yadagirikonda
-
ముగిసిన నవరాత్రి ఉత్సవాలు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని శివాలయంలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు పూర్ణాహుతిని నిర్వహించారు. ఉదయం అమ్మ వారిని దుర్గా సూక్తంతో అభిషేకించి, పట్టు పీతాంబరాలతో అలంకారం చేసి దుర్గా దేవీగా అలంకరించిన అనంతరం సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి హవనం చేసి నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికారు. తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్ట దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దేవస్థానానికి వివిధ విభాగాల నుంచి రూ. 6,32,948 ల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ఆలయ అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఈనెల 11 వ తేదీన దసరా పండుగ సందర్భంగా శిలాస్థాపన చేయనున్నారు. ఉత్తరం దిశలోని సిద్ధమైన రాజగోపురం బేస్మెంట్పై ఆరోజు ఉదయం 8ః19 గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. ఈ శిలాస్థాపన వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు చేతుల మీదుగా జరపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇందుకోసం నిర్మాణం పనులను వేగిరం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పనులను వేగవంతం చేయాలనే ఆదేశాల మేరకు రాజగోపురాలను సిద్ధంచేశారు. దక్షిణ రాజగోపురం పనులను ప్రారంభించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం నేలను చదును చేస్తున్నారు. స్వామి వారి రథాలను తీసి వాటిని శుభ్రం చేస్తున్నారు. గతంలో ఉన్న రథశాలను సైతం తొలగిస్తున్నారు. -
దేవాలయాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం
యాదగిరికొండ : తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధి టీఆర్ఎస్కే సాధ్యమైందని సినీమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి దేవస్థానాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే యాదగిరిగుట్ట చరిత్రనే మార్చేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, స్థానిక సర్పంచ్ బూడిద స్వామి, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సయ్యద్‌బాబా, మిట్ట వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి హుండీ లెక్కింపు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 35 రోజులకు గాను రూ.58,61,69లు, అలాగే 80 గ్రాముల బంగారం , 1,600 గ్రాముల వెండి వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మెన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఏఈఓలు చంద్రశేఖర్, రామ్మోహన్రావు, అధికారులు గజ్వేల్ రమేశ్, శ్రవణ్, గోపాల్, చలమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
కొండపై నీటిసంపు నిర్మాణానికి సర్వే
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై భక్తులకు మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దాదాపు 10 లక్షల లీటర్ల సంపును నిర్మించేందుకు మంగళవారం సర్వే చేశారు. శివాలయం పక్కన ఉన్న నీటి ట్యాంకును కూల్చేసి దాని స్థానంలోనే నేల అడుగు భాగంలో విశాలమైన నీటి సంపును నిర్మాణం చేయడానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ పనులు దసరా రోజు నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సురేందర్‌రెడ్డి, ఎస్సీ రమణానాయక్, ఈఓ గీతారెడ్డి, దేవస్థానం అధికారులు డీఈ దయాకర్‌రెడ్డి, ఇంజనీర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ పాపారావు, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ప్రసాదాలను తీసుకోవడానికి భక్తులు పోటీలు పడ్డారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొన్ని ఆలయాన్ని ఉదయం 3 గంటలకే తెరిచారు. -
ప్రధానాలయ ద్వారాల తొలగింపు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని ప్రధానాలయ ద్వారాలను శుక్రవారం తొలగించారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా మరో రెండు రోజుల్లో రాజగోపురాన్ని తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ద్వారాలను, భద్రతా పరంగా ఉన్న గేట్లను తొలగించారు. మరోవైపు నాలుగు రాజగోపురాల పనులు వేగంగా జరుగుతున్నాయి. దసరా మరో పది రోజులు మాత్రమే ఉండడంతో కాంట్రాక్టు అధికారులు పనులను వేగంగా చేస్తున్నారు. మూడు రాజగోపురాలకు బేస్మేంట్ పనులు దాదాపుగా పూర్తి చేశారు. -
యాదాద్రి ఘాట్‌రోడ్డుపై ధర్నా
యాదగిరికొండ దురుసుగా ప్రవర్తించడంతో పాటు దేవస్థానం వర్తక సంఘం అధ్యక్షుడిపై చేయి చేసుకున్న హోంగార్డుపై చర్య తీసుకోవాలని కోరుతూ వర్తకసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గంటసేపు దేవస్థానం ఎదుట బైఠాయించారు. అమెరికా పర్యటన ముగించుకుని దేవస్థానం ఈఓ గీతారెడ్డి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను స్నేహపూర్వకంగా కలవడానికి వర్తకసంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య కొండపైకి వెళ్తుండగా విధుల్లో ఉన్న హోంగార్డు అర్వపల్లి అడ్డుకున్నాడని తెలిపారు. హోంగార్డు దురుసుగా ప్రవర్తించి చేయి కూడా చేసుకున్నాడని ఆరోపించారు. విషయాన్ని తెలుసుకున్న దుకాణదారులు సంఘటన స్థలానికి చేరుకుని అర్వపల్లిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, దేవస్థానం ఈఓ గీతారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కర్రె వెంకటయ్యపై చేయి చేసుకున్న హోంగార్డుపై విచారణ జరుపుతామని, విచారణ పూర్తయ్యే వరకు అతన్ని విధుల్లోకి తీసుకోమని, తప్పు అని తేలితే చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం హోంగార్డుపై వర్తకసంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వర్తకసంఘం సభ్యులు కొన్న రమేష్, శివకుమార్, మిట్ట వెంకటయ్య, కర్రె వీరయ్య, బాలరాజు పాల్గొన్నారు. -
త్వరలో పాతగుట్టలో అద్దాల మండపం
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఆధీనంలోని పాతగుట్టలో అద్దాల మండపాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం యాదాద్రి విస్తరణ పనుల్లో భాగంగా కొండపైన ఉన్న అద్దాల మండపాన్ని తొలగించి పాతగుట్టకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పాతగుట్టలో రూ. 50 లక్షలతో అద్దాల మండపాన్ని నిర్మించనున్నట్లు మాచారం. పూర్తికావచ్చిన ప్రధానాలయ తొలగింపు యాదాద్రి విస్తరణలో భాగంగా ప్రధానాలయ తొలగింపు పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. స్లాబ్ తొలగించగా ఆలయం చుట్టూ గోడలు మాత్రమే మిగిలిపోయాయి. పశ్చిమ రాజగోపురాన్ని దాదాపుగా తొలగించారు. మరో రెండు రోజుల్లో తొలగింపు పనులు పూర్తి చేసి నాలుగు రాజగోపురాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ దసరాకు రాజగోపురాలకు శంకుస్థాపన చేసి వచ్చే దసరా నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించే యోచనలో అధికారులు ఉన్నారు. -
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే క్యూలైన్లు ఈ రోజు బోసిపోయి కనిపించాయి. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలను ధరింపచేసి, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్ పాల్గొన్నారు. -
రాజగోపురాల నిర్మాణ పనులు ప్రారంభం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని యాదాద్రి ప్రధానాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయానికి సంబంధించిన రాజగోపురాల నిర్మాణాన్ని శనివారం నుంచి ప్రారంభించారు. తూర్పు రాజగోపురం నిర్మాణానికి నేలను చదును చేస్తుండగా, ఉత్తర రాజగోపురం కోసం బెస్మెంట్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న పశ్చిమ రాజగోపురాన్ని తొలగించే పనులు వేగవంతమయ్యాయి. వచ్చే దసరా నాటికి పనులన్నీ పూర్తి చేయాలనే ఆలోచనతో వైటీడీఏ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. -
ఆలయంలో ఘనంగా విశేష పూజలు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా బాలాలయంలో నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, అర్చన, సహస్రనామార్చన, సుదర్శన హవనం వంటి విశేష పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 3 గంటలకే తెరిచి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. ఆలయంలోని స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకించారు. పట్టు వస్త్రాలను ధరింపచేసి ప్రత్యేక పీఠంపై అధిష్టింపచేశారు. వివిధ రకాలైన పుష్పాలతో ప్రత్యేక పూజలను చేసిన అనంతరం హారతిని సమర్పించారు. శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు గావించారు. కోడే మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, నరిసింహాచార్యులు, రంగాచార్యులు, ఆలయ అధికారులు చంద్రశేఖర్, గోపాల్ పాల్గొన్నారు. -
యాదాద్రి పనులపై సమీక్ష
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం పనులపై శనివారం ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ విప్ సునిత సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ముందుగా దర్శించుకున్న అనంతరం యాదాద్రిలో సన్‌షైన్ అధికారులు చేస్తున్న నిర్మాణాలపై తగిన సూచనలను ఇచ్చారు. నూతనంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయం రాజగోపురాలను పరిశీలించారు. సుమారు రూ. 2000 కోట్లతో చేస్తున్న ఈ పనులపై ఆయన తగిన విధంగా అధికారులను ఆదేశించారు. ఈ పనులపై ఎటువంటి జాప్యం పనికిరాదన్నారు. అక్కడి నుంచి సన్‌షైన్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో నిర్మాణ పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని సీఎం కేసీఆర్‌కు వివరిస్తానన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మాట్లాడుతూ శనివారం రాజగోపురాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. 250 ఎకరాల్లో లే అవుట్ల నిర్మాణం మొదలవుతాయని తెలిపారు. ఇందులో 1000 గజాలు,1500 గజాలలో కాటేజీల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. వచ్చే దసరా లోపే పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నామన్నారు. యాదాద్రి ఆలయం నిర్మాణ పనులు మాత్రం వచ్చే అక్టోబర్ వరకు పూర్తి చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ రవీందర్రావు, వైటీడీఏ సెక్రటరీ రమేశ్ రెడ్డి, ఈఈ నరసింహామూర్తి, దేవస్థానం ఇన్చార్జి ఈఓ కృష్ణవేణి తదితరులు ఉన్నారు. -
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం సుమారు 15 వేల మంది స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ఉంటారని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో కొండపైకి వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఘనంగా సుదర్శన యాగం యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం అర్చకులు విశేష పూజలు, సుదర్శనయాగంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఉదయం నిత్య కైంకర్యాలను నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయమానంగా తయారుచేసి ఊరేగించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంకాలం స్వామి అమ్మవార్లను గజ వాహన సేవలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, రాకేశాచార్యులు, మోహనాచార్యులు , సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని ఆదివారం ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మోహన్కందాలు వేరువేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారిని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మెన్ బి. నర్సింహమూర్తి, ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు. -
యాదాద్రిలో విశేష పూజలు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ఊంజల్‌సేవలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. శుక్రవారం పురస్కరించుకుని ఆలయాన్ని ఉదయం 3గంటలకే తెరిచారు. దేవస్థానం ఏర్పాటు చేసిన 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవలను నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్, వేముల వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ప్రధానాలయం కూల్చివేత
యాదగిరికొండ : యాదగిరిగుట్టశ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం కూల్చివేత పనులు సన్‌షైన్ అధికారులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రధానాలయానికి వెనుక భాగాన ఉన్న ధర్మదర్శనాల క్యూలైన్ షెడ్లను తీసివేస్తున్నారు. ఆలయం పైభాగంలో స్లాబ్‌ను కట్ చేస్తున్నారు. ఆలయంలో చిన్న చిన్న ఆలయాలను, పిల్లర్లను, కిటికీలను, పెద్ద పెద్ద ద్వారాలను క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు. మరో వారం రోజులు ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు. -
ముమ్మరంగా ‘యాదాద్రి’ పనులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానంలో యాదాద్రి ప్రధానాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొండ చుట్టూ రిటైనింగ్ వాల్ కోసం సుమారు 100 లోతు నుంచి నిర్మాణం చేస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లర్లు ప్రస్తుతం భూమికి సమాంతరంగా వచ్చాయి. వైటీడీఏ అధికారుల సూచనల మేరకు సన్‌షైన్ అధికారులు పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రధానాలయంలోని ఆండాళ్ అమ్మవారు, ఆళ్వార్ల విగ్రహాలను కళావిహీనం చేసి స్వయంభుమూర్తుల వద్ద భద్రపరిచారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆలయ దక్షిణ భాగం నుంచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ధ్వజ స్తంభానికి ఉన్న వెండి తొడుగులు తీసి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఆలయ నిర్మాణ పనులు సీఎం కేసీఆర్ సూచనలు, చినజీయర్‌స్వామి సలహాలను అనుసరించి ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘యాదాద్రి’లో ప్రత్యేక పూజలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో తిరుమంజన ఉత్సవం జరిపారు. గులాబి, మందారం, కనకాంబరం తదితర పూలమాలలతో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచి విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు చంద్రశేఖర్, గోపాల్ పాల్గొన్నారు. -
పాతగుట్టలో పవిత్రోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని పాతగుట్ట ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు ధరింపజేశారు. అనంతరం వివిధ రకాల ఫుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పీఠంపై అధిష్ఠింపజేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన పవిత్ర మాలలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సకల దేవతల మూలమంత్రాలతో హవనం చేశారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అంకురార్పణం, దేవతాహోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఆరుట్ల సంపతాచార్యులు, యాజ్ఞీకులు సురేంద్రాచార్యులు, శ్రీకాంతాచార్యులు, అర్చకులు గట్టు వెంకటాచార్యులు, అధికారులు లక్ష్మణాచార్యులు, వెంకటేశ్వర్లు, పన్నగేశ్వర్రావు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్రభుత్వ విప్ పూజలు
యాదగిరికొండ: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆమె జన్మదిన సందర్భంగా మంగళవారం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాల ఆలయంలోని ప్రతిష్టామూర్తులకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అష్టోత్తరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీస్వామి, అమ్మవార్ల అశీస్సులతో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆమె వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులున్నారు. -
యాదాద్రి హుండీ లెక్కింపు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీతభవనంలో సోమవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 39 రోజులకు గాను రూ. 80,29,901 నగదు, 88గ్రాముల బంగారం,1750 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి. నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, అధికారులు దోర్భల భాస్కర శర్మ, రామ్మోహన్రావు, చంద్ర శేఖర్, శ్రవణ్, జూషెట్టి కృష్ణ, గోపాల్ పాల్గొన్నారు. -
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని బుధవారం ఎస్సీ శాసనమండలి కమిటీ చైర్మెన్ హనుమంత్ షిండే, ఎమ్మెల్యేలు కన్నె యాదయ్య, నారదాసు లక్ష్మణ్‌రావు, నీలం రాజు, గాదరి కిశోర్, ఎమ్మెల్సీ దుర్గం చిన్నయ్యలు దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మెన్ బి. నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ అధికారులు చంద్రశేఖర్, దోర్భల భాస్కర శర్మ, రామ్మోహన్రావు , జూషెట్టి కృష్ణ, గోపాల్, మేడి శివకుమార్, చలమాచార్యులు, ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, ఎంïపీపీ స్వప్న, సర్పంచ్ బూడిద స్వామి, ఎంపీటీసీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. -
త్వరలో రాజగోపురాల కూల్చివేత
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థాన విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రధానాలయం రాజగోపురాలు, ఆలయ ఆవరణలోని మండపాలను కూల్చివేయనున్నట్లు వైటీడీఏ అధికారులు సోమవారం తెలిపారు. సుమారు 2.33 ఎకరాల్లో విస్తీర్ణం కానున్న ప్రధానాలయానికి ఇటీవల వాస్తు ప్రకారం అమ్మవారి ఆలయం, ఆళ్వార్ల ఆలయం, గోదాదేవి ఆలయం వంటివి ఎక్కడ నిర్మించాలో సర్వే చేశామన్నారు. ఈ క్రమంలో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం పూజలు చేసిన అనంతరం ధ్వజస్తంభాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుదర్శన చక్రం ఉన్న రాజగోపురం కేవలం 12 ఫీట్లు మాత్రమే ఉందని, దీనిని సుమారు 52 అడుగుల ఎత్తు పెంచనున్నట్లు తెలిపారు. -
స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని ఆదివారం భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు చింతపట్ల రంగాచార్యులు, సురేంద్రాచార్యులు, మంగళగిరి నరసింహామూర్తి, అధికారులు దోర్భల భాస్కరశర్మ, గోపాల్, వేముల వెంకటేశ్ పాల్గొన్నారు. -
ఆలయంలో విశేష పూజలు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో నిత్య కైంకర్యాలు, అర్చనలు, హారతులు, సహస్రనామార్చనలు నిర్వహించారు. అమ్మవారిని పట్టు పీతాంబరాలు, అనేక రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి, గజ, అశ్వ వాహన సేవల్లో అమ్మవారిని అధిష్టింపచేశారు. సాయంకాలం జోడు సేవలు నిర్వహించారు. శివాలయంలోని పరమేశ్వరుడిని, అద్దాల మండపంలోని నవ నారసింహులను భక్తులు దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలో సుదర్శన నారసింహ యాగంలో భక్తులు పాల్గొని తమ మొక్కును తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు మంగళగిరి నరసింహామూర్తి, శ్రీధరాచార్యులు, అధికారులు గోపాల్, వేముల వెంకటేశ్ పాల్గొన్నారు.