కొనసాగుతున్న ప్రధానాలయం కూల్చివేత
కొనసాగుతున్న ప్రధానాలయం కూల్చివేత
Published Fri, Sep 2 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
యాదగిరికొండ : యాదగిరిగుట్టశ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం కూల్చివేత పనులు సన్‌షైన్ అధికారులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రధానాలయానికి వెనుక భాగాన ఉన్న ధర్మదర్శనాల క్యూలైన్ షెడ్లను తీసివేస్తున్నారు. ఆలయం పైభాగంలో స్లాబ్‌ను కట్ చేస్తున్నారు. ఆలయంలో చిన్న చిన్న ఆలయాలను, పిల్లర్లను, కిటికీలను, పెద్ద పెద్ద ద్వారాలను క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు. మరో వారం రోజులు ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు.
Advertisement
Advertisement