యాదాద్రిలో విశేష పూజలు | special puja in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో విశేష పూజలు

Published Thu, Jul 21 2016 6:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

యాదాద్రిలో విశేష పూజలు

యాదాద్రిలో విశేష పూజలు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో గురువారం ఆలయంలో సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణం, అభిషేకం వంటి విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం  స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలను ధరింపజేశారు. ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టింపచేసి నిత్యారాధనలను నిర్వహించారు. శివాలయంలో కోడే మొక్కులను తీర్చుకున్నారు. సాయంకాలం స్వామి అమ్మవార్లకు జోడు సేవలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకుడు నల్లందీగళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, సురేంద్రాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు జూషెట్టి కృష్ణ, నరేందర్, వేముల వెంకటేశ్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement