గుండు నుంచి వేరు చేసిన రాయి ముక్క
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని గర్భాలయం గుండుకు సమీపంలో ఉన్న రాయి ముక్కను తొలగించేందుకు అధికారులు యత్నిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానాలయం పనుల్లో భాగంగా గర్భాలయం లోని స్వయంభూ మూర్తిని ఆనుకుని ఉన్న పెద్ద బండరాయి, సమీప రాళ్లలో చిన్న ముక్కను కూడా తీసివేయకూడదని చిన్న జీయర్ స్వామి గతంలో చెప్పారు. గర్భాలయాన్ని ఏ మాత్రం ముట్టుకోకుండా పనులు చేయాలని సీఎం కేసీఆర్ కూడా మౌఖిక ఆదేశాలిచ్చారు.
కానీ అధికారులు అందుకు భిన్నంగా పనులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంభూ మూర్తి గుండుకు ఆనుకుని ఉన్న రాయి ముక్కను పక్కకు తొలగించారు. దీని పై అటు స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో అధికారులు బయట పెట్టడం లేదు. రాయిని మాత్రం తొలగించడం లేదంటూనే పక్కకు జరిపేందుకు ప్రయత్నించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment