
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.