ఆలయంలో విశేష పూజలు
ఆలయంలో విశేష పూజలు
Published Sun, Jul 31 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో నిత్య కైంకర్యాలు, అర్చనలు, హారతులు, సహస్రనామార్చనలు నిర్వహించారు. అమ్మవారిని పట్టు పీతాంబరాలు, అనేక రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి, గజ, అశ్వ వాహన సేవల్లో అమ్మవారిని అధిష్టింపచేశారు. సాయంకాలం జోడు సేవలు నిర్వహించారు. శివాలయంలోని పరమేశ్వరుడిని, అద్దాల మండపంలోని నవ నారసింహులను భక్తులు దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలో సుదర్శన నారసింహ యాగంలో భక్తులు పాల్గొని తమ మొక్కును తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు మంగళగిరి నరసింహామూర్తి, శ్రీధరాచార్యులు, అధికారులు గోపాల్, వేముల వెంకటేశ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement