యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ
Published Sun, Sep 18 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే క్యూలైన్లు ఈ రోజు బోసిపోయి కనిపించాయి. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలను ధరింపచేసి, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement