EO
-
శ్రీశైలం మహాక్షేత్రంలో స్వచ్ఛ శ్రీశైలం
-
ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగింది: టీటీడీ ఈవో
సాక్షి,తిరుమల: ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు. కల్తీ జరిగినట్లు తేలడంతో లడ్డూ తయారీలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని చెప్పారు. లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. టీటీడీకి సొంత టెస్ట్ ల్యాబ్ లేదు. జులై5,6 తేదీల్లో రెండు నెయ్యి ట్యాంకర్లలోని శాంపిల్స్‌ను బయట ల్యాబ్‌లలో టెస్ట్‌కు పంపాం. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఈ టెస్ట్‌లలో తేలింది. దీంతో సరఫరాదారులందరికీ వార్నింగ్ ఇచ్చాం. నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్ ఖరారైంది’అని ఈవో తెలిపారు. ఇదీ చదవండి.. శ్రీవారి లడ్డూపై సీబీఎన్ ఉన్మాద రాజకీయం -
తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు
తిరుపతి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈవో గౌతమి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం తొలిసారి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు అసహనానికి గురయ్యారు. అధికారులు పుష్ప గుచ్చాలు ఇస్తున్నప్పటికీ తీసుకోకుండా వాటిని పక్కకు తోసేశారు. అదే సమయంలో స్థానిక నేతలు ఇచ్చిన బొకేలను మాత్రం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణం చేశాక స్పెషల్ విమానంలో కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అయితే.. గాయత్రి నిలయం వద్ద ఆయన వాహనం దిగి నేరుగా లోపలికి వెళ్లారు. అప్పటికే లోపల ఉన్న తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు యత్నించగా.. సీఎం చంద్రబాబు తిరస్కరించారు. అయితే.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఇచ్చిన గుచ్ఛాలను మాత్రం ఆయన నవ్వుతూ తీసుకున్నారు. వాహనం దిగిన తనకు స్వాగతం పలికేందుకు అధికారులు బయటకు రాకపోవడంతోనే ఆయన ప్రవర్తించి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ అంశం తెరపైకి వచ్చింది. ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబుతిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా విజయవాడ వెళ్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకోనున్నారాయన. అనంతరం ఈ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే కీలక హామీలపైఆయన సంతకాలు చేస్తారని సమాచారం. -
అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదాల మండపం ఆర్కియాలజీ పరిధిలో లేదన్నారు. ఎప్పుడైనా కూలే పరిస్థితి ఉందని.. అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశామని ఈవో పేర్కొన్నారు. అనేకమార్లు ఆర్కియాలజీ సంప్రదింపు చేసిన స్పందించలేదు. అలిపిరి పాదాల మండపం కూడా శిథిలావస్థలో ఉన్నా.. వాటిపై రాజకీయాలు చేస్తూ, భక్తులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీటీడీ వద్ద శిల్పకళా, ఆలయాల నిర్మాణం సంబంధించిన అన్ని వింగ్స్ ఉన్నాయని ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని ఈవో అన్నారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం కానుకలుగా సమర్పించారు. గత ఏడాది రూ. 39.40 కోట్లు, 2022లో రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చింది. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని ఈవో వెల్లడించారు. -
తిరుమలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: అధిక మాసం కారణంగా.. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. సోమవారం అన్నమయ్య భవన్లో అన్నివిభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సోమవారం సమావేశం నిర్వహించి.. బ్రహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించి.. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబరు 18 నుండి 26 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15వ తేదీ నుండి 23 వరకు తేదీ వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని వెల్లడించారాయన. ఈ ఏడాదిలో అధిక మాసం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రంను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22వ తారీఖున గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటుందని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారాయన. ఇక అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో 14-18వ తేదీల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారాయన. అక్టోబర్ 18వ తారీఖున గరుడవాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.. ఈ ఏడాది పెరటాసి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్ధాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశం ఉండొచ్చన్నారాయన. పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. అలాగే.. సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, కాబట్టి ఈ రెండు బ్రహ్మోత్సవాలు, పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. టీడీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు. -
ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: టీటీడీ ఈవో
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ రోడ్ల ప్రయాణంలో ప్రమాదాల నివారణకు దీర్ఘ కాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరు సుందర తిరుమల-శుద్ధ తిరుమల పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయి. 'ఇందుకోసం జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేశాం. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. టీటీడీ సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు, ఇతర విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందిస్తున్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. 'తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. తద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాము. టీటీడీ చరిత్రలో తొలిసారి టీటీడీ లోని అన్ని విభాగాల ఆధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా నెల రోజుల పాటు సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజుల్లో 15,441 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 13,351 మంది కార్పొరేషన్ సిబ్బంది, 6 వేల మందికి పైగా శ్రీవారి సేవకులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్, పోలీస్, న్యాయశాఖ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్ రోడ్లు, రెండు నడక దార్లలో పారిశుద్ధ్య విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మే 13వ తేదీన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణగారు సైతం తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు' అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదీ చదవండి:అధైర్యపడొద్దు..అండగా ఉంటాం 'తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశాము. ట్యాక్సీ డ్రైవర్లు, వాహనదార్లు డ్రైవింగ్ చేసే సమయంలో టీటీడీ నిర్ణయించిన వేగం మేరకే నిదానంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడకుండా, మలుపుల వద్ద పరిమిత వేగంతో , ఓవర్ టేక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి' అని ఈవో ధర్మారెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి టీటీడీకి కేటాయించింది. ఈ భూమిలో దాత, రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించనున్నారు. జూన్ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు భక్తులు పాల్గొంటారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మే 31వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. సనాతన హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 3 నుండి 8వ తేదీ వరకు టీటీడీ నిర్వహిస్తోంది. 8వ తేదీ జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదీ చదవండి:శరవేగంగా చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం శ్రీ పద్మావతి హృదయాలయంలో 20నెలల వ్యవధిలోనే 1450 మంది చిన్నారులకు ఉచితంగా గుండె అపరేషన్లు నిర్వహించారు . క్లిష్టమైన గుండె అపరేషన్లు కూడా ఆరోగ్య శ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ స్కీంల కింద, ప్రాణదానం ట్రస్టు సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మూడు గుండెమార్పిడి ఆపరేషన్లు కూడా విజయవంతంగా నిర్వహించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 'టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంత మంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ఐటి విభాగం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిరుద్యోగులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోస పోవద్దు' అని ఈవో ధర్మారెడ్డి భక్తులను కోరారు. మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 23.38 లక్షలుకాగా, హుండీ కానుకలు రూ.109.99 కోట్లు ఆదాయం లభించింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ఒక కోటి 6 లక్షలు కాగా, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 56.30 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11 లక్షలు. ఇదీ చదవండి:మేనిఫెస్టో చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే కాగితం: కొమ్మినేని -
ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట
-
టీఎస్పీఎస్సీలో కొత్త కోణం.. ఆ పరీక్ష రద్దు చేయాలని ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో అండ్ ఈవో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రొఫెసర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పేపర్ లీక్‌లో ఒక్కరే ఉన్నారని అనుకోవడం లేదు. పేపర్ లీక్‌పై రకరకాల వదంతులు వచ్చాయి. పరీక్షల రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మళ్లీ క్వాలిఫై అవుతామో లేదోనని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది జీవితాలలో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది. లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణను లీకుల రాజ్యం, లిక్కర్ రాజ్యంగా మార్చారు. టీఎస్పీస్సీలో సమగ్ర పక్షాళన జరగాలి. డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాము. రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిసి త్వరలో పోరాటానికి పిలుపునిస్తామన్నారు. ఇక, పేపర్ లీక్‌పై బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. బీజేపీ నేతల తీరుపై అనుమానాలు: కేటీఆర్ -
తిరుమలలో శిల్పకళా ప్రదర్శనను ప్రారంభించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
-
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
-
Kanipakam: కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. -
కేసులు వేసే అధికారం ఈఓ, ఏసీలకు..
సాక్షి, అమరావతి: దేవుడి భూములు, ఆలయాల ఇతర ఆస్తులను ఆక్రమించుకునే వారిపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారాన్ని సంబంధిత ఆలయ ఈఓ లేదా జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలంటే దేవదాయ శాఖ చట్టంలోని 86(3) సెక్షన్ ప్రకారం సంబంధిత ఆలయ ఈఓలు దేవదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ అధికారాన్ని సంబంధిత ఆలయ ఈఓ లేదా జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లకు బదలాయిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేవుడి భూములు, ఇతర ఆస్తుల ఆక్రమణదారులపై ఎటువంటి జాప్యం లేకుండా స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. దేవదాయశాఖ పరిధిలో వివిధ ఆలయాల పేరిట దాదాపు 4.09 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో అందులో 67,525 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. మరో 3,613 ఎకరాలను వాటి లీజు గడువు ముగిసినా సంబంధిత లీజుదారులు వాటిని తమ అధీనంలో ఉంచుకున్నారు. ట్రస్టు బోర్డులకుదరఖాస్తుల స్వీకరణ అధికారం ఇక 6 (ఏ), (బీ) కేటగిరి ఆలయాల్లో ట్రస్టు బోర్డుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేయడం, ట్రస్టు బోర్డు సభ్యుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ అధికారం ఇప్పటివరకు దేవదాయ శాఖ కమిషనర్‌కే ఉంది. తాజాగా.. 6 (ఏ) కేటగిరీ ఆలయాలకు నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ అధికారం దేవదాయ శాఖ డివిజనల్ కమిషనర్లకు. 6 (బీ) ఆలయాల అధికారం జిల్లా దేవదాయ శాఖ కమిషనర్లకు బదలాయిస్తున్నట్లు కూడా వాణీమోహన్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
భక్తుల సౌకర్యార్థం మరిన్ని సంస్కరణలు
-
శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలిగింది : జవహర్ రెడ్డి
సాక్షి, తిరుమల : టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సాక్షి టీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో పుణ్యఫలం చేస్తే గానీ ఈ అవకాశం దక్కదని పేర్కొన్నారు. ‘శ్రీవారి పాదాల చెంత నేను చదువును పూర్తి చేశాను. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుత్తం ఉన్న పద్దతులను మరింత పటిష్టం చేస్తా’నని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో భక్తుల కోసం నూతన సంస్కరణలు తీసుకొస్తానని తెలిపారు. పూర్తి జాగ్రత్తలు తీసుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చన్నారు. అన్‌లాక్ 5లో భాగంగా మినహాయింపులు ఇచ్చారని, టీటీడీ ఉన్నత అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు తెలియజేస్తామని ఈవో కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. (టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి) -
టీటీడీ ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. (బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం) 9న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల భక్తుల సౌకర్యార్థం ఈ నెల 15 నుంచి 24 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 9న ఉదయం 11 గంట లకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, తూర్పు గోదావరి : అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం మంగళవారం సీరియస్ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో చక్రదరరావును సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యేవరకు అన్నవరం ఆలయ ఈవో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా గత శనివారం అర్థరాత్రి తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : స్వామి వారి రథం దగ్ధం.. మంత్రి దిగ్భ్రాంతి) -
మనసున్న పరిపూర్ణ
ఆమె ఈవో అన్నపూర్ణ ఆకలి చూసి అన్నంపెట్టే చెయ్యి ఆధ్యాత్మికత దారులు వేసే చేత కష్టం ఎరిగి కాపాడే తత్వం స్పందించే మనసున్న పరిపూర్ణ ఉదయం నిద్రలేచే సరికే ఆ రోజు చేయాల్సిన పనులు మన కోసం ఎదురు చూస్తుంటాయి. ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకుని ఉద్యోగానికి వెళ్తే అక్కడ మరికొన్ని బాధ్యతలు, సమస్యలు నవ్వుతూ ఎదురొస్తాయి. మనసును కంట్రోల్లో పెట్టుకుని అన్నింటినీ చిరునవ్వుతో పూర్తి చేయాలి. కొన్నాళ్లకు ఆ నవ్వు జీవం కోల్పోయి ప్లాస్టిక్ నవ్వులా మిగులుతుంది. నవ్వుకి తిరిగి జీవం రావాలంటే... మనలో ఒత్తిడిని తాను ఆఘ్రాణించి మనకు ఆహ్లాదాన్నిచ్చే ప్రదేశం ఒకటి కావాలి. మనలో చాలామందికి అది ఆలయమో, ప్రార్థనా మందిరమో అయి ఉంటుంది. ‘ఆలయానికి వచ్చే వారికి సాంత్వన కలిగించేటట్లు ఉండాలి ఆలయ వాతావరణం. మా ఉద్యోగ బాధ్యతలు పైకి భగవంతుని సేవగా కనిపిస్తాయి. కానీ మా విధి నిర్వహణ భగవంతుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సేవకే ఎక్కువగా అంకితమై ఉంటుంది’ అన్నారు హైదరాబాద్, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ. ప్రాచీన ఆలయమే పెద్ద బాలశిక్ష బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి అధికారిగా నియమకానికంటే ముందు అన్నపూర్ణ 32 ఆలయాలకు ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘‘అఆలు, గుణింతాలు, వాక్యాలు చదవడం నేర్చుకున్న తర్వాత పెద్ద బాలశిక్ష చదవాలి. అక్షరాభ్యాసం రోజే పెద్ద బాలశిక్ష చేతిలో పెడితే ఉద్యోగ బాధ్యత భూతంలా భయపెడుతుంది. అందుకే 2001లో ఈవోగా నాకు తొలి బాధ్యతగా హైదరాబాద్‌లోని వివేక్‌నగర్ హనుమాన్ ఆలయం కేటాయించినప్పుడు... మొదట ఏదైనా చిన్న ఆలయాన్నివ్వమని అడిగాను. సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్లో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ బాధ్యతలిచ్చారు. అది నాలుగు వందల ఏళ్ల నాటి ప్రాచీన ఆలయం. స్థానికులకు అక్కడ ఒక ఆలయం ఉన్న పట్టింపు కూడా ఉండేది కాదు. పూజారులు పూజ చేసి ఉదయం పది లోపు వెళ్లిపోయేవాళ్లు. ఆడవాళ్లు గుడికి రావడానికి వెసులుబాటు దొరికే సమయానికి గుడి మూసేస్తే ఎలా వస్తారని టైమింగ్స్ పొడిగించాను. సహస్రనామాలు చదివే మహిళలతో గ్రూప్ తయారు చేశాను. ఐదుగురు మహిళలు స్వచ్ఛందంగా పని చేశారు. వారితో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి కుంకుమార్చనకు రావలసిందిగా ఆహ్వానించాను. ఈవోగా రాకముందు నేను సెక్రటేరియట్లో ఉద్యోగం చేసిన అనుభవంతో చాలామంది ప్రముఖులతో పరిచయం ఉంది. నాయకులను, ఇతర ప్రముఖులను గుడికి ఆహ్వానించాను. దాంతో స్థానికులు కూడా అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు’’ అని తొలి ఆలయ బాధ్యత నిర్వహించిన రోజులను గుర్తు చేసుకున్నారు అన్నపూర్ణ. ధార్మిక వైద్యసేవ ప్రముఖ ప్రభుత్వ వైద్యశాలకు అనుబంధంగా ఉన్న ధర్మశాల నిర్వహణ బాధ్యత కూడా ధర్మాదాయ శాఖ నిర్వహణలోనే ఉండేది. పేషెంట్ హాస్పిటల్లో ఉంటే, వారికి సహాయంగా వచ్చిన వాళ్లకు ధర్మశాలలో బస సౌకర్యం ఉండేది. పది రూపాయల నామమాత్రపు ఫీజుతో గది ఇచ్చేవారు. పేదవాళ్లకు ఆసరాగా ఉండాల్సిన ఆ ధర్మశాల అన్నపూర్ణ బాధ్యతలు చేపట్టే నాటికి పేదరికానికి చిరునామా గా ఉండేది. కరెంట్ బిల్లు బకాయిల కారణంగా పవర్ కట్ అయింది. ఆమె ప్రభుత్వానికి తెలియచేసి గదులకు రిపేర్లు, వాటర్ ఫిల్టర్, బోరు, రోడ్డు వేయించారు. పూలకుండీలు పెట్టించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచారు. ఇదే ఫార్ములాను ఆలయాల నిర్వహణలో కూడా పాటించడమే ఆమె విజయ రహస్యం. 650 ఆలయాలున్న తెలంగాణ రాష్ట్రంలో 150 మంది సభ్యులున్న ఆలయాల ఈవోల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి దారి తీసిన నమ్మకం కూడా. ఈ ఏడాది జూన్‌లో గెజిటెడ్ అధికారిగా ప్రమోషన్ రావడంతో ఈవోల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారామె. ‘‘ప్రశాంతత కోసం ఆలయానికి వస్తారు. ఆలయంలో దర్శనం అయ్యే లోపు అసహనానికి లోనవుతుంటారు. ఆలయంలో పూల చెట్లు, మంచి శిల్పాలు, చిత్రాలతో ఆహ్లాదంగా ఉంటే భక్తులు ఆ మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఆలయంలో పార్కింగ్ సౌకర్యం లేకపోతే భక్తుల మనసు వాళ్ల వాహనం మీదనే ఉంటుంది. అందుకే బల్కంపేట ఆలయం బాధ్యతలు తీసుకున్న వెంటనే పార్కింగ్ లాట్ మీద దృష్టి పెట్టాను’’ అన్నారామె. నిత్యావసర సరుకుల పంపిణీ లష్కర్ బంగారు బోనం సికింద్రాబాద్ లష్కర్ బోనాల పండగ తెలంగాణ జిల్లాలతోపాటు... తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. మూడు నెలల ముందు నుంచి ఏర్పాట్లు మొదలవుతాయి. రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం చేయించడం తన చేతుల మీద జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు అన్నపూర్ణ. ఆ ఏడాది లష్కర్ బోనాలకు 35 లక్షల మంది భక్తులు రావడం కూడా రికార్డు. కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు నాయకులు, మహిళలు వెయ్యి బోనాలతో మొదలుపెట్టి పదిహేను వందల బోనాలతో ఆలయానికి చేరిన విషయాన్ని చెబుతూ ‘‘బతకడానికి ఎన్నో ఉద్యోగాలున్నాయి. నాకు ఇలాంటి ఉద్యోగం రావడం మా అమ్మానాన్నలు చేసిన పుణ్యమే. బల్కంపేట అమ్మవారికి బంగారు చీర కట్టించి, బంగారు బోనం పెట్టాలనేది ఇప్పుడు నా ముందున్న కల’’అన్నారు అన్నపూర్ణ. కరోనా ఇక్కట్లు అన్నపూర్ణ తండ్రి జనార్ధనరావు నల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలం, వెంపటి గ్రామంలో పటేల్. రోజుకు కనీసంగా వందమందికి తక్కువ లేకుండా పంచాయితీకి వచ్చేవారు. పొరుగూళ్ల నుంచి వచ్చిన వారికి అన్నం పెట్టి పంపించడం అన్నపూర్ణ తల్లి కౌసల్యాదేవి బాధ్యత. అన్నం పెట్టడంతోపాటు కూతురికి అన్నపూర్ణ అని పేరు పెట్టడం యాధృచ్చికం కావచ్చు. కానీ అన్నపూర్ణకు అన్నం పెట్టే అలవాటు మాత్రం వారసత్వంగా వచ్చింది. కరోనా వైరస్ ఇళ్లలో పని చేసుకునే వాళ్ల ఉపాధిని కాలరాసింది. పూజారులకు భగవంతుడికి పూజ చేసి హారతి కానుకలు లేకుండా ఒట్టిచేతులతో ఇళ్లకెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చింది. హాస్పిటల్లో పేషెంట్లకు తోడుండే సహాయకులు అన్నం తినడానికి చిన్న కాకా హోటల్ కూడా తెరుచుకోని దుస్థితి. ఇలాంటి వాళ్ల కోసం ఈ ఐదు నెలలుగా పని చేస్తున్నారు అన్నపూర్ణ. తన అన్నదమ్ములను, స్నేహితులను ప్రోత్సహించి సహాయం చేయిస్తున్నారు. ‘‘మనకు ఉన్న దాంట్లో నలుగురికి అన్నం పెడితే భగవంతుడు మనల్ని కాపాడుతాడు’’ అని అమ్మ చెప్పిన మాటలు నాలో బాగా నాటుకున్నాయని చెప్పారు అన్నపూర్ణ. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తారామె. గత ఏడాది మలేసియాలో మహిళాదినోత్సవం పురస్కారం అందుకోవడం వెనుక ఆమె చేసిన ఇన్ని పనులున్నాయి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎన్. రాజేశ్ రెడ్డి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర ఆహారం పంచుతున్న అన్నపూర్ణ -
విజయవాడ: దుర్గమ్మ దర్శనానికి గ్రీన్ సిగ్నల్
-
రథసప్తమి నాడు సప్తవాహనాలపై శ్రీవారు
సాక్షి, తిరుమల: తిరుమలలో సూర్యజయంతిని రథసప్తమిగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు. రథసప్తమిపై టీటీడీ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1న రథసప్తమిని నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ వేడుక కోసం నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: శ్రీవారి భక్తులకు తీపి కబురు రథసప్తమి నాడు సప్త వాహనాలపై శ్రీవారి ఊరేగింపు ఉంటుందని ఆయన చెప్పారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వేడుక పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రోజు సుమారు 55, 689 ఉచిత లడ్డులను భక్తులకు అందించామని తెలిపారు. భక్తులు అదనంగా 1,59,814 లడ్డూలు విక్రయించారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. చదవండి: గదుల బుకింగ్‌లో కాషన్ డిపాజిట్ విధానం -
మందిగిరి ఈవో రాంప్రసాద్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
-
ఎక్కడివారక్కడే గప్‌చుప్..!
సాక్షి, ఒంగోలు: సహజంగా ఏటా దేవదాయ, ధర్మాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుంటారు. జూన్ నెల 25వ తేదీ నుంచి ఈ మేరకు బదిలీలు ప్రారంభమయ్యాయి. జీవో ఎంఎస్ నంబర్ 46 పేరుతో దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం కూడా జూన్ 26న జీవో ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జూన్ 24వ తేదీ నుంచి బదిలీలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో బదిలీల ప్రక్రియ జిల్లాలో మూడు రోజులుగా నిలిచిపోయింది. కారణం సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం. జిల్లాను యూనిట్‌గా చేసుకున్నప్పుడు అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంది. గడిచిన ఏడాది కాలంగా జిల్లా దేవదాయ శాఖకు ఓ రకంగా అసిస్టెంట్ కమిషనర్ లేనట్టే. శ్రీరామమూర్తి సెలవులో వెళ్లినప్పటి నుంచి దేవదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్ లేరు. తాజాగా నియమితులైన అధికారి కూడా నియామకం అయిన వారం రోజుల తర్వాత కూడా విధుల్లో చేరలేదు. ఎక్కడివారక్కడే.. నిజానికి బదిలీల ప్రక్రియ నిర్వహించాలంటే తొలుత ఏయే గ్రూప్స్ ఆలయాల కార్య నిర్వహణాధికారులు ఎంతెంత కాలం నుంచి విధులు నిర్వహిస్తున్నారనే విషయంలో జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయానికి నివేదికలు ఇవ్వాలి. కానీ, నివేదికలు ఇచ్చేటప్పుడే అసమగ్ర నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ను అనుసరించి నిర్దేశిత తేదీలను అధికారులు పట్టించుకోరు. తద్వారా బదిలీలకు నిర్దేశించిన తేదీల్లో హడావిడిగా, నువ్వక్కడ, నేనిక్కడ అన్న రీతిలో బదిలీలు నిర్వహిస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్‌లో పారదర్శకతను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. బదిలీలకు తప్పుడు నివేదికలు మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌ను ప్రభుత్వ ఉత్తర్వులుగా మార్చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి తప్పుడు నివేదికలు ఇవ్వడం, బదిలీల సమయంలో అందుబాటులో ఉండక పోవడం, అనంతరం రాజకీయంగా ప్రాతినిధ్యం చేసి ఒకేచోట ఉండిపోవటం అనేది పలుచోట్ల ఈవోలు చేస్తున్న వ్యవహారం. ఈ క్రమంలో కమిషనర్ కార్యాలయం కూడా ఏ ఒకరిద్దరినో బదిలీ చేస్తున్నట్టు చూపించడంతో ప్రక్రియను సరిపెట్టేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో పారదర్శక నివేదికలతో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించాల్సిన ఈవోల బదిలీలు తూతూ మంత్రంగా జరుపుతూ దేవదాయ – ధర్మదాయ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రికవరీల ఊసేది? జిల్లాలో పలు చోట్ల దేవదాయ–ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన నిధులు గోల్మాల్ అవుతున్నాయి. భక్తుల కానుకలు నివేదికల్లో అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఇటీవల పొందూరు గ్రూప్ ఆలయ పరిధిలో రూ.23లక్షల కుంభకోణం జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి విచారణలు చేసి రికవరీ చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇంకో విచిత్రం ఏమంటే, నిధుల అవకతవకలు జరిగిన ప్రాంతాల్లోని ఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించటం దేవదాయ, ధర్మదాయ శాఖలో కొసమెరుపు. సత్వరం సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బదిలీలు పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహింపజేసి దేవాలయాల ఉన్నతికి పాటు పడాలని ఆయా ప్రాంతాల్లో భక్తులు కోరుతున్నారు. పాతుకుపోతున్న ఈవోలు జిల్లాలోని ఆలయాల కార్యనిర్వహణాధికారులు 50మంది వరకు ఉన్నారు. వీరిలో ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన వారు కొందరు ఉండగా, అధికులు జూనియర్ అసిస్టెంట్ హోదా నుంచి వచ్చి ఈవోగా పదోన్నతులు పొందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు నుంచే తప్పుడు సమాచారం ఇస్తుంటారు. జిల్లాలో ఉన్న 50మంది ఈవోల్లో అధిక శాతం మంది ఎక్కడివాళ్లక్కడ పాతుకు పోయారు. అధిక ఈవోలు 8,9 ఏళ్లుగా తాము నియామకం అయినచోటే పాతుకుపోయారు. ► సింగరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈవోగా ఉన్న అధికారి తొమ్మిదేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక ఆయన్ని మళ్లీ కోటప్పకొండకు ఇన్చార్జి ఈవోగా కూడా గత ప్రభుత్వ హయాంలో నియమించారు. ► ఒంగోలు గ్రూప్ ఆలయాల ఈవో తొమ్మిదేళ్లుగా, కొత్తపట్నం గ్రూప్ ఆలయాల ఈవో ఐదేళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. ► కారంచేడు గ్రూప్ దేవాలయాలకు కూడా ఈవో సుదీర్ఘకాలంగా బదిలీకి దూరంగా ఉన్నారు. ► కొప్పోలు గ్రూప్ ఆలయాల కార్యనిర్వహణాధికారి సుధీర్ఘకాలంగా బదిలీ కాలేదు. ► పొదిలి గ్రూప్ టెంపుల్స్‌కు చెందిన నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం(పొదిలికొండ) తదితరాల ఆలయాల ఈవోలు కూడా బదిలీలకు దూరం. ► మార్టూరు మండలంలోనూ అదే పరిస్థితి. ఈ ప్రాంతంలో 19 ఆలయాలకు ఒకరే ఈవో, వీరు కూడా అనేక ఏళ్లుగా బదిలీకి దూరంగా ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా మేనేజర్ హోదా కూడా ఉంది. ఇలా మార్కాపురం, కందుకూరు, పర్చూరు డివిజన్లలోని పలు ఆలయాల ఈవోలు ఒకేచోట ఏళ్ల తరబడి పాతుకుపోయారు. దీంతో బదిలీలకు మొహం చాటేస్తున్నారు. -
దుర్గగుడి సమావేశంలో మరోసారి బయటపడ్డ విభేదాలు
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశం సోమవారం రసాభాసగా సాగింది. ఆలయ ఈవో, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. ఉద్యోగుల సస్పెన్షన్ పై పాలకమండలి జోక్యం పట్ల ఈవో కోటేశ్వరమ్మ అసంతృప్తి చెందారు. సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకోమని లెటర్ ఇచ్చింది చైర్మన్ గౌరంగబాబు కాబట్టి దీనికి ఆయనే బాధ్యత వహించాలన్న పాలకమండలి సభ్యులు. పాలనా పరంగా ఉద్యోగుల విషయాల్లో కలుగచేసుకోవద్దంటు చైర్మన్ గౌరంగబాబు. పాలకమండలి ఉద్యోగుల విషయంలో చెర్మన్, పాలకమండలి సభ్యలు జోక్యం చేసుకోవద్దన్న ఈవో దీంతో సమావేశం చెర్మన్ గౌరంగబాబు బయటకు వెళ్లి పోయ్యారు. -
ఈవో Vs చైర్మన్!
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో అధికారవర్గం.. పాలకవర్గం విభేదాలపై పెడుతున్న శ్రద్ధ.. భక్తులకు మెరుగైన సేవలు అందించే అంశంపై పెట్టలేకపోతున్నారనేది అమ్మ భక్తులకు అర్థమవుతున్న విషయం. భక్తులు మెచ్చేలా.. అందరికీ నచ్చేలా నిర్ణయాలతో ముందడుగువేయాల్సిన తరుణంలో ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. కనకదుర్గమ్మ ఆలయ అధికారవర్గం.. పాలకవర్గం మధ్య విభేదాలు పాలక మండలి సమావేశం సాక్షిగా మరోమారు బహిర్గతమయ్యాయి. ఎడముఖం.. పెడముఖంగా ఈవో, చైర్మన్ వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించి ఎవరి ధోరణిలో వారు మాట్లాడటం భక్తులను విస్మయపరుస్తోంది. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈఓ, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. దుర్గగుడి పాలక మండలి సమావేశం శనివారం దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రంలోని బోర్డు మీటింగ్ హాల్లో జరిగింది. చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈఓ వి.కోటేశ్వరమ్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఈఓ కోటేశ్వరమ్మ మాత్రమే మీడియాతో ప్రసంగించి ముగించారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల తర్వాత నలుగురు సిబ్బందిపై వేటు వేయడంపై పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల వ్యవహారం దేవస్థాన అడ్మినిస్ట్రేషన్‌కు చెందిందని ఈఓ సర్ది చెప్పారు. ఈ విషయంలో పాలక వర్గం ఆగ్రహంగా ఉంది. పాలక వర్గ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి ఈఓ మీడియాకు వివరించి సమావేశాన్ని హడావుడిగా ముగించేశారు. అయితే సమావేశం గురించి, ఉద్యోగులపై వేటు వ్యవçహారం గురించి చైర్మన్‌ను వివరణ కోరగా, ఆయన మరోమారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాలక వర్గం, ఈఓ మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేది అర్థమవుతోంది. దత్తత ఆలయాల నిర్వహణపై దృష్టి : ఈఓ దుర్గగుడి దత్తత ఆలయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించామని ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు పాలక మండలి ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లో దుర్గగుడి దేవస్థానం సిబ్బందిని నియమించాలని నిర్ణయించామన్నారు. ఇటీవల ఓ ఆలయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో గర్భగుడిని అపరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ధూపదీప నైవేద్యాలను సరిగా నిర్వహించడం లేదని గుర్తించి అర్చకుడిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీంతో ఆ ఆర్చకుడు ఈఓ, ఏఈఓతో పాటు వైదిక కమిటీపై సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశామని వివరించారు. దుర్గాఘాట్‌లో పూజా సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల లైసెన్సులు రెన్యువల్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దుర్గాఘాట్‌లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు అవసరమైన ఇంజినీరింగ్ పనులకు ఆమోదం తెలిపామన్నారు. ఘాట్ రోడ్డులో పార్కింగ్ సదుపాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించామని, అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బంగారం, వెండిని మింట్ ద్వారా కరిగించి గోల్డ్ బాండ్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గొల్లపూడిలోని దేవస్థానానికి చెందిన స్థలంలో కాటేజీలు నిర్మించేందుకు పాలకవర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. త్వరలోనే వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి విధి విధానాలను వచ్చే పాలక వర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని చెప్పారు. బస్టాండ్‌లో దేవస్థాన ప్రసాదాల కౌంటర్‌ను ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాలతో పాటు క్యాలెండర్లను విక్రయించనున్నామన్నారు. పాలకవర్గాన్ని పట్టించుకోవడం లేదు : చైర్మన్ పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాలను ఈఓ మీడియాకు వివరించారు. ఇంతలో దేవస్థానానికి హైకోర్టు న్యాయమూర్తులు వస్తున్నారంటూ ఈఓ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. దీంతో చైర్మన్ గౌరంగబాబు మీడియాతో మాట్లాడకుండానే సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవల ఆలయంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై చైర్మన్, పాలక మండలి సభ్యులను మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడేందుకు అంగీకరించారు. దేవస్థానంలో నలుగురు ఉద్యోగులపై చర్యలు అంశంపై పాలక మండలిలో చర్చించేందుకు సభ్యులు ప్రతిపాదన చేశారని, అయితే అది దేవస్థాన అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన వ్యవహారంగా ఆలయ ఈఓ పేర్కొన్నారని తెలిపారు. దసరా ఉత్సవాలకు ఎంత వెచ్చించారని చైర్మన్‌ను ప్రశ్నించగా, గత ఏడాది దసరా ఉత్సవాల్లో మొత్తం రూ.6.65 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ తమకు రికార్డు పూర్వకంగా వివరాలను తెలిపారని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.8.40 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారన్నారు. అయితే గత ఏడాది దసరా ఉత్సవాల్లో సుమారు రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ పలుమార్లు పేర్కొనడం జరిగిందని, ఈ వ్యవహారంలో పాలక మండలిపై కావాలనే ప్రచారం చేయడం ఎంత వరకు సబబని పాలక మండలి సభ్యులు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో పలువురు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఉద్దేశపూర్వకంగానే నన్ను బలి చేశారు
-
వివాదాల్లో బెజవాడ దుర్గగుడి ఈవోలు
-
దుర్గగుడి ఈవోగా ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ
-
మహాసంప్రోక్షణ సమయంలో లక్షా 92వేల మందికి దర్శనం
-
టీటీడీ ఛైర్మన్,ఈవోలపై ఎంపీ రాయపాటి ఫైర్
-
వాటి కోసమే వంటశాల మూసేశారు : రమణ దీక్షితులు
సాక్షి, అమరావతి : తాను పుట్టినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి సేవలో ఉన్నానని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. తన తండ్రి తర్వాత వంశపారపర్యంగా తిరుమల ప్రధాన అర్చకుడిగా కొనసాగున్నానని చెప్పారు. స్వామివారికి కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. వెయ్యి ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీవారి వంటశాలను మూసివేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. స్వామి వారికి ఎప్పుడు నైవేద్యం అందకుండా లేదని, ఏ సౌకర్యాలు లేని సమయంలోనే తమ వంశీకులు నిత్యం నైవేద్యం పెట్టేవారని తెలియచేశారు. కానీ 2017 డిసెంబర్ 8 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 25 రోజులు వంటశాల మూసివేశారని, ఇది ఆగమ శాస్త్ర విరుద్ధమని రమణ దీక్షితులు అన్నారు. శుచిగా రుచిగా లేని నైవేద్యంతో స్వామి వారిని పస్తు పెట్టామనే బాధగా ఉందని వాపోయారు. వంటశాల మూసివేసినప్పుడు చూస్తే అధ్వాన్నంగా ఉందని, పల్లవులు, చోళులు కాలంనాటి బంగారు ఆభరణాలను వెతకడం కోసం తవ్వినట్లు అనిపించిందన్నారు. ఈ విషయమై ఆలయ ఈవోను పలుసార్లు అడిగినా, ఏమీ తెలియదనే సమాధానం వచ్చిందని తెలిపారు. కానీ ఈవోకు తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. 2001 గరుడ సేవ నాడు సమర్పించిన ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని చెప్పారు. భక్తులు విసిరిన నాణేల కారణంగా అది పగిలిపోయిందని.. కనిపించలేదని రికార్డుల్లో రాశారని వెల్లడించారు. కానీ ఇటీవల జెనీవాలో అలాంటి గులాబీ రంగు వజ్రం 500 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన వార్త చదివానని వెల్లడించారు. భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందనేది అవాస్తవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, స్వామి సంపద పోయిందని, నైవేద్యం అందడం లేదని, ఎలాంటి వైపరీత్యం జరుగుతుందేమోనన్న భయంతో బయటికి చెప్పానని అన్నారు. కానీ తనపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భవిష్యత్తు భగవంతుడే నిర్ణయించాలని ఆయన అన్నారు. -
ఆఫీసుకు రా.. తేల్చుకుందాం!
మహానంది: ‘దేవస్థానంలో జరిగే కార్యక్రమాలకు ఎవరిని పిలుచుకోవాలో నాకు తెలీదా? నా ఇష్టమొచ్చినట్టే చేస్తాను. నువ్వెవడివి అడగడానికి?’ అంటూ మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎన్సీ సుబ్రహ్మణ్యం ‘సాక్షి’ విలేకరిపై చిందులు తొక్కారు. ప్రముఖ దేవస్థానానికి ఈఓ అన్న సంగతి మరిచి..‘ఏయ్...ఉండు...ఆఫీసుకు రా తేల్చుకుందాం’ అంటూ ఓ ఫ్యాక్షన్ నాయకుడిలా బెదిరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహానంది దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన రూపేష్ అనే దాత మూడు వీల్చైర్లను విరాళంగా ఇచ్చారు. వీటి ప్రారంభోత్సవానికి ఎలాంటి ప్రొటోకాల్ లేని కొందరు అధికార పార్టీ నేతలను ఈఓ ఆహ్వానించి.. వారితో ప్రారంభింపజేశారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘ఇదేమి భక్తి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో మహానంది ఈఓ సుబ్రహ్మణ్యం ఉదయాన్నే ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి తిట్లదండకం అందుకున్నారు. ‘ఏం తమాషాగా ఉందా! గంటలోగా ఆఫీసుకు రా.. తేల్చుకుందాం’ అంటూ బెదిరించారు. -
ప్రసాదానికి ఎసరు!
దేవుడి ప్రసాదమంటే ఎంతో భక్తితో స్వీకరిస్తాం. కొన్ని సందర్భాల్లో స్వామి దర్శనం దొరికినా..దొరక్కపోయినా ప్రసాదం అందితే చాలను కుంటాం. అంతటి ప్రాశస్త్యం కలిగిన ప్రసాదం తయారీకి ఇవ్వాల్సిన నిధుల విషయంలో దేవదాయశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురోహితులు ఆరోపిస్తున్నారు. కర్నూలు(న్యూసిటీ): దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో 6 బి గ్రూపు కింద జిల్లాలో 88 దేవాలయాలు ఉన్నాయి. వాటి ఆదాయం ఏడాదికి రూ. 25 లక్షలలోపు ఉంటుంది. లక్షకు నెలకు రూ. 1000 చొప్పున ఆయా ఆలయాల్లో ప్రసాదం (పడితరం) తయారీ కోసం ఈఓ నిధులు కేటాయించాలి. ఈమేరకు ఆ శాఖ కమిషనర్ వై.వి.అనురాధ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీనిని అమలు చేయాల్సిన ఆలయ ఈఓలు బేఖాతరు చేస్తున్నారు. నంద్యాల, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల తదితర మండలాల్లోని ఆలయాలకు పడితరం నిధులు ఇవ్వకుండా ఈఓలు మొండికేసినట్లు తెలిసింది. పాములపాడు మండల వేంపెట గ్రామంలో ఉన్న రాముల వారి, ఈశ్వరస్వామి తదితర ఆలయాల్లో ప్రసాదం తయారీకి డబ్బులు ఇవ్వడం లేదని సహాయ కమిషనర్ కార్యాలయంలో పురోహితులు ఫిర్యాదు చేశారు. అయినా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆళ్లగడ్డలో వేణుగోపాలస్వామి , నంద్యాల, బేతంచెర్లలో చెన్నకేశవస్వామి, ఆదోనిలో నరసింహస్వామి, కర్నూలు పాతబస్టాండ్‌లో నగరేశ్వరస్వామి తదితర ఆలయాలకు సైతం పడితరం నిధులు అందడం లేదు. ఇలా అయితే భక్తులకు ప్రసాదాల పంపిణీ కష్టమవుతుందని పురోహితులు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ప్రసాదం ఇవ్వలే ని పరిస్థితి ఉంది. దీనిపై దేవదాయశాఖ సహాయ కమిషనర్ డి. ఆనంద్‌కుమార్‌ను వివరణ అడగగా.. ఈఓలు ప్రసాదానికి నిధులు ఇవ్వడం లేదని తెలిసిందని,ఇక నుంచి మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. -
ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్‌గా దుర్గగుడి
విజయవాడ: ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్‌గా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని తీర్చిదిద్దుదామంటూ నూతన ఈవో పద్మ సలహా ఇచ్చారు. దుర్గ గుడి నూతన ఈవోగా నియమితులైన ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాడపాటివారి సత్రంలో దుర్గగుడి పాలకమండలి సమావేశం ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె అద్యక్షతన మొట్టమొదటి పాలకమండలి సమావేశం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఫిబ్రవరి చివరి వారంలో శివాలయం తెరుద్దామని అనుకుంటున్నామని చెప్పారు. దుర్గ గుడిలో రేట్లు గురించి కూడా చర్చించామని వెల్లడించారు. త్వరలో ఈ విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శివరాత్రికి శివాలయ దర్శనం ఇవ్వాలని అనుకున్నాం..కానీ మూహూర్తలు లేనందువల్ల ఫిబ్రవరిలో నెలాఖరులో శివాలయం దర్శనం కల్పించేలా చూస్తామని చెప్పారు. భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా, అగమ శాస్త్రం అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా, దుర్గగుడి ఈవోగా రెండు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని, దేవస్థానంలో ఆఫీసు ఏర్పాటు చెయ్యాలని ప్రతిపాదించారు..అలా చెయ్యటం వల్ల దేవాలయంలో అవినీతి తగ్గి భక్తులకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమాలు అధ్యయనం చేసి ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండే విధంగా అమలు చేయ్యటం జరుగుతుందన్నారు. ప్రతి నెల మొదటి వారంలో పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
సమస్యలు.. సవాళ్లు!
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఐఏఎస్ అధికారి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమెకు అనేక సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ఈఓలు నిష్క్రమించిన తీరును చూస్తే ఆలయ ఈఓ పదవి ముళ్ల కిరీటం వంటిదని అర్థమవుతుంది. ఆలయంలోని సమస్యలనే కాదు, రాజకీయ ఒత్తిళ్లనూ ఎదుర్కోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి లోకేష్ కోసం గత ఈఓ సూర్యకుమారి తాంత్రిక పూజలు నిర్వహించారన్న ఆరోపణలు రావడంతో బదిలీకాక తప్పలేదు. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు, పాలకమండలి నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవినీతి సర్వాంతర్యామి! దుర్గగుడిలో అవినీతి సర్వాంతర్యామిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అన్నదానం, ప్రసాదాలు తయారీ, అకౌంట్స్, స్టోర్స్, టికెట్ విక్రయాలు, ఇంజినీరింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అవినీతిని విజిలెన్స్ అధికారులు గత ఏడాది ఎండగట్టారు. అటెండర్లు టికెట్లను రీసైక్లింగ్ చేస్తుండగా భక్తులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. అన్నదానంలో భోజనం చేసిన భక్తుల కంటే ఎక్కువ మందిని లెక్క చూపించడం, అకౌంట్ విభాగంలో అడ్వాన్సులు తీసుకోవడం, ప్రసాదాల తయారీ దిట్టంలో హస్తలాఘవం, అడ్డగోలు నిర్మాణాలు చేపట్టడం, వాటిని కూల్చివేయడం వంటివి సర్వ సాధారణమయ్యాయి. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులకు ఎన్నిరకాలుగా అవినీతి చేయాలో తెలుసన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఈఓ దేవస్థానంలో తిష్టవేసిన అవినీతిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. తరిగిపోతున్న అమ్మవారి మూలధనం దేవస్థానంలో అభివృద్ధి పేరుతో అనేక భవనాలను కూల్చివేశారు. కొత్తకొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల అన్నదానం కోసం తాత్కాలిక భవనం నిర్మించారు. అర్జున వీధిలో అందం కోసం పర్గోలా నిర్మిస్తున్నారు. ఘాట్‌రోడ్డుకు తరుచూ మరమ్మతులు చేస్తున్నారు. భవానీమండపం, అన్నదానం భవనం కూల్చిన చోట నూతన నిర్మాణాలు చేయాల్సి ఉంది. అభివృద్ధి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు ఆలయ మూల నిధులు తరిగి పోతున్నాయి. రూ.125 కోట్ల మూలధనం రూ.60 కోట్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఉన్న మూలధనం చాలదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయంగా అందనందునే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త ఈఓ మూలధనం పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతల ఒత్తిళ్లు దుర్గగుడిలో అర్చకుల నుంచి సిబ్బంది వరకు జిల్లాలో ఎవరో ఒక నాయకుడితో సంబంధాలు ఉన్నాయి. గుడిలో చీమ చిటుక్కుమన్నా, జిల్లాకు చెందిన ఒక మంత్రికి, ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి చేరిపోతాయి. వెంటనే వారి నుంచి ఈఓకు ఆదేశాలు అందుతాయి. లడ్డూ ప్రసాదాల రేట్లు పెంచుతూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ఓ మంత్రి ఆదేశాల మేరకు తగ్గించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తరుచుగా ఈఓలకు ఏదోఒక సిఫార్సు చేస్తూనే ఉంటారని సమాచారం. కొత్తగా వచ్చే ఈఓ వీటన్నింటినీ తట్టుకుని ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పాలకమండలిలో కొందరు సభ్యులు అత్యుత్సాహంతో అధికారులకు ఆదేశాలు ఇస్తూ, పాటించకుంటే ఆగ్రహం వ్యక్తంచేస్తుంటారు. భక్తులకు సౌకర్యాలు నిల్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైనప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. ఒకటి రెండు రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండేందుకు కాటేజీలు అసలే లేవు. ఘాట్ రోడ్డును తరుచు మూసివేస్తూ ఉం టారు. లిప్టులు ఉన్నా.. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండవు. దీంతో ఏడంతస్తులూ ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే. అన్నదానం కోసం గంటలుతరబడి వేచి ఉండాలి. వారాంతంలోనూ, పర్వదినాల్లో ప్రసాదాలు అం తంత మాత్రంగానే లభిస్తాయి. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలప్పుడు కనీసం నాలుగు కిలో మీటర్ల దూరం నడిస్తే కానీ అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. భక్తులకు వాహనాల పార్కింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తే దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -
వచ్చేదెవరు..?
దుర్గగుడి కొత్త కార్యనిర్వహణాధికారిగా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మ ఆలయంలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈఓగా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో మళ్లీ ఐఏఎస్‌ను నియమిస్తారా లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, విజయవాడ: దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఐఏఎస్ అధికారినే నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశంపై ఇంద్రకీలాద్రిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం, అది వివాదాస్పదం కావడంతో కొన్ని రోజుల క్రితం వరకూ ఈఓగా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి ఎ.సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతానికి దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనూరాధ ఆలయ ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చూస్తున్నారు. మరో పక్షం రోజుల్లో ప్రభుత్వం కొత్త ఈఓను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంతో తమకు అనుకూలంగా ఉండే అధికారినే ఈఓగా తీసుకొచ్చేందుకు ఇద్దరు కీలకమంత్రుల చుట్టూ దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు, అధికారులు ప్రదక్షిణ చేస్తున్నారు. ఐఏఎస్ వచ్చేనా? దేవస్థానం ఈఓగా తిరిగి ఐఏఎస్ అధికారిని నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమిస్తారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల నుంచి ఈఓగా పనిచేసేవారు వివాదాస్పదం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈఓగా రావడానికి ఐఏఎస్‌లు సుముఖంగా లేరని తెలిసింది. ముమ్మరంగా ప్రయత్నాలు దుర్గగుడిలో దీర్ఘకాలంగా పనిచేసిన ఏఈఓ, సూపరింటెండెంట్లు, గుమస్తాలను కలిపి మొత్తం 23 మందిని ఇటీవల ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయితే అంగబలం, అర్థబలం ఉపయోగించి వారిలో కొందరు తిరిగి ఇక్కడకు చేరుకున్నారు. వారిలో అన్నదానం, ప్రసాదాలు తయారీ, స్టోర్స్ వంటి కీలకవిభా గాల్లో పనిచేసిన అధికారులు ఉన్నారు. వారే తిరిగి తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొచ్చేందుకు ముమ్మరంగా లాబీ నడుపుతున్నారని సమాచారం. దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు వారికి సహాయం చేస్తున్నారని తెలిసింది. త్రినాథరావు కాకపోతే సింహాచలం ఈఓగా ఉన్న రామచంద్రమోహన్‌ను అయినా దుర్గగుడి ఈఓగా నియమించాలనే వారు కోరుతున్నారని సమాచారం. పాలకమండలి దూరం..దూరం ఆలయంలో ఈఓగా పనిచేసిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి దుర్గమ్మకు తాంత్రిక పూజలు చేయించారంటూ వ్యాఖ్యలు చేసి, చివరకు ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైన పాలకమండలి సభ్యులు మాత్రం ఈఓ విషయంలో ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఈఓ గురించి మాట్లాడితే మరోసారి వివాదం అవుతుందని భావించే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఆలోచనలను మంత్రుల వద్దనే పంచుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కోటేశ్వరమ్మ లేదా త్రినాథరావు ముంబాయికి చెందిన ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ ఈఓగా వస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆమె అక్కడ రిలీవ్ కాలేదు. దీంతో ఆమె ఈఓగా రావడం సందిగ్ధంగా మారింది. ఈలోగా దేవస్థానంలో ఒకవర్గం తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొ చ్చేందుకు లాబీ నడుపుతోంది. ఐఏఎస్‌కు బదులు దేవాదాయశాఖకు చెందిన అధికారిని నియమిస్తేనే పరిస్థితుల్ని చక్కదిద్దుతారని ఆ వర్గం ప్రచారం చేస్తోంది. ద్వారకా తిరుమల ఆలయ ఈఓ వి.త్రినాథరావును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన 2013 డిసెంబర్ నుంచి 2014 నవంబర్ వరకు దుర్గగుడి ఇన్చార్జి ఈఓగా ఏ విధమైన వివాదాలు లేకుండా పనిచేశారు. ద్వారకా తిరుమల ఆలయంలో ఐదేళ్ల నుంచి ఈఓ పనిచేస్తున్నారు. దీంతో ఆయన త్వరలో బదిలీ అవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ఈఓను నియమించాలంటూ దుర్గగుడికి చెందిన కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఇద్దరు మంత్రుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. -
వేములవాడ ఆలయ ఈవోకు నోటీసులు
సాక్షి, రాజన్నసిరసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయ ఈవోకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఆలయ ఈవో రాజేశ్వర్ అక్రమంగా పదోన్నతులు పొందారన్న అభియోగాలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. -
ఇన్చార్జి ఈఓగా జగన్నాథరావు
- నేడు అన్నవరం దేవస్థానం బాధ్యతలు చేపట్టనున్న ఏసీ - ప్రిన్సిపల్ సెక్రటరీ విదేశీ పర్యటనతో రెగ్యులర్ ఈఓ నియామకంలో జాప్యం అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఫుల్ అడిషనల్ చార్జి)గా అసిస్టెంట్ కమిషనర్ ఈరంకి వేంకట జగన్నాథరావు నియమితులయ్యారు. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.నాగేశ్వరరావును విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్-2గా ఈ నెల 8న ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అవి ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. దీనికితోడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ రెండు వారాల పాటు సెలవు పెట్టి శుక్రవారం విదేశాలకు వెళ్లారు. ఆయన ఈ నెల 30న తిరిగి వస్తారు. ఆ తరువాతే ఈఓ నియామకంపై ఒక నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈలోగా దేవస్థానంలో పాలన వ్యవహారాలు చూసేందుకు, బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావును రిలీవ్ చేసేందుకు ఇన్చార్జిగా ఈరంకిని నియమించారు. ఆయనను ఆ ఇన్చార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని ‘సాక్షి’ ముందే చెప్పింది. బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావు నుంచి జగన్నాథరావు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయనగరం జేసీ-2గా సోమ లేదా మంగళవారాల్లో తాను బాధ్యతలు స్వీకరిస్తానని నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. ఈరంకికి ఈ బాధ్యతలు ఏడోసారి.. గత ఆరేళ్లుగా ఏసీ జగన్నాథరావు ఆరుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఈసారి కూడా కలుపుకుంటే అది ఏడోసారి అవుతుంది. 2010లో అప్పటి ఈఓ కె.రామచంద్రమోహన్ అమెరికాలో సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లినపుడు ఈరంకి పది రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. రామచంద్రమోహన్ తరువాత 2012లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదం వేంకటేశ్వర్లు ఈఓగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి 15 రోజులు పట్టడంతో అప్పుడు కూడా జగన్నాథరావే ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడు 12 రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013 మే నెలలో 15 రోజులు సెలవు పెట్టినపుడు కూడా ఇన్చార్జి ఈఓగా పని చేశారు. 2014 ఆగస్టులో వేంకటేశ్వర్లు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏగా బదిలీ కాగా, ఆయన స్థానంలో 2015 జూలై రెండో తేదీన కె.నాగేశ్వరరావు ఈఓగా వచ్చే వరకూ ఈరంకి ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఇప్పుడు తిరిగి ఇన్చార్జి ఈఓగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఎవరికో అన్న‘వరం’
సత్తెన్న సన్నిధిలో రాజకీయం - ఖాళీ అయిన ఈవో పోస్టుపై రత్నగిరిపై తమ్ముళ్ల పోరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అన్నవరం సత్యదేవుని కొండపై రాజకీయ పాచికలు అడుకుంటున్నారు. ఖాళీ అయిన ఈఓ పోస్టు కోసం అధికార పార్టీలో రెండు గ్రూపులు సిగపట్లు పడుతుండటంతో రత్నగిరిపై రాజకీయం రాజుకుంది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న అన్నవరం సత్యదేవుని వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఏటా 80 లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. స్వామి సన్నిధిలో జరిగే వ్రతాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి సత్యదేవుని కొండపై పట్టు కోసం నేతలు హోరాహోరీగా తలపడుతూ రాజకీయం చేస్తున్నారు. సత్యదేవుని ఆలయ కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా గురువారం బదిలీ కావడంతో పోరు తీవ్రమైంది. నాగేశ్వరర రావు స్థానంలో కొత్త ఈవో కోసం రెండు గ్రూపులు రెండు పేర్లను తెరమీదకు తేవడంతో కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. అర్హతలేకున్నా అందలాలెక్కించడం, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేయడం, లక్షల రూపాయలు చేతులు మారితేనే కానీ పోస్టింగుల రాని పరిస్థితులు దేవాదాయశాఖలో ఇటీవల శృతిమించి పోయిన వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. గ్రేడ్–1, గ్రేడ్–2 ఈఓ పోస్టింగులకే రూ.20 నుంచి రూ.30 లక్షలు ముట్టజెప్పితే ఇక అన్నవరం సత్యదేవుని ఈఓ పోస్టింగ్ అంటే మాటలా అంటున్నారు. ఆ పోస్టింగ్‌కు ఎంత పలుకుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రయత్నాల్లో ముగ్గురు... అన్నవరం ఈఓ పోస్టింగ్ కోసం ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈవో మంచెనపల్లి రఘునా«థ్, ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినా«ధరావు, రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు మినహా ఇద్దరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాగేశ్వరరావు అన్నవరం ఈవోగా వచ్చే సమయంలో రఘునా«థ్ కూడా ఇక్కడకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడు ఈయన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవాదాయశాఖకు సంబధంలేని రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారి అయిన నాగేశ్వరరావుకు పోస్టింగ్ దక్కింది. ఈ పోస్టింగ్ కోసం అప్పట్లో మంత్రి వర్గీయులు ఒక ఈవో నుంచి తీసుకున్న రూ.20 లక్షలు సంబంధిత వ్యక్తికి ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదంగా మారింది. ఆ సొమ్ములు ఎలానూ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఆ పోస్టింగ్ అవకాశం దక్కేలా చూడాలని సంబంధిత వ్యక్తి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఏసీబికి చిక్కడంతో... ఇక్కడకు వస్తారని ప్రచారం జరుగుతున్న రఘునా«థ్ 2006 నుంచి 2008 వరకు అన్నవరం ఈవోగా పని చేశారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయడంతో సస్పెండయ్యారు. ఆ కారణంగానే రెండేళ్ల కిందట తిరిగి అన్నవరం ఈవోగా రావాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆ ఏసీబీ కేసులో క్లీన్చిట్ రావడంతో ఇప్పుడు ఇక్కడకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోను రఘునా«థ్‌ను తీసుకువచ్చి తీరతామని మంత్రి అనుచరులు చాలా నమ్మకంగా చెబుతున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రఘునా«థ్ వస్తే కొండపై తమకు ఇబ్బందులు తప్పవని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి, మరో ఏసీ ఇక్కడి పోస్టింగ్ కోసం ఆసక్తి కనబరుస్తున్న ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినాథరావు లైన్లో పెడుతున్నారు. త్రినా«థరావు జిల్లాలో డిప్యుటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కొండపై అన్నీ తామే అన్నట్టు చక్రం తిప్పిన ఆ ఇద్దరు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఈవోగా రావడం ఖాయమని ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇందుకు మంత్రి వర్గీయులతో పొసగని మెట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఈవో నాగేశ్వరరావు ముక్కుసూటిగా పోయే విధానంనచ్చని వారు ఇప్పుడు కొండపై తమ మాట వినే వారిని తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇలా రెండు గ్రూపులు చెరొకరి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా రాజకీయ సిఫార్సులతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ వైపు దేవాదాయశాఖ కమిషనరేట్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండపై మంత్రి, ఎమ్మెల్యేలలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో ఎవరు పట్టు సాధిస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు బదిలీ
- విజయనగరం జేసీ–2గా బదిలీ చేసిన ప్రభుత్వం - కొత్త ఈఓ వచ్చేవరకూ ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? అన్నవరం: అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును విజయనగరం జాయింట్ కలెక్టర్–2గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించ లేదు. రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు స్పెషల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ ఆర్ఎస్ నెంబర్.1267 విడుదల చేసింది. అందులో రెండో పేరుగా ఈయనది ఉంది. ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? ఇన్‌ఛార్జి ఈఓగా దేవస్థానం ఏసీ జగన్నాథ రావును నియమించే అవకాశాలున్నాయి. గతంలో పనిచేసిన ఈఓలు కె. రామచంద్రమోహన్, ప్రసాదం వేంకటేశ్వర్లు బదిలీ అయినపుడు వెంటనే రెగ్యులర్ ఈఓలను నియమించకుండా దేవస్థానం ఏసీ జగన్నాధరావునే ఇన్‌ఛార్జి ఈఓగా నియమించారు. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా పాటిస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయం ముందే చెప్పిన ‘సాక్షి’ ... దేవస్థానం ఈఓ బదిలీ అవుతున్న విషయాన్నిఈ నెల ఐదో తేదీన ‘అన్నవరం దేవస్థానానికి కొత్త ఈఓ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈఓ పనితీరుతో అసంతృప్తిగా ఉన్న జిల్లాకు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు సీఎం వద్దకు వెళ్లి ఈఓను బదిలీ చేసి దేవాదాయశాఖకు చెందిన మరో అధికారిని ఇక్కడ నియమించాలని కోరగా అందుకు సీఎం అంగీకరించినట్టు, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వార్తలో ప్రస్తావించాం. అన్నట్టుగానే గురువారం రాత్రి ఈఓ బదిలీకి సంబంధించి జీఓ విడుదలైంది. -
అన్నవరానికి త్వరలో కొత్త ఈఓ!
రెవెన్యూశాఖకు ప్రస్తుత ఈఓ నాగేశ్వరరావు సరెండర్? ప్రచారంలోకి త్రినాథరావు, రఘునాథ్ పేర్లు అధికారపార్టీ నేతల ముమ్మర ప్రయత్నాలు అన్నవరం : అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును ఆయన మాతృ విభాగం రెవెన్యూ శాఖకు సరెండర్ చేయాలా లేక మరో ఆరు నెలలు ప్రస్తుత పదవిలోనే కొనసాగించాలా అనే దానిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికారపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయనను పంపించి, దేవాదాయశాఖకు చెందిన అధికారిని ఈఓ గా నియమించాలని సీఎంను కోరగా, ఆయన అందుకు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ శాఖలో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను 2015 జూలై రెండో తేదీన దేవస్థానం ఈఓగా ప్రభుత్వం నియమించింది. 2016 జూలై రెండో తేదీకి ఏడాది కాలపరిమితి పూర్తవడంతో మరో ఏడాది డెప్యుటేషన్ పొడిగించింది. దీంతో వచ్చే జూలై రెండో తేదీతో ఆయన కాలపరిమితి ముగియనుంది. తన డెప్యుటేషన్ పూర్తవుతున్నందున తనను రెవెన్యూ విభాగానికి సరెండర్ చేయాలని ఆయన దేవాదాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ, కమిషనర్ ను గతంలో కోరారు. అయితే 2018 మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆయన మరో ఆరు నెలలు ఇక్కడే కొనసాగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. పంపించేయాలని నేతల ప్రయత్నాలు: అయితే ఇటీవల కాలంలో ఈఓ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడం, అధికారపార్టీకి చెందిన మెజార్టీ నేతలు కూడా తమకు సరైన గౌరవ మర్యాదలు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఆయనను కొనసాగించే విషయమై అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి తోడు రెవెన్యూ విభాగానికి చెందిన అధికారి ఈఓగా వస్తే దేవస్థానంలో ఎటువంటి అభివృద్ది జరగడం లేదని, ఏడేళ్లుగా ఇదే పరిస్థితి అని కొంతమంది అధికారపార్టీ నాయకులు సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈఓగా త్రినాదరావు లేదా రఘునాద్..? ద్వారకా తిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావు లేదా పెనుగంచిప్రోలు దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎం.రఘునాథ్ ఇద్దరిలో ఒకరిని అన్నవరం దేవస్థానం ఈఓగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. త్రినాథరావు గతంలో జిల్లాలో డీసీ పనిచేయగా, రఘునా«థ్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓ గా పనిచేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధకశాఖ గతంలో దాడులు చేసింది. ఆ కేసులో ఆయనకు క్లీన్చిట్ లభించిందని చెబుతున్నారు. -
మహానంది ఇన్చార్జ్ ఈఓగా వెంకటేశ్వర్లు
మహానంది: మహానంది దేవస్థానం ఇన్చార్జ్ ఈఓగా అనంతపురం జిల్లా ఉవరకొండ గౌరీ మఠం అసిస్టెంటు కమిషనర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శంకర వరప్రసాద్ పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వెంకటేశ్వర్లుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయశాక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వెంకటేశ్వర్లు గౌరీ(గవి)మఠం ఏసీ, మేనేజర్‌గా ఉన్న ఆయన కర్నూలు జిల్లా డీసీగా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పది రోజుల్లో మహానంది దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. -
వేసవిలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు
► టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ► కాలిబాట భక్తులకు తాత్కాలిక షెడ్ల నిర్మాణం ► ఉగాది నుంచి మొబైల్ యాప్ ప్రయోగాత్మకంగా ప్రారంభం తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవి సెలవుల్లో విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని ఆయా విభాగాధిపతులకు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో మంగళవారం జేఈవో కెఎస్.శ్రీనివాసరాజుతో కలిసి టీటీడీ సీనియర్ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.., వేసవిలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై విభాగాలవారీగా పలు సూచనలు చేశారు. ఏప్రిల్ రెండో వారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో తిరుపతిలోని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద నూతన స్కానర్లను ఏర్పాటు చేయాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు. కాలిబాట భక్తుల కోసం నారాయణిగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తామన్నారు. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం, వసతి తదితర సేవలను భక్తులు పొందేందుకు రూపొందించిన మొబైల్ యాప్‌ను శ్రీ హేమలంబినామ సంవత్సరం ఉగాదిరోజు బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఐటీ, టీసీఎస్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ప్రారంభిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఈవో తెలిపారు. టీటీడీలో 2200 మంది కాటేజి దాతలు ఉండగా ఇప్పటికే 1500 మంది దాతలు కాటేజీ డోనార్మేనేజ్మెంట్ సిస్టమ్ ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేసుకున్నారని, ఇది ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. శ్రీవారి దర్శనం, లడ్డూప్రసాదం, వసతి తదితర అంశాలలో అక్రమాలకు పాల్పడేవారిపై సమాచారం అందించినవారికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి అందిస్తామని ఈవో తెలిపారు. టీటీడీ అందిస్తున్న సేవలపై నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ప్రసారమైన డాక్యుమెంటరీ అద్భుతంగా ఉందని తెలిపారు.,టీటీడీ కార్యక్రమాలను ప్రపంచంవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరువ చేసేందుకు మరిన్ని ఛానళ్లు డాక్యుమెంటరీ చిత్రీకరణకు ముందుకురావాలని ఈవో కోరారు. -
ఆలయ భూములు అన్యాక్రాంతం కానీయొద్దు
– స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కర్నూలు(న్యూసిటీ): దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూములను అన్యాక్రాంతం కానీయొద్దని ఈవోలకు స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నగరేశ్వరస్వామి దేవాలయంలో మీ ఇంటికి – మీ భూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం దేవస్థానానికి చెందిన భూముల సర్వేనంబర్లు తహసీల్దార్ ఆర్‌ఎస్‌ఆర్‌లో లేవన్నారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు సుధాకర్‌రెడ్డి, ఈఓలు సత్యనారాయణ, రామాంజనేయులు, డి.ఆర్.కె.వి.ప్రసాద్, తిమ్మనాయుడు, బుడ్డన్న, వీరయ్య, కమలాకర్, హనుమంతరావు వాణి, కామేశ్వరీ, స్వర్ణముఖి, ఉద్యోగులు హరిశ్చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ డిప్యూటీ ఈఓ సాంబయ్య మృతి
ఏటూరునాగారం : ఐటీడీఏ డిప్యూటీ ఈఓ, తాళ్లగడ్డ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పులుసం సాంబయ్య(45) బుధవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, హెడ్‌కానిస్టేబుల్ రమేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో కుటుంబ సభ్యులతో నివాసముంటున్న సాంబయ్యకు వారం రోజులుగా కడుపునొప్పి వస్తుండడంతో ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకున్నాడు. అలాగే పాఠశాలలో గడ్డి బాగా పెరగడంతో గడ్డి నివారించేందుకు పెస్టిసైడ్స్ షాపులో తెచ్చుకున్న గడ్డి మందును ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 10వ తేదీన ఉదయం కడుపునొప్పి వస్తుండడంతో టానిక్ అనుకొని పక్కనే ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తర్వాత సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఈ నెల 19న ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. -
హేమారెడ్డి మల్లమ్మ చైతన్యరథయాత్ర ప్రారంభం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివ శరణి హేమారెడ్డి మల్లమ్మ చైతన్య రథయాత్ర ప్రారంభమైంది. సోమవారం జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య శ్రీచెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ , కర్ణాటక రాష్ట్ర టెక్స్టైల్స్, దేవాదాయశాఖ మంత్రి రుద్రప్ప మనప్ప లుమాని, దేవస్థానం ఈఓ నారాయణభరత్ గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి రథాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రథయాత్ర నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీశైలంలో ప్రారంభమైన చైతన్య రథయాత్ర కర్ణాటక రాష్ట్రంలో మీదుగా కూడళ సంగమం చేరుకుంటుందని పేర్కొన్నారు. -
శ్రీశైలంలో వరుణయాగం
– ఆరంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త – 29న మల్లన్నకు సహస్రఘటాభిషేకం శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో తలపెట్టిన వరుణయాగాన్ని Ô¶ నివారం ప్రారంభించారు. ఆలయ›ప్రాంగణంలోని రుద్రయాగశాలలో ప్రారంభ పూజల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. 29 వరకు ఆలయప్రాంగణంలో వరుణ జపాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. ఇందులో భాగంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత మహాగణపతి పూజ, స్థలశుద్ధి కోసం పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, రుద్రపారాయణలు తదితర కార్యక్రమాలు చేశారు. 29న చివరి రోజు మల్లన్న సహస్రఘటాభిషేకం జరుగుతుందని, భక్తులు, స్థానికులు పాల్గొనాలని ఈఓ కోరారు. -
ఇక శ్రీశైలం పర్యటనకు హెలికాప్టర్?
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈఓ నారాయణభరత్ గుప్త ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్లో వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. అందులో భాగంగా న్యూఢిల్లీకి చెందిన ఓల్గా సమ్మిట్ ఏవియేషన్ సంస్థకు చెందిన సభ్యుల బందం మంగళవారం క్షేత్రానికి చేరుకుని ఈఓతో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సంస్థ ఆధీనంలో కొన్ని హెలికాప్టర్లు ఉన్నందున ప్రయాణికులను హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి తీసుకొచ్చి దర్శనానంతరం తిరిగి హైదరాబాద్‌కు చేర్చే విషయంపై సాధ్యాసాధ్యాలను చర్చించినట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీతో పాటు శ్రీశైలంలో ఉన్న హెలిప్యాడ్లను కూడా ఈ బందం పరిశీలించినట్లు తెలిసింది. దీనిపై పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించాక ప్రభుత్వ అనుమతితో ఏవియేషన్ సంస్థతో దేవస్థానం అగ్రిమెంట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. -
బాలాలయం పనుల పరిశీలన
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని బాలఆలయం పనులను ఈఓ గీతారెడ్డి గురువారం పరిశీలించారు. ప్రస్తుతం రహదారికి అడ్డంగా ఉన్న క్యూలైన్లను తొలగించి ప్రత్యేకంగా బాలాలయానికి ఆనుకుని క్యూలైన్లను నిర్మిస్తున్నారు. అలాగే ప్రధానాలయం గోడలను మరో వారం రోజుల్లో తొలగించనున్నట్లు ఈఓ తెలిపారు. అందుకోసం ప్రధానాలయం స్ట్రాంగ్ రూంలోని బంగారు, వెండి ఆభరణాలను బాలాలయంలో తీసుకువస్తున్నారు. దేవస్థానం అధికారులు ప్రధానాలయంలోని ఇతర వస్తువులు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. -
అడిగినంత ఇస్తేనే ...
‘డయల్ టు అన్నవరం ఈఓ’ కార్యక్రమంలో భక్తుల ఫిర్యాదు తగు చర్యలు తీసుకుంటాం : ఈఓ నాగేశ్వరరావు డయిల్ టూ ఈఓ కార్యక్రమంలో కాలర్‌తో మాట్లాడుతున్న ఈఓ కె.నాగేశ్వరరావు అన్నవరం : సత్యదేవునికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకుందామని వస్తే.. ఇక్కడ తాము అడిగిన మొత్తం ఇస్తేనే గుండు గీస్తామని నాయిబ్రాహ్మణులు అంటున్నారని పలువురు భక్తులు అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ నిర్వహించిన ‘డయల్ టు ఈఓ’ కార్యక్రమానికి శ్రీనివాస్ (ఏలేశ్వరం), దూళ్ల సూర్యనారాయణ(కూరాడ), వీరశంకరం(అమలాపురం) ఫోన్ చేసి నాయీబ్రాహ్మణులు రూ.20 ఇస్తే తప్ప గుండు గీయబోమని అంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి ఈఓ స్పందించి భవిష్యత్‌లో ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇలా మొత్తం 15 మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఫోన్‌చేసి తమ సమస్యలను వివరించారు. కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు.. ఈఓ స్పందనలు ఇలా.. కేవీ రఘువరన్, ఇంజరం : అన్నదాన పథ కానికి విరాళాలిచ్చిన దాతలకు వారి పేరున ఎప్పుడు అన్నదానం చేసేది సమాచారం పంపడం లేదు. ఈఓ : అన్నదానం దాతలకు సకాలంలోనే సమాచారం పంపించమని సంబంధిత అధికారులను ఆదేశించాం. ఎక్కడైనా లోపం జరిగితే సరిదిద్ది తగు చర్యలు తీసుకుంటాం. సోమేశ్వరరావు, అయినవిల్లిలంక : కోటిపల్లి నుంచి అన్నవరానికి నడిచే దేవస్థానం బస్‌ను నష్టాల కారణంగా రద్దు చేశారు. ఒకవేళ కోటిపల్లి నుంచి విశాఖపట్నానికి ఈ బస్ నడిపితే లాభదాయకంగా ఉండవచ్చేమో పరిశీలించగలరు. ఈఓ : అన్ని రకాల ప్రయోగాలు చేశాకే కోటిపల్లి-అన్నవరం బస్‌ను నిలిపివేశాం. అన్నవరం నుంచి సింహాచలానికి ఒక బస్ నడుపుతున్నాం. మేకల కృష్ణ, శంఖవరం : అన్నవరం దేవస్థానం దత్తత తీసుకున్న శంఖవరంలోని పార్వతీ పరమేశ్వరస్వామి ఆలయంలో నవగ్రహమండపం, ఇతర నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయాలి. ఈఓ : ఇంజినీరింగ్ అధికారులను పంపించి పనులు చేయిస్తాం. అఖిల, కాకినాడ : దేవస్థానంలోని ఫ్యాన్సీ, కూల్‌డ్రింక్ షాపులలో డ్రింక్స్, సబ్బులు ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఈఓ : అవి వేలంపాటలో పాడుకున్న షాపులు కావున ఎమ్మార్పీ కన్నా ఒకట్రెండు రూపాయలు ఎక్కువ అమ్ముతారు. అంతకంటే ఎక్కువగా అమ్మితే షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. ఉదయ్‌శంకర్, కాకినాడ : బైపాస్ రోడ్‌లోని సత్యదేవుని నమూనా ఆలయంలో సత్యదేవుని విగ్రహాలకు సరైన అలంకరణ చేయడం లేదు. ఈఓ : నమూనా ఆలయంలో సత్యదేవుని విగ్రహానికి వేసేందుకు రోజూ అవసరమైన పూలమాలలు పంపిస్తున్నాం. ఎందుకు దండలు మార్చలేదో తెలుసుకుని చర్యలు తీసుకుంటాం. టి.సుబ్బారావు, కడియపులంక : సత్యదేవుని ఆలయానికి ఈశాన్యంలోని సప్తగోకులం సందర్శించే భక్తులను అక్కడి అర్చకులు గోత్రనామాలు చెబుతామని కానుకలు అడుగుతున్నారు. ఈఓ : కానుకలు అడగవద్దని అర్చకులను మందలిస్తాం. ఈర్లు శ్రీనివాస్, అన్నవరం : సత్యదేవుని అంతరాలయం దర్శనం కోసం ఆలయం వద్ద రూ.వంద టికెట్లు అమ్మే వారు భక్తుల నుంచి సొమ్ములు వసూలు చేసి టికెట్లు ఇవ్వడం లేదు. ఈఓ : అటువంటి వారిపై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. బత్తుల శ్రీను, రాజమండ్రి : దేవస్థానంలో రైల్వేటైం టేబుల్ లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వేస్టేషన్ మూడో ప్లాట్‌ఫాంపై టికెట్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలి. ఈఓ : దేవస్థానం ఆవరణలో రైల్వేటైం టేబుల్ ఏర్పాటు చేస్తాం. రైల్వేస్టేషన్ మూడో ప్లాట్‌ఫాంపై టికెట్లు విక్రయించే విషయమై రైల్వే అధికారులతో మాట్లాడతాం. కేవీ రాజు, కాకినాడ : రత్నగిరి టోల్ గేట్ వద్ద రాత్రి ఎనిమిది గంటలకే దేవస్థానం బస్‌లు ఉండడం లేదు. ఈఓ : నలుగురు భక్తులున్నా దేవస్థానం బస్‌లను కొండమీదకు నడపాలని ఆదేశించాం. ఒకవేళ బస్ రత్నగిరికి వచ్చి మరలా కిందకు రావడానికి 20 నిమిషాలు సమయం పడుతుంది. ఆ సమయంలో భక్తులు వచ్చి ఉంటే వారికి బస్ కనిపించకపోవచ్చు. లక్ష్మీప్రసన్న, పెద్దాపురం : వ్రతాలాచరించే భక్తుల నుంచి వ్రతపురోహితులు కానుకలు డిమాండ్ చేస్తున్నారు. ఈఓ : గతంలో ఇలాంటి ఆరోపణలు వస్తే కొంతమంది పురోహితులపై చర్యలు తీసుకున్నాం. మరలా పురోహితులను హెచ్చరిస్తాం. -
మరో వివాదంలో దుర్గగుడి అధికారులు
విషమంగా అర్చకుడి ఆరోగ్యం ఈవో వేధింపులే కారణమని కుటుంబీకుల ఆరోపణ వేధింపులు అవాస్తవం : ఈవో విజయవాడ : దుర్గగుడి అధికారులు మరో వివాదంలో చిక్కుకున్నారు. దేవస్థాన ఉన్నతాధికారుల హెచ్చరికతో ఓ అర్చకుడి ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భవానీపురానికి చెందిన మంగళంపల్లి సుబ్బారావు దుర్గగుడిలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. సుబ్బారావుకు అనారోగ్యంగా ఉండడంతో తన సోదరుడిని సహాయకుడిగా నియమించుకున్నాడు. గత శుక్రవారం సుబ్బారావు స్థానంలో సోదరుడు రూ. 20ల టికెట్ క్యూ లైన్లో డ్యూటీ చేస్తుండగా ఓ బ్యాంక్ ఉద్యోగి బండి రత్నం అనే భక్తుడు అమ్మవారి దర్శనానికి వచ్చారు. డ్యూటీ చేస్తున్న అర్చకుడు కాకుండా మరో వ్యక్తి తనను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడంటూ, అతను బినామీ అని సదరు బ్యాంక్ ఉద్యోగి ఆలయ ఈవో నర్సింగరావుకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈవో నర్సింగరావు సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీని పెట్టుకున్నావని, వెంటనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. జరిగిన విషయాన్ని సుబ్బారావు ఈవోకు వివరించే లోగానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. సస్పెన్షన్‌కు బదులుగా జరిమానా సుబ్బారావు, అతని సోదరుడు ఈవోను కలిసి సస్పెం డ్ చేయవద్దని కోరగా రూ. 20 వేలు ఫైన్ చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని పక్షంలో అవుట్ పోస్టులో పెట్టిస్తానని హెచ్చరించారు. సుబ్బారావు అభ్యర్ధన మేరకు రూ. 15 వేలు జరిమానా కట్టించుకోవాలని ఈవో సీసీ చాంబర్‌కు సమాచారం అందించారు. అటెండర్, సీసీ వేధింపులు ఈవోకు వాస్తవ విషయాన్ని చెప్పేందుకు సుబ్బారావు యత్నించగా అటెండర్, సీసీ సతీష్ ఇష్టానుసారంగా మాట్లాడారని సుబ్బారావు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈవోను కలిసి ఇంటికి వచ్చిన సుబ్బారావు ఆలయ ప్రాంగణంలో జరిగిన విషయాన్ని భార్య దుర్గాదేవి, కుటుంబీకులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సుబ్బారావు హైబీపీతో బాధపడడంతో కుటుంబీకులు భవానీపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందినా మార్పు రాకపోవడంతో బుధవారం సూర్యారావు పేటలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుబ్బారావును పరిశీలించి 24 గంటలు అయితేనే తప్ప చెప్పలేమన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు దేవాదాయ శాఖ ఏసీ చంద్ర కుమార్‌ను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ అనురాధ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఘటనపై ఆలయ అర్చకులు బుధవారం నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. భర్తకు ఏమి జరిగినా ఈవోదే బాధ్యత నా భర్తకు ఎటువంటి అపాయం జరిగినా దానికి ఈవో నర్సింగరావుదే పూర్తి బాధ్యత. రెండు రోజులుగా కోమాలో ఉన్నా కనీసం అధికారులు వచ్చి పలకరించింది లేదు. ఆసుపత్రి ఖర్చులు భరించే అవకాశం ఉన్నా ప్రతి రూపాయి ఈవోనే చెల్లించాలి. -దుర్గాదేవి, సుబ్బారావు భార్య జరిమానా వేశా అర్చకులు సహాయకులను నియమించవద్దని గతంలోనే ఆదేశించాం. అయినా సహాయకులు పెట్టుకున్నారు. ఒక బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించా. అర్చకుల కోరిక మేరకు సస్పెండ్ చేయకుండా ఫైన్ వేశా. తన సిబ్బంది కాని అతన్నిపై దుర్భాషలాడలేదు. ఈ విషయం ఆయన ప్రక్కనే ఉన్న యజ్ఞనారాయణ శర్మ, బుజ్జిలు చెబితే నా ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు వచ్చే సొమ్ము అతనికి ఇస్తా. - సీహెచ్ నర్సింగరావు, ఈవో -
వేయికాళ్ల మండపం పూర్తయ్యేనా ?
టీటీడీ టెండర్లు ఆహ్వానించినా ఒక్కరూ పాల్గొనని వైనం తాజాగా మరోసారి ఆహ్వానం ప్రతిష్టాత్మక కట్టడానికి అడుగడుగునా అవాంతరాలు తిరుమల : పదమూడేళ్ల పాటు వివాదాల సుడిగుండంలో నలిగిన వేయికాళ్ల మండపం పునఃనిర్మాణం పనులు అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. రూ.18 కోట్ల అంచనాలతో టీటీడీ టెండర్లు ఆహ్వానించినా ఏ ఒక్కరూ దరఖాస్తు చేయలేదు. నిర్ణీత గడువులోపే పురాతన మండపానికి పునరుజ్జీవం కల్పించాలని సంకల్పించిన టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు రెండోసారి టెండర్లకు అనుమతిచ్చారు. వేయికాళ్ల మండపాన్ని తిరుమల ఆలయం ఎదురుగా 14వ శతాబ్దంలో నిర్మించారు. 650 ఏళ్లకు పైగా ఈ మండపం భక్తులకు ఆశ్రయం కల్పించింది. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ఊరేగింపునకు మండపం కొంత అడ్డుగా ఉండడంతో మాస్టర్‌ప్లాన్ కింద ఈ మండపాన్ని 2003లో కూల్చివేశారు. అప్పట్లో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి బహిరంగంగా వ్యతిరేకించారు. హైకోర్టులో వ్యాజ్యాలు నడిచాయి. అనేక వివాదాల నడుమ తొలగించిన మంటపం ప్రాంతంలోనే 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పులో కొత్త రాతి మంటపాన్ని నిర్మించాలని 2009లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పనులు పునాదికే పరిమితమయ్యాయి. ఒక దశలో మండపం అలిపిరి, శ్రీనివాసమంగాపురానికి తరలించాలని భావించారు. సీఎం చంద్రబాబు సూచనతో కొండపైనే పునః నిర్మాణం.. చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని తిరుమలలోనే నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై గత ఏడాది మార్చి 14వ తేదీన సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండపం నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవటంతో మండపం పున ర్నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. టెండర్లకు ఒక్కరూ హాజరుకాని వైనం.. శ్రీవారి ఆలయానికి కిలోమీటరు దూరంలోని నారాయణగిరి ప్రాంతంలో వేయికాళ్ల మండపం పునః నిర్మించటం వల్ల శ్రీవారి ఉత్సవాలు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు భక్తుల సందర్శనకు వీలుపడుతుందని టీటీడీ ఈవో సంకల్పించారు. ఆ మేరకు అధునాతన డిజైన్ రూపొందించారు. రూ.18 కోట్ల అంచనాలతో టెండర్లను ఆహ్వానిస్తూ గత నెలలో జరిగిన ధర్మకర్తల మండలి తీర్మానించింది. అయినప్పటికీ ఒక్కరూ కూడా హాజరు కాలేదు. టీటీడీ ఎస్ఎస్ఆర్ ధరల వల్లే రాలేదా? ఈ మండపం పునర్నిర్మాణానికి టీటీడీ ఇంజినీర్లు ముందుగానే బాగా కసరత్తు చేశారు. నాగలాపురం ఆలయ ప్రాకారానికి అనుబంధంగా రూ.68 లక్షలతో రాతి మండపాన్ని నిర్మిస్తున్నారు. అక్కడి నిర్మాణం పనులకు తిరుమలకొండ మీద నిర్మాణ పనుల మధ్య ఉండే వ్యత్యాసం, కార్మికుల శ్రమ, ప్రయాణం, నివాస పరిస్థితులు అంచనా వేశారు. అక్కడి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ధరల కంటే కొంత పెచ్చుతోనే వేయికాళ్ల మండపానికి టెండర్లు ఆహ్వానించారు. అయినా ఒక్కరూ పాల్గొనకపోవడంపై టీటీడీ ఇంజినీర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి బుధవారం మరోసారి టెండర్లు ఆహ్వానించారు. నిబంధనల్లో స్వల్ప మార్పు చేశాం పురాతన మండపానికి పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించాం. పెద్ద కట్టడాలు నిర్మించే విషయంలో టెండరుదారులు త్వరగా ముందుకు రారు. నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి మరోసారి ఆహ్వానించాం. ఈనెల 11 ఆఖరు తేదీ. నిర్ణయించిన గడువుతోనే వేయికాలాలపాటు నిలిచే నిర్మాణం నిర్మించి తీరుతాం. - టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు -
తిరుమలలో భక్తులను ఇలాగే పిలవాలి..
- భక్తులను 'గోవిందా..' అని సంబోధించాలన్న టీటీడీ చైర్మన్, ఈవోలు తిరుచానూరు : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను గోవిందా అని సంబోధించాలని టీటీడీ చెర్మైన్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీవారి సేవకులకు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి 2,750మంది శ్రీవారి సేవకులు, 600మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చారు. భక్తులతో ఎలా వ్యవహరించాలి, సేవలు ఎలా అందించాలి వంటి వాటిపై బుధవారం తిరుమల ఆస్థానమండపంలో వీరికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెర్మైన్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి నిస్వార్థ సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల జన్మ ధన్యమని తెలిపారు. 15ఏళ్ళ క్రితం 195మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవలో ఇప్పటి వరకు సుమారు 6.38లక్షల మంది సేవలందించారని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరగాలని కోరారు. భక్తుల మన్ననలు పొందేలా సేవలందించాలని కోరారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సేవలందించడం శ్రీవారి సేవకుల పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అనంతరం ఈవో డాక్టర్ డి.సాంబశివరావు మాట్లాడుతూ ధర్మప్రచారానికి రథసారధులు శ్రీవారి సేవకులని తెలిపారు. తిరుమలలో సేవా విధులతో పాటు ధర్మప్రచారంలో భాగంగా నిర్వహించే మనగుడి, శుభప్రదం, రథయాత్రలు, శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు, గోపూజ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీవారి సేవకులను కోరారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందుతున్న సేవలపై శ్రీవారి సేవకులతో సర్వేలు నిర్వహించి, లోపాలున్న చోట నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల దళారి వ్యవస్థను అరికట్టేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల 5లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద శ్రీవారి సేవకులు సేవలందించారని, వారి సేవలకు విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ శశిధర్, డీపీపీ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, టీటీడీ విద్యాశాఖాధికారి విజయకుమార్, పీఆర్వో టి.రవి, ఏపీఆర్వో పి.నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము
- శ్రీకాళహస్తిలో అధికారుల నిర్వాకం శ్రీకాళహస్తి : సాధారణ అవసరాలు, ఉత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయ సొమ్మును రూ.2కోట్ల వరకు సేవింగ్స్ (ఎస్బీ)ఖాతాలో ఆలయాధికారులు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువయితే బ్యాంకులో ఫిక్సె డ్ డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా రూ.20కోట్లను ఎస్బీ ఖాతాలో అధికారులు ఉంచేశారు. దాదాపు ఏడు నెలలుగా ఈ మొత్తానికి వడ్డీ లేకుండాపోయింది. భక్తులు ఆలయ హుండీల్లో వేసిన కానుకలు భద్రపరచి సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అధికారులదే. అయితే శ్రీకాళహస్తీశ్వరాల యంలో భక్తులు హుండీల్లో వేసిన డబ్బుతో పాటు ఆలయంలో రాహుకేతు పూజలు, ఇతర అభిషేకాల ద్వారా వచ్చిన రూ.20కోట్లు బ్యాంక్‌లో ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఎస్బీ అకౌంట్లో జమచేశారు. ఏటా దేవాదాయశాఖకు జూన్ చివరికల్లా సుమారు రూ.10కోట్లు ఆలయం నుంచి చెల్లించాల్సి ఉంటుం ది. అయినా అదనంగా మరో రూ.10కోట్లు ఉంచుకోవాల్సిన అవసరమం ఏమిటనేది ప్రశ్న. గతంలో ఎన్నడూ ఈవోలు ఇలా ఇంత పెద్ద మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఉంచిన సందర్భం లేదు. దేవాదాయశాఖకు చెల్లించడం కోసమే : ఈవో దేవాదాయశాఖకు ప్రతి ఏటా జూన్ చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఆదాయాన్ని బట్టి కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. గత ఏడాది రూ.10కోట్ల వరకు ఆలయానికి చెందిన డబ్బును దేవాదాయశాఖకు చెల్లించాం. ఈసారి ఆలయ ఆదాయం పెరగడంతో రూ.12కోట్ల వరకు చెల్లించాలి. ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే దేవాదాయశాఖకు వెంటనే చెల్లించాలంటే ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్ధేశంతో రూ.20కోట్లు ఎస్బీలో ఉంచాం. పుష్కరాల వల్ల చెల్లించలేకపోయాం. పుష్కరాలు తర్వాత చెల్లిస్తాం. అంతే తప్ప పైసా తిన్నా.. ఇబ్బందులు తప్పవు. - బి.రామిరెడ్డి,ఈవో -
క్షీరా రామం..భక్తిధామం
పొలకొలనుగా.. క్షీరపురిగా విలసిల్లిన పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (పెదగోపురం) పంచారామ క్షేత్రాల్లో ఒకటి భాసిల్లుతోంది. క్షీరా రామలింగేశ్వరుడి పేరుతో ఇక్కడ కొలువైన పరమ శివుణ్ణి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. కార్తీక మాసంలో లక్షలాది మంది ఇక్కడి శివలింగాన్ని దర్శించి పునీతులవుతారు. గోదావరి నది సముద్రంలో సంగమించే నరసాపురం పట్టణం పాలకొల్లుకు అతి సమీపంలో ఉండటంతో పుష్కర యాత్రికులు క్షీరా రామలింగేశ్వరుడిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ పెదగోపురాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 లక్షలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో క్షీరపురిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ అర్చకులు, ఆలయ పరిధిలోని దుకాణాల యజమానుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చల్లపు సూర్యచంద్రరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. భక్తులు, అర్చుకులు, దుకాణాల యజమానులతో మాట్లాడారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. ఈవో : అమ్మా.. నా పేరు సూర్యచంద్రరావు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీ సమస్యలేమిటో చెప్పండి. విజయలక్ష్మి, భక్తురాలు : ప్రతి సోమవారం స్వామికి ఇచ్చే పంచ హారతులను దర్శించుకునే భాగ్యం కేవలం ముందు వరుసలో భక్తులకు మాత్రమే కలుగుతోంది. ఆలయానికి వచ్చే వారందరికీ పంచహారతులు దర్శించుకోవడానికి అవకాశం కల్పించండి. ఈవో : మంచి సూచన చేశారు. వచ్చే సోమవారం నుంచి భక్తులందరికీ పంచహారతుల దర్శన భాగ్యం కల్పిస్తాం. ఆదిమూల నాగేశ్వరరావు, భక్తుడు : నమస్కారమండీ. ఆలయం ముందు దుకాణాలు పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అయినా స్పందన లేదు. ఈవో : నిజమే కొద్దిరోజులుగా సమస్య తీవ్రమైంది. దుకాణాలున్న ప్రాంతం మునిసిపాలిటీది కావడం వల్ల మునిసిపల్ కమిషనర్‌కి లేఖ రాశాం. ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే. లింగం సత్యనారాయణ, భక్తుడు : మాది పూలపల్లి. పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఆలయ పరిసరాల్లో లేదు. గుడికి దగ్గరలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. ఈవో : పుష్కరాల నేపథ్యంలో దేవుని హాలును అభివృద్ధి చేస్తున్నాం. రూ.35 లక్షలతో నిర్మించే అభిషేకాల మండపం దిగువ భాగంలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తాం. నీలకంఠేశ్వరి, భక్తురాలు : పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి తీసుకోవడానికి సరైన సదుపాయం లేదు. దూర ప్రాంత భక్తులు స్వామి దర్శనానంతరం కొద్దిసేపు సేదతీరే అవకాశం ఆలయ పరిసరాల్లో కల్పించాలి. ఈవో : పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా అభిషేకాల మండపం నిర్మిస్తున్నాం. దీంట్లో భక్తులు సేదతీరే వీలుంటుంది. మార్కండేయులు, భక్తుడు : నిత్యం గుడిలోనే ఉంటా. గర్భగుడిలో వీఐపీల పేరుతో కొంతమందికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్య భక్తులు దర్శన భాగ్యం కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఈవో : కార్తీక మాసం, పర్వ దినాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. గర్భగుడి లో అభిషేకాలను ఇకనుంచి చేయని వ్వం. అభిషేకాల కోసం పుష్కర నిధులతో ప్రత్యేక మండపం నిర్మిస్తున్నాం. ఎస్.గణపతి, భక్తుడు : ఈవో గారూ. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నసమారాధన చేయాలి. అవసరమైతే మైకుల్లో ప్రచారం చేయండి. భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయండి. సాధారణ రోజుల్లో ప్రతి సోమవారం భక్తులకు అన్నసమారాధన చేయించండి. ఈవో : మంచి సూచన చేశారు. ఇకనుంచి ముందు పట్టణేతరులకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత మిగిలితే స్థానికులకు భోజనం పెట్టే ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈవో సూర్యచంద్రరావు పురోహితుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈవో : అర్చక స్వాములూ.. మీ సమస్యలేమిటో చెప్పండి. కోట నాగబాబు, పురోహితుడు : మాకంటూ ప్రత్యేకంగా సమస్యలు లేవు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నివిధాలా సేవలందిస్తాం. పుష్కర సమయాల్లో అరగంట మాత్రమే విశ్రాంతి ఇస్తాం. మద్దూరి సూర్యనారాయణమూర్తి, పురోహితుడు : గత పుష్కరాల్లో పురోహితులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈ పుష్కరాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరుతున్నాం. ఈవో : ఈ విషయమై శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశాం. తప్పనిసరిగా పురోహితులందరికీ గుర్తింపు కార్డులిచ్చే ఏర్పాట్లు చేస్తాం. అనంతరం ఆలయానికి చెందిన షాపులను లీజుకు తీసుకు వ్యాపారాలు చేస్తున్న వారితో ఈవో మాట్లాడారు. వివిధ సమస్యలను వ్యాపారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి సంబంధించి 42 షాపులు ఉన్నాయని, తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో షాపుల్లో పనిచేసే గుమాస్తాలు, యజమానులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. వీటిలో నీటి సౌకర్యం లేదని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పుష్కర నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్నామని ఈవో సమాధానమిచ్చారు. స్థలాభావం వల్ల అదనపు మరుగుదొడ్లు నిర్మించే అవకాశం లేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పుష్కర యాత్రికులకు సమస్యలు రానివ్వం పుష్కర యాత్రికులకు ఎలాంటి సమస్యలు రానివ్వం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర యాత్రికుల కోసం 12 రోజులపాటు పట్టణంలోని అన్నసమారాధన సత్రాల సహకారంతో మెయిన్ రోడ్డులోని రేపాక వారి సత్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భక్తుల విశ్రాంతి కోసం అన్నదాన సత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు భక్తుల సౌకర్యాల కోసం ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రూ.85 లక్షలు మంజూరు చేయించారు. రూ.50 లక్షలతో ఆలయానికి రంగులు, వైరింగ్ మరమ్మతులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయిస్తున్నాం. మరో రూ.35 లక్షలతో అభిషేక మండపాల నిర్మిస్తున్నాం. ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తవుతాయి. - చల్లపు సూర్యచంద్రరావు, ఈవో -
ఇది ‘పెళ్లిళ్ల వెంకన్న’ గుడి పేచీ
అమలాపురం టౌన్ :అన్నవరం సత్యదేవుని ఆలయం తర్వాత జిల్లాలో అధిక సంఖ్యలో వివాహాలు జరిగేదిగా అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడి ప్రసిద్ధి గాంచింది. ‘పెళ్లిళ్ల వెంకన్న’గా పేరుగాంచిన ఈ దేవుడి గుడి కి కార్యనిర్వహణాధికారి (ఈఓ) నియమాకం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈఓ నియామకంపై భిన్నాభిప్రాయాలతో ఉండటంతో ఈ వ్యవహారం అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతల మధ్య భేదాభిప్రాయాలూ అనివార్యమవుతున్నాయి. ఒకరు వద్దని.. మరొకరు కాదని.. ఈ గుడి ఈఓ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. కేవలం ఆలయ మేనేజర్‌తోనే ఈఓ బాధ్యతలను నిర్వర్తింపచేస్తున్నారు. ఈ ఆలయంలో ఏ అధికారి పనిచేసినా బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిందే. ఒక వర్గం నేతలు ఆలయంలో జరిగే అన్ని రకాల వేలంపాటలను వారే దక్కించుకుని ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. వారిని ఏ అధికారి వచ్చినా ఏమీ చేయలేకపోతున్నారు. మంత్రి రాజప్ప అనుచరుడైన టీడీపీ నాయకుడు కర్రి దత్తుడు ఆలయ ట్రస్టీ చైర్మన్ పదవిని ఆశించి మంత్రిని ప్రసన్నం చేసుకుని అందుకు లైన్‌క్లియర్ చేయించుకున్నారు. దత్తుడికి చైర్మన్ గిరీ ఇంకా అధికారికంగా ఇవ్వకపోయినా ఆయనే ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అంటూ హడావుడి చేస్తున్నారు. కాగా అమలాపురం పట్టణ దేవత సుబ్బాలమ్మ ఆలయానికి స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలో మెయిన్‌రోడ్డు చెంత గల రూ.30 కోట్ల విలువైన భూములను కొందర రాజకీయ అండతో ఆక్రమించుకుని లీజుదారులమని చెప్పుకుంటూ ఆలయ ఆదాయాన్ని మింగేస్తున్నారు. ఆ ఆలయ ఈఓగా వచ్చిన సీహెచ్ వెంకటలక్ష్మి భూముల పరిరక్షణకు నడుం బిగించటంతో పాటు ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టి వారి పాలిట సింహస్వప్నమయ్యారు. అప్పట్లో ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆమె లెక్కచేయలేదు. ఆలయ భూములను రక్షించటంలో ధైర్యంగా వ్యవహరించిన వెంకటలక్ష్మిని వెంకటేశ్వరస్వామి ఆలయ ఈవోగా నియమిస్తే ఆ ఆలయం కూడా బాగుపడుతుందని నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు చెప్పడంతో ఆ పార్టీకి చెందిన దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు ఈఓ పని తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆమెను ఎఫ్ఏసీ ఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం రాజప్ప వర్గీయులైన కొందరు టీడీపీ నేతలకు రుచించలేదు. ముఖ్యంగా ఆలయ చైర్మన్ పదవిని ఆశిస్తున్న దత్తుడు ఆమె నియూమకాన్ని వ్యతిరేకించారు. ఆమెకు తలబిరుసని, చెప్పినమాట వినరని రాజప్పకు నూరిపోశారు. లక్ష్మిని నియమిస్తే రూ. 2 కోట్ల విరాళం.. అజ్ఞాతభక్తుని ఆఫర్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయూలంటే నిజాయితీ గల అధికారి అవసరమని భావించిన పట్టణానికి చెందిన ధనవంతుడైన ఓ భక్తుడు లక్ష్మిని నియమిస్తే ఆలాయూనికి రూ.2 కోట్లు విరాళమివ్వడానికి ముందుకు వచ్చారు. ఆయన గతంలో తిరుపతి వెంకన్నకు రూ.7 కోట్ల విరాళాన్ని ఓ అజ్ఞాత భక్తునిగా అందించారు. దేవాదాయ శాఖలో ఎవరైనా దాతలు ఒక వంతు నిధులు విరాళంగా ఇస్తే రెండొంతులు సీజీఎఫ్ కింద దేవాదాయశాఖ సమకూరుస్తుంది. ఈ లెక్కన ఆ భక్తుడు ఇచ్చే రూ.2 కోట్లకు దేవాదాయశాఖ రూ.4కోట్లు జోడించి మొత్తం రూ.6కోట్లతో వెంకన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని స్థానికులు, కొందరు బీజేపీ నాయకులు మంత్రి మాణిక్యాలరావు దృష్టిలో పెట్టారు. అప్పటికే ఆమెపై సానుకూల నివేదిక ఉండటంతో మంత్రి అంగీకరించి ఈఓగా నియమించారు. లక్ష్మి 15 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించేందుకు వెళితే అక్కడి రాజకీయ నాయకులు కొందరు అడ్డుకున్నారు. ఆమె నియూమకానికి ససేమిరా అంటూ, తద్వారా అజ్ఞాత భక్తుడు ఇచ్చే రూ.2 కోట్ల విరాళాన్ని మోకాలడ్డారు. కాగా ఈఓగా లక్ష్మి వస్తే ఆలయంలో కొన్ని అనుచిత వ్యవహారాలకు అడ్డుకట్ట వేస్తుందని కొందరు భయపడుతున్నారని, వారే మంత్రి రాజప్పను ఈ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు టీడీపీ నాయకులే బాహాటంగా అంటున్నారు. అరుుతే ఆమె నియూమకాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఆరునూరైనా రానివ్వబోమంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార, మిత్రపక్షాల మంత్రులలో ఎవరిది పైచేరుు అవుతుందో వేచి చూడాల్సిందే. -
టీటీడీ ఈవోగా సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావును ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి పేషీలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎ.గిరిధర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు టీటీడీ ఈవోగా ఉన్న ఎంజీ గోపాల్‌ను బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న అజయ్ జైన్‌ను ఇంధన, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. కళాశాల విద్యా కమిషనర్ కె.సునీతకు సాంకేతిక విద్య ఇన్చార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అజయ్ జైన్‌కు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఇన్‌క్యాప్) వైస్ చైర్మన్ కం మేనేజింగ్ డెరైక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. ఈ స్థానంలో పనిచేస్తున్న ఎన్.గుల్జార్‌ను బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఐఏఎస్‌ల విభజన ప్రాథమిక జాబితాలో గోపాల్ పేరును తెలంగాణ కోటాలో చేర్చింది. వారంలో ఐఏఎస్‌ల విభజన పూర్తయ్యే అవకాశం ఉన్నందునే పోస్టింగ్ ఇవ్వలేదని తెలిసింది. -
పదవిలో ఉంటే ఉంటా.. పోతే పోతా
విజయవాడ : విధి నిర్వహణలో నీతి, నిజాయితీలకు పెద్దపీట వేస్తానని.. విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గబోనని నూతన ఈవో సీహెచ్.నర్సింగరావు స్పష్టం చేశారు. దుర్గగుడి ఈవోగా ఆయన నిన్న అమ్మవారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఈవోగా తాను ముక్కుసూటిగా పని చేస్తానని తెలిపారు. 'పదవిలో ఉంటే ఉంటా..పోతే పోతా.. నా పద్థతి మాత్రం మార్చుకోను' అని తేల్చి చెప్పారు. గతంలోనూ తాను పనిచేసిన చోట అదేవిధంగా వ్యవహరించానని నర్సింగరావు వివరించారు. అమ్మవారి దేవాలయ ప్రతిష్ట పెంచడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు. దేవాలయానికి, ప్రభుత్వానికి నష్టం వచ్చే నిర్ణయాలు తీసుకోనని, ఆలయానికి ప్రపంచఖ్యాతి తెచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
సంస్కరణల పర్వం
‘సాక్షి’తో రామాలయం ఈవో కూరాకుల జ్యోతి భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఆలయ ఈవోగా అభివృద్ధే నా తొలి కర్తవ్యం. ఆలయాభివృద్ధిలో భాగంగా అనేక సంస్కరణలను చేపట్టాలని నిర్ణయించాం. ఇవి ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలిగించకుండా చూస్తాం. ఆలయాభివృద్ధిలో భాగంగా రూ.50 వేలకు పైగా విరాళం ఇచ్చిన దాతలను సన్మానించాలని నిర్ణయించాం. లడ్డూ ప్రసాదాల ద్వారా ఆలయానికి ఏటా రూ.కోటికి పైగా నష్టం వస్తున్నా సామాన్యభక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీటి ధరలను పెంచొద్దని నిర్ణయించుకు న్నాం. ఆలయాభివృద్ధి, దేవుని సేవల విషయంలో రాజీపడొద్దనేది నా ధ్యేయం. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి రామాలయంలో సంస్కరణల పర్వానికి తెరదీయనున్నట్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) కూరాకుల జ్యోతి వెల్లడించారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆలయ విశిష్టతను చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాభివృద్ధికి తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ‘సాక్షి’ ప్రతినిధితో మంగళవారం ఆమె మాట్లాడారు. ఆలయాభివృద్ధే ధ్యేయం ‘ఆలయాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. దాతలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. రూ.50వేలకు పైగా విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. వారిని ప్రత్యేకంగా సన్మానిస్తాం. ఎంతో ప్రాశ్యస్తి ఉన్న రామాలయం తెలంగాణలోని ఇతర దేవాలయాలతో పోలిస్తే ఆదాయపరంగా కొంత వెనుకబడి ఉంది. దేవాలయంలో మరిన్ని సేవలందించడం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నాం. సామాన్య భక్తులపై భారం పడకుండా చూస్తాం. దేవాలయంలో ప్రతిరోజు నిర్వహించే అభిషేకం టికెట్ ధరలను పెంచాలని భావిస్తున్నాం. ప్రస్తుతం రూ.500 ఉన్న అభిషేకం టికెట్ ధరను రూ.1,100లకు పెంచే యోచనలో ఉన్నాం. త్వరలో దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాం. అంతరాలయంలో సేవా టికెట్ ధరలనూ పెంచాలని భావిస్తున్నాం. దీన్ని రూ.50 నుంచి రూ.100కు పెంచాలని భావిస్తున్నాం. నదీ హరతిని ఘనంగా నిర్వహిస్తాం.. కార్తీకమాసాన్ని పురస్కరించుకొని వచ్చేనెల 6, 13 తేదీల్లో గోదావరి నదీ హరతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి, వచ్చే ఏడాది జూలైలో గోదావరి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ ఉత్సవాల సందర్భంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతులు కల్పించేందుకు ఇప్పటికే రూ.15 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రణాళికలు పంపించాం. నష్టం వస్తున్నప్పటికీ ప్రసాదం ధరలు పెంచం.. దేవాలయం సమకూరుస్తున్న లడ్డూ ప్రసాదాలతో నష్టం వస్తున్నప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో వీటి ధరలను పెంచొద్దని నిర్ణయించాం. ప్రస్తుతం రూ.10కి లడ్డూ విక్రయిస్తున్నాం. దీనివల్ల ఆలయానికి ఏడాదికి రూ.కోటికి పైగా నష్టం వస్తుంది. అయినప్పటికీ భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ప్రసాదం ధరలు పెంచొద్దని నిర్ణయించాం. ఈ ప్రసాదం తయారీ, విక్రయం ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి వేములవాడ తరహాలో లడ్డూ పరిమాణాన్ని 100 గ్రాముల నుంచి 80 గ్రాములకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై ఉన్నతాధికారులతోనూ చర్చించాం. రామాలయ విశిష్టతను కాపాడుకుందాం.. ఎంతో ప్రాశ్యస్తి, చరిత్ర ఉన్న రామాలయ విశిష్టతను కాపాడుకుందాం. నా తొలి ప్రాధాన్యం దేవునికే. స్వయంగా వెలిసిన రాముడికి, భద్రాద్రి గుడికి విశిష్ట నేపథ్యం ఉంది. దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉంది. దీనికోసం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తాం. రామాలయ ప్రాశ్యస్తిని భక్తులకు అందుబాటులో ఉంచేందుకు శ్రీ రాముని చరిత్రను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పుస్తకరూపంలో తీసుకొస్తాం. ఆలయ పవిత్రత, విశిష్టతను కాపాడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే చేపడుతున్నాం. -
చర్చలు మరోసారి విఫలం..
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ ఈఓ, ఉద్యోగుల మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వేధింపులకు పాల్పడుతున్న ఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ంలో పని చేస్తున్న ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులు, నాల్గవ తరగతి ఉద్యోగులు సమష్టిగా రిలే దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈఓ కక్షపూరితంగా ఉద్యోగులపై జారీ చేసిన మెమోలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల య ఉద్యోగులు టీజేఏసీ నాయకుల ఆధ్వర్యం లో సహాయ నిరాకరణ చేస్తున్న విషయం విదితమే. ఈ విషయంపై ఈఓతో శుక్రవారం టీజేఏసీ నాయకులు చర్చలు జరిపారు. ఉద్యోగులు భేషరతుగా క్షమాపణ చెబితే మెమోలు ఉపసంహరించుకుంటానని ఈఓ తెలపడంతో ఉద్యోగుల నిరసన కొనసాగిస్తున్నారు. నాల్గవ రోజైన శనివారం చిత్రకూట మండపం వద్ద బైఠాయించి ఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈఓతో ఉద్యోగ సంఘ అధ్యక్షుడు చర్చలు మరోమారు విఫలం..... ఈ క్రమంలో దేవస్థాన ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నర్సింహారాజును ఈఓ మరోసారి క్యాంపు కార్యాలయంలో చర్చలు జరపటానికి ఆహ్వానించారు. ఈ చర్చలలో కేవలం ఇద్దరి ఉద్యోగులపై ఉన్న మెమోలను మాత్రమే ఉపసంహరించుకుంటానని తెలపడంతో నర్సింహారాజు తిరిగి వెనక్కి వచ్చారు. సాయంత్రం కూడా ఈఓ మరోసారి పిలిచి ఇదే విషయాన్ని పేర్కొనడంతో చర్చలు విఫలం అయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లను పూర్తిస్థాయిలో అంగీకరిస్తేనే చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే వద్దని నర్సింహరాజు స్పష్టం చేశారు. డిమాండ్లను సాధించే వరకు విరమణ లేదు.... తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు ఈఓతో చర్చలకు వెళ్లేది లేదని ఆలయ ఉద్యోగులు, సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. టీజేఏసీ డివిజన్ కన్వీనర్ మాట్లాడుతూ ఈఓ మోసపూరిత వైఖరికి తాము విసిగిపోయామని, అందుకే సహాయ నిరాకరణతో పాటు రిలే దీక్షలకు సిద్ధమయ్యామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహిస్తూనే పరిపాలన స్తంభింపజేస్తామని అన్నారు. ఈఓగా రఘునాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన అన్ని పనులపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ఈ విచారణ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈఓ ఉద్యోగుల పట్ల రాజీ మార్గంతో కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈఓపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలనే నినాదంతో ఆదివారం రిలే దీక్షలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ, ఆలయ ఉద్యోగ సంఘ నాయకులు నర్సింహరాజు, రవీందర్, శ్రీనివాసరెడ్డి, నిరంజన్, సూపరింటెండెంట్ కనకదుర్గ, కత్తి శ్రీను, భాస్కర్, వెంకట్, సుబ్బారావు, స్థలశాయి స్థానాచార్యులు, వేదపండితులు హనుమత్‌శాస్త్రి, లింగాల రామకృష్ణ ప్రసాదఅవధాని, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, సీతారామానుజాచార్యులు, ఉపప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణచార్యులు, అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రావణ్కుమారాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముదిరిన వివాదం
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈవో, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం మరింత రాజుకుంది. ఈవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు గురువారం కూడా పరిపాలనాపరమైన సేవలు నిలిపేసి సహాయ నిరాకరణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా నిరసనకు దిగారు. ‘ఈవో డౌన్ డౌన్’, ‘ఉద్యోగులను వేధిస్తున్న ఈవోను సస్పెండ్ చేయాలి’ అని రాసిన ప్లకార్డులు చేబూనారు. ఈవోకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్వామి వారికి పూజలు, భక్తుల సందర్శనకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలోని అన్ని కేడర్ల ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి టీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఇలా ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడడం విచారకరమన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈవో ఇక్కడి ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించినందునే సమస్య జటిలంగా మారిందని అన్నారు. దీనిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటప్పయ్య మాట్లాడుతూ.. ఈవో రఘునాధ్ నిరంకుశ వైఖరి కారణంగా అనేకమంది ఉద్యోగులు మానసిక వ్యథతో ఉన్నారని అన్నారు. ఈవోను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు నరసింహరాజు, ఏఈవో శ్రావణ్ కమార్, ఏఈ రవీందర్, నిరంజన్ కుమార్, పీఆర్వో సాయిబాబా, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మురళీ కృష్ణమాచార్యులు బదిలీకి లేఖ దేవస్థాన అధర్వణ వేద పండితులు జి.మురళీ కృష్ణమాచార్యులును ఇక్కడి నుంచి బదిలీ చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఈవో రఘునాధ్ గత నెల 31న లేఖ రాశారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా మురళీ కృష్ణమాచార్యులు వ్యవహరిస్తున్నారని, ఈ కారణంగా దేవస్థానం ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఆ లేఖలో... ‘ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ‘శ్రీరామచంద్రస్వామినే వరాయ’ అనే పదాన్ని తొలగించి ‘రామనారాయణ వరాయ’ అంటూ ప్రవచనాలు చెప్పారు. ఈ ఏడాది జరిగిన స్వామి వారి కల్యాణోత్సవంలో ‘కల్యాణ వేడుకలో భద్రాచలములో కొలువైన శ్రీరామచంద్రుడు దశరధ తనయుడు రాముడు కాదని, అట్లు అనుకొనుచున్న రామ భక్తులు మూర్ఖులు, అవివేకులని, భద్రాద్రిలో కొలువున్న రాముడు వైకుంఠ రాముడనియు, రామ నారాయణుడనియు వ్యాఖ్యానించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దీనిపై వివరణ కోరుతూ మెమో ఇవ్వగా, టీఎన్జీవో నాయకులను నా చాంబర్‌కు తీసుకొచ్చి అర గంటకు పైగా బయటకు వెళ్లనీయకుండా నిర్బంధించారు. పరిపాలనాపరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ వివాదాలకు కారణభూతుడవుతున్నారు. ఆయనను వెంటనే బదిలీ చేయాలి’’ అని ఉంది. ఈ లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ లేఖపై ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు తీవ్రంగానే స్పందించారు. ఆర్థిక లావాదేవీలపై విచారణకు డిమాండ్ ఆలయ సంబంధ ఆర్థిక లావాదేవీల్లో ఈవోగా రఘునాథ్ అక్రమాలకు పాల్పడ్డారని వేద పండితులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ పనులను టెండర్లు లేకుండా తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని, వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరాారు. సెలవులో ఈవో ఆలయ ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈవో రఘునాధ్ రెండు రోజులపాటు సెలవు పెట్టారు. ఆయన బుధవారం రాత్రి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నయనానందంగా శ్రీరామ రథోత్సవం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామ దివ్య రథోత్సవాన్ని నయనానందపర్వంగా నిర్వహించారు. ముందుగా సముద్రాల యాదగిరాచార్య, శఠగోపాలాచార్య, సంపత్కుమారాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. భక్తాంజనేయస్వామి భజన మండలి ఆధ్వర్యంలో భజ న, దుర్గా భవాని మహిళా మండలి గోదా కోలాట బృందాలు, పాలబిందెల బాలు నృత్యాలు, పెంటయ్య బ్యాండు భక్తి గీతాలాపనలతో రథోత్సవం పురవీధుల్లో సాగింది. ఈ సందర్భంగా అడుగడుగునా భక్తులు హారతులతో నీరజనాలు పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మనోహర్‌రెడ్డి, టుటౌన్ ఎస్ఐ బాషా, కమిటీ సభ్యులు జడల సువర్ణ, సునీతవేమన, శ్రీనివాసాచార్యులు, భక్తులు చకిలం వేణుగోపాలరావు, అర్చకులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీ ఈవో
రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం మధ్యవర్తినీ అదుపులోకి తీసుకున్న అధికారులు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం సొమ్ము డిమాండ్ కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు పంచాయతీ ఈవో ఆర్.భవానీప్రసాద్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బిల్డింగ్ ప్లాన్ అనుమతుల కోసం గురువారం రూ.8 వేలు లంచం తీసుకోగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. స్థానిక ఏలూరు రోడ్డు సమీపంలో నివాసముంటున్న చేపల రైతు సైదు ఆనందరావు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎన్నికల నామినేషన్ల విధుల్లో ఉన్న ఈవోకు ఎనిమిది రూ.1000 నోట్లను లంచంగా అందించేందుకు వెళ్లాడు. బయటకు వచ్చి నగదు తీసుకున్న ఆయన వాటిని మధ్యవర్తి, లెసైన్స్డ్ సర్వేయర్ గుడిపాటి జగన్నాథానికి ఆ సొమ్ము అందజేశాడు. ఇంతలో మారువేషాల్లో ఉన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని చూసి జగన్నాథం పారిపోతుండగా అధికారులు వెంటపడి పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి గదిలోకి తీసుకెళ్లి విచారణ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద చివరి రోజు నామినేషన్లు కావడంతో మండంలోని వివిధ గ్రామాల అభ్యర్థులు, మద్దతుదారులతో కోలాహలంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా జగన్నాథాన్ని ఏసీబీ అధికారులు బలవంతంగా తీసుకెళ్లడంతో ఏం జరుగుతోందో తెలియని గందరగోళ స్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే... మండవల్లి మండలం దేవి చింతపాడుకు చెందిన సైదు పాండురంగారావు స్థానిక ఏలూరు రోడ్డులో స్థలం కొన్నాడు. ఆయన మరణానంతరం కుమారుడు ఆనందరావు భవనం నిర్మించుకున్నాడు. ఇటీవల పై అంతస్తు నిమిత్తం బ్యాంకు రుణం కోసం పంచాయతీ ప్లాన్ అప్రూవల్ పొందేందుకు ఫిబ్రవరి 28న కైకలూరు పంచాయతీ ఈవో భవానీప్రసాద్‌ను కలిశాడు. రూ.20 వేలు లంచం ఇస్తే వెంటనే ఇస్తానని ఆయన సమాధానమిచ్చాడు. తన తండ్రి బతికున్నప్పుడే అప్రూవల్ కోసం దాఖలు చేసుకున్నామని చెప్పగా, ఆ రసీదులు తీసుకురావాలని చెప్పాడు. తీరా తీసుకొచ్చాక వాటికి కాలం చెల్లిందని, కొత్తవి తీసుకోవాలని తెలిపాడు. ఇలా అనేక పర్యాయాలు కార్యాలయం చుట్టూ తిప్పటంతో విసిగి వేసారిపోయిన ఆనందరావు ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల పథకం ప్రకారం ఈవోతో మాట్లాడగా జగన్నాథంతో మాట్లాడాలని చెప్పాడు. చివరికి రూ.8 వేలకు పనిపూర్తిచేసేందుకు ఒప్పందం కుదిరింది. ఆనందరావు గురువారం పంచాయతీ కార్యాలయంలో అప్రూవల్ నిమిత్తం రూ.6,586 చెల్లించి ఆ రసీదుతో లంచం నగదు రూ.8 వేలు తీసుకుని ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చాడు. జగన్నాథం ఎదురుగా నగదును అందించాడు. పంచాయతీ సిబ్బంది ఏకంగా రసీదు పుస్తకాన్ని కూడా ఈవో వద్దకు పంపించారు. అధికారులు రసీదు పుస్తకాన్ని కూడా సీజ్ చేసి, పలువురు పంచాయతీ సిబ్బందిని కూడా విచారణ చేశారు. ఈవో ఇంటిపై సోదాలు చేస్తున్నాం : డీఎస్పీ ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ విలేకరులతో మాట్లాడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈవోను శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. గుడివాడలోని ఈవో ఇంటిలో సోదాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల గుంటూరు, విజయవాడ పరిధిలో 9 కేసులు నమోదు చేశామన్నారు. అధికారులు లంచం అడిగితే 9440446164, 9440446167, 9440446133 సెల్ నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, 10 మంది సిబ్బంది పాల్గొన్నారు. లంచగొండుల ఆట కట్టించడానికే... కైకలూరు పంచాయతీ కార్యాలయంలో కింది స్థాయి నుంచి పైస్థాయి సిబ్బంది వరకు తనను చాలా ఇబ్బందులకు గురిచేశారని, చివరకు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని బాధితుడు ఆనందరావు చెప్పారు. పలుమార్లు ఈవోను కలవగా.. రూ.20 వేలు ఇస్తే వెంటనే పని పూర్తిచేస్తానని చులకనగా మాట్లాడారని తెలిపారు.