త్వరలో రాజగోపురాల కూల్చివేత | Raja Gopura demolitation soon | Sakshi
Sakshi News home page

త్వరలో రాజగోపురాల కూల్చివేత

Published Mon, Aug 1 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

త్వరలో రాజగోపురాల కూల్చివేత

త్వరలో రాజగోపురాల కూల్చివేత

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థాన విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రధానాలయం రాజగోపురాలు, ఆలయ ఆవరణలోని మండపాలను కూల్చివేయనున్నట్లు వైటీడీఏ అధికారులు సోమవారం తెలిపారు. సుమారు 2.33 ఎకరాల్లో విస్తీర్ణం కానున్న  ప్రధానాలయానికి ఇటీవల వాస్తు  ప్రకారం అమ్మవారి ఆలయం, ఆళ్వార్ల ఆలయం, గోదాదేవి ఆలయం వంటివి ఎక్కడ నిర్మించాలో సర్వే చేశామన్నారు. ఈ క్రమంలో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం పూజలు చేసిన అనంతరం ధ్వజస్తంభాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుదర్శన చక్రం ఉన్న రాజగోపురం కేవలం 12 ఫీట్లు మాత్రమే ఉందని, దీనిని సుమారు 52 అడుగుల ఎత్తు పెంచనున్నట్లు తెలిపారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement