మహానంది ఇన్‌చార్జ్‌ ఈఓగా వెంకటేశ్వర్లు | venkateswarlu as mahanandi incharge eo | Sakshi
Sakshi News home page

మహానంది ఇన్‌చార్జ్‌ ఈఓగా వెంకటేశ్వర్లు

Published Thu, Jun 1 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

venkateswarlu as mahanandi incharge eo

మహానంది: మహానంది దేవస్థానం ఇన్‌చార్జ్‌ ఈఓగా అనంతపురం జిల్లా ఉవరకొండ గౌరీ మఠం  అసిస్టెంటు కమిషనర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ శంకర వరప్రసాద్‌ పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వెంకటేశ్వర్లుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయశాక కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వెంకటేశ్వర్లు గౌరీ(గవి)మఠం ఏసీ, మేనేజర్‌గా ఉన్న ఆయన కర్నూలు జిల్లా డీసీగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పది రోజుల్లో మహానంది దేవస్థానానికి రెగ్యులర్‌ ఈఓను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement