ఎస్‌బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము | Rs 20 crore on account of SB | Sakshi
Sakshi News home page

ఎస్‌బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము

Published Wed, Jul 22 2015 3:39 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM

ఎస్‌బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము - Sakshi

ఎస్‌బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము

- శ్రీకాళహస్తిలో అధికారుల నిర్వాకం
శ్రీకాళహస్తి :
సాధారణ అవసరాలు, ఉత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయ సొమ్మును రూ.2కోట్ల వరకు సేవింగ్స్ (ఎస్‌బీ)ఖాతాలో ఆలయాధికారులు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువయితే బ్యాంకులో ఫిక్సె డ్ డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా రూ.20కోట్లను ఎస్‌బీ ఖాతాలో అధికారులు ఉంచేశారు. దాదాపు ఏడు నెలలుగా ఈ మొత్తానికి వడ్డీ లేకుండాపోయింది. భక్తులు ఆలయ హుండీల్లో వేసిన కానుకలు భద్రపరచి సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అధికారులదే.

అయితే శ్రీకాళహస్తీశ్వరాల యంలో భక్తులు హుండీల్లో వేసిన డబ్బుతో పాటు ఆలయంలో రాహుకేతు పూజలు, ఇతర అభిషేకాల ద్వారా వచ్చిన రూ.20కోట్లు బ్యాంక్‌లో ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఎస్‌బీ అకౌంట్‌లో జమచేశారు. ఏటా దేవాదాయశాఖకు జూన్ చివరికల్లా సుమారు రూ.10కోట్లు ఆలయం నుంచి చెల్లించాల్సి ఉంటుం ది. అయినా అదనంగా మరో రూ.10కోట్లు ఉంచుకోవాల్సిన అవసరమం ఏమిటనేది ప్రశ్న. గతంలో ఎన్నడూ ఈవోలు ఇలా ఇంత పెద్ద మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఉంచిన సందర్భం లేదు.
 
దేవాదాయశాఖకు చెల్లించడం కోసమే : ఈవో
దేవాదాయశాఖకు ప్రతి ఏటా జూన్ చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఆదాయాన్ని బట్టి కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. గత ఏడాది రూ.10కోట్ల వరకు ఆలయానికి చెందిన డబ్బును దేవాదాయశాఖకు చెల్లించాం. ఈసారి ఆలయ ఆదాయం పెరగడంతో రూ.12కోట్ల వరకు చెల్లించాలి. ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే దేవాదాయశాఖకు వెంటనే చెల్లించాలంటే ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్ధేశంతో రూ.20కోట్లు ఎస్‌బీలో ఉంచాం. పుష్కరాల వల్ల చెల్లించలేకపోయాం. పుష్కరాలు తర్వాత చెల్లిస్తాం. అంతే తప్ప పైసా తిన్నా.. ఇబ్బందులు తప్పవు.
- బి.రామిరెడ్డి,ఈవో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement