పదవిలో ఉంటే ఉంటా.. పోతే పోతా | New EO Narsigarao assumes office at Kanaka Durga temple | Sakshi
Sakshi News home page

పదవిలో ఉంటే ఉంటా.. పోతే పోతా

Published Fri, Nov 28 2014 9:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

పదవిలో ఉంటే ఉంటా.. పోతే పోతా

పదవిలో ఉంటే ఉంటా.. పోతే పోతా

విజయవాడ : విధి నిర్వహణలో నీతి, నిజాయితీలకు పెద్దపీట వేస్తానని..  విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గబోనని నూతన ఈవో సీహెచ్.నర్సింగరావు స్పష్టం చేశారు. దుర్గగుడి ఈవోగా ఆయన నిన్న అమ్మవారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఈవోగా తాను ముక్కుసూటిగా పని చేస్తానని తెలిపారు.

'పదవిలో ఉంటే ఉంటా..పోతే పోతా.. నా పద్థతి మాత్రం మార్చుకోను' అని తేల్చి చెప్పారు. గతంలోనూ తాను పనిచేసిన చోట అదేవిధంగా వ్యవహరించానని నర్సింగరావు వివరించారు. అమ్మవారి దేవాలయ ప్రతిష్ట పెంచడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు. దేవాలయానికి, ప్రభుత్వానికి నష్టం వచ్చే నిర్ణయాలు తీసుకోనని, ఆలయానికి ప్రపంచఖ్యాతి తెచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement