Published
Thu, Jul 21 2016 6:58 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
బాలాలయం పనుల పరిశీలన
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని బాలఆలయం పనులను ఈఓ గీతారెడ్డి గురువారం పరిశీలించారు. ప్రస్తుతం రహదారికి అడ్డంగా ఉన్న క్యూలైన్లను తొలగించి ప్రత్యేకంగా బాలాలయానికి ఆనుకుని క్యూలైన్లను నిర్మిస్తున్నారు. అలాగే ప్రధానాలయం గోడలను మరో వారం రోజుల్లో తొలగించనున్నట్లు ఈఓ తెలిపారు. అందుకోసం ప్రధానాలయం స్ట్రాంగ్ రూంలోని బంగారు, వెండి ఆభరణాలను బాలాలయంలో తీసుకువస్తున్నారు. దేవస్థానం అధికారులు ప్రధానాలయంలోని ఇతర వస్తువులు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.