‘బహుమానం’పై మెట్టు దిగిన దేవాదాయశాఖ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు మంజూరు చేస్తున్న బ్రహ్మోత్సవ బహుమానం విషయంలో దేవాదాయ శాఖ మెట్టు దిగింది. టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకే బ్రహోత్సవ బహుమానం ఇచ్చేలా నిశ్చయించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవ బహుమానం తగ్గిస్తూ ఈ నెల 3న జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. టీటీడీలో శాశ్వత ఉద్యోగిxకి రూ. 12,200, కాంట్రాక్టు ఉద్యోగికి రూ.6,100 బహుమానం ఇచ్చేలా టీటీడీ బోర్డు తీర్మానించి దేవాదాయ శాఖకు పంపింది.
అయితే ఆ శాఖ శాశ్వత ఉద్యోగికి రూ. 10,000, కాంట్రాక్టు ఉద్యోగికి రూ. 5,000గా నిర్ణయంచి జీవో జారీ చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు టీటీడీ ఈవో డాక ్టర్ సాంబశివరావును కలసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈవో ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకే ఉద్యోగులకు బహుమానం విడుదల చేసే ఫైల్‌పై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ శుక్రవారం సాయంత్రం సంతకం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
టీటీడీ ఉద్యోగులకు శుభవార్త
Published Fri, Feb 12 2016 10:11 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement