
సాక్షి,తిరుమల: ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు. కల్తీ జరిగినట్లు తేలడంతో లడ్డూ తయారీలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని చెప్పారు.
లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. టీటీడీకి సొంత టెస్ట్ ల్యాబ్ లేదు. జులై5,6 తేదీల్లో రెండు నెయ్యి ట్యాంకర్లలోని శాంపిల్స్‌ను బయట ల్యాబ్‌లలో టెస్ట్‌కు పంపాం. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఈ టెస్ట్‌లలో తేలింది. దీంతో సరఫరాదారులందరికీ వార్నింగ్ ఇచ్చాం. నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్ ఖరారైంది’అని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి.. శ్రీవారి లడ్డూపై సీబీఎన్ ఉన్మాద రాజకీయం