Temples authority
-
దేవాదాయ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులంతా హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని ఆ శాఖ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో అన్యమతస్తులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ పద్మ సర్క్యులర్ జారీ చేశారు. దేవాలయాలు, దేవదాయ శాఖ కార్యాలయాలు, సంస్థ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించారు. నిర్ణీత పత్రంలో అఫిడవిట్ 15 రోజుల్లోగా కమిషనర్ కార్యాలయంలో అందచేయాలని సూచించారు. దేవదాయ చట్టం ప్రకారం హిందూ మతస్తులనే ఉద్యోగులుగా, ఆలయాల్లో తీసుకోవాలనే స్పష్టమైన నిబంధన ఉంది. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో పేర్కొన్నారు. రెగ్యులర్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తీసుకోవాల్సిన అఫిడవిట్ ఫ్రొఫార్మను దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలతోపాటు అన్ని దేవదాయ శాఖ సంస్థలు, ఆలయాలకు కమిషనర్ పంపించారు. -
ఎస్బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము
- శ్రీకాళహస్తిలో అధికారుల నిర్వాకం శ్రీకాళహస్తి : సాధారణ అవసరాలు, ఉత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయ సొమ్మును రూ.2కోట్ల వరకు సేవింగ్స్ (ఎస్బీ)ఖాతాలో ఆలయాధికారులు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువయితే బ్యాంకులో ఫిక్సె డ్ డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా రూ.20కోట్లను ఎస్బీ ఖాతాలో అధికారులు ఉంచేశారు. దాదాపు ఏడు నెలలుగా ఈ మొత్తానికి వడ్డీ లేకుండాపోయింది. భక్తులు ఆలయ హుండీల్లో వేసిన కానుకలు భద్రపరచి సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అధికారులదే. అయితే శ్రీకాళహస్తీశ్వరాల యంలో భక్తులు హుండీల్లో వేసిన డబ్బుతో పాటు ఆలయంలో రాహుకేతు పూజలు, ఇతర అభిషేకాల ద్వారా వచ్చిన రూ.20కోట్లు బ్యాంక్లో ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఎస్బీ అకౌంట్లో జమచేశారు. ఏటా దేవాదాయశాఖకు జూన్ చివరికల్లా సుమారు రూ.10కోట్లు ఆలయం నుంచి చెల్లించాల్సి ఉంటుం ది. అయినా అదనంగా మరో రూ.10కోట్లు ఉంచుకోవాల్సిన అవసరమం ఏమిటనేది ప్రశ్న. గతంలో ఎన్నడూ ఈవోలు ఇలా ఇంత పెద్ద మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఉంచిన సందర్భం లేదు. దేవాదాయశాఖకు చెల్లించడం కోసమే : ఈవో దేవాదాయశాఖకు ప్రతి ఏటా జూన్ చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఆదాయాన్ని బట్టి కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. గత ఏడాది రూ.10కోట్ల వరకు ఆలయానికి చెందిన డబ్బును దేవాదాయశాఖకు చెల్లించాం. ఈసారి ఆలయ ఆదాయం పెరగడంతో రూ.12కోట్ల వరకు చెల్లించాలి. ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే దేవాదాయశాఖకు వెంటనే చెల్లించాలంటే ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్ధేశంతో రూ.20కోట్లు ఎస్బీలో ఉంచాం. పుష్కరాల వల్ల చెల్లించలేకపోయాం. పుష్కరాలు తర్వాత చెల్లిస్తాం. అంతే తప్ప పైసా తిన్నా.. ఇబ్బందులు తప్పవు. - బి.రామిరెడ్డి,ఈవో