
సాక్షి, తిరుమల : టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సాక్షి టీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో పుణ్యఫలం చేస్తే గానీ ఈ అవకాశం దక్కదని పేర్కొన్నారు. ‘శ్రీవారి పాదాల చెంత నేను చదువును పూర్తి చేశాను. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుత్తం ఉన్న పద్దతులను మరింత పటిష్టం చేస్తా’నని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో భక్తుల కోసం నూతన సంస్కరణలు తీసుకొస్తానని తెలిపారు. పూర్తి జాగ్రత్తలు తీసుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చన్నారు. అన్‌లాక్ 5లో భాగంగా మినహాయింపులు ఇచ్చారని, టీటీడీ ఉన్నత అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు తెలియజేస్తామని ఈవో కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. (టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment