Published
Sun, Jul 24 2016 8:43 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఆలయ పరిసరాలలో నిర్మాణ పనులు ప్రారంభం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానం పరిసరాలలో సన్‌షైన్ అధికారులు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకోసం సగానికి పైగా కొండను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీని కోసం ఆలయ పరిసరాల్లో పనులు జరిగే చోట ఇనుప రేకులను నాటి, దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. మరో వైపు నృసింహా కాంప్లెక్స్ అడుగు భాగంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బాలాలయం వద్ద ప్రస్తుతం ఉన్న దర్శనాల క్యూలైన్లను నూతనంగా నిర్మాణం చేసిన క్యూలైన్లకు నేటి నుంచి మార్చే అవకాశాలున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు. ఇందుకోసం అధికారులు క్యూలైన్ల పనులను వేగవంతం చేశారు.