పాతగుట్టలో పవిత్రోత్సవాలు
పాతగుట్టలో పవిత్రోత్సవాలు
Published Wed, Aug 17 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని పాతగుట్ట ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు ధరింపజేశారు. అనంతరం వివిధ రకాల ఫుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పీఠంపై అధిష్ఠింపజేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన పవిత్ర మాలలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సకల దేవతల మూలమంత్రాలతో హవనం చేశారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అంకురార్పణం, దేవతాహోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఆరుట్ల సంపతాచార్యులు, యాజ్ఞీకులు సురేంద్రాచార్యులు, శ్రీకాంతాచార్యులు, అర్చకులు గట్టు వెంకటాచార్యులు, అధికారులు లక్ష్మణాచార్యులు, వెంకటేశ్వర్లు, పన్నగేశ్వర్రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement