యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
Published Sun, Sep 4 2016 10:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం సుమారు 15 వేల మంది స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ఉంటారని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో కొండపైకి వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు కాలినడకన కొండపైకి చేరుకున్నారు.
ఘనంగా సుదర్శన యాగం
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం అర్చకులు విశేష పూజలు, సుదర్శనయాగంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఉదయం నిత్య కైంకర్యాలను నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయమానంగా తయారుచేసి ఊరేగించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంకాలం స్వామి అమ్మవార్లను గజ వాహన సేవలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, రాకేశాచార్యులు, మోహనాచార్యులు , సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్ పాల్గొన్నారు.
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని ఆదివారం ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మోహన్‌కందాలు వేరువేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారిని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మెన్ బి. నర్సింహమూర్తి, ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement