సాక్షి,హైదరాబాద్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అక్టోబర్ 18(శుక్రవారం) ఆమె మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని గుడుల లడ్డూలను టెస్టింగ్‌కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ వచ్చింది. వేములవాడ దేవస్థానం మాస్టర్‌ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే దేవాలయాల్లో 24 రకాల ఆన్‌లైన్ సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
వేములవాడ రాజన్నకు 65 కిలోల బంగారంతో తాపడం చేయిస్తాం. బాసర సరస్వతి టెంపుల్ పునర్నిర్మాణం కోసం మాస్టర్‌ప్లాన్ రెడీ అయింది. వేములవాడను రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తాం’అని మంత్రి సురేఖ తెలిపారు.
ఇదీ చదవండి: కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment