
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: నూతన సంవత్సరం సందర్భంగా యదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజామునుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.