర్భగుడిలోనే ఇంకిపోతుండడంతో గర్భగుడి కింద ఉన్న ఇసుక కుంగిపోయి శివలింగం ఓ పక్కకు ఒరుగుతోందని గ్రామస్తులు, భక్తులు, ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. నీరు నిలిచి ఉండడంతో గర్భగుడి దుర్గంధం వెదజల్లుతోందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సోమసూత్రాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర పురావస్తుశాఖ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా శాఖలకు చెందిన స్థానిక సిబ్బందే బాహాటంగా విమర్శిస్తున్నారు. -
ఈవోల పదోన్నతుల వివాదం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా గ్రేడ్-2 కార్యనిర్వహణాధికారి(ఈఓ) పోస్టుల భర్తీ వ్యవహారం ఇప్పుడు దేవాదాయశాఖలో కొత్త వివాదానికి కారణమవుతోంది. గ్రేడ్-3 ఈవోలకు పదోన్నతులు కల్పించటం ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ... దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లతో వాటిని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదమైంది. ప్రస్తుతం భర్తీ కావాల్సిన పోస్టులు దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల కోటాకు సంబంధించినవి. ఇప్పుడు వారికి కాకుండా దేవాలయ ఉద్యోగుల(పాలకమండళ్లు నియమించినవారు)తో భర్తీ చేయనుండటమే వివాదానికి కారణం. పదోన్నతులకు సంబంధించి ఆ శాఖలోని ప్రభుత్వ, దేవాలయ ఉద్యోగుల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పరస్పర ఫిర్యాదులతో విచారణలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూ తీసుకున్న ఈ తాజా నిర్ణయం మరింత వేడి రగిల్చింది. దేవాదాయశాఖలో కార్యనిర్వహణాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి గతంలోనే 262 నెంబరు జీఓ ద్వారా మార్గదర్శకాలు వెల్లడించారు.గ్రేడ్-3 ఈవోల పదోన్నతుల ద్వారా, దేవాదాయశాఖ (డిపార్ట్మెంట్) సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించటం ద్వారా, దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించటం ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరి వాటా పోస్టులు ఎన్నో కూడా దామాషా లెక్కలు ఖరారు చేశారు. అందులో డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులతో భర్తీ కావాల్సిన 25 గ్రేడ్-2 ఈవో పోస్టులు అలాగే ఉండిపోయాయి. ఆ పోస్టులు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపకపోవటంతోనే అవి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాటిని దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లతో భర్తీ చేసేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు. డిపార్ట్మెంట్ కోటా పోస్టులు అయినందున వాటిని డిపార్ట్‌ంట్ ఖాతాలోనే ఉంచాలని, అందుకోసం అవసరమైతే గ్రేడ్-3 ఈవోలతో భర్తీ చేయాలని శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. దేవాలయ ఉద్యోగులతో వాటిని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించటంతో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం దేవాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నవారు ఇప్పుడు గ్రేడ్-2 ఈవోలుగా మారి తమ కంటే పై పోస్టులు పొందడం ఎలా సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా అధికారులు దాదాపు తుది నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందారని అధికారులు చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు డిపార్ట్మెంట్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. -
ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం స్వాధీనం!
♦ రెండు నోటీసులు జారీ చేసిన దేవాదాయ శాఖ ♦ అప్పగించేందుకు అంగీకరించని ఆలయ పాలకమండలి ♦ విశాఖ పీఠానికి అప్పగించినందున స్వాధీనం సరికాదంటూ వాదన ♦ సూమోటో ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లోని ప్రసిద్ధ దైవ సన్నిధానాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించింది. చలనచిత్ర, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆలయ పాలక మండలి సభ్యులుగా ఉండటం.. స్వాధీన ప్రక్రియకు వారు తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నా దేవాదాయ శాఖ వెనకడుగు వేయకపోవటం... వెరసి ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయాన్ని దేవాదాయ శాఖ చట్టం మేరకు దానికి స్వాధీనం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయాలన్న ఆ శాఖ నోటీసుకు ఆలయ పాలక మండలి స్పందించకపోవటంతో... చట్టంలో ఉన్న వెసులుబాటు ఆధారంగా సూమోటోగా అధికారులే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. పాలకమండలి సభ్యుల మధ్య పొడచూపిన విభేదాలే ఇప్పుడు ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు రావటం విశేషం. ఇదీ నేపథ్యం... జూబ్లీహిల్స్‌లో దాదాపు మూడున్నర వేల చదరపు గజాల విస్తీర్ణంలో దైవ సన్నిధానం పేరిట ఆలయాల సమూహం నిర్మితమైంది. అనతి కాలంలోనే ఆలయానికి ప్రాచుర్యం వచ్చింది. ముఖ్యంగా ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల రాకతో హడావుడిగా ఉంటుంది. ఆలయ పాలకమండలిలో దాదాపు అంతా ప్రముఖులే ఉన్నారు. ఈ తరుణంలో 2012లో పాలకమండలి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో కొందరు పాలకమండలి సభ్యులు ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పెద్దమొత్తంలో వస్తున్న ఆదాయాన్ని పక్కదారిపట్టిస్తున్నారని ఇద్దరు పాలకమండలి సభ్యులు దేవాదాయశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా అప్పట్లోనే ప్రభుత్వం ఆదేశించటంతో ఆ శాఖ ఇన్స్పెక్టర్లు విచారణ ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం అధికారులు కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. కీలకమైన ఆదాయ ఖాతా వివరాలు ఇవ్వటంలో ఆలయ నిర్వాహకులు సహకరించటం లేదని, ఆలయాన్ని విశాఖపట్టణంలోని శారదాపీఠానికి బదలాయించినందున వివరాలు అందుబాటులో లేవని చెబుతున్నారని, అక్కడి పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ అందులో అధికారులు పేర్కొన్నారు. ఆలయానికి అవసరమైన 3,200 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వమే ఇచ్చినందున దాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డి1-2416/2012 నెంబరుతో తాజాగా ఆల య పాలకమండలికి స్వాధీన నోటీసు జారీ చేశారు. ఆలయాన్ని విశాఖ శారదా పీఠానికి కేటాయించినందున దాని స్వాధీనం సరికాదంటూ పాలకమండలి సభ్యులు దేవాదాయశాఖ దృష్టికి తెచ్చారు. ఆలయ బదలాయింపునకు దేవాదయ శాఖ అనుమతి తీసుకోనందున అది చెల్లదని, వెంటనే దేవాదాయశాఖ పరిధిలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఆ శాఖ మరో నోటీసు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవటంతో దేవాదాయ శాఖ చట్టంలోని సూమోటో సెక్షన్ ఆధారంగా అధికారులే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
రూ.7.12 కోట్లతో యాదాద్రి భవన్
నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల పాల్గొన్న మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ఏర్పాటు చేయనున్న యాదాద్రి భవన్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. రూ.7.12 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి నిధులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణ పనులను సిరికో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు. భవనంలో యాదాద్రి సమాచార కేంద్రంతో పాటు పెళ్లి మండపం, వేడుకలు నిర్వహించుకోవడానికి 500 మంది సరిపోయేలా అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం(యాదగిరిగుట్ట), నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2016 సంవత్సరం క్యాలెండర్‌ను నాయిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ఎన్.శివశంకర్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, సిరికో ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధార్మిక వ్యవస్థ రక్షణకు వైఎస్ కృషి చేశారు
హన్మకొండ కల్చరల్: హిందూ ధార్మిక వ్యవస్థ, ఆలయ వ్యవస్థ రక్షణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారని, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అభినందనీయమైన కృషి చేస్తున్నారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. హన్మకొండలోని చరిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కార్తీకమాసం సందర్భంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహభాషణం చేస్తూ.. తండ్రి లాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ధార్మిక భావాలు కలవారని, ప్రజాసంక్షేమం కోసం ఏపీలో పోరాటం చేస్తున్నారని, ఆయనకు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వలే తెలంగాణలో దేవాదాయ శాఖకు సారవంతమైన భూములు లేవని, కేవలం వేతనాలపైనే అర్చకులు ఆధారపడుతున్నారని తెలిపారు. ధూప, దీప నైవేద్య పథకం కింద అర్చకుల వేతనాలను పెంచుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వేయిస్తంభాల గుడి ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి వద్దిరాజు రాజేందర్రావు, బ్రాహ్మణ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు అయినవోలు వెంకటసత్యమోహన్, అర్భన్ అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్, రుగ్వేద పండితులు గంగు మణికంఠశర్మ, స్వామీజీ శిష్యులు పాల్గొన్నారు. -
మళ్లీ వివాదంలోకి...
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వ్యవహారం లో కొత్త వివాదం రాజు కుంది. గతంలో ఆలయ స్థల లీజును వ్యతిరేకిస్తూ స్థానికులు ఉద్యమించటంతో తర చూ వార్తల్లోకెక్కగా... ఇప్పు డు మనోభావాలు దెబ్బతింటున్నాయనే కోణంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు పోటెత్తాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు శాస్త్రవిరుద్ధంగా ఉందో లేదో తేల్చేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ వేయాల్సి వచ్చింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతుండటంతో సమీప బస్తీలకు అరిష్టం చుట్టుకుందని, దీనివల్ల అనారోగ్యానికి గురై చనిపోతున్నారంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇదీ సంగతి..: బంజారాహిల్స్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఓ ధార్మిక సంస్థ లీజుకు తీసుకుని పునరుద్ధరణ, అభివృద్ధి పనులు జరుపుతోంది. పురాతన ఆలయం దెబ్బతినకుండా చుట్టూ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంటోంది. అయితే ఈ పనుల పేరుతో దేవాయంలోని మూల విరాట్టులను మరోచోటికి తరలించటం, ధ్వజస్తంభాన్ని తొలగించటం, చుట్టూ ఉన్న గుట్ట రాళ్లను మార్పుచేర్పులు చేయటాన్ని స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇవన్నీ శాస్త్రవిరుద్ధమైన పనులని, దీనివల్ల తమకు అరిష్టం చుట్టుకుందంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. నెలరోజులుగా ఈ వివాదం నానుతోంది. ఇటీవల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు స్థానికులు రాగా నిర్వాహకులు అడ్డుకుని గేట్లకు తాళాలు వేశారని, ఆలయంలో స్వామిని దర్శనం చేసుకోనివ్వటం లేదని ఫిర్యాదు చేయటంతో ప్రభుత్వం స్పందించింది. అక్కడి పనులు శాస్త్ర సమ్మతమా, విరుద్ధమా తేల్చి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో ఈ ఆలయ స్థలం స్వాహా చేసేందుకు రాజకీయ నేతలు యత్నించటం, ఆ తర్వాత ధార్మిక సంస్థ అభివృద్ధి చేసేందుకు ముందుకు రావటంతో ప్రభుత్వం లీజుకివ్వటం తదితరాలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగింది. కమిటీ ఆలయ సందర్శన: దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు కన్వీనర్‌గా, ఆగమ శాస్త్ర నిపుణులు వెంకటాచార్యులు, స్థపతి వల్లినాయగం, దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్సింహులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులు ఓ దఫా ఆలయాన్ని సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించి రికార్డు చేశారు. ధార్మిక సంస్థ నిర్వాహకులతో మాట్లాడగా వారం రోజుల్లో పనుల ప్రణాళికలు అందిస్తామని, ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేసి ఆలయాన్ని తెరిచేలా చూస్తామని వెల్లడించారు. వాటిన్నింటిని పరిశీలించి మరో పది రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. -
దేవుడా.. దర్శనమేదీ?
అభిషేకాలు.. అర్చనలు, నోములు.. వ్రతాలు.. బోనాలు.. ఒడిబియ్యాలు, ధూపదీపాలు.. నిత్యపూజలతో కళకళలాడే దేవాలయాలు కళతప్పాయి. పవిత్రమైన శ్రావణమాసంలో పొంగిపొర్లెభ క్తిభావం.. అర్చక ఉద్యోగుల సమ్మెతో మూగబోయింది. తమ ఇష్ట దైవాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని, మానసిక ప్రశాంతతను పొందడానికి తరలివచ్చిన భక్తజనం.. ఆలయాల్లో పూజలు చేసేవారు లేక తీవ్ర నిరాశకు గురవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను ప్రారంభించి 10 రోజులవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అర్చక ఉద్యోగ సంఘాలు తమపట్టును వీడటంలేదు. దీంతో అనునిత్యం వేలాది మంది భక్తులు నానా అవస్థలు పడుతుండగా, దేవాదాయ శాఖకు రూ.లక్షల్లో ఆదాయం గండి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 370మంది అర్చక ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. శ్రావణమాసానికి ‘సమ్మె’ట - కళతప్పిన ఆలయాలు - హారతి లేదు.. తీర్థం లేదు - పది రోజులుగా ఆర్జిత సేవలు బంద్ - దేవాదాయ శాఖకు రూ. లక్షల్లో గండి - సత్రాలకు సైతం తాళాలు, భక్తులకు ఇక్కట్లు మెదక్/వర్గల్/శివ్వంపేట/జహీరాబాద్: ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు మెతుకుసీమ నిలయం. ఏడుపాయలలో దుర్గాభవాని, ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయం, నాచారం లక్ష్మీనర్సింహస్వామి, బొంతపల్లి వీరభద్రస్వామి, రుద్రారం గణేష్ టెంపుల్, బీరంగూడంలోని శివాలయం, సిద్దిపేటలోని వెంకటేశ్వర, కోటి లింగాల ఆలయాలను అనునిత్యం సుమారు 50 వేలకుపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రావణమాసం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే జిల్లాలోని అర్చక ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధన కోసం ఈయేడు ఆగస్టు 25 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ప్రతిరోజూ అర్చకులు దేవతా విగ్రహాలకు అభిషేకాలు, నివేదన గావించి సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో తరలివచ్చే వేలాది మంది భక్తులు పూజలు చేయించుకోలేక, మొక్కులు చెల్లించుకోలేక, మొక్కుబడి దర్శననానికే పరిమితమవుతున్నారు. ఏడుపాయల్లో మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే కేతకీ సంగమేశ్వరాలయాల్లో ఆది, సోమవారాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉంటుంది. అర్చక ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో కనీస పూజలకు అవకాశం లేక పోగా, దేవుడి ప్రసాదం కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది భక్తులు దేవాలయాలకు రావడం లేదు. లక్షల్లో ఆదాయం గండి అర్చక ఉద్యోగుల సమ్మె ప్రభావంతో దేవాలయాల ఆదాయానికి గండి పడుతోంది. కేతకి సంగమేశ్వరాలయంలో ఆది, సోమవారాల్లోనే ఎంతలేదన్న రూ.5లక్షల ఆదాయం వస్తుంది. ఏడుపాయల్లో సోమ, మంగళ, బుధ, శుక్ర , ఆదివారాల్లో కలిసి సుమారు రూ.1.50లక్షల ఆదాయం వస్తుంది. అలాగే జిల్లా అంతటా దేవాలయాల్లో రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. అర్చకుల సమ్మెపోటుతో ఆదాయం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ట్రెజరీ వేతనాలే ప్రధాన డిమాండ్ : అర్చక ఉద్యోగులందరికీ 010 పద్దుకింద జీతాలు చెల్లించాలని ప్రధాన డిమాండ్. ధూప, దీప, నైవేద్యం కింద అర్చకులకు రూ.6వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్ఎంఆర్(నాన్‌మస్టర్ రోల్) ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతున్నారు. పదో పీఆర్సీని 370 దేవాలయాల్లో పనిచేస్తున్న 2,375మంది అర్చక ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. రూ. 8 లక్షల ఆదాయం నష్టం కేతకీ ఆలయానికి వచ్చే భక్తుల నుంచి అభిషేకాలు, హారతి, అన్న పూజ, వాహనాల పూజ, ఆకుల పూజ, గండ జ్యోతి, కంట్లం పూజ, ప్రసాదాలు, గదుల అద్దె ద్వారా ఆలయానికి ఆదాయం వచ్చేది. అర్చకులు, ఆలయ సిబ్బంది సమ్మెలో ఉండడంతో కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి దాదాపు రూ.8 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. నాచగిరిలో మౌన దీక్ష వర్గల్: సమ్మెలో భాగంగా నాచగిరి ఆలయ అర్చకులు, సిబ్బంది నోటికి గుడ్డలు కట్టుకుని గర్భగుడి ముందు మౌన దీక్ష కొనసాగించారు. సంఘ నేతలు రంగాచారి, గోపాలకృష్ణ శర్మ, సుధాకర్‌గౌడ్‌ల నేతృత్వంలో నిరసన కొనసాగింది. మోకాళ్లపై నిరసన శివ్వంపేట: చాకరిమెట్ల ఆంజనేయస్వామి, సికింద్లాపూర్ నర్సింహస్వామి, హత్నూర మండలం పలుగుమీది పోచమ్మ దేవాలయాల అర్చక సిబ్బంది దేవాదత్తశర్మ, ధనుంజయ్యశర్మ, విద్యాకర్‌చారి, శ్రీకాంత్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, పోచయ్య, తదితరులు నిరసన వ్యక్తం చేశారు. మోకాళ్ళపై నిల్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. 50యేళ్ల తరువాత వచ్చాను 50యేళ్ల తరువాత దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాను. పదేళ్ల వయస్సులో మా అమ్మవెంట వచ్చి అప్పట్లో దుర్గమ్మను దర్శించుకున్నా. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడకు వస్తే కనీసం పూజ చేయించుకునే అవకాశం లేకుండా పోయింది. - జోగమ్మ, ముండ్రాయి 30యేళ్లలో ఇలాంటి సమ్మె చూడలేదు ఏడుపాయల దుర్గమ్మ వద్ద 30యేళ్లుగా పూజలు చేస్తున్నా అప్పుడప్పుడు సమ్మెలు చేశాం. కాని పదిరోజులపాటు చేసిన దాఖలాలు లేవు. భక్తులకు ఇబ్బందులు కలగడం బాధగానే ఉంది. కనీసం మా డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - నర్సింహాచారి, పూజారి, ఏడుపాయల ప్రభుత్వం స్పందించాలి అర్చకులు సమ్మె చేపట్టడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆలయానికి వచ్చే వారు ఒకింత నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి అర్చకులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. - రాధాకృష్ణా రాగోజి, భక్తుడు, గుల్బర్గా శ్రావణ మాసంలో ఇదేం చోద్యం వేలూరు-నాచారం క్షేత్రం అంటే మాకు ఎంతో భక్తి, విశ్వాసం. లక్ష్మీ నరసింహస్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని హారతి, తీర్థంతోపాటు ఫలమో, పుష్పమో తీసుకుంటే మనసు నిండా సంతృప్తి ఉంటుంది. శ్రావణ మాసం దేవున్ని నిండుగా చూసుకునే అవకాశం కూడా దక్కడం లేదు. హారతి లేదు, తీర్థం పెట్టడం లేదు. గ్రిల్స్ నుంచి దేవున్ని చూసి అదే పదివేలు అనుకోవాల్సి వస్తున్నది. - పీ సునీత, భక్తురాలు, సికింద్రాబాద్ ఎంతో ఆశతో వచ్చాం కేతకీ సంగమేశ్వర స్వామి దైవ దర్శనం, అభిషేకం కోసం వందల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. ఆలయంలో అభిషేకాలు జరగక పోవడంతో నిరాశకు గురయ్యాం. మాలాగే చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. - శంకర్ భక్తుడు, అత్నూర్ -
దేవాలయ ఉద్యోగులకూ పీఆర్సీ
- ప్రభుత్వోద్యోగులతో సమంగా 43 శాతం ఫిట్మెంట్ - ఫైలుపై సీఎం సంతకం.. ఉత్తర్వు జారీ - 5 వేల మంది సిబ్బందికి వర్తింపు - ‘30 శాతం’ నిబంధనతో కొంత మందికే లబ్ధి - ఆ నిబంధనను తోసిరాజని గతంలో వేతనాల పెంపు - ఏకరూప వేతన విధానాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వోద్యోగులతో సమంగా ప్రభుత్వం వారికి వేతన సవరణను (10వ పీఆర్సీ) అమలు చేయనుంది. 43 శాతం ఫిట్మెంట్ వర్తింపునకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేయగా దానికి సంబంధించి దేవాదాయశాఖ రాత్రికి ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది ఉద్యోగులకు ఇది వర్తించనుంది. రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కేడర్ సహా ఇతర అన్ని ప్రధాన దేవాలయాలకు ఇది వర్తించనుంది. అయితే దేవాదాయశాఖ ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగుల తరహాలో ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించే వెసులుబాటు లేనందున ఆయా ఆలయాల్లోని ఆదాయంలో వేతనాల మొత్తం 30 శాతానికి మించకూడదే నిబంధన అమలులో ఉంది. ఇప్పుడు అంతకంటే తక్కువ వేతనాలు చెల్లిస్తున్న ఆలయాలకు మాత్రమే తాజా వేతన సవరణ అమలవుతుంది. ఇప్పటికే 30 శాతానికి మించి వేతన ఖర్చులు ఉన్న ఆలయాల్లో నిబంధనల ప్రకారం వేతన సవరణ అమలు కాదు. కానీ ఆర్జేసీ కేడర్‌లో ఉన్న యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల్లో 30 శాతం నిబంధనను సడలిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. వేతన సవరణతో దాదాపు రూ.5 కోట్ల వరకు ఆ శాఖపై అదనపు భారం పడుతుందని సమాచారం. తమ డిమాండ్ మేరకు వేతన సవరణ చేసినందుకు దేవాలయ అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రమేశ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సీఎం కేసీఆర్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలను కలసి కృతజ్ఞతలు తెలిపారు. గత పీఆర్సీ తరహాలోనే..: ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని తమకూ వర్తింప చేయాలని ఆలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ మేరకు ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెండింగులో ఉంది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ దానికి ఆమోదముద్ర వేశారు. 2010 పీఆర్సీని అప్పటి ప్రభుత్వోద్యోగులకు వర్తింపజేసినట్టుగానే దేవాలయ ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించినట్టయింది. అంతా గందరగోళం ఏ ప్రభుత్వ విభాగంలో లేనంత అస్తవ్యస్థ పరిస్థితులతో కొనసాగుతున్న దేవాదాయశాఖలో వేతనాల విషయం కూడా అంతే గందరగోళంగా ఉంది. పీఆర్సీ తరుణంలో మరోసారి అది చర్చనీయాంశంగా మారింది. దేవాలయ సిబ్బందికి ఆ ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లించాలి. ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకూ ఖర్చు చేయాల్సి ఉన్నం దున మొత్తం ఆదాయంలో ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు 30 శాతానికి మించకూడదంటూ 1987లో ప్రభుత్వం సీలింగ్ విధిస్తూ చట్టం చేసింది. ధార్మిక కార్యక్రమాలకు 20%, ధార్మిక పరిషత్తు, అర్చక సంక్షేమ నిధి, ఆడిట్ ఫీజు తదితర డిపార్ట్మెంటల్ కంట్రిబ్యూషన్‌కు 20%, ఆలయ అభివృద్ధి పనులు, ఉత్సవ నిర్వహణకు 30% చొప్పున ఖరారు చేశారు. ఈ లెక్కన రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఇప్పటికే 30% దాటింది. నిబంధనల ప్రకారం ఆయా ఆలయాల్లో వేతనాల పెంపు సాధ్యం కాదు. కానీ 2010 వేతన సవరణ సమయంలో దాన్ని పట్టించుకోకుండా అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్టాబ్లిష్మెంట్ వాటాను 40 శాతానికి పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే ఆలయాల నుంచి 30% చొప్పున వసూలు చేసి వేతన నిధిని ఏర్పాటు చేసి ఏకరూప వేతన విధానం అమలు చేయాలనే మరో అంశం అధ్యయనంలో ఉంది. -
దేవా... ఇదేమి స్వాహా
దేవాలయ పునర్నిర్మాణంలో అవినీతి? లక్షల్లో దాతల సొమ్ము దుర్వినియోగం దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టు దేవాలయం పునర్నిర్మాణంలో తలో చేయి వేసి లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేశారని భక్తులు వాపోతున్నారు. దాతల సొమ్ముతోనే నిర్మించినట్టు ఓ వైపు చెబుతుంటే దేవాదాయ శాఖ విడుదల చేసి రూ.25 లక్షలు ఏమయ్యాయని గ్రామస్తులు నిలదీయడంతో నీళ్లు నములుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామంలో ఉన్న దేవాలయ పునరుద్ధరణ పనులు వివాదాస్పదంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి పునర్నిర్మాణం కోసం నిధులు రాగా, మరోవైపు దాతల నుంచి కూడా నిధులు భారీగా వసూలు చేశారు. ప్రభుత్వ నిధులతో పనులు పూర్తి చేసినట్లు శిలాఫలకం వేసిన అధికారులే, దాతలు ఇచ్చిన సొమ్మును కూడా శిలాఫలకాల్లో చూపించారు. ఈ పనుల్లో అధికారులు కుమ్మక్కై భారీగా దాతల సొమ్ము నొక్కేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు దేవాదాయ శాఖ కమిషనర్‌కు, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం జీనోద్ధరణ పనులకు దేవాదాయ శాఖ ద్వారా రూ.25.65 లక్షల అంచనాలు ఆమోదం పొందాయి. వీటిని టెండర్లు పిలిచి పనులూ పూర్తి చేశారు. ఈ పనికి ఖర్చయిన రూ.25 లక్షల ఖర్చులో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద దేవస్థానం నిధుల నుంచి రూ.8.55లక్షలు, ప్రభుత్వ సీజీఎఫ్ గ్రాంట్ నుంచి రూ.17 లక్షలు వచ్చాయి. ఈ పనులన్నీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి పి.వెంకట్రావు నేతృత్వంలో పూర్తి చేశారు. కానీ ఇదే పనులకు పొందూరు గ్రామ నివాసులైన వేజండ్ల రామారావు, కనమర్లపూడి వెంకట శేషరావు తదితరులు రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ తరపున సుమారు రూ. 55 లక్షల వరకూ వసూలు చేసి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు శిలాశాసనం చెక్కించారు. ఒకే పనిని తామంటే తాము చేసినట్లుగా దేవాదాయ శాఖ, పునర్నిర్మాణ కమిటీవారు చెప్పుకుంటున్నారు. దేవస్థానం గోడలపై ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రకారం మొత్తం 80 లక్షల రూపాయల వరకూ ఖర్చయినట్లు కనపడుతోంది. వాస్తవంగా ఈ పనికి డిపార్టుమెంట్ రూ.25 లక్షలు మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే దాతలు వసూలు చేసిన మొత్తం దుర్వినియోగమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రహరీగోడ దగ్గర నుంచి నందీశ్వరుడు, కరెంట్ ఫ్యాన్లు, కరెంట్ కనెక్షన్, మెయిన్ గేట్ తదితర అన్ని పనులనూ చేయించినట్లు దాతలు తమ పేర్లతో శిలాఫలకాలను గుడి ఆవరణలో వేశారు. దాతలు డిపార్టుమెంట్ నిర్ణయించిన పనులు పూర్తిగా వారి స్వంత నిధులో చేయించినట్లు శిలాఫలకాలు ఉన్నపుడు దేవస్థాన ఇంజినీర్లు బిల్లులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆలయ ప్రతిష్ట సమయంలో కమిటీ లేకపోయినా కమిటీ ఉన్నట్లు ప్రొటోకాల్ బోర్డులలో రాయించడంపై ఈవోపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చర్యలు చేపడతాం టంగుటూరు మండలం పొందూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అవకతవకలు జరిగినట్లు, నిధులు దుర్వినియోగమైనట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. రుజువైన పక్షంలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతాం. సీజీఎఫ్ కింద కేటాయించిన నిధులను వెనక్కు తీసుకుంటాం. అవకతవకలలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాత్ర ఉందని తేలితే ఆయనపైకూడా చర్యలు తీసుకుంటాం. - వెండిదండి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ -
ఎస్బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము
- శ్రీకాళహస్తిలో అధికారుల నిర్వాకం శ్రీకాళహస్తి : సాధారణ అవసరాలు, ఉత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయ సొమ్మును రూ.2కోట్ల వరకు సేవింగ్స్ (ఎస్బీ)ఖాతాలో ఆలయాధికారులు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువయితే బ్యాంకులో ఫిక్సె డ్ డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా రూ.20కోట్లను ఎస్బీ ఖాతాలో అధికారులు ఉంచేశారు. దాదాపు ఏడు నెలలుగా ఈ మొత్తానికి వడ్డీ లేకుండాపోయింది. భక్తులు ఆలయ హుండీల్లో వేసిన కానుకలు భద్రపరచి సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అధికారులదే. అయితే శ్రీకాళహస్తీశ్వరాల యంలో భక్తులు హుండీల్లో వేసిన డబ్బుతో పాటు ఆలయంలో రాహుకేతు పూజలు, ఇతర అభిషేకాల ద్వారా వచ్చిన రూ.20కోట్లు బ్యాంక్‌లో ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఎస్బీ అకౌంట్లో జమచేశారు. ఏటా దేవాదాయశాఖకు జూన్ చివరికల్లా సుమారు రూ.10కోట్లు ఆలయం నుంచి చెల్లించాల్సి ఉంటుం ది. అయినా అదనంగా మరో రూ.10కోట్లు ఉంచుకోవాల్సిన అవసరమం ఏమిటనేది ప్రశ్న. గతంలో ఎన్నడూ ఈవోలు ఇలా ఇంత పెద్ద మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఉంచిన సందర్భం లేదు. దేవాదాయశాఖకు చెల్లించడం కోసమే : ఈవో దేవాదాయశాఖకు ప్రతి ఏటా జూన్ చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఆదాయాన్ని బట్టి కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. గత ఏడాది రూ.10కోట్ల వరకు ఆలయానికి చెందిన డబ్బును దేవాదాయశాఖకు చెల్లించాం. ఈసారి ఆలయ ఆదాయం పెరగడంతో రూ.12కోట్ల వరకు చెల్లించాలి. ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే దేవాదాయశాఖకు వెంటనే చెల్లించాలంటే ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్ధేశంతో రూ.20కోట్లు ఎస్బీలో ఉంచాం. పుష్కరాల వల్ల చెల్లించలేకపోయాం. పుష్కరాలు తర్వాత చెల్లిస్తాం. అంతే తప్ప పైసా తిన్నా.. ఇబ్బందులు తప్పవు. - బి.రామిరెడ్డి,ఈవో -
ఏం మాయ చేశారో!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత. దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇద్దరు వ్యక్తులు ఉద్యోగులుగా చలామణీ అవుతున్నారు. ఓ ఆలయ మేనేజర్ వారికి ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ల పేరుతో సర్వీసు రికార్డులు సృష్టించాడు. ఏడేళ్ల సర్వీసు తర్వాత పీఆర్సీ కూడా అమలు చేయించాడు. వీరికి ప్రభుత్వం నెల నెలా ఠంఛనుగా జీతాలు చెల్లిస్తోంది. డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సహకరించడంతో ఈ వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా నడిచాయి. దొంగ ఉద్యోగులిద్దరికీ బదిలీ అయినప్పుడు 14 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపడింది. ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు జరపడంతో ఎన్నో విస్మయకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. వ్యవస్థలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేశాయి. దీంతో ముగ్గురిని విధుల నుంచి తొలగించి, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. - దేవాదాయశాఖలో దొంగ నియామకాలు - 14 ఏళ్ల కిందటి అడ్డగోలు వ్యవహారం - ఉన్నతాధికారులకు తెలియకుండా కథ నడిపించిన ఆలయ మేనేజర్ - సహకరించిన డీసీఓ సూపరింటెండెంట్ డాబాగార్డెన్స్(విశాఖ): దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకంలో అవకతవకలు బయటపడ్డాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్ తెలిపారు. సోమవారం టర్నర్ చౌల్ట్రీలో ఉన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ విషయమై రీజనల్ జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆయన వెల్లడించిన వివరాలు.. విశాఖపట్నం కంచరపాలెం బర్మా క్యాంపు జై భారత్‌నగర్‌లో ఉన్న నూకాంబిక అమ్మవారి దేవాలయంలో చెంబోలు శ్రీనివాసరావు మేనేజర్‌గా విధులు నిర్వహించేవాడు. 2001లో భక్త సమాజం సెక్రటరీ ద్వారా జి.సత్యనారాయణ అనే వ్యక్తిని రూ.వెయ్యి జీతానికి నియమించాడు. ఎల్.వి.కృష్ణారావు అనే వ్యక్తిని కూడా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే అడ్డగోలుగా ఉద్యోగమిచ్చాడు. అంతేగాక 1993 పీఆర్సీ అమలు చేస్తూ 2008 నుంచి జి.సత్యనారాయణకు నెలకు రూ.16 వేలు,(ఫైల్ నెంబరు ఏ1/2084/08, తేది 2008 మే 25) ఎల్.వి.కృష్ణారావుకు నెలకు రూ.10 వేలు జీతంగా జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో పర్మినెంట్ చేశారు. వాస్తవానికి ఆ ఫైల్ నెంబరుతో యలమంచిలిలోని ఓ దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడిపై ఫిర్యాదు నమోదు చేసి ఉంది. దేవాలయానికి మంజూరయ్యే నిధులతో వారికి జీతాలు చెల్లిస్తూ వచ్చిన ఆలయ మేనేజర్ చెంబోలు శ్రీనివాసరావు.. నిధుల కొరత వల్ల ఇబ్బందులు ఎదురై సూపరింటెండెంట్ సహాయంతో వారిద్దర్నీ భీమిలి లంగర్ ఖానా చౌట్రీకి, అనంతరం సంగివలస కొత్తఅమ్మవారి దేవాలయానికి బదిలీ చేసేశాడు. ఈ విషయాన్ని క్షుణంగా పరిశీలించి విచారిస్తే చెంబోలు బాగోతం బయటపడిందని సహాయ కమిషనర్ పుష్పవర్థన్ తెలిపారు. విచారణ అనంతరం ప్రాంతీయ సహాయ కమిషనర్ భ్రమరాంబకు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని, ఆమె సూచన మేరకు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ నెల 20న ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ అవకతవకలకు ప్రధాన బాధ్యుడైన చెంబోలు శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించి, సహకరించిన సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశామన్నారు. త్వరలోనే మరికొంతమంది జాబితాను వెల్లడిస్తామని సహాయ కమిషనర్ పేర్కొన్నారు. -
ఖజానా నుంచి వేతనాలివ్వండి
దేవాదాయ కమిటీకి అర్చకులు, ఉద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: తమకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు ఇచ్చేలా సిఫారసు చేయాలని దేవాదాయ చట్ట సవరణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు కోరారు. కమిటీ సభ్యులు వెంకటాచారి, సీతారామారావు, కృష్ణమూర్తి శనివారం దేవాదాయశాఖ కార్యాలయంలో అభిప్రాయసేకరణ నిర్వహించారు. దీనికి పలు ఆలయాల ధర్మకర్తలు, అర్చకులు, ఉద్యోగులు హాజరై పలు సూచనలు అందజేశారు. దేవాలయాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఖజానా నుంచి వేతనాలు చెల్లించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌తో ఇటీవల దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు దిగటంతో ప్రభుత్వం దాని పరిశీలనకు ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చట్ట సవరణ కమిటీకి కూడా ఆ అంశాన్ని వివరించి ప్రభుత్వానికి అనుకూలంగా సిఫారసు చేయాల్సిందిగా కోరారు. అర్చక సంఘాల విభేదాలపై అసహనం: అర్చక సంఘాల్లో విభేదాలు, పరస్పర ఆరోపణలపై కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గంగు భానుమూర్తి ఆధ్వర్యంలోని అర్చక సంఘం, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో అర్చకుల్లో విభేదాలు రచ్చకె క్కాయి. సమ్మెను ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలోని తెలంగాణ అర్చక సంఘం వ్యతిరేకించింది. సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ విభేదాలు తీవ్రమయ్యాయి. కమిటీకి మొదట భానుమూర్తి వర్గం సూచనలు అందజేసింది. ఆ తర్వాత ఉపేంద్ర శర్మ వర్గం తెలిపింది. ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీనిపై కమిటీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
మాస్టర్ ప్లాన్ల విషయంలో సర్కార్ సీరియస్
సింహాచలం, న్యూస్‌లైన్: ప్రధాన దేవాలయాల్లో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి చేసిన మాస్టర్ ప్లాన్లు దీర్ఘకాలం అప్రూవల్‌కి నోచుకోక పోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా చాలా దేవాలయాల మాస్టర్ ప్లాన్లు అప్రూవల్ కాలేదన్నారు. ఇందులో దేవాలయాల అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. ఈనెల 20న ప్రధాన దేవాలయాల ఈఓలతో హైదరాబాద్‌లోని దేవాదాయాశాఖ కమిషనర్ కార్యాలయంలో దీనిపై చర్చ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాన్ లేకుండా పనులు చేపడుతుండడంతో ఖర్చు పెరుగుతోందని, ఈఓలు మారినప్పుడల్లా ప్లాన్ మారిపోతోందన్నారు. సింహగిరి దివ్యక్షేత్రం ప్లాన్ కూడా ఆమోదానికి నోచక పోవడంపై స్పందిస్తూ త్వరలోనే ఆమోదం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఈ కోటి తులసి పూజల్లో పాల్గొన్నారు. ఏఈఓ ఆర్.వి.ఎస్.ప్రసాద్ ఆయనకు ప్రసాదం అందజేశారు. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు శ్రీనివాసరాజు, మల్లేశ్వరరావు, రాంబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఘర్షణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్ర, విభజనకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల మధ్య.. ఇతర శాఖల ఉద్యోగులు వారి ఆందోళనల్లో పాల్గొనవద్దనే ఒప్పందం కుదిరింది. అయితే ఏపీఎన్జీవోలు ఈ ఒప్పందాన్ని మీరి ఇతర శాఖల వారిని పిలిపించుకుని సమ్మె నిర్వహిస్తున్నారంటూ దేవాదాయ శాఖ తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖలోని ఇరుప్రాంతాల ఉద్యోగులు ఒకరినొకరు దూషించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇరు పక్షాలు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. వారు పక్కపక్కనే ఆందోళనలు నిర్వహించడంతో వారి మధ్య తీవ్ర తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఒకరికొకరు తలపడేందుకు యత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనలు విరమించాలని ఇరువర్గాలనూ ఆదేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.